Shuru
Apke Nagar Ki App…
రాష్ట్ర చరిత్రలో తొలిసారి పోలీస్ ఆఫీసర్స్ రీట్రీట్.... రాష్ట్ర చరిత్రలో తొలిసారి పోలీస్ ఆఫీసర్స్ రీట్రీట్
Jtv9 News Network
రాష్ట్ర చరిత్రలో తొలిసారి పోలీస్ ఆఫీసర్స్ రీట్రీట్.... రాష్ట్ర చరిత్రలో తొలిసారి పోలీస్ ఆఫీసర్స్ రీట్రీట్
More news from తెలంగాణ and nearby areas
- గజ్వేల్ సిద్దిపేట జిల్లా మార్చి 9 ప్రజా తెలంగాణ న్యూస్ / రంజాన్ ఉపవాసాల సందర్బంగా సిద్దిపేటలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు. మాజీ హోమ్ మినిస్టర్ మహమ్మద్ అలీ. తదితర నాయకులు పాల్గొన్నారు.1
- ఖమ్మం అంబేద్కర్ భవన్ లో వెలుగుమట్ల బాధితులకు మద్దతుగా సోమవారం రాత్రి డీఎస్పీ అధ్యక్షుడు విశారదన్ మహరాజ్ తో కలిసి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టిన జాగృతి అధ్యక్షురాలు. మంగళవారం ఉదయం కవిత, విశారదన్ తో పాటు నిరాహార దీక్ష చేపట్టిన వారిని అరెస్ట్ చేసిన పోలీసులు. కవితతో పాటు దీక్ష చేస్తున్న వారిని హైదరాబాద్ రోడ్డులో తరలిస్తున్న ఖమ్మం పోలీసులు.1
- అశోక్ నగర్ వినాయకుని ఆలయంలో చోరీ సంగారెడ్డి జిల్లాలోని రామచంద్రపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలయంలో చోరీ జరిగింది. అశోక్ నగర్ వినాయక ఆలయంలో మంగళ వారం తెల్లవారుజామున దొంగలు తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. స్థానికుల సమాచారం ప్రకారం దొంగలు ఆలయంలోని సుమారు 3 తులాల బంగారు ఆభరణాలు, 8 కిలోల వెండి వస్తువులు అపహరించారు. అంతేకాకుండా ఆలయ హుండీని పగులగొట్టి అందులో ఉన్న సుమారు 90 వేల రూపాయల నగదును కూడా తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఉదయం ఆలయానికి వచ్చిన స్థానికులు తాళాలు పగులగొట్టబడినట్టు గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలనలు ప్రారంభించారు. క్లూస్ టీం సహాయంతో వేలిముద్రలు మరియు ఇతర ఆధారాలను సేకరిస్తున్నారు. ఆలయ పరిసరాల్లో ఉన్న సీసీటీవీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తూ దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.ఈ ఘటనపై రామచంద్రాపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.4
- నల్గొండ జిల్లా.. మిర్యాలగూడ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో 2k రన్ కార్యక్రమం.. 99 రోజుల కార్యచరణ ప్రణాళికలో భాగంగా 2కె రన్.. 2k రన్ ను జెండా ఊపి ప్రారంభించిన ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి.. స్థానిక రాజీవ్ చౌక్ నుండి హనుమాన్ పేట ఫ్లైఓవర్ వరకు కొనసాగిన 2 కే రన్.. చెత్తరహిత మిర్యాలగూడగా తీర్చిదిద్దడంలో అందరూ భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే పిలుపు.. పరిసరాల పరిశుభ్రత,పచ్చదనం పెంపొందించడం తమ లక్ష్యం.. వచ్చే రెండేళ్లలో మిర్యాలగూడ పట్టణాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేస్తాం.1
- రాష్ట్ర ప్రభుత్వ 'ప్రజా పాలన -- ప్రగతి ప్రణాళిక'లో భాగంగా ఎంపీడీవో విగ్నేశ్వర్ పోతాన్ శెట్టిపల్లి గ్రామంలోని డంపింగ్ యార్డును ఆకస్మికంగా తనిఖీ చేశారు. గ్రామంలో సేకరించిన తడి, పొడి చెత్త విభజన, కంపోస్ట్ తయారీ విధానాన్ని ఆయన పరిశీలించారు. పారిశుద్ధ్య నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేస్తూ, గ్రామాన్ని మరింత పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి ప్రమోద, జీపీ సిబ్బంది పాల్గొన్నారు.1
- మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్ మండలం లింగసాన్ పల్లి తండా కు చెందిన గిరిజన దంపతులకు నెల రోజుల క్రితం మగ బిడ్డ జన్మించారు. తొలి కాన్పులో మగ బిడ్డ జన్మించిన ఆనందంగా ఉన్న దంపతులు కామారెడ్డి జిల్లాకు చెందిన దంపతులు ఓ మధ్యవర్తి ద్వారా బాలు తల్లిదండ్రులను కలిసి బేరం పెట్టారు. 50 వేలకు బేరం కుదిరింది. డబ్బులు ఇచ్చిన కామారెడ్డి కి చెందిన దంపతులు తీసుకు వెళ్ళారు. అయితే బాబు పుట్టిన తరవాత అంగన్వాడిలో పాలు, ఇతర పోషక ఆహారం కు బాలింత రాకపోవడం తో అనుమానం కలిగిన అంగన్వాడీ టీచర్ ఆరా తీసింది. విషయం అడగడం తో ఇంటికి తాళం వెళ్ళిపోయారు. అధికారులు రంగంలోకి దిగి పోలీస్ లకు సమాచారం అందించారు. కామారెడ్డి లో ఉన్న నెల రోజుల పసికందును తీసుకొని సఖి కేంద్రం కు తరలించారు. తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చి నట్టు నిర్వాహకురాలు రేణుక తెలిపారు. నెల రోజుల పసి కందు ను విక్రయించడం పై జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.1
- తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అరెస్ట్! బాధితుల కోసం దీక్ష..కవితను, విశారదన్ మహరాజ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఖమ్మం నగరంలోని అంబేడ్కర్ భవనం వద్ద మంగళవారం ఉదయం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వెలుగుమట్ల బాధితులకు మద్దతుగా సోమవారం రాత్రి నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను పోలీసులు అరెస్ట్ చేశారు.దీక్షలో ఆమెతో పాటు డీఎస్సీ అధ్యక్షుడు విశారదన్ మహరాజ్ మరియు ఇతర ప్రతినిధులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వెలుగుమట్ల బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ రాత్రంతా దీక్ష కొనసాగించిన వీరిని, మంగళవారం ఉదయం పోలీసులు బలవంతంగా అక్కడి నుండి తరలించారు. ప్రస్తుతం ఖమ్మం పోలీసులు వీరిని హైదరాబాద్ రోడ్డు మీదుగా తరలిస్తున్నారు. ఈ అరెస్టులతో ఖమ్మం పట్టణంలో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది.1
- గజ్వేల్ మండలంలోని మాసన్ పల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న గజ్వేల్ నియోజకవర్గం ఇన్చార్జ్ వంటేరు ప్రతాపరెడ్డి గారు మరియు బి ఆర్ఎస్ శ్రేణులు ముస్లిం మైనార్టీ సోదరులు ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు4
- సిద్దిపేట జిల్లా : యువకుల ర్యాష్ డ్రైవింగ్ పై గజ్వెల్ పోలీస్ స్టేషన్ లో కౌన్సిలింగ్ ఇచ్చిన పోలీసులు. * గజ్వెల్ మున్సిపల్ సంగాపూర్ రోడ్డు లో ర్యాష్ డ్రైవింగ్ వీడియోను తీసుకున్న యువకులు * ర్యాష్ డ్రైవింగ్ వీడియో ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన యువకులు * వీడియో వైరల్ గా మారడంతో ర్యాష్ డ్రైవింగ్ చేసిన యువకులను గజ్వెల్ పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్ * మళ్లీ ర్యాష్ డ్రైవింగ్ చేస్తే కేసు నమోదు చేస్తానని హెచ్చరిక * విద్యార్థులు రాకపోకల సమయంలో పిచ్చి చేష్టలు చేస్తే చర్యలు తప్పవని యువకులను హెచ్చరించిన సీఐ రవి కుమార్1