logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

మార్కాపురం జిల్లా కేంద్రంలో శిథిలావస్థకు చేరుకున్న రహదారులు భవనముల శాఖ అతిథి గృహం మార్కాపురం జిల్లా కేంద్రంలో రహదారులు భవనముల శాఖ అతిథి గృహము శిథిలావస్థకు చేరింది. భవనం లోపల పై కప్పుకున్న పిఓపి ఊడి కింద పడిపోయింది. గత ప్రభుత్వంలో ఎంతో కొంత ప్రజా ప్రతినిధులు, అధికారులు ఉపయోగించుకున్నారు. నేడు ఆ పరిస్థితి లేకపోవడంతో నిరుపయోగంగా మారి సరైన అధికారుల పర్యవేక్షణ లేక పరిసరాలు చిట్ట అడివిని తలపిస్తున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరారు

1 hr ago
user_M. ADINARAYANA
M. ADINARAYANA
Local News Reporter మార్కాపురం, ప్రకాశం, ఆంధ్రప్రదేశ్•
1 hr ago

మార్కాపురం జిల్లా కేంద్రంలో శిథిలావస్థకు చేరుకున్న రహదారులు భవనముల శాఖ అతిథి గృహం మార్కాపురం జిల్లా కేంద్రంలో రహదారులు భవనముల శాఖ అతిథి గృహము శిథిలావస్థకు చేరింది. భవనం లోపల పై కప్పుకున్న పిఓపి ఊడి కింద పడిపోయింది. గత ప్రభుత్వంలో ఎంతో కొంత ప్రజా ప్రతినిధులు, అధికారులు ఉపయోగించుకున్నారు. నేడు ఆ పరిస్థితి లేకపోవడంతో నిరుపయోగంగా మారి సరైన అధికారుల పర్యవేక్షణ లేక పరిసరాలు చిట్ట అడివిని తలపిస్తున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరారు

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • గణేష్ ఉత్సవాల్లో భాగంగా పుల్లలచెరువులో ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమం నిర్వహణ. మంచి నడవడిక, సత్ ప్రవర్తన ఎంతో గొప్పవని వాటిని ఆచరిస్తే ఉత్తమ జీవనాన్ని పొందవచ్చని ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త మాచిరాజు. హనుమంతరావు అన్నారు. ఆధ్యాత్మిక భావనలను అవలంభిస్తేనే యువత ఉన్నతమైన స్థానంలో ఉంటారని వివరించారు.గణేష్ వేడుకల్లో భాగంగా పుల్లలచెరువులో ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో ప్రవచనం వినిపించారు. ఆ సంఘం నాయకులు ఉప్పల. హనుమంతరావు ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించగా ఆర్య వైశ్య సంఘం ప్రముఖులు జీవి గురునాధం,ప్రముఖ సిద్ధాంతి వడ్లమాని. గోవర్ధనా చార్యులు,గ్రామస్తులు, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
    1
    గణేష్ ఉత్సవాల్లో భాగంగా పుల్లలచెరువులో ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమం నిర్వహణ.
మంచి నడవడిక, సత్ ప్రవర్తన ఎంతో గొప్పవని వాటిని ఆచరిస్తే ఉత్తమ జీవనాన్ని పొందవచ్చని ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త మాచిరాజు. హనుమంతరావు అన్నారు. ఆధ్యాత్మిక భావనలను అవలంభిస్తేనే యువత ఉన్నతమైన స్థానంలో ఉంటారని వివరించారు.గణేష్ వేడుకల్లో భాగంగా పుల్లలచెరువులో ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో ప్రవచనం వినిపించారు. ఆ సంఘం నాయకులు ఉప్పల. హనుమంతరావు ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించగా ఆర్య వైశ్య సంఘం ప్రముఖులు జీవి గురునాధం,ప్రముఖ సిద్ధాంతి వడ్లమాని. గోవర్ధనా చార్యులు,గ్రామస్తులు, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
    user_ఏడుకొండలు. జర్నలిస్ట్
    ఏడుకొండలు. జర్నలిస్ట్
    Local News Reporter పుల్లలచెరువు, ప్రకాశం, ఆంధ్రప్రదేశ్•
    15 hrs ago
  • నందికొట్కూరు మున్సిపాలిటీలోని విద్యానగర్‌లో సీసీ రోడ్డు పనులు ప్రారంభం నందికొట్కూరు మున్సిపాలిటీ పరిధిలోని విద్యానగర్ 11వ వార్డులో 15వ ఆర్థిక సంఘం నిధుల ద్వారా రూ.7.50 లక్షల వ్యయంతో చేపట్టనున్న నూతన సీసీ రోడ్డు నిర్మాణ పనులను ఎమ్మెల్యే గిత్త జయసూర్య ప్రారంభించారు. పట్టణంలోని ప్రతి వార్డులో అవసరమైన అభివృద్ధి పనులను దశలవారీగా చేపట్టి మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.
    1
    నందికొట్కూరు మున్సిపాలిటీలోని విద్యానగర్‌లో సీసీ రోడ్డు పనులు ప్రారంభం
నందికొట్కూరు మున్సిపాలిటీ పరిధిలోని విద్యానగర్ 11వ వార్డులో 15వ ఆర్థిక సంఘం నిధుల ద్వారా రూ.7.50 లక్షల వ్యయంతో చేపట్టనున్న నూతన సీసీ రోడ్డు నిర్మాణ పనులను ఎమ్మెల్యే గిత్త జయసూర్య ప్రారంభించారు. పట్టణంలోని ప్రతి వార్డులో అవసరమైన అభివృద్ధి పనులను దశలవారీగా చేపట్టి మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.
    user_Why not dinesh... yashaswi
    Why not dinesh... yashaswi
    News Anchor జూపాడు బంగ్లా, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    13 hrs ago
  • బద్వేలులో వైభవంగా 9వ వార్షిక వినాయక చవితి వేడుకలు. స్వామివారి సన్నిధిలో గొప్ప అన్నదాన కార్యక్రమం. బద్వేలు,సెప్టెంబర్ 15: బద్వేలు పట్టణంలోని 16వ వార్డు సుమిత్రానగర్ నందు శ్రీ వరసిద్ధి వినాయక చవితి 9వ వార్షికోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వినాయక మండపం భక్తులతో కిటకిటలాడుతోంది. ఈ ఉత్సవాలకు విచ్చేయుచున్న భక్తులందరికీ ఉత్సవ కమిటీ సభ్యులు స్వాగతం సుస్వాగతం పలుకుతున్నారు. ఉత్సవాలకు సహకరించిన దాతలు: వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు పలువురు దాతలు ముందుకు వచ్చి తమ వంతు సహాయ సహకారాలు అందించారు. -విగ్రహ దాత మరియు దేవుని పూజా సామాగ్రి దాత: కీ.శే. గాండ్ల వెంకటరమణ బాబు - శ్రీమతి కుమారి -అన్నదాన దాతలు: కీ.శే. కోడూరు వెంకట స్వామి రెడ్డి - శ్రీమతి విజయమ్మ, శ్రీ కోడూరు మల్లిఖార్జున రెడ్డి - శ్రీమతి అపర్ణ -లడ్డు దాత: శ్రీ వెలిగండ్ల నాగరాజు - శ్రీమతి ఉమాదేవి -పూలదండ దాత: శ్రీ నిమ్మకాయల గురివిరెడ్డి - శ్రీమతి రాజమ్మ -పటాకుల దాతలు: శ్రీ కోడూరు చంద్రశేఖర్ రెడ్డి - శ్రీమతి ప్రశాంతి, శ్రీ కీ.శే. సంసాని ఏరికలయ్య - శ్రీమతి ఆదిలక్షుమ్మ ఆర్థిక సహాయం అందించిన దాతలు: శ్రీ నాగినేని వెంకటసుబ్బయ్య - 6000/-, శ్రీ నిమ్మకాయల శేఖర్ రెడ్డి - 5000/-, శ్రీ ఇమామ్ ఖాసీమ్ - 4000/-, శ్రీ లకిడి విజయ్ భాస్కర్ - 2116/-, శ్రీ కోన రవిశంకర్ - 2016/-, శ్రీ చెరుకూరి సిద్ధయ్య (టైలర్) - 2000/-, శ్రీ కనిశెట్టి సతీష్ (టీచర్) - 2000/-, శ్రీ పిట్టా జయసింహ - 2000/-, శ్రీ ఓబుల్ రెడ్డి సాయి ప్రతాప్ రెడ్డి - 2000/-, శ్రీ మోరేపల్లె రామయ్య - 2000/-, శ్రీమతి కోటపాటి సావిత్రమ్మ - 2000/-, శ్రీ కీ.శే. పుల్లయ్య - 2000/-, శ్రీ రెడ్డిపల్లె శ్రీనివాసుల యాదవ్ - 2000/- ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు మాట్లాడుతూ, గత 9 సంవత్సరాలుగా సుమిత్రానగర్ లో వినాయక చవితి వేడుకలను ఐక్యమత్యంతో నిర్వహిస్తున్నామని, దాతల సహకారంతోనే ఈ వేడుకలు విజయవంతం అవుతున్నాయని తెలిపారు. భక్తులందరూ వచ్చి స్వామి వారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. అనంతరం మధ్యాహ్నం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి సన్నిధిలో కీ.శే. కోడూరు వెంకట స్వామి రెడ్డి - శ్రీమతి విజయమ్మ, కోడూరు మల్లిఖార్జున రెడ్డి - అపర్ణ, కొండూరు చంద్ర కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో గొప్ప అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం సాయంత్రం చెక్కభజన కార్యక్రమం కూడా ఉంటుందని తెలియజేశారు.
    2
    బద్వేలులో వైభవంగా 9వ వార్షిక వినాయక చవితి వేడుకలు.
స్వామివారి సన్నిధిలో గొప్ప అన్నదాన కార్యక్రమం.
బద్వేలు,సెప్టెంబర్ 15: బద్వేలు పట్టణంలోని 16వ వార్డు సుమిత్రానగర్ నందు శ్రీ వరసిద్ధి వినాయక చవితి 9వ వార్షికోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వినాయక మండపం భక్తులతో కిటకిటలాడుతోంది.
ఈ ఉత్సవాలకు విచ్చేయుచున్న భక్తులందరికీ ఉత్సవ కమిటీ సభ్యులు స్వాగతం సుస్వాగతం పలుకుతున్నారు.
ఉత్సవాలకు సహకరించిన దాతలు:
వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు పలువురు దాతలు ముందుకు వచ్చి తమ వంతు సహాయ సహకారాలు అందించారు.
-విగ్రహ దాత మరియు దేవుని పూజా సామాగ్రి దాత: కీ.శే. గాండ్ల వెంకటరమణ బాబు - శ్రీమతి కుమారి
-అన్నదాన దాతలు: కీ.శే. కోడూరు వెంకట స్వామి రెడ్డి - శ్రీమతి విజయమ్మ, శ్రీ కోడూరు మల్లిఖార్జున రెడ్డి - శ్రీమతి అపర్ణ
-లడ్డు దాత: శ్రీ వెలిగండ్ల నాగరాజు - శ్రీమతి ఉమాదేవి
-పూలదండ దాత: శ్రీ నిమ్మకాయల గురివిరెడ్డి - శ్రీమతి రాజమ్మ
-పటాకుల దాతలు: శ్రీ కోడూరు చంద్రశేఖర్ రెడ్డి - శ్రీమతి ప్రశాంతి, శ్రీ కీ.శే. సంసాని ఏరికలయ్య - శ్రీమతి ఆదిలక్షుమ్మ
ఆర్థిక సహాయం అందించిన దాతలు:
శ్రీ నాగినేని వెంకటసుబ్బయ్య - 6000/-, శ్రీ నిమ్మకాయల శేఖర్ రెడ్డి - 5000/-, శ్రీ ఇమామ్ ఖాసీమ్ - 4000/-, శ్రీ లకిడి విజయ్ భాస్కర్ - 2116/-, శ్రీ కోన రవిశంకర్ - 2016/-, శ్రీ చెరుకూరి సిద్ధయ్య (టైలర్) - 2000/-, శ్రీ కనిశెట్టి సతీష్ (టీచర్) - 2000/-, శ్రీ పిట్టా జయసింహ - 2000/-, శ్రీ ఓబుల్ రెడ్డి సాయి ప్రతాప్ రెడ్డి - 2000/-, శ్రీ మోరేపల్లె రామయ్య - 2000/-, శ్రీమతి కోటపాటి సావిత్రమ్మ - 2000/-, శ్రీ కీ.శే. పుల్లయ్య - 2000/-, శ్రీ రెడ్డిపల్లె శ్రీనివాసుల యాదవ్ - 2000/-
ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు మాట్లాడుతూ, గత 9 సంవత్సరాలుగా సుమిత్రానగర్ లో వినాయక చవితి వేడుకలను ఐక్యమత్యంతో నిర్వహిస్తున్నామని, దాతల సహకారంతోనే ఈ వేడుకలు విజయవంతం అవుతున్నాయని తెలిపారు. భక్తులందరూ వచ్చి స్వామి వారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. అనంతరం మధ్యాహ్నం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి సన్నిధిలో కీ.శే. కోడూరు వెంకట స్వామి రెడ్డి - శ్రీమతి విజయమ్మ,  కోడూరు మల్లిఖార్జున రెడ్డి - అపర్ణ, కొండూరు చంద్ర కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో గొప్ప అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం సాయంత్రం చెక్కభజన కార్యక్రమం కూడా ఉంటుందని తెలియజేశారు.
    user_జీ.మౌలాలి.
    జీ.మౌలాలి.
    Photographer బద్వేల్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    13 hrs ago
  • పద్మశాలి యూత్ ఆధ్వర్యంలో వైభవంగా గణేష్ నవరాత్రి వేడుకలు. గుళ్ళపల్లి గ్రామంలో పద్మశాలి యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గణేష్ నవరాత్రి ద్వితీయ సంవత్సర వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ, ఈ నెల 19వ తేదీన స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం ప్రధాన ఆకర్షణగా 21 కేజీల మహా లడ్డూ వేలం పాట నిర్వహించనున్నట్లు తెలిపారు.లడ్డూ వేలం పాట పూర్తయిన తర్వాత స్వామివారి శోభాయాత్ర, నిమజ్జన కార్యక్రమం ఘనంగా జరగనుంది. ఈ భక్తిశ్రద్ధల కార్యక్రమంలో గ్రామ ప్రజలు, భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని, స్వామివారి కృపకు పాత్రులు కావాలని నిర్వాహకులు కోరారు.
    1
    పద్మశాలి యూత్ ఆధ్వర్యంలో వైభవంగా గణేష్ నవరాత్రి వేడుకలు.
గుళ్ళపల్లి గ్రామంలో పద్మశాలి యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గణేష్ నవరాత్రి ద్వితీయ సంవత్సర వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ, ఈ నెల 19వ తేదీన స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం ప్రధాన ఆకర్షణగా 21 కేజీల మహా లడ్డూ వేలం పాట నిర్వహించనున్నట్లు తెలిపారు.లడ్డూ వేలం పాట పూర్తయిన తర్వాత స్వామివారి శోభాయాత్ర, నిమజ్జన కార్యక్రమం ఘనంగా జరగనుంది. ఈ భక్తిశ్రద్ధల కార్యక్రమంలో గ్రామ ప్రజలు, భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని, స్వామివారి కృపకు పాత్రులు కావాలని నిర్వాహకులు కోరారు.
    user_M.Vijay Kishore
    M.Vijay Kishore
    Cherukupalle H/O Arumbaka, Bapatla•
    12 hrs ago
  • మైదుకూరు-కడప రోడ్డులో ప్రమాదం అంచున ట్రాన్స్‌ఫార్మర్ - పట్టించుకోని అధికారులు మైదుకూరు, సెప్టెంబర్ 16: మైదుకూరు - కడప ప్రధాన రహదారిలో మసీదు ఎదురుగా ఉన్న ట్రాన్స్‌ ఫార్మర్ ప్రమాదం పొంచి ఉంది. ట్రాన్స్‌ఫార్మర్ స్తంభాలు తుప్పుపట్టి, వైర్లు వేలాడుతూ ఎప్పుడు కూలిపోతుందోనని స్థానికులు భయాందోళన చెందుతున్నారు. ఈ రహదారి గుండా రోజూ వందలాది వాహనాలు, పాదచారులు, చిన్నారులు రాకపోకలు సాగిస్తుంటారు. ప్రమాదం జరిగితే పెను ముప్పు తప్పదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై అనేకసార్లు విద్యుత్ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని, ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి శిథిల ట్రాన్స్‌ఫార్మర్‌ను తొలగించి నూతన ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
    1
    మైదుకూరు-కడప రోడ్డులో ప్రమాదం అంచున ట్రాన్స్‌ఫార్మర్ - పట్టించుకోని అధికారులు

మైదుకూరు, సెప్టెంబర్ 16:
మైదుకూరు - కడప ప్రధాన రహదారిలో మసీదు ఎదురుగా ఉన్న ట్రాన్స్‌ ఫార్మర్ ప్రమాదం పొంచి ఉంది. ట్రాన్స్‌ఫార్మర్ స్తంభాలు తుప్పుపట్టి, వైర్లు వేలాడుతూ ఎప్పుడు కూలిపోతుందోనని స్థానికులు భయాందోళన చెందుతున్నారు.
ఈ రహదారి గుండా రోజూ వందలాది వాహనాలు, పాదచారులు, చిన్నారులు రాకపోకలు సాగిస్తుంటారు. ప్రమాదం జరిగితే పెను ముప్పు తప్పదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ విషయంపై అనేకసార్లు విద్యుత్ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని, ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోందని స్థానికులు ఆరోపిస్తున్నారు.
ఇప్పటికైనా అధికారులు స్పందించి శిథిల ట్రాన్స్‌ఫార్మర్‌ను తొలగించి నూతన ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
    user_VEMULURIMALAKONDAIAH
    VEMULURIMALAKONDAIAH
    Hindu temple ఖాజీపేట, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • చర్మ డప్పు కళాకారుల పెన్షన్ గడువు పెంచాలి చర్మకారుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సుమాల ఆంటోనీ, కే భాస్కర్, డిమాండ్ సోషల్ వెల్ఫేర్ స్వీయ డిక్లరేషన్ విధానాన్ని రద్దు చేసి ఆధార్, రేషన్ కార్డు ఆధారంగా ఆన్‌లైన్ ప్రక్రియ కొనసాగించాలి చర్మకారుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సుమాల ఆంటోనీ, కే భాస్కర్, డిమాండ్ ఎమ్మిగనూరు: చర్మకారులు, డప్పు కళాకారులకు ప్రభుత్వం మంజూరు చేయనున్న పెన్షన్ దరఖాస్తుల గడువును మరింత పొడిగించాలని చర్మకారుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సుమాల ఆంటోనీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అర్హులైన ప్రతి కళాకారుడికి పెన్షన్ అందేలా నిబంధనలను సరళీకరించి, ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియను కొనసాగించాలని కోరారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్ల, మూడు నెలల కాలం పూర్తవుతున్న నేపథ్యంలో, చర్మకారులు, డప్పు కళాకారులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న పెన్షన్ ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించడం అభినందనీయమని ఆంటోనీ పేర్కొన్నారు. పెన్షన్ కోసం చర్మకారులు, డప్పు కళాకారులు గతంలో పలుమార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేయడంతో పాటు ఉద్యమాలు, ఆందోళనలు చేపట్టారని గుర్తుచేశారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం స్పందించి పెన్షన్ ప్రక్రియను ప్రారంభించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. అయితే ప్రస్తుతం పెన్షన్ దరఖాస్తు ప్రక్రియలో ఉన్న కొన్ని నిబంధనలు వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న పేద చర్మకారులు, డప్పు కళాకారులకు ఇబ్బందికరంగా మారాయని ఆంటోనీ తెలిపారు. ముఖ్యంగా సోషల్ వెల్ఫేర్ స్వీయ డిక్లరేషన్ (Self Declaration) విధానం వల్ల అర్హులైన పలువురు కళాకారులు దరఖాస్తు చేసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. అలాగే అద్దె ఇళ్లలో నివసిస్తున్న కళాకారుల వద్ద ఇంటి పన్ను రసీదు, విద్యుత్ బిల్లు తదితర పత్రాలు లేకపోవడం వల్ల వారు పెన్షన్‌కు దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కోల్పోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. తరతరాలుగా సంప్రదాయ చర్మకార వృత్తిని, డప్పు కళను నమ్ముకుని జీవిస్తున్న పేద కళాకారులకు ఇటువంటి నిబంధనలు అడ్డంకిగా మారకూడదని ఆయన అన్నారు. ఆధార్, రేషన్ కార్డుతో దరఖాస్తు అవకాశం కల్పించాలి ప్రభుత్వం సోషల్ వెల్ఫేర్ స్వీయ డిక్లరేషన్ విధానాన్ని రద్దు చేసి, ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఆధారంగా అర్హతను నిర్ధారించే విధంగా ఆన్‌లైన్ ప్రక్రియను కొనసాగించాలని ఆంటోనీ కోరారు. కుటుంబ వివరాలు, చిరునామా, వృత్తి తదితర అంశాలను రేషన్ కార్డు ఆధారంగా పరిశీలించి అర్హులైన వారికి పెన్షన్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. అద్దె ఇళ్లలో నివసించే కళాకారులకు కరెంట్ బిల్లు, హౌస్ ట్యాక్స్ వంటి పత్రాల నిబంధనలను సడలించాలని, వారి సంప్రదాయ వృత్తిని ప్రామాణికంగా పరిగణించాలని డిమాండ్ చేశారు. గ్రామస్థాయిలో సంబంధిత అధికారులు విచారణ నిర్వహించి అర్హతను నిర్ధారించే అవకాశం కల్పించాలని సూచించారు. గడువు పొడిగించి ప్రతి అర్హుడికి అవకాశం ఇవ్వాలి ప్రస్తుతం ఉన్న పెన్షన్ దరఖాస్తుల గడువును ప్రభుత్వం మరింత పొడిగించాలని ఆంటోనీ డిమాండ్ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో చాలామంది చర్మకారులు, డప్పు కళాకారులకు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియపై అవగాహన లేకపోవడంతో పాటు అవసరమైన పత్రాలు సమకూర్చుకోవడంలో ఆలస్యం జరుగుతోందని తెలిపారు. కాబట్టి ప్రభుత్వం ప్రత్యేకంగా మరికొంత సమయం కేటాయించి, గ్రామ, మండల స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. అర్హులైన ఏ ఒక్క కళాకారుడు కూడా కేవలం నిబంధనల కారణంగా పెన్షన్‌కు దూరం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. చర్మకారులు, డప్పు కళాకారుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని నిబంధనలను సరళీకరించి, ఆధార్–రేషన్ కార్డు ఆధారంగా ఆన్‌లైన్ దరఖాస్తు అవకాశం కల్పించడంతో పాటు పెన్షన్ దరఖాస్తుల గడువును పొడిగించాలని చర్మకారుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఆంటోనీ ప్రభుత్వాన్ని మరోసారి కోరారు.
    1
    చర్మ డప్పు కళాకారుల పెన్షన్ గడువు పెంచాలి
చర్మకారుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి  సుమాల ఆంటోనీ,   కే భాస్కర్,  డిమాండ్    
సోషల్ వెల్ఫేర్ స్వీయ డిక్లరేషన్ విధానాన్ని రద్దు చేసి ఆధార్, రేషన్ కార్డు ఆధారంగా ఆన్‌లైన్ ప్రక్రియ కొనసాగించాలి 
చర్మకారుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి  సుమాల ఆంటోనీ,   కే భాస్కర్,  డిమాండ్    
ఎమ్మిగనూరు: చర్మకారులు, డప్పు కళాకారులకు ప్రభుత్వం మంజూరు చేయనున్న పెన్షన్ దరఖాస్తుల గడువును మరింత పొడిగించాలని చర్మకారుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి  సుమాల ఆంటోనీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అర్హులైన ప్రతి కళాకారుడికి పెన్షన్ అందేలా నిబంధనలను సరళీకరించి, ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియను కొనసాగించాలని కోరారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్ల, మూడు నెలల కాలం పూర్తవుతున్న నేపథ్యంలో, చర్మకారులు, డప్పు కళాకారులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న పెన్షన్ ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించడం అభినందనీయమని ఆంటోనీ పేర్కొన్నారు. పెన్షన్ కోసం చర్మకారులు, డప్పు కళాకారులు గతంలో పలుమార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేయడంతో పాటు ఉద్యమాలు, ఆందోళనలు చేపట్టారని గుర్తుచేశారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం స్పందించి పెన్షన్ ప్రక్రియను ప్రారంభించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.
అయితే ప్రస్తుతం పెన్షన్ దరఖాస్తు ప్రక్రియలో ఉన్న కొన్ని నిబంధనలు వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న పేద చర్మకారులు, డప్పు కళాకారులకు ఇబ్బందికరంగా మారాయని ఆంటోనీ తెలిపారు. ముఖ్యంగా సోషల్ వెల్ఫేర్ స్వీయ డిక్లరేషన్ (Self Declaration) విధానం వల్ల అర్హులైన పలువురు కళాకారులు దరఖాస్తు చేసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.
అలాగే అద్దె ఇళ్లలో నివసిస్తున్న కళాకారుల వద్ద ఇంటి పన్ను రసీదు, విద్యుత్ బిల్లు తదితర పత్రాలు లేకపోవడం వల్ల వారు పెన్షన్‌కు దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కోల్పోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. తరతరాలుగా సంప్రదాయ చర్మకార వృత్తిని, డప్పు కళను నమ్ముకుని జీవిస్తున్న పేద కళాకారులకు ఇటువంటి నిబంధనలు అడ్డంకిగా మారకూడదని ఆయన అన్నారు.
ఆధార్, రేషన్ కార్డుతో దరఖాస్తు అవకాశం కల్పించాలి
ప్రభుత్వం సోషల్ వెల్ఫేర్ స్వీయ డిక్లరేషన్ విధానాన్ని రద్దు చేసి, ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఆధారంగా అర్హతను నిర్ధారించే విధంగా ఆన్‌లైన్ ప్రక్రియను కొనసాగించాలని ఆంటోనీ కోరారు. కుటుంబ వివరాలు, చిరునామా, వృత్తి తదితర అంశాలను రేషన్ కార్డు ఆధారంగా పరిశీలించి అర్హులైన వారికి పెన్షన్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.
అద్దె ఇళ్లలో నివసించే కళాకారులకు కరెంట్ బిల్లు, హౌస్ ట్యాక్స్ వంటి పత్రాల నిబంధనలను సడలించాలని, వారి సంప్రదాయ వృత్తిని ప్రామాణికంగా పరిగణించాలని డిమాండ్ చేశారు. గ్రామస్థాయిలో సంబంధిత అధికారులు విచారణ నిర్వహించి అర్హతను నిర్ధారించే అవకాశం కల్పించాలని సూచించారు.
గడువు పొడిగించి ప్రతి అర్హుడికి అవకాశం ఇవ్వాలి
ప్రస్తుతం ఉన్న పెన్షన్ దరఖాస్తుల గడువును ప్రభుత్వం మరింత పొడిగించాలని ఆంటోనీ డిమాండ్ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో చాలామంది చర్మకారులు, డప్పు కళాకారులకు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియపై అవగాహన లేకపోవడంతో పాటు అవసరమైన పత్రాలు సమకూర్చుకోవడంలో ఆలస్యం జరుగుతోందని తెలిపారు.
కాబట్టి ప్రభుత్వం ప్రత్యేకంగా మరికొంత సమయం కేటాయించి, గ్రామ, మండల స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. అర్హులైన ఏ ఒక్క కళాకారుడు కూడా కేవలం నిబంధనల కారణంగా పెన్షన్‌కు దూరం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
చర్మకారులు, డప్పు కళాకారుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని నిబంధనలను సరళీకరించి, ఆధార్–రేషన్ కార్డు ఆధారంగా ఆన్‌లైన్ దరఖాస్తు అవకాశం కల్పించడంతో పాటు పెన్షన్ దరఖాస్తుల గడువును పొడిగించాలని చర్మకారుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఆంటోనీ ప్రభుత్వాన్ని మరోసారి కోరారు.
    user_REPOTER KUMAR
    REPOTER KUMAR
    Social Media Manager కర్నూలు అర్బన్, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • తర్లుపాడు మండల కేంద్రంలోని బీసీ కాలనీలో ఘనంగా గణేష్ ఉత్సవాలు మార్కాపురం జిల్లా తర్లుపాడు మండలంలోని బీసీ కాలనీలో వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. వేడుకల్లో భాగంగా మంగళవారం స్వామివారికి వివిధ నైవేద్యాలతో ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా ఉభయ దాత ఈర్ల వెంకటయ్య కుటుంబ సభ్యులు 50 కేజీల లడ్డును ఊరేగింపుగా తీసుకొచ్చి స్వామివారికి సమర్పించారు. తొమ్మిది రోజులపాటు పూజ నిర్వహించి అనంతరం ప్రసాదాన్ని భక్తులకు పంపిణీ చేయనున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు
    1
    తర్లుపాడు మండల కేంద్రంలోని బీసీ కాలనీలో ఘనంగా గణేష్ ఉత్సవాలు 
మార్కాపురం జిల్లా తర్లుపాడు మండలంలోని బీసీ కాలనీలో వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. వేడుకల్లో భాగంగా మంగళవారం స్వామివారికి వివిధ నైవేద్యాలతో ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా ఉభయ దాత  ఈర్ల వెంకటయ్య కుటుంబ సభ్యులు 50 కేజీల లడ్డును ఊరేగింపుగా తీసుకొచ్చి స్వామివారికి సమర్పించారు. తొమ్మిది రోజులపాటు పూజ నిర్వహించి అనంతరం ప్రసాదాన్ని భక్తులకు పంపిణీ చేయనున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు
    user_M. ADINARAYANA
    M. ADINARAYANA
    Local News Reporter మార్కాపురం, ప్రకాశం, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • నిబంధనలకు విరుద్ధంగా తరగతులు నిర్వహిస్తున్న విద్యాసంస్థ పై చర్యలు తీసుకోండి. సెలవు రోజుల్లో నిబంధనలకు విరుద్ధంగా ఎటువంటి భద్రత లేకుండా ప్రిన్సిపల్ ఇంటిలో క్లాసులు నిర్వహించిన నారాయణ స్కూల్ పై చర్యలు తీసుకోవాలని రేపల్లె ఎంఈఓ కార్యాలయం వద్ద ఎస్ఎఫ్ఐ నాయకులు ధర్నా నిర్వహించి ఎంఈఓ కె.సురేష్ కి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రేపల్లె కార్యదర్శి ఎం.సూర్య ప్రకాష్,సహాయ కార్యదర్శి వై.నవీన్ మాట్లాడుతూ రేపల్లె పట్టణంలో సెలవు రోజులలో విద్యాసంస్థలు నిర్వహించవద్దని సంబంధిత విద్యాశాఖ అధికారులు ముందు రోజే ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఈనెల 12వ తేదీ రెండో శనివారం,స్కూల్ నడపడానికి ప్రయత్నించిన నారాయణ విద్యాసంస్థ యాజమాన్యంతో ఎస్ఎఫ్ఐ నాయకులు డీఈఓ ద్వారా ఫోన్లో మాట్లాడించిన, మేము స్కూలు నడపాల్సిందే,మాకు ర్యాంకులే ముఖ్యం అంటు కొంతమంది తల్లిదండ్రులను ఎస్ఎఫ్ఐ నాయకులతో మరియు ఫోన్ లో విద్యాశాఖ అధికారులతో గొడవలకు ప్రేరేపించి నిబంధనలకు విరుద్ధంగా విద్యార్థులను ఒత్తిడికి గురిచేస్తూ స్కూల్ నడపడంపై చర్యలు తీసుకోవాలన్నారు.విద్యాసంస్థ నడపటానికి ముందస్తు అనుమతులు తీసుకోకుండా గాలి,వెలుతురు, మంచినీళ్లు, టాయిలెట్స్ లాంటి భద్రతా సౌకర్యాలు లేకుండా స్కూలుకి కిలో మీటర్ దూరంలో గురువు రోడ్డులో ఉన్న ప్రిన్సిపల్ ఇంటిలో మరియు మరో రెండు చోట్ల స్కూల్ సిబ్బంది ఇళ్ళ వద్ద క్లాసులు నిర్వహించారు, నిబంధనలకు విరుద్దగా స్కూల్ ప్రారంభంలో కూడా పుస్తకాలు, యూనిఫామ్ బహిరంగంగా అమ్ముకుని విద్యార్థుల దగ్గర అధిక ఫీజులు వసూలు చేశారు,నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న నారాయణ స్కూల్ పై చర్యలు తీసుకోవాలని ఎంఈఓ ను కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు నాగార్జున, ప్రశాంత్,వెంకటేశ్వరరావు,శ్రీకాంత్ బెన్నీ తదితరులు పాల్గొన్నారు...
    2
    నిబంధనలకు విరుద్ధంగా తరగతులు నిర్వహిస్తున్న విద్యాసంస్థ పై చర్యలు తీసుకోండి.
సెలవు రోజుల్లో  నిబంధనలకు విరుద్ధంగా ఎటువంటి భద్రత లేకుండా ప్రిన్సిపల్ ఇంటిలో క్లాసులు నిర్వహించిన నారాయణ స్కూల్ పై చర్యలు తీసుకోవాలని రేపల్లె ఎంఈఓ కార్యాలయం వద్ద ఎస్ఎఫ్ఐ నాయకులు ధర్నా నిర్వహించి ఎంఈఓ కె.సురేష్ కి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రేపల్లె కార్యదర్శి ఎం.సూర్య ప్రకాష్,సహాయ కార్యదర్శి వై.నవీన్ మాట్లాడుతూ రేపల్లె పట్టణంలో సెలవు రోజులలో విద్యాసంస్థలు నిర్వహించవద్దని సంబంధిత విద్యాశాఖ అధికారులు ముందు రోజే ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఈనెల 12వ తేదీ రెండో శనివారం,స్కూల్ నడపడానికి ప్రయత్నించిన నారాయణ విద్యాసంస్థ యాజమాన్యంతో ఎస్ఎఫ్ఐ నాయకులు డీఈఓ ద్వారా ఫోన్లో మాట్లాడించిన, మేము స్కూలు నడపాల్సిందే,మాకు ర్యాంకులే ముఖ్యం అంటు కొంతమంది తల్లిదండ్రులను ఎస్ఎఫ్ఐ నాయకులతో మరియు ఫోన్ లో విద్యాశాఖ అధికారులతో గొడవలకు ప్రేరేపించి నిబంధనలకు విరుద్ధంగా విద్యార్థులను ఒత్తిడికి గురిచేస్తూ స్కూల్ నడపడంపై చర్యలు తీసుకోవాలన్నారు.విద్యాసంస్థ నడపటానికి ముందస్తు అనుమతులు తీసుకోకుండా గాలి,వెలుతురు, మంచినీళ్లు, టాయిలెట్స్ లాంటి భద్రతా సౌకర్యాలు లేకుండా స్కూలుకి కిలో మీటర్ దూరంలో గురువు రోడ్డులో ఉన్న ప్రిన్సిపల్ ఇంటిలో మరియు మరో రెండు చోట్ల స్కూల్ సిబ్బంది ఇళ్ళ వద్ద క్లాసులు నిర్వహించారు, నిబంధనలకు విరుద్దగా స్కూల్ ప్రారంభంలో కూడా పుస్తకాలు, యూనిఫామ్ బహిరంగంగా అమ్ముకుని విద్యార్థుల దగ్గర అధిక ఫీజులు వసూలు చేశారు,నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న నారాయణ స్కూల్ పై చర్యలు తీసుకోవాలని  ఎంఈఓ ను కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు నాగార్జున, ప్రశాంత్,వెంకటేశ్వరరావు,శ్రీకాంత్ బెన్నీ తదితరులు పాల్గొన్నారు...
    user_M.Vijay Kishore
    M.Vijay Kishore
    Cherukupalle H/O Arumbaka, Bapatla•
    21 hrs ago
  • బీసీ రక్షణ చట్టాన్ని వెంటనే అమలు చేయాలి - బీసీ చైతన్య సమితి నేత రామ్మోహన్ మైదుకూరు: బీసీ మంత్రి సవిత ప్రకటించిన బీసీ రక్షణ చట్టాన్ని వెంటనే అమలు చేస్తామన్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని, 34% రిజర్వేషన్ అమలు చేయడం సంతోషదాయకమని మైదుకూరు జాతీయ బీసీ చైతన్య సమితి నియోజకవర్గ అధ్యక్షులు కానగూడూరు రామ్మోహన్ ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు.బీసీల సంక్షేమం కోసం బీసీ రక్షణ చట్టాన్ని కూడా వెంటనే అమలుపరిచే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.
    1
    బీసీ రక్షణ చట్టాన్ని వెంటనే అమలు చేయాలి - బీసీ చైతన్య సమితి నేత రామ్మోహన్ 
మైదుకూరు: బీసీ మంత్రి సవిత ప్రకటించిన బీసీ రక్షణ చట్టాన్ని వెంటనే అమలు చేస్తామన్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని, 34% రిజర్వేషన్ అమలు చేయడం సంతోషదాయకమని మైదుకూరు జాతీయ బీసీ చైతన్య సమితి నియోజకవర్గ అధ్యక్షులు కానగూడూరు రామ్మోహన్ ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు.బీసీల సంక్షేమం కోసం బీసీ రక్షణ చట్టాన్ని కూడా వెంటనే అమలుపరిచే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.
    user_VEMULURIMALAKONDAIAH
    VEMULURIMALAKONDAIAH
    Hindu temple ఖాజీపేట, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.