సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలోని దౌల్తాబాద్ పోలీస్ స్టేషన్‌ను పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్, ఐపీఎస్, శుక్రవారం వార్షిక తనిఖీల్లో భాగంగా సందర్శించి పరిశీలించారు. స్టేషన్‌కు చేరుకున్న సీపీకి పోలీసు అధికారులు పూల మొక్కలు అందజేసి స్వాగతం పలకగా, ఆమె గౌరవ వందనం స్వీకరించి స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. తనిఖీల్లో భాగంగా సీపీ వాహనాల పార్కింగ్ ప్రదేశాలు, రిసెప్షన్, స్టేషన్ రైటర్ విభాగం, టెక్ టీమ్, ఎస్‌హెచ్‌వో కార్యాలయం, లాక్‌అప్ గది వంటి వివిధ విభాగాలను పరిశీలించారు. అలాగే, స్టేషన్‌లో నిర్వహిస్తున్న రికార్డులు, పెండింగ్ కేసులు, దర్యాప్తు పురోగతిపై ఎస్‌ఐ అరుణ్ కుమార్‌ను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన బ్యాడ్మింటన్ కోర్టును ప్రారంభించి, 100 మొక్కలను నాటారు. అనంతరం సీపీ మాట్లాడుతూ దౌల్తాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు. సాయంత్రం వేళల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తూ రోడ్డు ప్రమాదాలను అరికట్టాలని ఆదేశించారు. కేసుల దర్యాప్తులో నాణ్యత ప్రమాణాలు పాటించి, నిర్ణీత సమయంలో చార్జిషీట్లు దాఖలు చేయడం ద్వారా బాధితులకు న్యాయం చేయవచ్చని ఆమె స్పష్టం చేశారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసులను ప్రత్యేక దృష్టితో త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. విలేజ్ పోలీస్ అధికారులు తమకు కేటాయించిన గ్రామాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని, గ్రామ పెద్దలు, యువతతో సత్సంబంధాలు కొనసాగిస్తూ శాంతిభద్రతలకు సంబంధించిన సమాచారాన్ని ముందస్తుగా సేకరించాలని సీపీ సూచించారు. రౌడీ షీటర్లు, సస్పెక్ట్ హిస్టరీ షీటర్ల వివరాలను ఎప్పటికప్పుడు నవీకరించాలని, అనుమానిత వ్యక్తుల వేలిముద్రలను పోర్టబుల్ డివైస్‌ల ద్వారా తనిఖీ చేసి పాత నేరస్తులను గుర్తించాలని ఆదేశించారు. తెలంగాణ పోలీస్ శాఖ అందుబాటులోకి తీసుకొచ్చిన సీసీటీఎన్ఎస్-2.0, టీజీ-కాప్, హెచ్‌ఆర్‌ఎంఎస్, ఈ-సాక్ష్య, సైబర్ క్రైమ్ పోర్టల్, సీఈఐఆర్, సీడీఆర్ వంటి సాంకేతిక వ్యవస్థలపై పూర్తి పట్టు సాధించి నేరాల నియంత్రణలో సమర్థవంతంగా వ్యవహరించాలని సిబ్బందికి సూచించారు. స్టేషన్ రికార్డులను ఎప్పటికప్పుడు సీసీటీఎన్ఎస్‌లో నమోదు చేయాలని ఆదేశించారు. సిద్దిపేట సురక్ష నేత్ర కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామంలో సీసీటీవీ కెమెరాల ఏర్పాటు కోసం చర్యలు తీసుకోవాలని సూచించిన సీపీ, సిద్దిపేట పోలీస్ ఉద్యోగ మిత్ర వెబ్‌సైట్‌పై గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కల్పించాలని తెలిపారు. మారుతున్న సమాజానికి అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని అంది పుచ్చుకోవాలని, ప్రతి పోలీసు సిబ్బంది అన్ని విధులకు సంబంధించిన అవగాహన కలిగి ఉండాలని సూచించారు. విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేసి శాఖకు మంచి పేరు తీసుకురావాలని పిలుపునిచ్చారు. డ్యూటీ లేదా వ్యక్తిగత సమస్యలు ఉంటే నేరుగా తన దృష్టికి తీసుకురావచ్చని తెలిపారు. వాహనాలు నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్, సీట్‌బెల్ట్ ధరించాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ ఏసీపీ నర్సింలు, తొగుట సీఐ లతీఫ్, సీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్ రామకృష్ణ, ఎస్‌ఐ అరుణ్ కుమార్‌తో పాటు ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలోని దౌల్తాబాద్ పోలీస్ స్టేషన్‌ను పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్, ఐపీఎస్, శుక్రవారం వార్షిక తనిఖీల్లో భాగంగా సందర్శించి పరిశీలించారు. స్టేషన్‌కు చేరుకున్న సీపీకి పోలీసు అధికారులు పూల మొక్కలు అందజేసి స్వాగతం పలకగా, ఆమె గౌరవ వందనం స్వీకరించి స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. తనిఖీల్లో భాగంగా సీపీ వాహనాల పార్కింగ్ ప్రదేశాలు, రిసెప్షన్, స్టేషన్ రైటర్ విభాగం, టెక్ టీమ్, ఎస్‌హెచ్‌వో కార్యాలయం, లాక్‌అప్ గది వంటి వివిధ విభాగాలను పరిశీలించారు. అలాగే, స్టేషన్‌లో నిర్వహిస్తున్న రికార్డులు, పెండింగ్ కేసులు, దర్యాప్తు పురోగతిపై ఎస్‌ఐ అరుణ్ కుమార్‌ను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె పోలీస్ స్టేషన్ ఆవరణలో
ఏర్పాటు చేసిన బ్యాడ్మింటన్ కోర్టును ప్రారంభించి, 100 మొక్కలను నాటారు. అనంతరం సీపీ మాట్లాడుతూ దౌల్తాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు. సాయంత్రం వేళల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తూ రోడ్డు ప్రమాదాలను అరికట్టాలని ఆదేశించారు. కేసుల దర్యాప్తులో నాణ్యత ప్రమాణాలు పాటించి, నిర్ణీత సమయంలో చార్జిషీట్లు దాఖలు చేయడం ద్వారా బాధితులకు న్యాయం చేయవచ్చని ఆమె స్పష్టం చేశారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసులను ప్రత్యేక దృష్టితో త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. విలేజ్ పోలీస్ అధికారులు తమకు కేటాయించిన గ్రామాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని, గ్రామ పెద్దలు, యువతతో సత్సంబంధాలు కొనసాగిస్తూ
శాంతిభద్రతలకు సంబంధించిన సమాచారాన్ని ముందస్తుగా సేకరించాలని సీపీ సూచించారు. రౌడీ షీటర్లు, సస్పెక్ట్ హిస్టరీ షీటర్ల వివరాలను ఎప్పటికప్పుడు నవీకరించాలని, అనుమానిత వ్యక్తుల వేలిముద్రలను పోర్టబుల్ డివైస్‌ల ద్వారా తనిఖీ చేసి పాత నేరస్తులను గుర్తించాలని ఆదేశించారు. తెలంగాణ పోలీస్ శాఖ అందుబాటులోకి తీసుకొచ్చిన సీసీటీఎన్ఎస్-2.0, టీజీ-కాప్, హెచ్‌ఆర్‌ఎంఎస్, ఈ-సాక్ష్య, సైబర్ క్రైమ్ పోర్టల్, సీఈఐఆర్, సీడీఆర్ వంటి సాంకేతిక వ్యవస్థలపై పూర్తి పట్టు సాధించి నేరాల నియంత్రణలో సమర్థవంతంగా వ్యవహరించాలని సిబ్బందికి సూచించారు. స్టేషన్ రికార్డులను ఎప్పటికప్పుడు సీసీటీఎన్ఎస్‌లో నమోదు చేయాలని ఆదేశించారు. సిద్దిపేట సురక్ష నేత్ర కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామంలో సీసీటీవీ కెమెరాల ఏర్పాటు కోసం చర్యలు తీసుకోవాలని సూచించిన సీపీ,
సిద్దిపేట పోలీస్ ఉద్యోగ మిత్ర వెబ్‌సైట్‌పై గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కల్పించాలని తెలిపారు. మారుతున్న సమాజానికి అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని అంది పుచ్చుకోవాలని, ప్రతి పోలీసు సిబ్బంది అన్ని విధులకు సంబంధించిన అవగాహన కలిగి ఉండాలని సూచించారు. విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేసి శాఖకు మంచి పేరు తీసుకురావాలని పిలుపునిచ్చారు. డ్యూటీ లేదా వ్యక్తిగత సమస్యలు ఉంటే నేరుగా తన దృష్టికి తీసుకురావచ్చని తెలిపారు. వాహనాలు నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్, సీట్‌బెల్ట్ ధరించాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ ఏసీపీ నర్సింలు, తొగుట సీఐ లతీఫ్, సీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్ రామకృష్ణ, ఎస్‌ఐ అరుణ్ కుమార్‌తో పాటు ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
- తెలంగాణ రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని కేటీఆర్ తీవ్రంగా ఆరోపించారు. ప్రభుత్వం నిజంగానే ధాన్యం కొనుగోళ్లలో రికార్డు సృష్టించి ఉంటే పాండురంగ్ అనే రైతు ఎందుకు చనిపోయాడని ఆయన సూటిగా ప్రశ్నించారు. ప్రభుత్వం చెప్పే మాటలను నమ్మవద్దని, కావాలంటే కొనుగోలు కేంద్రాల దగ్గరికి వెళ్లి స్వయంగా అడగాలని కేటీఆర్ ప్రజలకు సూచించారు. కరోనా సమయంలో కూడా తాము 8500 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు.1
- మౌ నగరంలో, సల్మాన్ జంషెద్ రాహుల్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా ఒక గొప్ప సందేశాన్ని అందించారు. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకొని, ఆయన ప్రజలకు మిఠాయిలను పంపిణీ చేయడంతో పాటు మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ మరియు సల్మాన్ జంషెద్ బృందం తరపున ప్రజా సేవ మరియు ఆహార పంపిణీ స్ఫూర్తితో నిర్వహించబడింది.1
- జిన్నారం మున్సిపల్ కేంద్రంలోని కోర్టులో జడ్జ్ తేజశ్రీ ఆధ్వర్యంలో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయవాదులు మాట్లాడుతూ, లోక్ అదాలత్ ద్వారా కేసులు త్వరితగతిన పరిష్కారమై సత్వర న్యాయం అందుతుందని తెలిపారు. కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పరస్పర రాజీ ద్వారా వివాదాలను పరిష్కరించుకోవడం అభినందనీయమని వారు పేర్కొన్నారు.1
- చిన్న శంకరంపేట మండల కేంద్రంలోని మండల విద్యా వనరుల కేంద్రం (ఎంఈఆర్సీ) లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు విద్యా సంవత్సరం ప్రారంభం నుంచే 100 శాతం పాఠ్యపుస్తకాలు అందుబాటులో ఉంచాలని బీఆర్ఎస్వీ నాయకులు గట్టిగా డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా జిల్లా విద్యార్థి విభాగం నాయకుడు నాగరాజు, కార్యాలయ సిబ్బందికి వినతిపత్రాన్ని సమర్పించారు. అంతేకాకుండా, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కొరతను తక్షణమే పరిష్కరించాలని నాగరాజు విజ్ఞప్తి చేశారు. తరగతి గదులు, తాగునీరు, మరుగుదొడ్లు, ఫర్నిచర్ వంటి సౌకర్యాలను అన్ని పాఠశాలల్లో సమృద్ధిగా కల్పించాలని ఆయన స్పష్టం చేశారు. అలాగే, ప్రైవేట్ పాఠశాలలు అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయని, వాటిపై ప్రభుత్వం నియంత్రణ చర్యలు చేపట్టి తల్లిదండ్రులపై ఆర్థిక భారం తగ్గించాలని కూడా బీఆర్ఎస్వీ నాయకులు కోరారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని, విద్యారంగ సమస్యల పరిష్కారానికి అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్వీ నాయకులు మరోసారి విజ్ఞప్తి చేశారు.1
- ఏఐసీసీ ఓబీసీ నేషనల్ కోఆర్డినేటర్, ఏఐసీసీ సభ్యులు శ్రీనివాస్ యాదవ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై, అలాగే కాంగ్రెస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో నుండి ఐదుగురు ఎమ్మెల్యేలు, నలుగురు చైర్మన్లు వెళ్లిపోవడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన వెల్లడించారు. తాను అపాయింట్‌మెంట్ అడిగినా సీఎం రేవంత్ రెడ్డి ఇవ్వడం లేదని, సెక్రటేరియట్ గేట్లు కూడా తనకు తెరవడం లేదని శ్రీనివాస్ యాదవ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు జీవన్ రెడ్డి శిష్యుడిని చంపేశారని, అందుకే మనస్పర్థల కారణంగా జీవన్ రెడ్డి వెళ్లిపోయారని శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. రెడ్డిలు కాంగ్రెస్ పార్టీని 'అమ్మనా బూతులు' తిట్టినా ఎవరూ ఏమీ అనరని, కానీ బీసీ, మైనారిటీ నాయకులు అయితే మాత్రం నోటీసులు ఇస్తారని ఆయన మండిపడ్డారు. రేవంత్ రెడ్డి కంటే మహేష్ కుమార్ గౌడ్ గొప్పవారని శ్రీనివాస్ యాదవ్ అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సొంత ఎంపీ స్థానం మల్కాజ్‌గిరి సీటును, అలాగే సొంత నియోజకవర్గం కొడంగల్‌కు చెందిన మహబూబ్‌నగర్ ఎంపీ సెగ్మెంట్ సీటును కూడా గెలిపించుకోలేకపోయారని ఆయన విమర్శించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకు కావడం వల్లే అతడిని అరెస్ట్ చేయడానికి పది రోజులు లేటు చేశారని, అదే సామాన్యుడు అయితే వెంటనే అరెస్ట్ చేసేవారని శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. కాంగ్రెస్ నాయకులు తమను తక్కువ చేస్తే 'సైకిల్ కాంగ్రెస్ కొడుకులను తొక్కుతాం' అంటూ ఆయన తీవ్ర హెచ్చరిక చేశారు.1
- వికారాబాద్ జిల్లా కలెక్టర్ దీపక్ తివారి సంబంధిత అధికారులను ఆదేశిస్తూ, వనమాసం 2026 సంవత్సరపు లక్ష్యాలను తప్పనిసరిగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. వనమహోత్సవం కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించి, వివిధ శాఖలకు నిర్దేశించిన మొక్కలు నాటడం, వాటి సంరక్షణ లక్ష్యాలను కచ్చితంగా నెరవేర్చాలని ఆయన సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా, ప్రతి శాఖ తమకు కేటాయించిన మొక్కలు నాటే లక్ష్యాలను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ ఉద్ఘాటించారు. అటవీశాఖతో సమన్వయం చేసుకుంటూ అవసరమైన మొక్కలను సరఫరా చేయాలని, వాటిని నాటడంతో పాటు సంరక్షణ చర్యలను పక్కాగా అమలు చేయాలని ఆదేశించారు. నాటిన మొక్కల మనుగడపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.1
- మొహర్రం పండుగను దృష్టిలో ఉంచుకొని ఘాజీపూర్ అడ్మినిస్ట్రేషన్ అప్రమత్తంగా ఉంది. ఈ నేపథ్యంలో, SP డాక్టర్ ఇరాజ్ రాజా IPS శాంతి కమిటీకి సంబంధించిన ఒక ముఖ్యమైన సమావేశాన్ని నిర్వహించారు.1
- మహారాష్ట్రలోని పర్బానీ జిల్లాలో ఒక ఘోర ప్రమాదం సంభవించింది. యశ్వాడిలో ఉన్న హనుమాన్ ఆలయ మండపం కుప్పకూలడంతో, సుమారు 30 మంది శిథిలాల కింద చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై సహాయక చర్యలు ప్రస్తుతం కొనసాగుతున్నాయి.2