*_ముగ్గురు IAS లను పెళ్లి చేసుకున్న IAS అధికారి.._* ఈరోజుల్లో అమ్మాయిలు దొరక్కా ఎంతో మంది అబ్బాయిలు రోడ్డు మీద తిరుగుతున్నారు.వయసు పైబడుతున్నా..వెంట్రుకలు మెరిసిపోతున్నా పెళ్లి కాని ప్రసాద్‌లు ఇప్పటికీ చాలా మంది ఉన్నారు. కానీ మధ్యప్రదేశ్‌లో మాత్రం ఓ ఐఏఎస్ అధికారి నిత్య పెళ్లి కొడుకులా మారిపోయాడు. ఒక్కటి కాదు..రెండు కాదు.. ఏకంగా మూడు పెళ్లిళ్లు చేసుకుని హ్యాట్రిక్ కొట్టేశాడు.ముగ్గురు భార్యలు కూడా కీలకమైన బ్యూరోక్రాట్లు కావడం విశేషం.ఇంతకీ ఆ ఐఏఎస్ అధికారి ఎవరు? ఆయన కథేంటో తెలియాలంటే ఈ వార్త చదవాల్సిందే. అవీ ప్రసాద్.. ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్ జిల్లాకు చెందినవాడు.ప్రస్తుతం మధ్యప్రదేశ్ ఐఏఎస్ అధికారి.ప్రభుత్వంలో కీలక పొజిషన్‌లో ఉన్నాడు. 2013లో ఇండియన్ పోలీస్ సర్వీస్ (IPS)కి ఎంపికయ్యాడు.ఈ ఉద్యోగం నచ్చలేదో ఏమో తెలియదు గానీ మళ్లీ 2014లో UPSC పరీక్షలో 13వ ర్యాంకు సాధించి ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (IAS) లో స్థానం సంపాదించాడు.ఈ క్రమంలో ఢిల్లీలో సివిల్ సర్వీసెస్ పరీక్షకు సిద్ధమవుతున్నప్పుడు రిజు బాఫ్నా అనే అమ్మాయితో పరిచయం ఏర్పడింది. ప్రస్తుతం ఆమె మధ్యప్రదేశ్‌లోని షాజాపూర్ జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.ఆమెతో ఉన్న పరిచయంతో అవీ ప్రసాద్ వివాహం చేసుకున్నాడు.కానీ ఈ పెళ్లి ఎన్నేళ్లు నిలవలేదు. కొన్ని రోజులకే పరస్పరం అంగీకారంతో విడాకులు తీసుకున్నారు. అలా మొదటి వివాహం ముగిసిందో లేదో… ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 2016 బ్యాచ్ ఐఏఎస్ అధికారిణి మిషా సింగ్‌ను వివాహం చేసుకున్నాడు. దీంతో ఆమె మధ్యప్రదేశ్ కేడర్‌లో చేరింది.ప్రస్తుతం రత్లాం కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తుంది. మళ్లీ ఏమైందో.. తెలియదు గానీ నాలుగేళ్ల పాటు బాగానే ఉన్నారు. ఈమెతో కూడా అవీ ప్రసాద్ విడిపోయాడు. ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. ఇద్దరు కలెక్టర్లతో పెటాకులైన తర్వాతైన బుద్ధిగా ఉండాల్సిన అవీ ప్రసాద్ ముచ్చటగా మూడోసారి 2017 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారిణి అంకితా ధాకరే మెడలో కూడా మూడు ముళ్లు వేసేశాడు.ఫిబ్రవరి 11న కునో నేషనల్ పార్క్‌లో ఒక సాధారణ వేడుకలో వివాహం చేసుకున్నారు.ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.ప్రస్తుతం అంకితా ధాకరే రాష్ట్ర మంత్రిత్వ శాఖలో డిప్యూటీ సెక్రటరీగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం పెళ్లికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందించారు.కొంత మంది వ్యక్తిగతం అనగా.. ఇంకొందరు తప్పుపట్టారు. మరికొందరు ఇదేం పద్ధతి అంటూ నిలదీస్తున్నారు. ఇదిలా ఉంటే మూడవ వివాహం గురించి ఇప్పటి వరకు అవి ప్రసాద్ నుంచి అధికారిక ప్రకటన రాలేదు.సోషల్ మీడియాలో కూడా స్పందించలేదు.ప్రస్తుతం అయితే ఫొటోలు వైరల్ అవుతున్నాయి.ఇక అవి ప్రసాద్ ప్రస్తుతం మధ్యప్రదేశ్ ఉపాధి హామీ మండలి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO)గా పనిచేస్తున్నారు.గతంలో అనేక జిల్లాల్లో కలెక్టర్‌గా కూడా బాధ్యతలు నిర్వహించాడు.ఈ నిత్య పెళ్లి కొడుకైన ఐఏఎస్ అధికారిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.

- గుంటూరు కోదండ రామయ్య నగర్ 4వ లైన్ మెయిన్ రోడ్డు నిర్మాణం చేపట్టకపోవడంపై మంగళవారం స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏళ్లుగా మెటల్ రోడ్డుపై తేలిన రాళ్ల వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని వారు ఆవేదన చెందారు. ఇతర ప్రాంతాల్లో పనులు చేస్తున్న మున్సిపల్ అధికారులు, ఇక్కడ మాత్రం బడ్జెట్ లేదంటూ కాలయాపన చేస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు1
- * Delhi: * ఢిల్లీలో ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 (India AI Impact Summit 2026) అట్టహాసంగా ప్రారంభమైంది. * ఈ సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ జియో ఇంటెలిజెన్స్ పెవిలియన్‌ను సందర్శించారు. * ఇక్కడ జియో ఏఐ స్టాక్, జియో సంస్కృతి ఏఐ, జియో ఆరోగ్యం ఏఐ, జియో శిక్షా, జియో ఏఐ హోమ్ వంటి వివిధ ఏఐ మోడల్స్ వీక్షించారు. * జియో ఏఐ మోడల్స్ అన్నీ కూడా ఎంటర్‌ప్రైజ్ ఇంటెలిజెన్స్‌ను నడిపించడానికి, భారతీయ భాషలు & సాంస్కృతిక కంటెంట్‌ను ప్రోత్సహించడానికి, ఆరోగ్య సంరక్షణ డెలివరీని మెరుగుపరచడానికి, విద్యా వ్యవస్థలను బలోపేతం చేయడానికి & ఏఐ బేస్డ్ స్మార్ట్ లివింగ్‌ను ప్రారంభించడానికి ప్రత్యేకంగా రూపొందించారు.1
- గుంటూరు అమరావతిని సందర్శించిన పలకరించిన బిల్ గేట్స్ చంద్రబాబు ఆహ్వానం మేరకు మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ అమరావతిని సందర్శించారు.సోమవారం అమరావతిలో పర్యటించేందుకు వచ్చిన బిల్ గేట్స్ వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయానికి చేరుకున్నారు. సచివాలయం మొదటి బ్లాకు వద్ద బిల్ గేట్స్కు CM చంద్రబాబు నాయుడు, Dy CM పవన్ కళ్యాణ్ స్వాగతం పలికారు.1
- బీటెక్ విద్యార్థి మృతి.. కుటుంబ సభ్యుల ధర్నా *ఎన్టీఆర్ జిల్లా, జి. కొండూరు, ఫిబ్రవరి 17,* జి.కొండూరు మండలం మునగపాడుకు చెందిన బీటెక్ విద్యార్థి గిరీష్ ప్రైవేట్ స్కూల్ బస్సు ఢీకొన్న ప్రమాదంలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. కాలేజీ నుంచి ఇంటికి తిరిగి వెళ్తుండగా నాలుగు రోజుల క్రితం ఈ ప్రమాదం జరిగింది. స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డను కోల్పోయామని ఆగ్రహం వ్యక్తం చేస్తూ, మృతుని కుటుంబ సభ్యులు మంగళవారం పాఠశాల వద్ద ధర్నాకు దిగారు. తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.1
- Post by ఉంగరాల కార్తీక్1
- Post by 91241
- బుట్టాయిగూడెం మండలం కోట రామచంద్రపురం ఐటీడీఏ లో నిర్వహించిన రివ్యూ సమావేశానికి రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఐటిడిఏ పిఓ రాముల నాయక్ తో సహా పలువురు ఆమెకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఐసిడిసి, ఆశా వర్కర్లు, వైద్యాధికారులతో రివ్యూ సమావేశాన్ని నిర్వహించి పలు అంశాలపై చర్చించారు.1
- గుంటూరు జిల్లా: పొన్నూరు మండలం చింతలపూడిలోని ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ తల్లి ప్రమీలమ్మ ఇంట్లో భారీ దొంగతనం జరిగింది. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి దుండగులు 50 సవర్ల బంగారం, 10 కిలోల వెండితో పాటు లక్ష రూపాయల నగదు ఎత్తుకెళ్లారు. సమాచారం అందుకున్న పొన్నూరు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గుంటూరు నుంచి వచ్చిన క్లూస్ టీమ్ ఘటనా స్థలంలో ఆధారాలు సేకరిస్తోంది.1