logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

షీ టీం ఆధ్వర్యంలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలు గౌరవ రామగుండం సీపీ గారి ఆదేశానుసారము డీసీపీ మంచేరియల్ గారి ఆధ్వర్యంలో షీ టీం ఆధ్వర్యంలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలు గౌరవ రామగుండం సీపీ గారి ఆదేశానుసారము డీసీపీ మంచేరియల్ గారి ఆధ్వర్యంలో మంచేరియల్ లోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో షీ టీం ఆధ్వర్యంలో రక్షాబంధన్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. సోదర సోదరీమణుల మధ్య ప్రేమ, ఆప్యాయత, రక్షణకు ప్రతీకగా నిలిచే రక్షాబంధన్ సందర్భంగా విద్యార్థులు పోలీసు సిబ్బందికి రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా షీ టీం ఎస్ఐ ఉషారాణి మాట్లాడుతూ.. సమాజంలో శాంతిభద్రతలను కాపాడుతూ ప్రజలకు రక్షణ కల్పించడం తమ బాధ్యత అని, విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని మంచి పౌరులుగా ఎదగాలని సూచించారు. ప్రతి ఒక్కరూ పరస్పరం గౌరవించుకుంటూ, ఆపదలో ఉన్నవారికి అండగా నిలవాలని తెలిపారు. విద్యార్థులు పోలీసులతో కలిసి రక్షాబంధన్ వేడుకల్లో పాల్గొనడం పట్ల పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు. పోలీసుల సేవలను అభినందిస్తూ వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం విద్యార్థుల్లో సోదరభావం, సామాజిక బాధ్యత, దేశభక్తి మరియు పోలీసుల పట్ల గౌరవభావాన్ని పెంపొందించింది. కార్యక్రమంలో షీ టీం సిబ్బంది జ్యోతి, రాజేందర్ పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

45 min ago
user_Thalapalli Ramesh
Thalapalli Ramesh
బెల్లంపల్లె, మంచిర్యాల, తెలంగాణ•
45 min ago
e43116dd-0159-40b9-a1be-1aafd3a8404d

షీ టీం ఆధ్వర్యంలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలు గౌరవ రామగుండం సీపీ గారి ఆదేశానుసారము డీసీపీ మంచేరియల్ గారి ఆధ్వర్యంలో షీ టీం ఆధ్వర్యంలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలు గౌరవ రామగుండం సీపీ గారి ఆదేశానుసారము డీసీపీ మంచేరియల్ గారి ఆధ్వర్యంలో మంచేరియల్ లోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో షీ టీం ఆధ్వర్యంలో రక్షాబంధన్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. సోదర సోదరీమణుల

5fdfe031-0f2a-4157-a676-9ab08f19af46

మధ్య ప్రేమ, ఆప్యాయత, రక్షణకు ప్రతీకగా నిలిచే రక్షాబంధన్ సందర్భంగా విద్యార్థులు పోలీసు సిబ్బందికి రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా షీ టీం ఎస్ఐ ఉషారాణి మాట్లాడుతూ.. సమాజంలో శాంతిభద్రతలను కాపాడుతూ ప్రజలకు రక్షణ కల్పించడం తమ బాధ్యత అని, విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని మంచి పౌరులుగా ఎదగాలని సూచించారు. ప్రతి ఒక్కరూ పరస్పరం గౌరవించుకుంటూ, ఆపదలో ఉన్నవారికి

edddc45a-abd0-4a2f-bcb8-23c6279bdbe6

అండగా నిలవాలని తెలిపారు. విద్యార్థులు పోలీసులతో కలిసి రక్షాబంధన్ వేడుకల్లో పాల్గొనడం పట్ల పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు. పోలీసుల సేవలను అభినందిస్తూ వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం విద్యార్థుల్లో సోదరభావం, సామాజిక బాధ్యత, దేశభక్తి మరియు పోలీసుల పట్ల గౌరవభావాన్ని పెంపొందించింది. కార్యక్రమంలో షీ టీం సిబ్బంది జ్యోతి, రాజేందర్ పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

More news from Telangana and nearby areas
  • మంచిర్యాలలో బీసీ రాజకీయాలకు బలం.. మహేష్‌ వర్మ నాయకత్వంలో ముందడుగు మంచిర్యాల: నియోజకవర్గంలో బీసీ రాజకీయ నాయకత్వాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ ముందుకు సాగుతోంది. పార్టీ తరఫున బలమైన బీసీ నాయకత్వాన్ని మహేష్‌ వర్మ వహిస్తున్నారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. అగ్రవర్ణాల రాజకీయ ఆధిపత్యాన్ని ఎదుర్కొని బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం, అధికారంలో భాగస్వామ్యం కల్పించడమే తమ లక్ష్యమని తెలిపారు. తీన్మార్‌ మల్లన్న అధ్యక్షతన పార్టీ ఆధ్వర్యంలో మహేష్‌ వర్మ నాయకత్వంలో బీసీలను ఏకతాటిపైకి తీసుకువచ్చి ఆత్మగౌరవంతో రాజకీయ అధికారాన్ని సాధించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.
    1
    మంచిర్యాలలో బీసీ రాజకీయాలకు బలం.. మహేష్‌ వర్మ నాయకత్వంలో ముందడుగు
మంచిర్యాల: నియోజకవర్గంలో బీసీ రాజకీయ నాయకత్వాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ ముందుకు సాగుతోంది. పార్టీ తరఫున బలమైన బీసీ నాయకత్వాన్ని మహేష్‌ వర్మ వహిస్తున్నారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. అగ్రవర్ణాల రాజకీయ ఆధిపత్యాన్ని ఎదుర్కొని బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం, అధికారంలో భాగస్వామ్యం కల్పించడమే తమ లక్ష్యమని తెలిపారు. తీన్మార్‌ మల్లన్న అధ్యక్షతన పార్టీ ఆధ్వర్యంలో మహేష్‌ వర్మ నాయకత్వంలో బీసీలను ఏకతాటిపైకి తీసుకువచ్చి ఆత్మగౌరవంతో రాజకీయ అధికారాన్ని సాధించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.
    user_AlluriMahesh
    AlluriMahesh
    Local News Reporter Mancherial, Telangana•
    48 min ago
  • *జాతీయ బీసీ సంక్షేమ సంఘం* *రాష్ట్ర ఉపాధ్యక్షలు అమరవేణి నర్సాగౌడ్ కు ఆత్మీయ సన్మానం* *జాతీయ బీసీ సంక్షేమ సంఘం* *రాష్ట్ర ఉపాధ్యక్షలు అమరవేణి నర్సాగౌడ్ కు ఆత్మీయ సన్మానం* . ఈరోజు నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం నిర్మల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలోఇటీవల రాష్ట్ర ఉపాధ్యక్షులుగా నియమితులు ఐన అమరవేణి నర్సాగౌడ్ గారికి పూల మాలలు శాలువాలతో ఆత్మీయ సన్మానం చేశారు నిర్వహించారు. అమరవేణి నర్సాగౌడ్ హనుముల భాస్కర్ మాట్లాడుతూ :- ఈ దేశంలో 85% పైనున్న ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీలకు రాజ్యాధికారం రాకుండా కేవలం పిడికెడు మంది ఉన్న అగ్రకులాలు రాజ్యాంగపరమైన పదవులను అనుభవిస్తూ బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారంలో వాటా దక్కకుండా చేస్తున్న వారి విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు రాజ్యాధికారం లభించే వరకు ఐక్యంగా పోరాడుతామని తెలియజేశారు బీసీల జనాభా ప్రాతిపదికన న్యాయమైన వాటా, హక్కులు సాధించే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని తెలిపారు. . ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం నిర్మల్ జిల్లా అధ్యక్షులు అనుముల భాస్కర్ , సోన్ మండల అధ్యక్షులు మ్యాక ప్రేమ్ కుమార్ నాయకులు రమేష్, సత్యనారాయణ, రాజేష్, లక్ష్మీనారాయణ, కిషోర్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
    1
    *జాతీయ బీసీ సంక్షేమ సంఘం* 
*రాష్ట్ర ఉపాధ్యక్షలు అమరవేణి నర్సాగౌడ్ కు ఆత్మీయ సన్మానం*

*జాతీయ బీసీ సంక్షేమ సంఘం* 
*రాష్ట్ర ఉపాధ్యక్షలు అమరవేణి నర్సాగౌడ్ కు ఆత్మీయ సన్మానం*
.      ఈరోజు నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం నిర్మల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలోఇటీవల రాష్ట్ర ఉపాధ్యక్షులుగా నియమితులు ఐన అమరవేణి నర్సాగౌడ్ గారికి పూల మాలలు శాలువాలతో ఆత్మీయ సన్మానం చేశారు నిర్వహించారు.
అమరవేణి నర్సాగౌడ్ హనుముల భాస్కర్ మాట్లాడుతూ :-
ఈ దేశంలో 85% పైనున్న ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీలకు రాజ్యాధికారం రాకుండా కేవలం పిడికెడు మంది ఉన్న అగ్రకులాలు రాజ్యాంగపరమైన  పదవులను అనుభవిస్తూ బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారంలో వాటా దక్కకుండా చేస్తున్న వారి విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు రాజ్యాధికారం లభించే వరకు ఐక్యంగా పోరాడుతామని తెలియజేశారు  
బీసీల జనాభా ప్రాతిపదికన న్యాయమైన వాటా, హక్కులు సాధించే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని తెలిపారు.
.      ఈ కార్యక్రమంలో  జాతీయ బీసీ సంక్షేమ సంఘం నిర్మల్ జిల్లా అధ్యక్షులు అనుముల భాస్కర్ , సోన్ మండల అధ్యక్షులు మ్యాక ప్రేమ్ కుమార్  నాయకులు రమేష్,  సత్యనారాయణ,  రాజేష్, లక్ష్మీనారాయణ, కిషోర్ తదితర  నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
    user_Thalapalli Ramesh
    Thalapalli Ramesh
    బెల్లంపల్లె, మంచిర్యాల, తెలంగాణ•
    20 hrs ago
  • పోగొట్టుకున్న సెల్‌ఫోన్ల ఆచూకీని గుర్తించిన పోలీసులు.. స్వాధీనం చేసుకున్న 142 సెల్‌ఫోన్లను వాటి యజమానులకు అప్పగించిన రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఫోన్ పోయిందా... దొంగిలించబడిందా...? సీఈఐఆర్ పోర్టల్‌ను సద్వినియోగం చేసుకోండి: రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా* * రూ. 27.40 లక్షల విలువైన 142 సెల్‌ఫోన్లు బాధితులకు అందజేత* రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో సెల్‌ఫోన్‌ను పోగొట్టుకున్నా లేదా దొంగిలించబడినా వెంటనే స్పందించి సీఈఐఆర్ (CEIR) పోర్టల్‌ను సద్వినియోగం చేసుకోవాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా సూచించారు. మంగళవారం సెల్‌ఫోన్ల రికవరీకి సంబంధించి పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు సీసీఎస్ ఏసీపీలు రవీందర్, ప్రవీణ్ కుమార్ నేతృత్వంలో రామగుండం పోలీస్ కమిషనరేట్ సీసీఎస్, ఐటీ సెల్ బృందాలు సెల్‌ఫోన్ రికవరీ మేళా నిర్వహించాయి. ఈ సందర్భంగా పోగొట్టుకున్న, దొంగిలించబడిన సెల్‌ఫోన్ల ఆచూకీని గుర్తించి,పోలీసులు స్వాధీనం చేసుకున్న 142 సెల్‌ఫోన్లను వాటి యజమానులకు రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ, దొంగిలించబడిన లేదా పోగొట్టుకున్న సెల్‌ఫోన్ల ఆచూకీని గుర్తించేందుకు సీసీఎస్‌తోపాటు ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇప్పటివరకు 10,420 మంది సీఈఐఆర్ పోర్టల్‌లో ఫిర్యాదులు నమోదు చేయగా,అందులో 3,717 సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకుని వాటి యజమానులకు అందజేసినట్లు తెలిపారు.గత కొంతకాలంగా సీసీఎస్,ఐటీ సెల్ పోలీసులు ప్రత్యేకంగా శ్రమించి మరో 142 సెల్‌ఫోన్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. సెల్‌ఫోన్ దొంగతనాలు, పోగొట్టుకున్న ఫోన్ల సమస్యల పరిష్కారానికి భారత ప్రభుత్వ టెలికమ్యూనికేషన్స్ విభాగం సీఈఐఆర్ పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకువచ్చిందని తెలిపారు. ప్రస్తుత జీవనశైలిలో మొబైల్ ఫోన్ అత్యంత కీలకమైన సాధనంగా మారిందని అన్నారు.ఏదైనా సమాచారం తెలుసుకోవాలన్నా, నగదు చెల్లింపులు చేయాలన్నా, ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలన్నా మొబైల్ ఫోన్‌పైనే ఎక్కువగా ఆధారపడుతున్నామని పేర్కొన్నారు. ఎవరైనా తమ మొబైల్ ఫోన్‌ను పోగొట్టుకున్నా లేదా దొంగిలించబడినా వెంటనే సీఈఐఆర్ పోర్టల్‌లో సంబంధిత ఫోన్‌ను బ్లాక్ చేయడంతోపాటు, సంబంధిత పోలీస్ స్టేషన్‌లో సమాచారం ఇవ్వాలని సీపీ ప్రజలకు సూచించారు. సీఈఐఆర్ పోర్టల్ ముఖ్యంగా పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన మొబైల్ ఫోన్‌లను గుర్తించడంలో ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. పోర్టల్‌లో నమోదు చేసిన ఫోన్ వివరాల ఆధారంగా, ఆ మొబైల్ ఫోన్‌ను ఇతర రాష్ట్రాల్లో లేదా ఇతర నెట్‌వర్క్‌లలో ఉపయోగించకుండా నిరోధించవచ్చని చెప్పారు. దీంతో దొంగిలించబడిన ఫోన్‌ను వినియోగించడం కష్టతరమవుతుందని పేర్కొన్నారు. ఈ విధానం ద్వారా సెల్‌ఫోన్ చోరీలను తగ్గించడంతోపాటు, పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన ఫోన్లను తిరిగి గుర్తించి యజమానులకు అందించే అవకాశం మరింత పెరుగుతుందని సీపీ తెలిపారు.ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ (పరిపాలన) కె.శ్రీనివాస్,సీసీఎస్ ఏసీపీలు రవీందర్, ప్రవీణ్ కుమార్,వై. కృష్ణారెడ్డి,టి.గోపి,పి. బాలాజీ వరప్రసాద్, ఐటీ కోర్ ఇన్‌స్పెక్టర్ చంద్రశేఖర్ గౌడ్, ఎస్‌ఐలు బి.జీవన్, ఎం.చంద్రశేఖర్, ఎం.ఏ.నసీర్, ఎం. శివకేశవులు,కె. భాస్కర్ రావు,బి. భూమన్న,బి.శిరీష, శెట్టి లలిత,ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
    1
    పోగొట్టుకున్న సెల్‌ఫోన్ల ఆచూకీని గుర్తించిన పోలీసులు.. స్వాధీనం చేసుకున్న 142 సెల్‌ఫోన్లను వాటి యజమానులకు అప్పగించిన రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా
ఫోన్ పోయిందా... దొంగిలించబడిందా...? సీఈఐఆర్ పోర్టల్‌ను సద్వినియోగం చేసుకోండి: రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా*
* రూ. 27.40 లక్షల విలువైన 142 సెల్‌ఫోన్లు బాధితులకు అందజేత*
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో సెల్‌ఫోన్‌ను పోగొట్టుకున్నా లేదా దొంగిలించబడినా వెంటనే స్పందించి సీఈఐఆర్ (CEIR) పోర్టల్‌ను సద్వినియోగం చేసుకోవాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా సూచించారు.
మంగళవారం సెల్‌ఫోన్ల రికవరీకి సంబంధించి పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు సీసీఎస్ ఏసీపీలు రవీందర్, ప్రవీణ్ కుమార్ నేతృత్వంలో రామగుండం పోలీస్ కమిషనరేట్ సీసీఎస్, ఐటీ సెల్ బృందాలు సెల్‌ఫోన్ రికవరీ మేళా నిర్వహించాయి.
ఈ సందర్భంగా పోగొట్టుకున్న, దొంగిలించబడిన సెల్‌ఫోన్ల ఆచూకీని గుర్తించి,పోలీసులు స్వాధీనం చేసుకున్న 142 సెల్‌ఫోన్లను వాటి యజమానులకు రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా చేతుల మీదుగా అందజేశారు.
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ, దొంగిలించబడిన లేదా పోగొట్టుకున్న సెల్‌ఫోన్ల ఆచూకీని గుర్తించేందుకు సీసీఎస్‌తోపాటు ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇప్పటివరకు 10,420 మంది సీఈఐఆర్ పోర్టల్‌లో ఫిర్యాదులు నమోదు చేయగా,అందులో 3,717 సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకుని వాటి యజమానులకు అందజేసినట్లు తెలిపారు.గత కొంతకాలంగా సీసీఎస్,ఐటీ సెల్ పోలీసులు ప్రత్యేకంగా శ్రమించి మరో 142 సెల్‌ఫోన్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.
సెల్‌ఫోన్ దొంగతనాలు, పోగొట్టుకున్న ఫోన్ల సమస్యల పరిష్కారానికి భారత ప్రభుత్వ టెలికమ్యూనికేషన్స్ విభాగం సీఈఐఆర్ పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకువచ్చిందని తెలిపారు.
ప్రస్తుత జీవనశైలిలో మొబైల్ ఫోన్ అత్యంత కీలకమైన సాధనంగా మారిందని అన్నారు.ఏదైనా సమాచారం తెలుసుకోవాలన్నా, నగదు చెల్లింపులు చేయాలన్నా, ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలన్నా మొబైల్ ఫోన్‌పైనే ఎక్కువగా ఆధారపడుతున్నామని పేర్కొన్నారు.
ఎవరైనా తమ మొబైల్ ఫోన్‌ను పోగొట్టుకున్నా లేదా దొంగిలించబడినా వెంటనే సీఈఐఆర్ పోర్టల్‌లో సంబంధిత ఫోన్‌ను బ్లాక్ చేయడంతోపాటు, సంబంధిత పోలీస్ స్టేషన్‌లో సమాచారం ఇవ్వాలని సీపీ ప్రజలకు సూచించారు.
సీఈఐఆర్ పోర్టల్ ముఖ్యంగా పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన మొబైల్ ఫోన్‌లను గుర్తించడంలో ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. పోర్టల్‌లో నమోదు చేసిన ఫోన్ వివరాల ఆధారంగా, ఆ మొబైల్ ఫోన్‌ను ఇతర రాష్ట్రాల్లో లేదా ఇతర నెట్‌వర్క్‌లలో ఉపయోగించకుండా నిరోధించవచ్చని చెప్పారు. దీంతో దొంగిలించబడిన ఫోన్‌ను వినియోగించడం కష్టతరమవుతుందని పేర్కొన్నారు.
ఈ విధానం ద్వారా సెల్‌ఫోన్ చోరీలను తగ్గించడంతోపాటు, పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన ఫోన్లను తిరిగి గుర్తించి యజమానులకు అందించే అవకాశం మరింత పెరుగుతుందని సీపీ తెలిపారు.ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ (పరిపాలన) కె.శ్రీనివాస్,సీసీఎస్ ఏసీపీలు రవీందర్, ప్రవీణ్ కుమార్,వై. కృష్ణారెడ్డి,టి.గోపి,పి. బాలాజీ వరప్రసాద్, ఐటీ కోర్ ఇన్‌స్పెక్టర్ చంద్రశేఖర్ గౌడ్, ఎస్‌ఐలు బి.జీవన్, ఎం.చంద్రశేఖర్, ఎం.ఏ.నసీర్, ఎం. శివకేశవులు,కె. భాస్కర్ రావు,బి. భూమన్న,బి.శిరీష, శెట్టి లలిత,ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
    user_Telangana reporter
    Telangana reporter
    Local News Reporter రామగుండం, పెద్దపల్లి, తెలంగాణ•
    17 hrs ago
  • తెలంగాణ ఉద్యోగ ఉపాధ్యాయ,పెన్షనర్ల జేఏసీ ఆధ్వర్యంలో కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట ధర్నా కరీంనగర్‌లో ఉద్యోగుల మహాధర్నా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఉద్యోగ ఉపాధ్యాయ,పెన్షనర్ల జేఏసీ ఆధ్వర్యంలో కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట ధర్నా జిల్లాలోని ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు, గెజిటెడ్ అధికారులు, నాలుగో తరగతి సిబ్బంది, డ్రైవర్లు మరియు వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఉద్యోగుల సంక్షేమానికి చర్యలు తీసుకోవాలని, సీపీఎస్ స్థానంలో పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు.
    3
    తెలంగాణ ఉద్యోగ ఉపాధ్యాయ,పెన్షనర్ల జేఏసీ ఆధ్వర్యంలో కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట ధర్నా 
కరీంనగర్‌లో ఉద్యోగుల మహాధర్నా
ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఉద్యోగ ఉపాధ్యాయ,పెన్షనర్ల జేఏసీ ఆధ్వర్యంలో కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట ధర్నా 
జిల్లాలోని ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు, గెజిటెడ్ అధికారులు, నాలుగో తరగతి సిబ్బంది, డ్రైవర్లు మరియు వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఉద్యోగుల సంక్షేమానికి చర్యలు తీసుకోవాలని, సీపీఎస్ స్థానంలో పాత పెన్షన్ విధానాన్ని  పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు.
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    Karimnagar, Telangana•
    23 min ago
  • మిలాద్‌ ఉన్‌ నబీ ఊరేగింపు ప్రశాంతంగా నిర్వహణ : సహకరించినందుకు వారికి ధన్యవాదాలు సిపి గౌస్ ఆలం కరీంనగర్‌లో మిలాద్‌ ఉన్‌ నబీ పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారం నిర్వహించిన ఊరేగింపు ప్రశాంతంగా, వైభవంగా సాగింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా కరీంనగర్ పోలీస్‌ కమిషనరేట్‌ ఆధ్వర్యంలో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం తెలిపారు. సీపీ గౌష్‌ ఆలం స్థానిక పోలీసు అధికారులతో కలిసి భద్రతా ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించి పర్యవేక్షించారు. నాఖా చౌరస్తా, తెలంగాణ చౌక్‌ వద్ద ముస్లిం మత పెద్దలను పూలమాలలతో సత్కరించి మిలాద్‌ ఉన్‌ నబీ శుభాకాంక్షలు తెలిపారు. ఊరేగింపును ప్రశాంతంగా నిర్వహించడంలో సహకరించినందుకు వారికి ధన్యవాదాలు తెలిపారు. కరీంనగర్‌ శాంతిభద్రతలు, పరమత సహనం, సోదరభావానికి ప్రతీకగా నిలుస్తోందని, నగరంలోని గంగా–జమునా తెహజీబ్‌కు ఈ వేడుకలు నిదర్శనమని సీపీ పేర్కొన్నారు. ఊరేగింపు మార్గంలో ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ట్రాఫిక్‌ మళ్లింపులు చేపట్టి, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.
    1
    మిలాద్‌ ఉన్‌ నబీ ఊరేగింపు ప్రశాంతంగా నిర్వహణ : సహకరించినందుకు వారికి ధన్యవాదాలు సిపి గౌస్ ఆలం
కరీంనగర్‌లో మిలాద్‌ ఉన్‌ నబీ పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారం నిర్వహించిన ఊరేగింపు ప్రశాంతంగా, వైభవంగా సాగింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా కరీంనగర్ పోలీస్‌ కమిషనరేట్‌ ఆధ్వర్యంలో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం తెలిపారు.
సీపీ గౌష్‌ ఆలం స్థానిక పోలీసు అధికారులతో కలిసి భద్రతా ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించి పర్యవేక్షించారు. నాఖా చౌరస్తా, తెలంగాణ చౌక్‌ వద్ద ముస్లిం మత పెద్దలను పూలమాలలతో సత్కరించి మిలాద్‌ ఉన్‌ నబీ శుభాకాంక్షలు తెలిపారు. ఊరేగింపును ప్రశాంతంగా నిర్వహించడంలో సహకరించినందుకు వారికి ధన్యవాదాలు తెలిపారు.
కరీంనగర్‌ శాంతిభద్రతలు, పరమత సహనం, సోదరభావానికి ప్రతీకగా నిలుస్తోందని, నగరంలోని గంగా–జమునా తెహజీబ్‌కు ఈ వేడుకలు నిదర్శనమని సీపీ పేర్కొన్నారు. ఊరేగింపు మార్గంలో ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ట్రాఫిక్‌ మళ్లింపులు చేపట్టి, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.
    user_శాతవాహన కరీంనగర్
    శాతవాహన కరీంనగర్
    కరీంనగర్ రూరల్, కరీంనగర్, తెలంగాణ•
    15 hrs ago
  • ఘనంగా అయ్యప్ప స్వామి పడి పూజ, దేవాలయంలో ఆధ్యాత్మిక వాతావరణం దండేపల్లి మండలంలోని గూడెం గుట్ట పరిధిలో ఉన్న అయ్యప్ప స్వామి దేవాలయంలో పడిపూజ కార్యక్రమం వైభవంగా జరిగింది. కేరళలో జరిగే ఓనం పండుగ సందర్భంగా ఆదివారం సాయంత్రం దేవాలయంలో అయ్యప్ప స్వామి పడిపూజను వేద పండితులు ఘనంగా నిర్వహించారు. అనంతరం దేవాలయంలో అయ్యప్ప స్వామి భక్తి పాటలు పాడుతూ భజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీంతో అయ్యప్ప స్వామి దేవాలయం, పరిసరాలలో పూర్తిగా ఆధ్యాత్మిక వాతావరణం సంతరించుకుంది.
    1
    ఘనంగా అయ్యప్ప స్వామి పడి పూజ, దేవాలయంలో ఆధ్యాత్మిక వాతావరణం
దండేపల్లి మండలంలోని గూడెం గుట్ట పరిధిలో ఉన్న అయ్యప్ప స్వామి దేవాలయంలో పడిపూజ కార్యక్రమం వైభవంగా జరిగింది. కేరళలో జరిగే ఓనం పండుగ సందర్భంగా ఆదివారం సాయంత్రం దేవాలయంలో అయ్యప్ప స్వామి పడిపూజను వేద పండితులు ఘనంగా నిర్వహించారు. 
అనంతరం దేవాలయంలో అయ్యప్ప స్వామి భక్తి పాటలు పాడుతూ భజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీంతో అయ్యప్ప స్వామి దేవాలయం, పరిసరాలలో పూర్తిగా ఆధ్యాత్మిక వాతావరణం  సంతరించుకుంది.
    user_P.G. Murthy
    P.G. Murthy
    జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    15 hrs ago
  • గన్నేరువరం మండలం డబుల్ రోడ్డు కోసం 30న నిరాహార దీక్ష.. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో డబుల్ రోడ్డు నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తూ యువజన సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 30న 24 గంటల నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు నాయకులు తెలిపారు. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో 100 రోజుల్లో డబుల్ రోడ్డు నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చినా, రెండున్నరేళ్లు గడిచినా పనులు ప్రారంభం కాలేదని ఆరోపించారు. రోడ్డు సమస్యపై ప్రజలు, యువజన సంఘాలు పలుమార్లు ప్రశ్నించినా సరైన సమాధానం రాలేదన్నారు. ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు చిత్తశుద్ధి ఉంటే 30న లక్ష్మీనరసింహస్వామి కాంప్లెక్స్ ఎదుట జరిగే నిరాహార దీక్షకు హాజరై తమతో కలిసి కూర్చోవాలని కోరారు. రోడ్డు సమస్య పరిష్కారం కోసం పార్టీలకతీతంగా అన్ని రాజకీయ పార్టీలు, ప్రజలు దీక్షకు మద్దతుగా తరలిరావాలని పిలుపునిచ్చారు. యువజన సంఘాల ఐక్యతతో డబుల్ రోడ్డు సాధించే వరకు పోరాటం కొనసాగిస్తాం” అని నాయకులు స్పష్టం చేశారు.
    1
    గన్నేరువరం మండలం డబుల్ రోడ్డు కోసం 30న నిరాహార దీక్ష..
కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో డబుల్ రోడ్డు నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తూ యువజన సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 30న 24 గంటల నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు నాయకులు తెలిపారు. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను గురువారం ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో 100 రోజుల్లో డబుల్ రోడ్డు నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చినా, రెండున్నరేళ్లు గడిచినా పనులు ప్రారంభం కాలేదని ఆరోపించారు. రోడ్డు సమస్యపై ప్రజలు, యువజన సంఘాలు పలుమార్లు ప్రశ్నించినా సరైన సమాధానం రాలేదన్నారు.
ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు చిత్తశుద్ధి ఉంటే 30న లక్ష్మీనరసింహస్వామి కాంప్లెక్స్ ఎదుట జరిగే నిరాహార దీక్షకు హాజరై తమతో కలిసి కూర్చోవాలని కోరారు. రోడ్డు సమస్య పరిష్కారం కోసం పార్టీలకతీతంగా అన్ని రాజకీయ పార్టీలు, ప్రజలు దీక్షకు మద్దతుగా తరలిరావాలని పిలుపునిచ్చారు.
యువజన సంఘాల ఐక్యతతో డబుల్ రోడ్డు సాధించే వరకు పోరాటం కొనసాగిస్తాం” అని నాయకులు స్పష్టం చేశారు.
    user_Vodnala thirupthi
    Vodnala thirupthi
    Tour operator గన్నేరువరం, కరీంనగర్, తెలంగాణ•
    2 hrs ago
  • రామగుండం లో గుజరాత్.NIA తనిఖీలు., * పూర్తి స్థాయిలో విచారణ జరపాలని రామగుండం సిపి కి వినతిపత్రం అందించిన విశ్వహింద్ పరిషత్ రామగుండం లో గుజరాత్ NIA తనిఖీల సంబంధించి రామగుండం పోలీసు కమీషనర్ కు వినతి పత్రం సమర్పించిన విశ్వహిందూ పరిషత్ నాయకులు. నిన్ను రామగుండం అయోధ్య నగర్ లో ముజాహిల్ అనే విద్యార్థి నీ గుజరాత్ NIA వారు అతని ఇంటిని సోదాలు నిర్వహించి అతని ఫోన్. లాప్టాప్ తీసుకువెళ్ళి అతనిని NTPC పోలీస్ స్టేషన్ లో విచారించడం జరిగింది.. ఈ సందర్భంగా పరిషత్. విభాగ కార్యదర్శి. అయోధ్య రవీందర్ మాట్లాడుతూ పారిశ్రామిక ప్రాంతంలో గత కొన్ని సంవత్సరాల నుండి ఇక్కడ ఉగ్రవాద జడలు ఉన్నాయి.. అనేకమంది ఇక్కడ షెల్టర్ తీసుకున్నారు. అనేకసార్లు ఇక్కడ జాతీయ నిగూ సంస్థ ల తనిఖీలు జరిగాయి.. కావున పోలీసు వారు ఇలాంటి సంఘటనలను సీరియస్ గా తీసుకొని పూర్తి స్థాయిలో విచారణ జరపాలని కోరారు... ఈ కార్యక్రమంలో. జిల్లా సహా కార్యదర్శి అడ్డిగొప్పుల రాజు. నగర్ కార్యదర్శి మునిగాల సంపత్. వెంకటస్వామి. లింగాన్న. రాజేశ్. తిరుపతి. మరియు బాధ్యులు పాల్గొన్నారు.....
    1
    రామగుండం లో గుజరాత్.NIA తనిఖీలు.,
* పూర్తి స్థాయిలో విచారణ జరపాలని రామగుండం సిపి కి వినతిపత్రం అందించిన విశ్వహింద్ పరిషత్ 
రామగుండం లో గుజరాత్ NIA తనిఖీల సంబంధించి రామగుండం పోలీసు కమీషనర్ కు వినతి పత్రం సమర్పించిన విశ్వహిందూ పరిషత్ నాయకులు.
నిన్ను రామగుండం అయోధ్య నగర్ లో ముజాహిల్ అనే విద్యార్థి నీ గుజరాత్ NIA వారు అతని ఇంటిని సోదాలు నిర్వహించి అతని ఫోన్. లాప్టాప్ తీసుకువెళ్ళి అతనిని NTPC పోలీస్ స్టేషన్ లో విచారించడం జరిగింది.. ఈ సందర్భంగా పరిషత్. విభాగ కార్యదర్శి. అయోధ్య రవీందర్ మాట్లాడుతూ పారిశ్రామిక ప్రాంతంలో గత కొన్ని సంవత్సరాల నుండి ఇక్కడ ఉగ్రవాద జడలు ఉన్నాయి.. అనేకమంది ఇక్కడ షెల్టర్ తీసుకున్నారు. అనేకసార్లు ఇక్కడ జాతీయ నిగూ సంస్థ ల తనిఖీలు జరిగాయి.. కావున పోలీసు వారు ఇలాంటి సంఘటనలను సీరియస్ గా తీసుకొని పూర్తి స్థాయిలో విచారణ జరపాలని కోరారు...
ఈ కార్యక్రమంలో. జిల్లా సహా కార్యదర్శి అడ్డిగొప్పుల రాజు. నగర్ కార్యదర్శి మునిగాల సంపత్. వెంకటస్వామి. లింగాన్న. రాజేశ్. తిరుపతి. మరియు బాధ్యులు పాల్గొన్నారు.....
    user_Telangana reporter
    Telangana reporter
    Local News Reporter రామగుండం, పెద్దపల్లి, తెలంగాణ•
    17 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.