Shuru
Apke Nagar Ki App…
ఓయూలో "హోలీ" అఖిల భారత విద్యార్థి పరిషత్ (ABVP) ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో అంగరంగ వైభవంగా హోలీ పండుగ సంబరాలలో వేలాదిమంది విద్యార్థులతోని దద్దరిల్లిన ఓయూ. హోలీ వేడుకల్లో ఒకరిపై ఒకరు రంగులు చల్లుకొని డిజె సౌండ్ ల నడుమ నృత్యం చేస్తూ ఓయూ ప్రాంగణమంతా కలర్లతో నిండిపోయింది.
Sagaboina Paparao
ఓయూలో "హోలీ" అఖిల భారత విద్యార్థి పరిషత్ (ABVP) ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో అంగరంగ వైభవంగా హోలీ పండుగ సంబరాలలో వేలాదిమంది విద్యార్థులతోని దద్దరిల్లిన ఓయూ. హోలీ వేడుకల్లో ఒకరిపై ఒకరు రంగులు చల్లుకొని డిజె సౌండ్ ల నడుమ నృత్యం చేస్తూ ఓయూ ప్రాంగణమంతా కలర్లతో నిండిపోయింది.
More news from తెలంగాణ and nearby areas
- తెలంగాణ రాష్ట్రంలో రెడ్లు,వెలమలు కలిసి కొట్టేసిన లక్ష పద్నాలుగు వేల ఎకరాల భూదాన్ భూముల లెక్క తేల్చాలని బీసీ రాజ్యాధికార పార్టీ అధినేత, ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. ఖమ్మం వెలుగుమట్లలో పేదోడు కేవలం 30 ఎకరాల్లో గుడిసెలు వేసుకుంటే కూలగొట్టారు...మరి ఈ లక్ష ఎకరాల సంగతి ఏందీ.? గత ప్రభుత్వ పెద్దలు,ఈ ప్రభుత్వ పెద్దలు కలిసి లక్ష ఎకరాల భూదాన్ భూములు కొట్టేశారు. నాటి కెసిఆర్.. నేటి రేవంత్ రెడ్డి పాలనలో భూదాన్ భూముల సంగతి తేల్చాలని తీన్మార్ మల్లన్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.1
- కీసర, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కీసర సర్కిల్ పరిధిలోని రాంపల్లి దాయరలో వెలసిన హేమాద్రి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం లో మంగళవారం గిరి ప్రదక్షిణ, పల్లకి సేవ అంగరంగ వైభవంగా నిర్వహించారు. ప్రతి పౌర్ణమి రోజున జరిగే ఈ కార్యక్రమం హోలీ పర్వదినం, లక్ష్మీ అమ్మవారి జయంతి యోగం సందర్భంగా విశేషంగా జరిగింది.ఉదయం ఐదు గంటలకు వేదోత్తములు ఆదిత్య శర్మ, శ్రీనివాస్ శర్మల మార్గదర్శకత్వంలో స్వామి వారి విశేష పూజలు నిర్వహించి అనంతరం పల్లకి సేవతో గిరి ప్రదక్షిణ ప్రారంభించారు. గిరిప్రదక్షిణలో పాల్గొన్న భక్తులు భజనలు, భక్తి గీతాలతో గోవింద నామస్మరణ చేస్తూ వెంకులోనిగుట్ట గిరులను మార్మోగించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మేడ్చల్ నియోజకవర్గ శాసనసభ్యులు, మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి, మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్, శ్రీ సాయి ధామం దత్త పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ రామానంద ప్రభూజీ స్వామి పాల్గొన్నారు. గిరి ప్రదక్షిణ అనంతరం లక్ష్మీ అమ్మవారి జయంతి యోగం సందర్భంగా విశేష లక్ష్మీ పూజను ఆలయ చైర్మన్ కందాడి హనుమంత్ రెడ్డి దంపతులు, ఆలయ ట్రస్ట్ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించారు. లక్ష్మీ అమ్మవారికి గవ్వలతో అభిషేకం చేసి, అనంతరం స్వామీజీ, ఎమ్మెల్యే చేతుల మీదుగా భక్తులకు లక్ష్మీ గవ్వలను పంపిణీ చేశారు. ప్రతి ఇంటిలో లక్ష్మీ గవ్వలు ఉండడం అష్టైశ్వర్య సిద్ధికి కారణమని వేద పండితులు తెలిపారు.వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ దేవాలయ జీర్ణోద్ధరణ కార్యక్రమాన్ని ప్రారంభించిన నిర్వాహకులను ప్రముఖులు ప్రశంసించారు. కార్యక్రమంలో కెఎల్‌ఆర్ ఇండస్ట్రియల్ పార్క్ అసోసియేషన్ సభ్యులు, మన్నె ఇంజనీరింగ్ కంపెనీ ప్రతినిధులు, అలియాబాద్ మున్సిపాలిటీ చైర్మన్, వివిధ రాజకీయ పార్టీల రాష్ట్ర నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, ఆలయ ట్రస్టు సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.3
- हैदराबाद में ममता नामक महिला ने अपने 2-महीने के बच्चे की हत्या कर दी है. पुलिस के अनुसार, सुबह बच्चे का पिता घर लौटा तो उसने देखा कि ममता बच्चे को जलते चूल्हे में जला रही थी. बच्चे के मुंह में कपड़ा और आंखों पर पट्टी थी. रिपोर्ट्स के मुताबिक बच्चे के लगातार रोने से परेशान होकर उसने यह कदम उठाया.1
- గజ్వేల్: సిద్దిపేట జిల్లా మార్చి 3 ప్రజా తెలంగాణ న్యూస్/ సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో కీర్తిశేషులు రామారావు–విజయలక్ష్మి స్మారకంగా నిర్వహించిన ఉత్తమ మహిళా పురస్కారాల కార్యక్రమంలో ప్రముఖ కవి, రచయిత శంకర్ నారాయణ సమాజానికి సందేశాత్మకంగా మాట్లాడారు. వృద్ధాప్యంలో తల్లిదండ్రులను నిర్లక్ష్యంగా అనాధాశ్రమాలకు తరలించడం సమాజంలో పెరుగుతున్న ఆందోళనకర ధోరణి అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నవమాసాలు మోసి సంతానానికి జీవం ప్రసాదించే తల్లి రుణాన్ని ఎన్నటికీ తీర్చలేమని పేర్కొన్నారు. అయినప్పటికీ కొందరు తమ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయడం బాధాకరమని అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని పాటల రచయిత, స్వరకర్త రాయరావు విశ్వేశ్వరరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మహిళల పట్ల అగౌరవం, హింసాత్మక ఘటనలు ఇంకా కొనసాగుతుండటం సమాజానికి మంచిది కాదని శంకర్ నారాయణ పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ చందన, వైస్ చైర్మన్ పద్మ భాయి తదితరులు పాల్గొన్నారు. ముందుగా వివిధ రంగాల్లో విశిష్ట ప్రతిభ కనబర్చిన మహిళలను ఘనంగా సన్మానించి ఉత్తమ మహిళా పురస్కారాలు అందజేశారు.4
- BLR చారిటబుల్ ట్రస్ట్ పేరు మీద ఏడుగురు ఎంబీబీఎస్ విద్యార్థులకు చెక్కులు అందజేసిన హరీష్ రావు ప్రస్తుత విద్యా సంవత్సరంలోనే మొత్తం 122 మంది వైద్య విద్యార్థులకు వారి విద్యా ఖర్చుల కోసం ఆర్థిక సహాయం అందించిన బండారి లక్ష్మారెడ్డి1
- సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండల కేంద్రంలోని శంభులోంగేశ్వర కాలనీ లో రేపు హోళీ పండుగ సందర్భంగా సోమవారం రాత్రి కామ దహనానికి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాలనీలోని చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ చురుకుగా పాల్గొన్నారు. కనుమరుగైపోతున్న సంస్కృతి సంప్రదాయాలు భవిష్యత్ తరాలకు ప్రతి ఒక్కరూ అందించాలని వారు తెలిపారు3
- విద్యార్థులు ఎయిడ్స్ పై అవగాహన కలిగి ఉండాలి: సంగారెడ్డి సైన్స్ కేంద్రంలో విద్యార్థులకు అవగాహన కల్పించిన వైద్య శాఖ అధికారులు1
- తెలంగాణ నిజామాబాద్ జిల్లా సాలూరా మండలంలోని హున్సా గ్రామంలో హోలీ పండుగ రోజున పిడిగుద్దులాట నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఈసారి కూడా మంగళవారం పిడిగుద్దులాట నిర్వహించారు. గ్రామస్తులు రెండు వర్గాలుగా విడిపోయి కొన్ని నిమిషాల పాటు పరస్పరం ముఖాలపై పిడిగుద్దులు కురిపించుకుంటారు. ఈ ఆటను చూసేందుకు మహారాష్ట్ర నుంచి కూడా ప్రజలు తరలివస్తారు. బయటివారికి వింతగా కనిపించినా హున్సా గ్రామస్తులు మాత్రం దీనిని ఆచారంగా భావించి ఎంతో ఇష్టంతో ఆడుతారు అంటూ అక్కడ ప్రజలు పేర్కొన్నారు.1