స్థానిక శ్రీ వై ఎన్ కళాశాల యోగా సెంటర్ ఆధ్వర్యంలో, 'యోగాంధ్ర' అభ్యసన కార్యక్రమంలో భాగంగా, అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డాక్టర్ సిహెచ్ కనకారావు మాట్లాడుతూ, యోగా మన దేశ సంస్కృతిలో ఒక భాగమని, అది నేడు ప్రపంచవ్యాప్తంగా వ్యాపించి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకునే స్థాయికి చేరుకుందంటే దాని ప్రత్యేకతను చెప్పనక్కర్లేదని అన్నారు. 'యోగాంధ్ర'గా అందరూ కలిసి ఆసనాలను వేయడం చాలా సంతోషంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రెసిడెంట్ పోలిశెట్టి శ్రీ రఘురామ రావు, సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ డాక్టర్ అందే రామ్ సతీష్, కళాశాల IQAC కోఆర్డినేటర్ డా. గంధం శ్రీ రామకృష్ణ, హెచ్.ఆర్.డి డైరెక్టర్ డా.సి.హెచ్ శ్రీనివాస్, భౌతిక శాస్త్ర విభాగ అధిపతి అప్పనఫణి, సంస్కృత విభాగాధిపతిరాలు డా. కె.వీ.ఆర్.బి.వరలక్ష్మి, రసాయన శాస్త్ర విభాగాధిపతి డా.బి.ఆనంద కుమార్, యోగా కన్వీనర్ కె.ఎల్ గణేష్ కుమార్, మహిళా సాధికార విభాగ సమన్వయకారిణి కుసుమ, ఎన్.ఎస్.ఎస్. యూనిట్స్ I,II ఆఫీసర్స్ ఎస్.యాకోబు, చింతా సోమేశ్వరి పాల్గొన్నారు. అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బందితో పాటు విద్యార్థిని విద్యార్థులు కూడా ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు.
స్థానిక శ్రీ వై ఎన్ కళాశాల యోగా సెంటర్ ఆధ్వర్యంలో, 'యోగాంధ్ర' అభ్యసన కార్యక్రమంలో భాగంగా, అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డాక్టర్ సిహెచ్ కనకారావు మాట్లాడుతూ, యోగా మన దేశ సంస్కృతిలో ఒక భాగమని, అది నేడు ప్రపంచవ్యాప్తంగా వ్యాపించి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకునే స్థాయికి చేరుకుందంటే దాని ప్రత్యేకతను చెప్పనక్కర్లేదని అన్నారు. 'యోగాంధ్ర'గా అందరూ కలిసి ఆసనాలను వేయడం చాలా సంతోషంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రెసిడెంట్ పోలిశెట్టి శ్రీ రఘురామ రావు, సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ డాక్టర్ అందే రామ్ సతీష్, కళాశాల IQAC కోఆర్డినేటర్ డా. గంధం శ్రీ రామకృష్ణ, హెచ్.ఆర్.డి డైరెక్టర్ డా.సి.హెచ్ శ్రీనివాస్, భౌతిక శాస్త్ర విభాగ అధిపతి అప్పనఫణి, సంస్కృత విభాగాధిపతిరాలు డా. కె.వీ.ఆర్.బి.వరలక్ష్మి, రసాయన శాస్త్ర విభాగాధిపతి డా.బి.ఆనంద కుమార్, యోగా కన్వీనర్ కె.ఎల్ గణేష్ కుమార్, మహిళా సాధికార విభాగ సమన్వయకారిణి కుసుమ, ఎన్.ఎస్.ఎస్. యూనిట్స్ I,II ఆఫీసర్స్ ఎస్.యాకోబు, చింతా సోమేశ్వరి పాల్గొన్నారు. అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బందితో పాటు విద్యార్థిని విద్యార్థులు కూడా ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు.
- ప్రపంచ యోగ దినోత్సవం సందర్భంగా అనపర్తిలో యోగాంధ్ర కార్యక్రమాన్ని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆదివారం ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక నాయకులు, అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులతో కలిసి యోగాసనాలు వేశారు. ప్రతి ఒక్కరూ యోగపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఈ సందర్భంగా అన్నారు. పతాంజలి మహర్షి యోగాను అష్టాంగ యోగాలుగా తీర్చిదిద్దారని ఆయన గుర్తుచేశారు.1
- రాజమహేంద్రవరంలోని కోటిలింగాల ఘాట్‌లో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆదివారం 'యోగాంధ్ర' కార్యక్రమాన్ని ఆయుష్ శాఖ, రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్, జిల్లా యంత్రాంగం సంయుక్తంగా నిర్వహించాయి. ఈ కార్యక్రమానికి ఎంపీ దగ్గుబాటి పురందరేశ్వరి ముఖ్య అతిథిగా హాజరై యోగాసనాలు వేశారు. జిల్లా నలుమూలల నుండి వచ్చిన యోగా సాధకులు, విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగులు, వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు సామూహికంగా యోగాసనాలు వేయడం విశేషంగా ఆకట్టుకుంది. ఈ సందర్భంగా ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి ప్రజలందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిపాదనతో ఐక్యరాజ్యసమితి 2014లో జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించిందని ఆమె గుర్తు చేశారు. భారతీయ సంస్కృతికి ప్రతీకైన యోగా ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యకరమైన జీవనశైలికి మార్గదర్శకంగా నిలుస్తోందని ఆమె పేర్కొన్నారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి యోగానే ఉత్తమ మార్గమని ఎంపీ పురంధరేశ్వరి అభిప్రాయపడ్డారు. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ, యోగా సర్వరోగ నివారిణిగా పనిచేస్తుందని, ప్రతిరోజూ 45 నిమిషాల పాటు యోగా సాధన చేస్తే శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని సూచించారు. ప్రాణాయామం, ధ్యానం వల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గడంతో పాటు ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతాయని ఆమె తెలిపారు. ఎమ్మెల్సీ సోము వీర్రాజు యోగా ద్వారా ప్రపంచ దేశాలు భారతదేశాన్ని విశ్వగురువుగా గుర్తించాయని పేర్కొంటూ, 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం "Yoga for Healthy Ageing" అనే అంశంతో నిర్వహించబడిందని చెప్పారు. అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ, విద్యార్థుల్లో మానసిక స్థైర్యం, ఏకాగ్రత పెంపొందించడంలో యోగాభ్యాసం కీలకమని తెలిపారు. యోగా జిల్లా నోడల్ అధికారి, జాయింట్ కలెక్టర్ వై. మేఘా స్వరూప్ యువత ఆరోగ్యంగా ఉంటేనే దేశం అభివృద్ధి చెందుతుందని, ప్రతి ఒక్కరూ నిత్య జీవితంలో యోగాను భాగం చేసుకోవాలని సూచించారు. రాజమహేంద్రవరం మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా ఆధునిక జీవనశైలిలో పెరుగుతున్న ఒత్తిడి, అనారోగ్య సమస్యలకు యోగా సమర్థవంతమైన పరిష్కారమని అన్నారు. రుడా చైర్మన్ బొడ్డు వెంకట రమణ మాట్లాడుతూ, యోగా భారతదేశం ప్రపంచానికి అందించిన అమూల్యమైన వారసత్వమని, ఆరోగ్యకరమైన జీవనశైలికి యోగానే ఉత్తమ మార్గమని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ రోజూ కొంత సమయం యోగా సాధనకు కేటాయిస్తే శారీరక, మానసిక ఆరోగ్యంతో పాటు క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం పెంపొందుతాయని చెబుతూ, యువత నుంచి వృద్ధుల వరకు అందరూ యోగాను నిత్యజీవితంలో భాగంగా చేసుకోవాలని సూచించారు.1
- 😭🙏1
- అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా పశ్చిమ బెంగాల్‌లోని జల్దపార నేషనల్ పార్కులో ప్రకృతి ఒడిలో ప్రత్యేక వేడుకలు జరిగాయి. పచ్చని అడవి మధ్య, నదీ తీరాన అటవీ శాఖ సిబ్బంది అత్యంత ఉత్సాహంగా యోగాసనాలు వేశారు. ఈ ప్రత్యేక ప్రదర్శనలో సిబ్బందితో పాటు మావటిల సమక్షంలో ఏనుగులు కూడా పాల్గొని ఈ కార్యక్రమానికి మరింత ప్రత్యేక ఆకర్షణను తెచ్చాయి. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం విస్తృతంగా వైరల్ అవుతోంది.1
- అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా, జూన్ 21న కాకినాడ జిల్లాలోని పెదపూడి మండలంలో భారతీయ జనతా పార్టీ మైనార్టీ మోర్చా ఆధ్వర్యంలో పలు యోగా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. పెదపూడి మండల మైనార్టీ మోర్చా అధ్యక్షులు నవాబ్ షేక్ సర్ధార్ హుస్సేన్ ఈ వివరాలను తెలిపారు. ఈ కార్యక్రమాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు, ఉపాధి హామీ కూలీలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సాహంగా యోగా సాధన చేశారు. ఈ సందర్భంగా, ఆహ్వానించిన యోగా శిక్షకులు యోగా ప్రాముఖ్యత గురించి వివరిస్తూ, శారీరక ఆరోగ్యం, మానసిక ప్రశాంతత, ఏకాగ్రత పెంపు వంటి అంశాలపై అవగాహన కల్పించారు. నవాబ్ షేక్ సర్ధార్ హుస్సేన్ మాట్లాడుతూ, ప్రస్తుత జీవనశైలిలో ఆరోగ్యకరమైన జీవితానికి యోగా ఎంతో అవసరమని నొక్కి చెప్పారు. ప్రతిరోజూ యోగా చేయడం వల్ల శారీరక దృఢత్వం, మానసిక ప్రశాంతత, రోగనిరోధక శక్తి పెరుగుతాయని ఆయన పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ యోగాను తమ దైనందిన జీవితంలో అంతర్భాగం చేసుకోవాలని, తద్వారా ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి తోడ్పడాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాలు బీజేపీ నాయకులు, మైనార్టీ మోర్చా సభ్యులు మరియు స్థానిక ప్రజల భాగస్వామ్యంతో విజయవంతంగా పూర్తయ్యాయి.4
- అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా, రేపల్లె మండల న్యాయ సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో స్థానిక ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో యోగా కార్యక్రమం దిగ్విజయంగా నిర్వహించబడింది. ఆదివారం ఉదయం ఎనిమిది గంటల నుండి ఒక గంట పాటు జరిగిన ఈ యోగా దినోత్సవ కార్యక్రమంలో పారా లీగల్ వాలంటీర్లు, పట్టణ ప్రముఖులు, మరియు వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు కలిసి యోగాసనాలు వేశారు. మండల న్యాయ సేవా అధికార సంస్థ నేతృత్వంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు విజయవంతంగా జరిగాయి.2
- 😭🙏1
- భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ములకలపల్లి మండలంలో ఈరోజు మధ్యాహ్నం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. పూసుగూడెం, మాదారం అటవీ ప్రాంతంలో ఒక కారు అదుపుతప్పి చెట్టును బలంగా ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన సంభవించింది. మృతి చెందిన వారిలో భార్యాభర్తలు సాయి ప్రకాష్, సంధ్య మరియు వారి ఐదేళ్ల కొడుకు మోక్షిత్ ఉన్నారు. ఈ ప్రమాదంలో తల్లి జ్యోతికి తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను వెంటనే 108 వాహనంలో పాల్వంచ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం, మృతులంతా భద్రాచలం పట్టణానికి చెందినవారు. వీరంతా ములకలపల్లిలోని బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి భద్రాచలం వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పాల్వంచ ప్రభుత్వాసుపత్రికి తరలిస్తున్నారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.1