మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాల నిరోధానికి సమిష్టి కృషి: జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో కలెక్టర్, సీపీ వెల్లడి మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాల రవాణా, విక్రయం, వినియోగంపై గట్టి నిఘా కొనసాగించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి, పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో మంగళవారం కలెక్టర్ అధ్యక్షతన మత్తు పదార్థాల నిరోధక కమిటీ జిల్లా స్థాయి సమావేశం జరిగింది. పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, సంబంధిత శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. మత్తు పదార్థాల నియంత్రణకు చేపట్టిన చర్యలపై చర్చించి, వాటి నిరోధానికి అవలంభించాల్సిన చర్యలపై అధికారులకు కలెక్టర్, సీపీ దిశానిర్దేశం చేశారు. గడిచిన రెండు మాసాలలో జిల్లాలో ఎక్సైజ్, పోలీస్ శాఖల అధ్వర్యంలో నిర్వహించిన దాడులు, పట్టుబడిన గంజాయి, అల్ఫ్రాజోలం ఇతర మత్తు పదార్థాలు, నమోదైన కేసుల గురించి అధికారులు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, యువతను, విద్యార్థులను మత్తుకు బానిసలుగా మారుస్తున్న మాదకద్రవ్యాల రవాణా, విక్రయాలపై ఉక్కుపాదం మోపాలని సూచించారు. పోలీస్, ఎక్సైజ్, రవాణా శాఖల సంయుక్త ఆధ్వర్యంలో కమిటీగా ఏర్పడి పక్కాగా కృషి చేయాలన్నారు. డ్రగ్స్ వాడకం వల్ల కలిగే దుష్పరిణామాల గురించి ప్రజలను చైతన్యపరచేందుకు విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. అన్ని పాఠశాలలు, కళాశాలల్లో ప్రహరీ క్లబ్స్, యాంటీ డ్రగ్ కమిటీలు క్రియాశీలక పాత్ర పోషించేలా చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. ఈ కమిటీలను బలోపేతం చేస్తూ పూర్తి స్థాయిలో అవి పని చేసేలా చూడాలన్నారు. కొంతమంది గర్భిణీ మహిళలు సైతం క్లోరోఫాం, డైజోఫాం, అల్ఫ్రాజోలం వంటి హానికారకమైన పదార్థాలను వినియోగిస్తూ తయారు చేసిన కల్తీ కల్లు సేవిస్తున్నట్లు సమాచారం ఉందని, ఇది వారి ఆరోగ్యాన్ని దెబ్బ తీయడంతో పాటు పుట్టబోయే బిడ్డ ఆరోగ్యం పై కూడా తీవ్ర దుష్ప్రభావం చూపుతుందని అన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని గర్భిణీ స్త్రీలు కల్తీ కల్లు బారిన పడకుండా గ్రామగ్రామాన అంగన్వాడి కార్యకర్తల ద్వారా అవగాహన కల్పించాలని సూచించారు. ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలలో సైతం మత్తు పదార్థాల గురించి ప్రజల్లో చైతన్యం పెంపొందించాలని సూచించారు. ప్రధాన రహదారుల పక్కన దాభాలలో విస్తృత తనిఖీలు నిర్వహించాలని ఫుడ్ సేఫ్టీ అధికారులను ఆదేశించారు. తద్వారా ఓపీఎం (నల్లమందు) వంటి వాటి వినియోగాన్ని గుర్తించి నియంత్రించవచ్చని సూచించారు. రెసిడెన్షియల్ స్కూళ్లు, కళాశాలల్లో విద్యార్థులకు రిసోర్స్ పర్సన్ల ద్వారా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని, విద్యార్థులచే వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించేలా చూడాలన్నారు. మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాలను రవాణా చేసే వారిని, వాటిని విక్రయిస్తున్న వారిని, వాటిని వినియోగిస్తున్న వారిని పక్కాగా గుర్తిస్తూ గట్టి నిఘా కొనసాగిస్తున్నామని పోలీస్ కమిషనర్ పి.సాయిచైతన్య తెలిపారు. ఇప్పటికే పలువురిని అరెస్టు చేశామని, ఇకపై మరింత కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. జిల్లాలో ఎక్కడైనా గంజాయి, క్లోరల్ హైడ్రేట్, డైజోఫామ్, అల్ఫ్రాజోలం వంటి మత్తు పదార్థాల రవాణా, విక్రయాలు జరుగుతున్నట్లు గమనిస్తే పోలీసులకు సమాచారం అందించాలని, టోల్ ఫ్రీ నెంబర్ 1908 కు కూడా ఫోన్ చేసి తెలియజేయవచ్చని సీ.పీ సూచించారు. మత్తును కలుగజేసే ఔషధాలు పక్కదారి పట్టకుండా, వాటి వినియోగం పై కూడా పర్యవేక్షణ జరపాలని జిల్లా ఔషధ నియంత్రణ విభాగం అధికారులకు సూచించారు. పాఠశాలలు, కళాశాలలకు 100 మీటర్ల దూరం లోపు సిగరెట్లు, గుట్కాలు వంటి విక్రయాలు జరుగకుండా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ దిలీప్ కుమార్, ఆర్డీఓ రాజేంద్ర కుమార్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి, డీఈఓ అశోక్, డిప్యూటీ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ దుర్గా ప్రమీల,.డీటీఓ ఉమా మహేశ్వరరావు, జిల్లా ఔషధ నియంత్రణ అధికారిణి శ్రీలత, డీఎంహెచ్ఓ డాక్టర్ రాజశ్రీ, డీడబ్ల్యూఓ పద్మ తదితరులు పాల్గొన్నారు.

- Post by Solanke Ravi4
- కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్లోని రైతు వేదికలో మంగళవారం నిర్వహించిన 'రైతునేస్తం' కార్యక్రమంలో భాగంగా వీసీ ద్వారా యూరియా యాప్పై రైతులకు అవగాహన కల్పించారు. ఏఈవో సౌమ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అధికారులు మాట్లాడుతూ.. దళారీల ప్రమేయం లేకుండా, ఎరువులు పక్కదారి పట్టకుండా ఉండేందుకే ఈ యాప్ను ప్రవేశపెట్టినట్లు తెలిపారు. రైతులు నేరుగా యాప్ ద్వారానే యూరియా కొనుగోలు చేయాలని సూచించారు.1
- *సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడం డ్రైవర్ల ప్రధాన బాధ్యత: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, ఐపీఎస్,వాహనాలకు రేడియం స్టిక్కర్లు తప్పనిసరి* కోరుట్ల మార్చి 31 ప్రజా ముద్ర న్యూస్ కోరుట్ల నియోజకవర్గం పట్టణంలో రోడ్డు భద్రతపై విస్తృత అవగాహన కల్పించేందుకు తెలంగాణ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “Arrive Alive – A Campaign for Safer Roads” కార్యక్రమంలో భాగంగా సోమవారం కొరుట్ల పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయ ఆవరణలో కొరుట్ల, మెట్‌పల్లి ప్రాంతాలకు చెందిన లారీ, ఐచర్ ఇతర భారీ వాహనాల డ్రైవర్లు, యజమానుల కోసం ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, ఐపీఎస్ ముఖ్య అతిథిగా హాజరై ట్రాఫిక్ నియమాలు, డిఫెన్సివ్ డ్రైవింగ్ ప్రాముఖ్యత, రహదారి భద్రతపై మార్గదర్శకాలు అందించారు.ఈ సందర్భంగా ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడుతూ, ప్రస్తుత కాలంలో ఇతర ప్రమాదాల కంటే రోడ్డు ప్రమాదాల వల్లనే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఈ ప్రమాదాలను గణనీయంగా తగ్గించేందుకు గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు రోడ్డు భద్రతా వ్యవస్థలను బలోపేతం చేయడం, ప్రజల్లో డిఫెన్సివ్ డ్రైవింగ్ సంస్కృతిని పెంపొందించడం “Arrive Alive” కార్యక్రమం ప్రధాన లక్ష్యమని తెలిపారు. రోడ్డు ప్రమాదాలు ఎప్పుడు, ఎలా జరుగుతాయో ముందుగా ఊహించలేమని, కాబట్టి నివారణ చర్యలు అత్యంత కీలకమని స్పష్టం చేశారు. చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయని, అలాంటి సంఘటనల వల్ల కుటుంబాలకు తీరని నష్టం కలుగుతుందని అన్నారు. ప్రతి డ్రైవర్ బాధ్యతాయుతంగా వ్యవహరించి ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించాలని సూచించారు. రాత్రి సమయంలో వాహనాలను రోడ్డు పక్కన నిలిపే సందర్భాల్లో రేడియం స్టిక్కర్లు తప్పనిసరిగా అమర్చుకోవాలని, తద్వారా ఇతర వాహనదారులకు వాహనాలు స్పష్టంగా కనిపించి ప్రమాదాలను నివారించవచ్చని తెలిపారు. అధిక ప్రకాశం ఉన్న ఎల్ఈడి లైట్లు ఎదురుగా వచ్చే వాహనదారులకు ఇబ్బందులు కలిగిస్తాయని, వాటిని నియంత్రణలో వినియోగించాలని సూచించారు. అలాగే అధిక లోడ్‌తో లారీలు, ఐచర్ వాహనాలు నడపడం ప్రమాదకరమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ స్వయంగా లారీలు, వ్యాన్ వాహనాలకు రేడియం స్టిక్కర్లను అతికించి డ్రైవర్లకు భద్రతా చర్యలపై అవగాహన కల్పించారు. అనంతరం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, మెట్‌పల్లి డీఎస్పీ అడ్డూరి రాములు, కొరుట్ల సీఐ సురేష్ బాబు, ఎస్సై చిరంజీవి, మున్సిపల్ చైర్‌పర్సన్ తిరుమల వసంత గంగాధర్, ఎంవిఐ శ్రీనివాస్ తదితరులు మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు తమ వంతు సహకారం అందించారు. ఈ కార్యక్రమంలో మెట్‌పల్లి డీఎస్పీ అడ్డూరి రాములు, రవాణా శాఖ అధికారి శ్రీనివాస్, మున్సిపల్ చైర్‌పర్సన్ తిరుమల వసంత గంగాధర్, స్థానిక ప్రజాప్రతినిధులు, కొరుట్ల సీఐ సురేష్ బాబు, మెట్‌పల్లి సీఐ అనిల్ కుమార్, కొరుట్ల ఎస్సైలు చిరంజీవి, రామచంద్రం, మెట్‌పల్లి ఎస్సై కిరణ్, మేడిపల్లి ఎస్సై శ్రీధర్ రెడ్డి, కథలాపూర్ ఎస్సై రవికిరణ్, అలాగే లారీ, వ్యాన్ అసోసియేషన్ సభ్యులు, డ్రైవర్లు, యజమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు4
- నేరడిగొండ మండలంలోని బొందిడి గ్రామానికి చెందిన ఆడే రమేష్ (టీచర్) పదవి విరమణ సందర్భంగా ఆయన నివాసం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఆడే గజేందర్ హాజరై టీచర్ రమేష్ ని శాలువాతో సన్మానించి వారి సేవలను ప్రశంసిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు తదితరులు ఉన్నారు.1
- రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం పరిధిలోని తిప్పాపురం గోశాలను ఆలయ ఈవో ఎల్. రమాదేవి, జిల్లా వెటర్నరీ అనిమల్ హస్బండ్రీ అధికారి రవీందర్ రెడ్డి కలిసి తనిఖీ చేశారు.ఈ సందర్భంగా గోవులను ఎండ వేడి ప్రభావం నుండి రక్షించేందుకు చేపట్టిన చర్యలను వారు పరిశీలించారు.గోశాల చుట్టూ గ్రీన్ నెట్ ఏర్పాటు, జంబో కూలర్లు, ఫ్యాన్లు, చలువ పందిళ్లు వంటి సౌకర్యాలను సమీక్షించారు.అలాగే గోవులకు తాగునీరు, కార్న్ సైలేజ్ (పశువులకు ప్రత్యేక ఆహారం) సరైన విధంగా అందుతున్నాయా అనే అంశాన్ని పరిశీలించారు. గోవులకు అందిస్తున్న ఆహారాన్ని స్వయంగా చూసి, వాటికి పెట్టి గోవులు తింటున్నాయా అనే విషయాన్ని కూడా ఈవో రమాదేవి గమనించారు.గోవుల ఆరోగ్య పరిస్థితిపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. గోశాలలో పనిచేస్తున్న సిబ్బందితో మాట్లాడి, గోవుల సంరక్షణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.ఇదే సందర్భంలో రాజన్న కోడె మొక్కుల నిర్వహణ, వాటి ప్రాముఖ్యత గురించి కూడా వివరంగా చర్చించారు.ఈ తనిఖీలలో పర్యవేక్షకులు విజయ్ కుమార్, జూనియర్ అసిస్టెంట్ గొట్టం రవి తదితర ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.1
- లక్షెట్టిపేటలో హనుమాన్ శోభాయాత్ర నేత్రపర్వంగా జరుగుతోంది. హనుమాన్ జయంతిని పురస్కరించుకొని మంగళవారం రాత్రి పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర దేవాలయం నుండి హనుమాన్ భక్తులు, ప్రజలు హనుమాన్ ఫ్లెక్సీని ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో ఉంచి ప్రధాన రహదారి మీదుగా ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా హనుమాన్ భక్తి గీతాలు ఆలపించారు. బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ హనుమాన్ శోభాయాత్రలో పాల్గొన్నారు.1
- ఉన్నది మొత్తం రెండు పాములు కనిపించాయి ఒకటి ప్రాణాలతో తప్పించుకుంది మరొకటి చనిపోయింది,తప్పించుకున్న పాము సుమారుగా ఇదే సైజ్ ఉండచ్చు అని అంచనా అటు వైపు చేను పనులకు వెళ్ళే వారు ,చెరువులో చేపలు పట్టేవారు జాగ్రత్తగా ఉండటం మంచిది1
- Post by Solanke Ravi3