చర్లపల్లిలో ఎంఎస్ఎంఈ ఎగ్జిబిషన్–2026 ప్రారంభం _పారిశ్రామికవేత్తలకు అండగా ఉంటాం – ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి చర్లపల్లి, పారిశ్రామిక ఉత్పత్తులను ప్రదర్శించేందుకు, విక్రయించేందుకు ఎగ్జిబిషన్లు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని ఉప్పల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు. సోమవారం చర్లపల్లి పారిశ్రామికవాడలోని సీఐఏ ఆడిటోరియంలో చర్లపల్లి పారిశ్రామికవేత్తల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎంఎస్ఎంఈ ఎగ్జిబిషన్–2026ను ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.ఈ సందర్భంగా సీఐఏ అధ్యక్షుడు డి. శ్రీనివాసరెడ్డి, టీఐఎఫ్ అధ్యక్షుడు కొండవీటి సుధీర్ రెడ్డి, చర్లపల్లి ఐఎల్ఏ అధ్యక్షుడు గోవిందరెడ్డిలతో కలిసి ఎమ్మెల్యే ఎగ్జిబిషన్‌లో ఏర్పాటు చేసిన స్టాళ్లను ప్రారంభించి పరిశీలించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పరిశ్రమల్లో తయారయ్యే ఉత్పత్తులను ప్రజలకు పరిచయం చేయడంలో, మార్కెట్ అవకాశాలను పెంపొందించడంలో ఇలాంటి ఎగ్జిబిషన్లు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. ఉప్పల్ నియోజకవర్గంలోని పారిశ్రామికవాడల అభివృద్ధికి తనవంతుగా కృషి చేస్తానని, పారిశ్రామికవేత్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని తెలిపారు.పారిశ్రామిక ఉత్పత్తుల ప్రదర్శన కోసం ప్రత్యేక కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి ముఖ్యమంత్రి, మంత్రులను కలిసి కృషి చేస్తానని ఎమ్మెల్యే చెప్పారు. ఎగ్జిబిషన్‌లో పరిశ్రమలలో వినియోగించే పలు రకాల యంత్రాలు, ఉత్పత్తులతో పాటు బ్యాంకుల స్టాళ్లు కూడా ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో సీఐఏ కార్యదర్శి మోహన్, చర్లపల్లి ఐఎల్ఏ ఉపాధ్యక్షులు తాటి శ్రీనివాస్, పారిశ్రామికవేత్తలు కట్టంగూరి హరీష్ రెడ్డి, మిరుపాల గోపాల్ రావు, సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, మల్లిఖార్జున్ రెడ్డి, గంగాధర్ బాబు, కమిటీ సభ్యులు మరియు పలువురు పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.
చర్లపల్లిలో ఎంఎస్ఎంఈ ఎగ్జిబిషన్–2026 ప్రారంభం _పారిశ్రామికవేత్తలకు అండగా ఉంటాం – ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి చర్లపల్లి, పారిశ్రామిక ఉత్పత్తులను ప్రదర్శించేందుకు, విక్రయించేందుకు ఎగ్జిబిషన్లు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని ఉప్పల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు. సోమవారం చర్లపల్లి పారిశ్రామికవాడలోని సీఐఏ ఆడిటోరియంలో చర్లపల్లి పారిశ్రామికవేత్తల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎంఎస్ఎంఈ ఎగ్జిబిషన్–2026ను ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.ఈ సందర్భంగా సీఐఏ అధ్యక్షుడు డి. శ్రీనివాసరెడ్డి, టీఐఎఫ్ అధ్యక్షుడు కొండవీటి సుధీర్
రెడ్డి, చర్లపల్లి ఐఎల్ఏ అధ్యక్షుడు గోవిందరెడ్డిలతో కలిసి ఎమ్మెల్యే ఎగ్జిబిషన్‌లో ఏర్పాటు చేసిన స్టాళ్లను ప్రారంభించి పరిశీలించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పరిశ్రమల్లో తయారయ్యే ఉత్పత్తులను ప్రజలకు పరిచయం చేయడంలో, మార్కెట్ అవకాశాలను పెంపొందించడంలో ఇలాంటి ఎగ్జిబిషన్లు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. ఉప్పల్ నియోజకవర్గంలోని పారిశ్రామికవాడల అభివృద్ధికి తనవంతుగా కృషి చేస్తానని, పారిశ్రామికవేత్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని తెలిపారు.పారిశ్రామిక ఉత్పత్తుల ప్రదర్శన కోసం ప్రత్యేక కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి ముఖ్యమంత్రి,
మంత్రులను కలిసి కృషి చేస్తానని ఎమ్మెల్యే చెప్పారు. ఎగ్జిబిషన్‌లో పరిశ్రమలలో వినియోగించే పలు రకాల యంత్రాలు, ఉత్పత్తులతో పాటు బ్యాంకుల స్టాళ్లు కూడా ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో సీఐఏ కార్యదర్శి మోహన్, చర్లపల్లి ఐఎల్ఏ ఉపాధ్యక్షులు తాటి శ్రీనివాస్, పారిశ్రామికవేత్తలు కట్టంగూరి హరీష్ రెడ్డి, మిరుపాల గోపాల్ రావు, సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, మల్లిఖార్జున్ రెడ్డి, గంగాధర్ బాబు, కమిటీ సభ్యులు మరియు పలువురు పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.
- ఖమ్మం అంబేద్కర్ భవన్ లో వెలుగుమట్ల బాధితులకు మద్దతుగా సోమవారం రాత్రి డీఎస్పీ అధ్యక్షుడు విశారదన్ మహరాజ్ తో కలిసి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టిన జాగృతి అధ్యక్షురాలు. మంగళవారం ఉదయం కవిత, విశారదన్ తో పాటు నిరాహార దీక్ష చేపట్టిన వారిని అరెస్ట్ చేసిన పోలీసులు. కవితతో పాటు దీక్ష చేస్తున్న వారిని హైదరాబాద్ రోడ్డులో తరలిస్తున్న ఖమ్మం పోలీసులు.1
- తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అరెస్ట్! బాధితుల కోసం దీక్ష..కవితను, విశారదన్ మహరాజ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఖమ్మం నగరంలోని అంబేడ్కర్ భవనం వద్ద మంగళవారం ఉదయం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వెలుగుమట్ల బాధితులకు మద్దతుగా సోమవారం రాత్రి నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను పోలీసులు అరెస్ట్ చేశారు.దీక్షలో ఆమెతో పాటు డీఎస్సీ అధ్యక్షుడు విశారదన్ మహరాజ్ మరియు ఇతర ప్రతినిధులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వెలుగుమట్ల బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ రాత్రంతా దీక్ష కొనసాగించిన వీరిని, మంగళవారం ఉదయం పోలీసులు బలవంతంగా అక్కడి నుండి తరలించారు. ప్రస్తుతం ఖమ్మం పోలీసులు వీరిని హైదరాబాద్ రోడ్డు మీదుగా తరలిస్తున్నారు. ఈ అరెస్టులతో ఖమ్మం పట్టణంలో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది.1
- **గజ్వేల్, సిద్దిపేట జిల్లా మార్చి 9:** ప్రజా తెలంగాణ న్యూస్/ గజ్వేల్ నియోజకవర్గంలోని మల్లన్నసాగర్ రిజర్వాయర్ నుంచి కొండపోచమ్మ సాగర్‌కు నీటిని వెంటనే పంపాలని బీఆర్ఎస్ పార్టీ ఇన్‌చార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి డిమాండ్ చేశారు. అకారం పంప్‌హౌస్‌ను తక్షణం స్టార్ట్ చేసి, కొండపోచమ్మ సాగర్‌లోకి నీళ్లు వదిలి, కెనాల్ ప్రాంతంలో 2-3 కిలోమీటర్ల రైతులకు సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. అదే సమయంలో, గజ్వేల్ ఏరియా 132 కెవీ సబ్‌స్టేషన్ ద్వారా రైతులకు 24 గంటల మెరుగైన విద్యుత్ సరఫరా చేయాలని కూడా డిమాండ్ చేశారు. ఈ రైతు సమస్యల పరిష్కారానికి గజ్వేల్ నియోజకవర్గ ముఖ్య నాయకులు అందరూ పాల్గొన్న సమావేశంలో ఈ తీర్మానాలు ఆమోదించబడ్డాయి. కాలేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌లో మల్లన్నసాగర్‌కు ప్రాధాన్యత ఉన్నప్పటికీ, స్థానిక రైతుల సాగునీటి అవసరాల కోసం ఈ నీటి రిలీజ్ అత్యవసరమని వంటేరు ప్రతాప్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు.4
- Termites existence, not to be ignored, love your home.1
- Amjad ullah khan (spokeman) #MBT Raidurgam ps limet 3 log #mar_peeta gaya Bin na waajen1
- గజ్వేల్ సిద్దిపేట జిల్లా మార్చు 10 ప్రజా తెలంగాణ న్యూస్/ విద్యతో పాటు, శాస్త్ర సాంకేతికత సమాజం పట్ల గౌరవం ఉండే విధంగా ప్రతి విద్యార్థి లక్ష్యంతో ముందుకు వెళ్లాలని కావేరి వ్యవసాయ యూనివర్సిటీ వ్యవస్థాపకులు భాస్కర్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా గౌరారం వద్ద గల కావేరి వ్యవసాయ కళాశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ రంగాలలో గుర్తింపు పొందిన మహిళలకు ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ విద్యార్థి దశ నుండే లక్ష్యంతో ఉన్నతమైన శిఖరాలకు చేరే విధంగా పట్టుదలతో చదువుకోవాలని సూచించారు అనంతరం వివిధ రంగాల్లో గుర్తింపు పైన మహిళలకు శాలువాలతో సన్మానం చేశారు విద్యార్థులచే వివిధ నాటక కళారూపాలు, నృత్య ప్రదర్శనలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో కళాశాల సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.4
- అందులో భాగంగా ఈరోజు రాత్రి 10 గంటలకు లక్ష్మీనరసింహస్వామి వార్ల తిరు కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా భక్తుల జయ జయ ద్వానాల నడుమ నిర్వహించనున్నారు. కాబట్టి చుట్టుపక్క గ్రామాల ప్రజలతో పాటు హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారి కృపకు పాత్రులు కాగలరని ఆలయ అర్చకులు, నిర్వాహకులు కోరుతున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ చైర్మన్, ధర్మకర్తలు, ఈవో, సిబ్బంది భక్తులను ఆహ్వానిస్తున్నారు.1
- బాలికలు సర్వైకల్ క్యాన్సర్ బారిన పడకుండా కేంద్ర ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తున్న హెచ్.పి.వి టీకా ను 14 ఏళ్ల వయస్సు గల బాలికలందరూ సద్వినియోగం చేసుకోవాలని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షురాలు, మాజీ మేయర్ బండ కార్తిక చంద్రారెడ్డి అన్నారు. ఈ మేరకు లాలాపేటలోని పట్టణ సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఈ టీకా పంపిణీ కార్యక్రమాన్ని ఆమె లాంచనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్తిక రెడ్డి మాట్లాడుతూ ఆడబిడ్డల ఆరోగ్యం కోసం ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం గొప్ప సంకల్పం తీసుకుందన్నారు. మార్కెట్ లో దాదాపు 4 వేలు విలువ చేసే వ్యాక్సిన్ ను కేంద్ర ప్రభుత్వం ఉచితంగా అందజేయడం ఎంతో అభినందనీయమని పేర్కొన్నారు. గతంలో కరోనా విపత్కర పరిస్థితిలో దేశ ప్రజలందరికీ భారత దేశంలో తయారైన వ్యాక్సిన్ ఉచితంగా పంపిణీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రజారోగ్యం పట్ల కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న శ్రద్ధకు ఇది నిదర్శనమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్వరూప గౌడ్, కనికట్ల హరి, అనిత, సత్యవతి, ఉపేందర్ యాదవ్ ,వీరన్న, వేణు యాదవ్ సికింద్రాబాద్ నియోజకవర్గ బిజెపి నాయకులు, కార్యకర్తలు, డిప్యూటీ డి ఎం హెచ్ ఓ డాక్టర్ జయశ్రీ, లాలాపేట ఆరోగ్య కేంద్రాల మెడికల్ ఆఫీసర్లు డాక్టర్ లావణ్య, డాక్టర్ వందన, ఆరోగ్య కేంద్రం వైద్య సిబ్బంది పాల్గొన్నారు.1