*PM విశ్వకర్మ అవగాహన సదస్సు* *ఈ రోజు నెల్లూరు డీకే డబ్ల్యూ కళాశాలలో పీఎం విశ్వకర్మ అవగాహన సదస్సు MSME అసిస్టెంట్ డైరెక్టర్ డి .వీరయ్య గారు వైజాగ్ వారి ఆధ్వర్యంలో జరిగింది. ముఖ్య అతిథులుగా ఏపీ ఎస్ ఎస్ డి సి డిస్టిక్ మేనేజర్ అబ్దుల్ ఖయ్యూం గారు, ఐ పి పి ఎస్ మేనేజర్ సుధాకర్ గారు, డి ఆర్ డి ఎ. డి పిఎం మధుసూదన్ గారు, చేతివృత్తుల ప్రతినిధి జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు ఖాజన వెంకట శేషయ్య ఆచారి గారు, డైరెక్టర్ ఆర్.ఎస్.ఇ.టి.ఐ యూనియన్ బ్యాంక్ కాశయ్యగారు, సి ఎస్ సి డిస్టిక్ మేనేజర్ శ్రీనివాసులు గారు, కెనరా బ్యాంక్ ఎఫ్ ఎల్ సి వి రవిశంకర్ గారు, మరియు డీకే డబ్ల్యూ ప్రిన్సిపల్ గిరి గారు పాల్గొన్నారు. MSME డైరెక్టర్ వీరయ్య గారు మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని జిల్లాలలో పీఎం విశ్వకర్మ అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నామని, ఈరోజు నెల్లూరు లో డీకే డబ్ల్యూ ప్రిన్సిపాల్ గిరి గారి సహకారంతో ఏర్పాటు చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు సుమారు 300 మంది పీఎం విశ్వకర్మ బెనిఫిషర్స్ రావడం చాలా సంతోషమని, అన్ని వృత్తుల వారు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.* *తదుపరి పీఎం విశ్వకర్మ ఇంప్లిమెంటేషన్ కమిటీ మెంబర్ మరియు నెల్లూరు జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు ఖాజన వెంకట శేషయ్య ఆచారి మాట్లాడుతూ పీఎం విశ్వకర్మ 2023 విశ్వకర్మ జయంతి రోజున ప్రధానమంత్రి గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు ఆవిష్కరిం చారనీ,భారత దేశంలో చేతివృత్తిదారులు ఆర్థికంగా అట్టడుగు స్థాయిలో ఉన్నారని వారికి ప్రభుత్వ సాయం అందించేందుకు ఈ పథకాన్ని రూపొందించారాని చేతివృత్తుల వారి తరఫున ముఖ్యంగా ప్రధానమంత్రి కి ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ముఖ్యంగా ఈ పథకం విశ్వకర్మియుల చేతివృత్తులైన కమ్మర, వడ్రంగి, కంచర, శిల్పి, స్వర్ణకార వృత్తుల తో పాటు, టైలరింగ్, రజక, మేస్త్రి, బుట్టలు అల్లే వారికి, వలలు చేసేవారికి మొత్తం 18 రకాల కుల సంప్రదాయ వృత్తుల వారు అప్లై చేసుకోవచ్చని, అప్లై చేసుకున్న లబ్ది దారులందరికి ఒక వారం పాటు వృత్తి ట్రైనింగు, ఆ సమయంలో స్టైఫండ్ రూపంలో నాలుగు వేల రూపాయలు మరియు 15 వేల రూపాయలు విలువ చేసే పనిముట్లు ఉచితంగా అందజేశారన్నారు.* *ట్రైనింగ్ అయిన తర్వాత బ్యాంకు దగ్గరికి వెళ్తే బ్యాంకు వారు రుణాలు కల్పిస్తున్నారని తెలిపారు. సమావేశానికి విచ్చేసిన లబ్ధిదారులు అనేక రకాల సమస్యల గురించి వెంకట శేషయ్య ఆచారి గారు ప్రతి ఒక్కరికి సమాధానం తెలియజేస్తూ, సమస్యల సాధనకు తొందరలో కలెక్టర్ గారిని కలిసి సెంట్రల్ గవర్నమెంట్ దృష్టికి తీసుకు వెళ్తామని తెలిపారు.*

- Post by Bondhu Suresh1
- చిత్తూరు జిల్లా సోషల్ మీడియా అక్రమ కేసులో పూడి శ్రీహరి గారికి బెయిల్ మంజూరు 25000 సెల్ఫ్ బాండ్లతో శ్రీహరి గారికి బెయిల్ మంజూరు చేసిన కుప్పం కోర్టు. #SatyamevaJayathe #YSRCP #CBNJungleRaj #JaganannaConnects1
- *జగన్ పార్టీ కి ప్లాన్ బి కింద గొడ్డలి, కోడికత్తి,గులకరాయి గుర్తుతో కొత్త జెండా నమూనా విడుదల..నవతరం పార్టీ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం.* :చిలకలూరిపేట::16-04-2026.* *ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు ముక్కల జగన్ పార్టీ జెండా లేమితో బాధగా ఉండటం చూసి చలించిపోయిన నవతరం పార్టీ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం తనవంతు సాయంగా కొత్త జెండా నమూనా తయారు చేసి మీడియా ద్వారా వారికి బుధవారం నవతరం పార్టీ కార్యాలయంలో విడుదల చేశారు.స్వంతంగా పార్టీ పెట్టుకోలేక శివకుమార్ వద్ద పార్టీని అరువు తెచ్చుకున్న జగన్ మోహన్ రెడ్డి ఇప్పుడు మావిగన్ పేరుతో ప్రజల్లోకి వచ్చేందుకు చేస్తున్న ప్రయత్నంకి తన వంతు మద్దతుగా జెండా నమూనా ప్లాన్ బి కింద ఉపయోగించుకునేందుకు ఆయనకు అందిస్తున్నట్లు రావు సుబ్రహ్మణ్యం తెలిపారు. మూడు రంగులు కలిగిన జెండా పైన రక్తం రంగు వృత్తకారంలో గొడ్డలి,కోడికత్తి,గులకరాయి గుర్తులు ఉండేలా రూప కల్పన చేసినట్లు తెలిపారు. ఈ జెండా ప్లాన్ బి కింద ఉపయోగించుకునే వీలుందేమో పరిశీలన చేయాలని మావిగన్ మామయ్య జగన్ మోహన్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు.మూడు ముక్కలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చేయాలని చేసిన ప్రయత్నం వల్ల ఆయన ఎన్నికల గుర్తు సీలింగ్ ఫ్యాన్ ముక్కలు,11 చెక్కలుగా విడిపోవడం జరిగిందని, కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేక ఇబ్బందుల్లో పడ్డ ఆయనకు ఇప్పుడే ఇటువంటి జెండా అవసరం ఉందని ఇటువంటి జెండా రూపొందించామని రావు సుబ్రహ్మణ్యం తెలిపారు.అన్యదా భావించకుండా రానున్న ఎన్నికల్లో ఎజెండాగా రాజధాని మావిగన్, ఎన్నికల్లో గొడ్డలి, కోడికత్తి, గులకరాయి గల జెండా తో మావయ్య జగన్ ముందుకు రావాలని అన్నారు.వారు అధికారం చేపడితే వాళ్ళ చేతుల్లో ఏముంటాయో వారి జెండాలో తెలిసేలా ఏర్పాట్లు జరుగుచున్నాయని ప్రజలు గమనించాలని నవతరం పార్టీ విజ్ఞప్తి చేస్తుందని తెలిపారు.రాజధాని అమరావతి కి ప్లాన్ బి జగన్ ఇవ్వాల్సిన అవసరం లేదని, కూటమి తరపున నవతరం పార్టీ నుండి తామే ప్లాన్ బి జగన్ కి ఇస్తున్నామని రావు సుబ్రహ్మణ్యం మీడియా ద్వారా జగన్ మోహన్ రెడ్డికి తెలిపారు*1
- రోలర్తో తొక్కించి హారన్ల ధ్వంసం చేసిన గుంటూరు ఎస్పీ గుంటూరు నగరంలో ఇటీవల వాహనదారులు మోడీఫైడ్ హారన్లు ఉపయోగించి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. జిల్లా ఎస్పీ జిందాల్ ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు చేపట్టారు. స్వాధీనం చేసుకున్న మోడీఫైడ్ హారన్లను రోలర్తో తొక్కించి ధ్వంసం చేశారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించే విధంగా మోడీఫైడ్ హారన్లు వాడితే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు. ట్రాఫిక్ నియమాలు పాటించాలని, ప్రజల భద్రతకు భంగం కలిగించే చర్యలను సహించబోమన్నారు.1
- చిత్తూరు జిల్లా కుప్పం.. న్యూస్... కుప్పం ఎమ్మెల్సీ భరత్ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడిన వైసీపీ లీగల్ సెల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి.. రాష్ట్రంలో రాక్షస పాలన జరుగుతోంది.. నేడు జరిగిన ఘటన రాక్షస పాలనకు పరాకాష్ట.. ఎవరో సోషియల్ మీడియాలో పోస్ట్ చేసిన పోస్టుకు సాక్షి మీడియా హెడ్ శ్రీహరి మరియు వైసీపీ కార్యకర్త గిరీష్ రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేశారు.. రాత్రంతా రెక్కీ చేసి, నేడు ఉదయం శ్రీహరిని అరెస్ట్ చేశారు.. 35 (3) నోటీసు ఇవ్వాల్సిన పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసి, కుప్పంకు తీసుకొచ్చారు.. న్యాయవ్యవస్థ గట్టిగా ఉండడంతో సామాన్యులు రాష్ట్రంలో బ్రతుకుతున్నారు.. ఏ 1 గిరీష్ రెడ్డి పై అక్రమంగా 111 సెక్షన్ పెట్టారు.. ఒక కోర్టులో రెండు ఛార్జ్ షీట్లు ఉంటే 111 సెక్షన్ పెట్టాలని సుప్రీం కోర్టు, హై కోర్టులు అనేకసార్లు చెప్పినా రాష్ట్రంలో పట్టించుకోవడం లేదు..1
- పెద్దపల్లి మండలం నిమ్మనపల్లి గ్రామంలో ఒంటికోట బడులు కావడం ఆపై అధికంగా ఎండ ఉండడంతో ఎస్సారెస్పీ నీటిని అధికారులు విడుదల చేయగా చిన్నారులు ఎంచక్కా కెనాల్ లో ఈత కొడుతూ ఎండ వేడిని సేద తీరుతున్నారు. 40 డిగ్రీల ఉష్ణోగ్రత అతి ఎండ ఉండడం ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు అప్రమత్తం చేయడంతో పాటు చిన్నారులకు ఇంటికి వెళితే అధికంగా వేడి ఉండడంతో ఉపశమనం కొరకు కెనాల్ కాలువలో చల్లని నీటిలో ఈత కొడుతూ సేద తీరుతున్నారు1
- Post by Bondhu Suresh1
- జగనన్నను ప్రేమించే వారి మధ్యలో. నేను బతుకుతున్నందుకు నా జన్మ ధన్యం అయింది. పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు ఎమోషనల్ వ్యాఖ్యలు.1
- చిత్తూరు జిల్లా కుప్పం న్యూస్ కుప్పంలో భారీగా చేరుకున్న పోలీసులు.. సాక్షి మీడియా హెడ్ శ్రీహరిని అరెస్టు చేయడంతో. భారీగా పోలీసులతో బందోబస్తు. కుప్పంకు వైయస్సార్ పార్టీ జిల్లా నాయకులు చేరుకున్నారు. సాక్షి మీడియా హెడ్ శ్రీహరిని కోర్టులో హాజరపరిచేందుకు ఏర్పాట్లు. చేస్తున్న పోలీసులు.2