logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

అక్రమ కేసులకు భయపడే ప్రసక్తే లేదని, కూటమి ప్రభుత్వం పాల్పడుతున్న కక్ష సాధింపులకు వ్యతిరేకంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని మాజీ మంత్రి వర్యులు, ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు డా. కాకాణి గోవర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. నెల్లూరు సెంట్రల్ జైలులో 97 రోజులు అక్రమ కేసులలో అన్యాయంగా జైల్లో ఉన్న కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారికి బెయిల్‌ మంజూరు కావడంతో, ఆయన విడుదలైన సందర్భంగా కాకాణి గోవర్ధన్ రెడ్డి, సూళ్లూరుపేట మాజీ శాసనసభ్యులు కిలివేటి సంజీవయ్య గారితో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆయన్ను పరామర్శించి, ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కాకాణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ మాజీ అధ్యక్షుడు అయిన కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారిని అక్రమంగా, లేనిపోని కేసులను సృష్టించి అన్యాయంగా 97 రోజుల పాటు జైల్లో ఉంచి కక్ష సాధింపులకు పాల్పడిందని తీవ్రంగా ఆరోపించారు. అక్రమ ఇసుక రవాణాను అడ్డుకోవడం, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడమే సత్యనారాయణ రెడ్డి చేసిన తప్పా అని ఆయన ప్రశ్నించారు. ఒక కేసులో బెయిల్ వస్తే, కావాలనే ఇంకో కేసులో పిటిషన్ వారెంట్ వేస్తూ, సత్యనారాయణ రెడ్డిని నిరంతరం జైల్లోనే ఉంచేలా కూటమి పాలకులు కుట్రలు పన్నారని కాకాణి అన్నారు. సత్యనారాయణ రెడ్డి వయస్సు, ఆయనకున్న ఆరోగ్య సమస్యలను కూడా కూటమి ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోలేదని, కనీసం వైద్యం చేయించుకోవడానికి కూడా కనికరం చూపలేదని, స్విమ్స్ వైద్యులు సైతం ఆయన పరిస్థితి ఇబ్బందికరంగా ఉందని చెప్పినా పట్టించుకోకుండా ఇబ్బందులకు గురి చేశారని వివరించారు. సత్యనారాయణ రెడ్డి గారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సెక్రటరీగా, కందుకూరు నియోజకవర్గ పరిశీలకుడిగా, జగన్ మోహన్ రెడ్డి గారికి విధేయుడిగా ఉన్నందుకే ఆయనపై కక్షసాధింపు చర్యలకు పాల్పడ్డారని కాకాణి పేర్కొన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు బనాయిస్తూ, జైళ్లకు పంపుతూ, వేధిస్తోందని కాకాణి మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రస్తుతం 'రెడ్ బుక్' రాజ్యాంగం రాజ్యమేలుతోందని, ప్రభుత్వ విధానాలను ప్రశ్నించే వారిని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్ల విధేయతగా ఉండే వారిని లక్ష్యంగా చేసుకుని కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు. సత్యనారాయణ రెడ్డిని జైల్లో పెట్టడం ముమ్మాటికీ అన్యాయం, అరాచకం, అక్రమం అని ఖండించారు. కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారి గొంతు నొక్కడమే లక్ష్యంగా చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరిస్తోందని, రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని గద్దె దించడానికి ఈ అరాచకాలే ప్రధాన కారణాలు కాబోతున్నాయని హెచ్చరించారు. అక్రమంగా ఇసుక రవాణా జరుగుతుందని ప్రశ్నించినందుకు మాజీ శాసనసభ్యుడు సంజీవయ్య గారితో పాటు సత్యనారాయణ రెడ్డి గార్ల పై అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేశారని తెలిపారు. జిల్లా మరియు రాష్ట్ర స్థాయిలో ఉన్నత పదవులు అనుభవించిన మాజీ ప్రజాప్రతినిధులకే ఈ పరిస్థితి ఎదురైతే, సామాన్య ప్రజల పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చని కాకాణి ఆవేదన వ్యక్తం చేశారు. ఒకప్పుడు రక్షణ కోసం ఆశ్రయించే పోలీస్ స్టేషన్లు, నేడు భయాందోళనలు కలిగించేలా మారాయని వ్యాఖ్యానించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొంతు ఎత్తే వారిని నిర్మూలించాలనే ఆలోచనతోనే చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్నారని, అందుకే రాష్ట్రంలో లాకప్ డెత్‌లు, వేధింపులు పెరిగిపోతున్నాయని అన్నారు. సాయి కృష్ణ లాకప్ డెత్ సంఘటనతో పాటు, క్రాంతి కుమార్ అనే యువకుడు వీడియో చూపించి ఆత్మహత్యకు పాల్పడడం చూస్తుంటే కూటమి ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా పాలిస్తుందో అర్థమవుతుందని కాకాణి పేర్కొన్నారు. ఈ కష్టకాలంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు సత్యనారాయణ రెడ్డి గారి కుటుంబానికి పూర్తి అండగా నిలిచారని, స్వయంగా మాట్లాడి ధైర్యం చెప్పారని కాకాణి తెలిపారు. దాదాపు 100 రోజులుగా జైల్లో ఉన్న సత్యనారాయణ రెడ్డి కేసును ఎదుర్కొనేందుకు మాజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డిని పంపి చట్టపరమైన సహాయం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అందించారని వెల్లడించారు. మాజీ శాసనసభ్యులు సంజీవయ్య గారు ప్రతిరోజూ తమతో మాట్లాడుతూ, ఇబ్బందులు పడుతున్నా జైల్లో ఉండే వారిని బయటకు తీసుకురావాలని తపనపడ్డారని కొనియాడారు. సత్యనారాయణ రెడ్డి విడుదల సందర్భంగా ఇంతమంది జైలు వద్దకు వచ్చారంటే, ఆయనపై ప్రజలకున్న ప్రేమాభిమానాలు ఏ విధంగా ఉన్నాయో అర్థమవుతుందని కాకాణి వ్యాఖ్యానించారు. వైఎస్ఆర్ సీపీ నాయకులపై, సంజీవయ్యపై అక్రమ కేసులు పెట్టడం, సత్యనారాయణ రెడ్డిని జైలుకు పంపడం వంటి చర్యల ద్వారా తెలుగుదేశం పార్టీ సూళ్లూరుపేట నియోజకవర్గంలో రాజకీయంగా భూస్థాపితం కాక తప్పదని ఆయన హెచ్చరించారు. సత్యనారాయణ రెడ్డి గారి అక్రమ అరెస్ట్, ఆయన పడిన బాధలను చూసి సామాన్య ప్రజలు, సానుభూతిపరులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని, ప్రజల్లో కూడా చర్చ జరుగుతోందని కాకాణి అన్నారు. కూటమి ప్రభుత్వ అరాచకాలను, అక్రమాలను రాబోయే రోజుల్లో ప్రజలు ఖచ్చితంగా ఎండగడతారని ధీమా వ్యక్తం చేశారు. అక్రమ కేసులను ఎదుర్కొని, అన్ని అవరోధాలను అధిగమించి సత్యనారాయణ రెడ్డి గారు విడుదలై తమ మధ్య ఉండడం సంతోషంగా ఉందని కాకాణి గోవర్ధన్ రెడ్డి తెలిపారు. ఈ కష్టకాలంలో వెన్నంటి ఉన్న పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి, సత్యనారాయణ రెడ్డి కుటుంబానికి అండగా నిలిచిన సూళ్లూరుపేట నియోజకవర్గ ప్రజలకు, వైయస్సార్ సిపి నాయకులకు, మరియు నిరంతరం శ్రమించిన సోదరుడు సంజీవయ్య గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

1 hr ago
user_SRIHARI POONDLA
SRIHARI POONDLA
నెల్లూరు అర్బన్, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, ఆంధ్రప్రదేశ్•
1 hr ago
2ed9ba54-7518-4899-8a08-d65fa18b23a8

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • ప్రియ సహోదరీ సోదరులారా, ఈ సందేశం ప్రభు యేసుక్రీస్తు సన్నిధిలో స్తుతించిన, ఆరాధించిన, ప్రార్థించిన, మరియు వైవిధ్యానించిన వారికి అపారమైన సంతోషం, సమాధానం లభిస్తాయని తెలియజేస్తుంది. దీనితో పాటు, ఎంతో ఆనందంగా జీవము, బలము, క్షేమాదాలను పొందుతారని స్పష్టం చేయబడింది.
    1
    ప్రియ సహోదరీ సోదరులారా, ఈ సందేశం ప్రభు యేసుక్రీస్తు సన్నిధిలో స్తుతించిన, ఆరాధించిన, ప్రార్థించిన, మరియు వైవిధ్యానించిన వారికి అపారమైన సంతోషం, సమాధానం లభిస్తాయని తెలియజేస్తుంది. దీనితో పాటు, ఎంతో ఆనందంగా జీవము, బలము, క్షేమాదాలను పొందుతారని స్పష్టం చేయబడింది.
    user_T. Raja simha
    T. Raja simha
    బద్వేల్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    18 hrs ago
  • ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ, కూట‌మి నాయ‌కులు ఇన్నాళ్లు పోలీసుల‌ను అడ్డం పెట్టుకుని క‌క్షపూరిత రాజ‌కీయాలు చేశారని, ఇప్పుడు అదే పోలీసులు ప్ర‌భుత్వాన్ని అడ్డం పెట్టుకుని చెల‌రేగిపోతున్నారని తీవ్రంగా ఆరోపించారు. వ్య‌క్తిగ‌త స్వార్థ రాజ‌కీయాల కోసం వ్య‌వ‌స్థ‌ల‌ను నిర్వీర్యం చేసి వాడుకుంటే స‌మాజం ఎలా త‌యార‌వుతుందో చెప్ప‌డానికి కృష్ణలంక సీఐ నాగరాజు కార‌ణంగా జ‌రిగిన సాయికృష్ణ లాక‌ప్ డెత్‌, క్రాంతి కుమార్ ఆత్మ‌హ‌త్య దుర్ఘ‌ట‌న‌లే సాక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ప్ర‌భుత్వ వైఫ‌ల్యాలు, అప్ర‌జాస్వామిక విధానాల‌ను ప్ర‌శ్నిస్తుంటే కూట‌మి నాయ‌కులు త‌ట్టుకోలేక‌పోతున్నారని, అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్ర‌శ్నించే గొంతుల‌ను నొక్క‌డానికి తెగ‌బ‌డుతున్నారని అప్పిరెడ్డి మండిపడ్డారు. అందులో భాగంగానే నెల్లూరులోని ఎమ్మెల్సీ ప‌ర్వ‌త‌రెడ్డి చంద్ర‌శేఖ‌ర్ రెడ్డికి చెందిన‌ విద్యాసంస్థ‌ల‌పై త‌నిఖీల పేరుతో దాడుల‌కు పూనుకున్నారని ఆయన వెల్లడించారు. డీఎస్సీ-2025 నిర్వ‌హ‌ణ‌లో జ‌రిగిన అక్ర‌మాలు, అవ‌కత‌వకలు, అలాగే తిరుమ‌ల ల‌డ్డూలో క‌ల్తీ నెయ్యి వాడారనే ఆరోప‌ణలు చేసి ఇందాపూర్ డెయిరీ ముసుగులో హెరిటేజ్‌కి లబ్ధి చేకూర్చారని ఆధారాల‌తో స‌హా నిరూపిస్తూ వైయస్ఆర్ సీపీ త‌ర‌ఫున చంద్ర‌శేఖర్ రెడ్డి బలంగా తన గొంతు వినిపించడంతో ప్ర‌భుత్వం ఇరుకున పడిందని అప్పిరెడ్డి వివరించారు. ప్ర‌భుత్వ ఉద్యోగుల స‌మ‌స్య‌ల‌పై ఎప్పటికప్పుడు స్పందిస్తూ కూట‌మి ప్ర‌భుత్వానికి కంటిలో న‌లుసుగా మారినందుకే ఆయనపై క‌క్ష పెంచుకుందని కూడా ఆయన ఆరోపించారు.
    1
    ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ, కూట‌మి నాయ‌కులు ఇన్నాళ్లు పోలీసుల‌ను అడ్డం పెట్టుకుని క‌క్షపూరిత రాజ‌కీయాలు చేశారని, ఇప్పుడు అదే పోలీసులు ప్ర‌భుత్వాన్ని అడ్డం పెట్టుకుని చెల‌రేగిపోతున్నారని తీవ్రంగా ఆరోపించారు. వ్య‌క్తిగ‌త స్వార్థ రాజ‌కీయాల కోసం వ్య‌వ‌స్థ‌ల‌ను నిర్వీర్యం చేసి వాడుకుంటే స‌మాజం ఎలా త‌యార‌వుతుందో చెప్ప‌డానికి కృష్ణలంక సీఐ నాగరాజు కార‌ణంగా జ‌రిగిన సాయికృష్ణ లాక‌ప్ డెత్‌, క్రాంతి కుమార్ ఆత్మ‌హ‌త్య దుర్ఘ‌ట‌న‌లే సాక్ష్యమని ఆయన పేర్కొన్నారు.

ప్ర‌భుత్వ వైఫ‌ల్యాలు, అప్ర‌జాస్వామిక విధానాల‌ను ప్ర‌శ్నిస్తుంటే కూట‌మి నాయ‌కులు త‌ట్టుకోలేక‌పోతున్నారని, అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్ర‌శ్నించే గొంతుల‌ను నొక్క‌డానికి తెగ‌బ‌డుతున్నారని అప్పిరెడ్డి మండిపడ్డారు. అందులో భాగంగానే నెల్లూరులోని ఎమ్మెల్సీ ప‌ర్వ‌త‌రెడ్డి చంద్ర‌శేఖ‌ర్ రెడ్డికి చెందిన‌ విద్యాసంస్థ‌ల‌పై త‌నిఖీల పేరుతో దాడుల‌కు పూనుకున్నారని ఆయన వెల్లడించారు.

డీఎస్సీ-2025 నిర్వ‌హ‌ణ‌లో జ‌రిగిన అక్ర‌మాలు, అవ‌కత‌వకలు, అలాగే తిరుమ‌ల ల‌డ్డూలో క‌ల్తీ నెయ్యి వాడారనే ఆరోప‌ణలు చేసి ఇందాపూర్ డెయిరీ ముసుగులో హెరిటేజ్‌కి లబ్ధి చేకూర్చారని ఆధారాల‌తో స‌హా నిరూపిస్తూ వైయస్ఆర్ సీపీ త‌ర‌ఫున చంద్ర‌శేఖర్ రెడ్డి బలంగా తన గొంతు వినిపించడంతో ప్ర‌భుత్వం ఇరుకున పడిందని అప్పిరెడ్డి వివరించారు. ప్ర‌భుత్వ ఉద్యోగుల స‌మ‌స్య‌ల‌పై ఎప్పటికప్పుడు స్పందిస్తూ కూట‌మి ప్ర‌భుత్వానికి కంటిలో న‌లుసుగా మారినందుకే ఆయనపై క‌క్ష పెంచుకుందని కూడా ఆయన ఆరోపించారు.
    user_Stv9 Press
    Stv9 Press
    తిరుపతి (గ్రామీణ), తిరుపతి, ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
  • గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి వైసిపిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసిపి వాళ్లు సిగ్గు లేకుండా అబద్ధాలు మాట్లాడుతున్నారని ఆయన స్పష్టం చేశారు. శనివారం అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అశోక్ రెడ్డి మాట్లాడుతూ, అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం కింద మొదటి విడతగా రూ.7 వేలు రైతుల ఖాతాలోకి జమ చేయబోతున్నట్లు తెలిపారు. మొత్తం మూడు విడతల్లో రైతులకు రూ.20 వేలు అందించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇచ్చిన మాట ప్రకారం తల్లికి వందనం పథకం ద్వారా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి లబ్ధి చేకూర్చామని కూడా వెల్లడించారు. వైసిపి వాళ్లు సిగ్గు లేకుండా అబద్ధాలు ఆడుతున్నారని ఎమ్మెల్యే అశోక్ రెడ్డి మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు.
    1
    గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి వైసిపిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసిపి వాళ్లు సిగ్గు లేకుండా అబద్ధాలు మాట్లాడుతున్నారని ఆయన స్పష్టం చేశారు. శనివారం అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే అశోక్ రెడ్డి మాట్లాడుతూ, అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం కింద మొదటి విడతగా రూ.7 వేలు రైతుల ఖాతాలోకి జమ చేయబోతున్నట్లు తెలిపారు. మొత్తం మూడు విడతల్లో రైతులకు రూ.20 వేలు అందించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇచ్చిన మాట ప్రకారం తల్లికి వందనం పథకం ద్వారా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి లబ్ధి చేకూర్చామని కూడా వెల్లడించారు. వైసిపి వాళ్లు సిగ్గు లేకుండా అబద్ధాలు ఆడుతున్నారని ఎమ్మెల్యే అశోక్ రెడ్డి మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు.
    user_Sasi Kumar reddy
    Sasi Kumar reddy
    గిద్దలూరు, ప్రకాశం, ఆంధ్రప్రదేశ్•
    16 hrs ago
  • మిత్రులందరికీ నమస్కారమండి. ARDV కంపెనీలో స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరికీ వర్క్ ఫ్రం హోం బిజినెస్ ఆపర్చునిటీ అందుబాటులో ఉంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకునే వారు పూర్తి వివరాల కొరకు మొబైల్ నెంబర్ 9666323500 నంబర్‌కు వాట్సప్ ద్వారా లేదా ఫోన్ కాల్ చేసి సంప్రదించగలరు. ధన్యవాదములు ఫ్రెండ్స్.
    1
    మిత్రులందరికీ నమస్కారమండి. ARDV కంపెనీలో స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరికీ వర్క్ ఫ్రం హోం బిజినెస్ ఆపర్చునిటీ అందుబాటులో ఉంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకునే వారు పూర్తి వివరాల కొరకు మొబైల్ నెంబర్ 9666323500 నంబర్‌కు వాట్సప్ ద్వారా లేదా ఫోన్ కాల్ చేసి సంప్రదించగలరు. ధన్యవాదములు ఫ్రెండ్స్.
    user_Kadiri Anjaneyulu
    Kadiri Anjaneyulu
    గండ్లపెంట, శ్రీ సత్య సాయి, ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
  • హైదరాబాద్‌లో కేంద్ర ప్రభుత్వం నుండి నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆసక్తిగల అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవడానికి 'Cryancreations5191' యూట్యూబ్ ఛానెల్‌ను చూడవచ్చు.
    1
    హైదరాబాద్‌లో కేంద్ర ప్రభుత్వం నుండి నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆసక్తిగల అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవడానికి 'Cryancreations5191' యూట్యూబ్ ఛానెల్‌ను చూడవచ్చు.
    user_Chandraiah Pochampally
    Chandraiah Pochampally
    Digital Marketing Specialist Gangavaram, Chittoor•
    3 hrs ago
  • అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా, రేపల్లె మండల న్యాయ సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో స్థానిక ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో యోగా కార్యక్రమం దిగ్విజయంగా నిర్వహించబడింది. ఆదివారం ఉదయం ఎనిమిది గంటల నుండి ఒక గంట పాటు జరిగిన ఈ యోగా దినోత్సవ కార్యక్రమంలో పారా లీగల్ వాలంటీర్లు, పట్టణ ప్రముఖులు, మరియు వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు కలిసి యోగాసనాలు వేశారు. మండల న్యాయ సేవా అధికార సంస్థ నేతృత్వంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు విజయవంతంగా జరిగాయి.
    2
    అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా, రేపల్లె మండల న్యాయ సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో స్థానిక ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో యోగా కార్యక్రమం దిగ్విజయంగా నిర్వహించబడింది. ఆదివారం ఉదయం ఎనిమిది గంటల నుండి ఒక గంట పాటు జరిగిన ఈ యోగా దినోత్సవ కార్యక్రమంలో పారా లీగల్ వాలంటీర్లు, పట్టణ ప్రముఖులు, మరియు వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు కలిసి యోగాసనాలు వేశారు. మండల న్యాయ సేవా అధికార సంస్థ నేతృత్వంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు విజయవంతంగా జరిగాయి.
    user_Syyed taher
    Syyed taher
    Local News Reporter Repalle, Bapatla•
    14 hrs ago
  • విజయవాడ మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి గారు, కూట‌మి ప్ర‌భుత్వం అమాయక యువకులను తమ స్వార్థ రాజకీయాల కోసం బలితీసుకుంటోందని తీవ్రంగా విమర్శించారు. కూట‌మి ప్ర‌భుత్వం వచ్చినప్పటి నుండి వెనుకబడిన కులాలకు చెందిన యువకులను పోలీసులు ఇన్‌ఫార్మర్‌లుగా మారాలని వేధిస్తున్నారని, వారి జీవితాలతో ఆడుకుంటున్నారని ఆమె ఆరోపించారు. కూట‌మి ప్రభుత్వం తీసుకొచ్చిన 'రెడ్‌బుక్ రాజ్యాంగం' కారణంగానే అమాయకుల జీవితాలు నాశనమవుతున్నాయని, తప్పులు చేసి సెటిల్మెంట్లు చేసుకోవడం రివాజుగా మారిందని ఆమె పేర్కొన్నారు. క్రాంతికుమార్ ఆత్మ‌హ‌త్యకు ప్ర‌భుత్వ‌మే పూర్తి బాధ్యత వహించాలని రాయన భాగ్యలక్ష్మి గారు డిమాండ్ చేశారు. ఈ ఘటనపై హోంమంత్రి అనిత క్రాంతికుమార్ కుటుంబాన్ని పరామర్శించాలని, సీపీ తక్షణం స్పందించాలని ఆమె పిలుపునిచ్చారు. పేరుపోగు వెంకటేశ్వరరావు కుటుంబానికి వైయస్ఆర్ సీపీ అండగా ఉంటుందని రాయన భాగ్యలక్ష్మి గారు స్పష్టం చేశారు.
    1
    విజయవాడ మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి గారు, కూట‌మి ప్ర‌భుత్వం అమాయక యువకులను తమ స్వార్థ రాజకీయాల కోసం బలితీసుకుంటోందని తీవ్రంగా విమర్శించారు. కూట‌మి ప్ర‌భుత్వం వచ్చినప్పటి నుండి వెనుకబడిన కులాలకు చెందిన యువకులను పోలీసులు ఇన్‌ఫార్మర్‌లుగా మారాలని వేధిస్తున్నారని, వారి జీవితాలతో ఆడుకుంటున్నారని ఆమె ఆరోపించారు. కూట‌మి ప్రభుత్వం తీసుకొచ్చిన 'రెడ్‌బుక్ రాజ్యాంగం' కారణంగానే అమాయకుల జీవితాలు నాశనమవుతున్నాయని, తప్పులు చేసి సెటిల్మెంట్లు చేసుకోవడం రివాజుగా మారిందని ఆమె పేర్కొన్నారు.

క్రాంతికుమార్ ఆత్మ‌హ‌త్యకు ప్ర‌భుత్వ‌మే పూర్తి బాధ్యత వహించాలని రాయన భాగ్యలక్ష్మి గారు డిమాండ్ చేశారు. ఈ ఘటనపై హోంమంత్రి అనిత క్రాంతికుమార్ కుటుంబాన్ని పరామర్శించాలని, సీపీ తక్షణం స్పందించాలని ఆమె పిలుపునిచ్చారు. పేరుపోగు వెంకటేశ్వరరావు కుటుంబానికి వైయస్ఆర్ సీపీ అండగా ఉంటుందని రాయన భాగ్యలక్ష్మి గారు స్పష్టం చేశారు.
    user_Stv9 Press
    Stv9 Press
    తిరుపతి (గ్రామీణ), తిరుపతి, ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
  • కడప జిల్లాలోని పులివెందుల నియోజకవర్గంలో తీవ్ర విషాదం నెలకొంది, నీటిలో మునిగి ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటన నియోజకవర్గంలోని చక్రాయపేట మండలం అద్దాలమర్రి గ్రామంలో జరిగింది. మృతి చెందిన వారిలో 18 ఏళ్ల జయవర్ధన్ రెడ్డి, 16 ఏళ్ల రాజా వర్ధన్ రెడ్డి అనే ఇద్దరు అన్నదమ్ములు నదిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. ఈ మరణాలకు అక్రమ ఇసుక తవ్వకాలే ప్రధాన కారణమని పలువురు గ్రామస్థులు ఆందోళనకు దిగారు. అక్రమంగా జరుగుతున్న ఇసుక తవ్వకాల వల్లే ఈ విషాదం చోటు చేసుకుందని గ్రామస్థులు నిరసన వ్యక్తం చేశారు.
    1
    కడప జిల్లాలోని పులివెందుల నియోజకవర్గంలో తీవ్ర విషాదం నెలకొంది, నీటిలో మునిగి ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటన నియోజకవర్గంలోని చక్రాయపేట మండలం అద్దాలమర్రి గ్రామంలో జరిగింది. మృతి చెందిన వారిలో 18 ఏళ్ల జయవర్ధన్ రెడ్డి, 16 ఏళ్ల రాజా వర్ధన్ రెడ్డి అనే ఇద్దరు అన్నదమ్ములు నదిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు.

ఈ మరణాలకు అక్రమ ఇసుక తవ్వకాలే ప్రధాన కారణమని పలువురు గ్రామస్థులు ఆందోళనకు దిగారు. అక్రమంగా జరుగుతున్న ఇసుక తవ్వకాల వల్లే ఈ విషాదం చోటు చేసుకుందని గ్రామస్థులు నిరసన వ్యక్తం చేశారు.
    user_LAKKU SIVA SANKAR reddy
    LAKKU SIVA SANKAR reddy
    Court reporter పులివెందుల, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.