logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

కృష్ణాజిల్లా గన్నవరం సబ్‌డివిజన్ పరిధిలో సంచలనం సృష్టించిన మహిళ హత్య కేసును గన్నవరం పోలీసులు అత్యంత చాకచక్యంగా ఛేదించారు. ఈ కేసులో నిందితులను అరెస్ట్ చేయడమే కాకుండా, భారీ మొత్తంలో సొత్తును కూడా స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ శ్రీ వి. విద్యాసాగర్ నాయుడు, ఐపీఎస్., ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. గన్నవరం దావాజీగూడెం రోడ్డులోని GKR పారడైజ్ అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్ నెం.401లో నివసిస్తున్న కాజ రజిత కుమారి (55) అనే మహిళ తన భర్త మరణానంతరం ఒంటరిగా ఉంటూ, శ్రీనగర్ కాలనీలో జ్యోతి పిండి మర నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఆమె ఇద్దరు కుమార్తెలు అమెరికాలో నివసిస్తున్నారు. ది.24-05-2026 రాత్రి సమయంలో మృతురాలు తన కుమార్తెతో ఫోన్‌లో మాట్లాడుతుండగా, ఎవరో కాలింగ్ బెల్ కొట్టారని చెప్పి ఫోన్‌ను నిలిపివేశారు. అనంతరం ఫోన్‌కు ఆమె స్పందించకపోవడంతో అనుమానం కలిగింది. మరుసటి రోజు ఉదయం పనిమనిషి ఇంటికి వచ్చి చూడగా, రజిత కుమారి తన బెడ్‌రూమ్‌లో అనుమానాస్పద స్థితిలో మృతిచెందినట్లు గుర్తించి వెంటనే 112కు సమాచారం ఇచ్చారు. మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు గన్నవరం పోలీసులు మొదట అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా అపార్ట్‌మెంట్ సీసీ కెమెరాలను పరిశీలించగా, మృతురాలికి పరిచయస్తురాలైన పోలవరపు సుష్మ మరియు ఆమె కుమారుడు పోలవరపు అజయ్ కుమార్ 24-05-2026 రాత్రి 10:07 గంటలకు ఫ్లాట్‌లోకి ప్రవేశించి, రాత్రి 11:17 గంటలకు బయటకు వెళ్లినట్లు గుర్తించారు. ఈ ఆధారాలతో కేసును మర్డర్ ఫర్ గెయిన్‌గా మార్చి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తును ముమ్మరం చేశారు. జిల్లా ఎస్పీ శ్రీ వి. విద్యాసాగర్ నాయుడు, ఐపీఎస్., ఆదేశాల మేరకు, గన్నవరం ఇన్‌చార్జ్ డీఎస్పీ శ్రీ పాల శ్రీనివాస్ పర్యవేక్షణలో, గన్నవరం పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జ్ సీఐ శ్రీ ఎల్. రమేష్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు నిందితుల కోసం గాలింపు చేపట్టాయి. దర్యాప్తులో లభించిన విశ్వసనీయ సమాచారం మేరకు, ఈరోజు గన్నవరం కోనయ్య చెరువు సమీపంలో నిందితులైన పోలవరపు సుష్మ (43), పోలవరపు అజయ్ కుమార్ (25)లను అదుపులోకి తీసుకుని విచారించగా, వారు నేరాన్ని అంగీకరించారు. ప్రధాన నిందితురాలు పోలవరపు సుష్మకు ఓ వ్యక్తితో ఉన్న వివాహేతర సంబంధానికి మృతురాలు అడ్డుగా ఉందనే భావనతో పాటు, ఆర్థిక ఇబ్బందుల కారణంగా మృతురాలి వద్ద ఉన్న బంగారం, నగదును దోచుకోవాలనే దురాశతో ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఈ కుట్రలో ఆమె కుమారుడు పోలవరపు అజయ్ కుమార్ సహకరించినట్లు దర్యాప్తులో తేలింది. కాగా, అజయ్ కుమార్‌పై గతంలో పలు క్రిమినల్ కేసులు నమోదై ఉన్నాయని, ఉయ్యూరు టౌన్ పోలీస్ స్టేషన్‌లో సస్పెక్ట్ షీట్ కూడా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. పోలీసులు సుమారు 390 గ్రాముల బంగారం, రూ.1,60,000 నగదు, నేరానికి ఉపయోగించిన AP40KF8842 Suzuki Access వాహనంతో సహా మొత్తం సుమారు రూ.56 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును వేగంగా ఛేదించి నిందితులను అరెస్ట్ చేసిన పోలీసు బృందాన్ని జిల్లా ఎస్పీ శ్రీ వి. విద్యాసాగర్ నాయుడు, ఐపీఎస్., అభినందించారు. ఈ బృందంలో డీఎస్పీ శ్రీ పాల శ్రీనివాస్, సీఐ శ్రీ ఎల్. రమేష్, ఎస్సైలు శ్రీ కె. శ్రీధర్, శ్రీ ఎం. నాగరాజు, శ్రీమతి ఎన్. ప్రశాంతి, హెడ్ కానిస్టేబుళ్లు మరియు పోలీస్ సిబ్బంది ఉన్నారు.

16 hrs ago
user_Arja Durga Prasad
Arja Durga Prasad
Local News Reporter మచిలీపట్నం, కృష్ణ, ఆంధ్రప్రదేశ్•

More news from Eluru and nearby areas
  • ఈరోజు ఏలూరులోని ఆర్ఆర్ పేట వెంకటేశ్వర స్వామి గుడి భక్తులతో కిటకిటలాడింది. ప్రతి ఒక్క భక్తుడు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని తమ భక్తిని చాటుకున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు జరిగిన అన్న సమారాధనలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అన్న సమారాధనలో పాల్గొనేందుకు ప్రతి ఒక్కరూ క్యూలైన్‌ను క్రమశిక్షణతో పాటించారు. ప్రసాదం స్వీకరించిన అనంతరం భక్తులు అక్కడి నుండి వెళ్లిపోయారు. మొత్తంగా, ఈరోజు ఏలూరు ఆర్ఆర్ పేటలోని వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తుల సందడితో నిండిపోయింది.
    1
    ఈరోజు ఏలూరులోని ఆర్ఆర్ పేట వెంకటేశ్వర స్వామి గుడి భక్తులతో కిటకిటలాడింది. ప్రతి ఒక్క భక్తుడు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని తమ భక్తిని చాటుకున్నారు.

మధ్యాహ్నం 12 గంటలకు జరిగిన అన్న సమారాధనలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అన్న సమారాధనలో పాల్గొనేందుకు ప్రతి ఒక్కరూ క్యూలైన్‌ను క్రమశిక్షణతో పాటించారు. ప్రసాదం స్వీకరించిన అనంతరం భక్తులు అక్కడి నుండి వెళ్లిపోయారు.

మొత్తంగా, ఈరోజు ఏలూరు ఆర్ఆర్ పేటలోని వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తుల సందడితో నిండిపోయింది.
    user_Vikram
    Vikram
    Bhimadole, Eluru•
    43 min ago
  • Post by SHOT NEWS
    1
    Post by SHOT NEWS
    user_SHOT NEWS
    SHOT NEWS
    Advertising agency Guntur, Andhra Pradesh•
    6 hrs ago
  • 😭🙏
    1
    😭🙏
    user_Rambabu Adhimulam
    Rambabu Adhimulam
    అమలాపురం, కోనసీమ, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • 😭🙏
    1
    😭🙏
    user_Adimlamrambabu Adimlamrambabu
    Adimlamrambabu Adimlamrambabu
    Kakinada (Rural), Andhra Pradesh•
    1 hr ago
  • 🙏😭
    1
    🙏😭
    user_Rambabu Adhimulam
    Rambabu Adhimulam
    అమలాపురం, కోనసీమ, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • కామారెడ్డి జిల్లాలోని మగ్దుంపూర్‌లో చంద్ర గౌడ్ అనే వ్యక్తి షర్ట్ జేబులో ఉన్న సామ్ సంగ్ ఫోన్ ఎండ వేడికి ఒక్కసారిగా పేలిపోయింది. అతను వెంటనే అప్రమత్తమవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో సదరు వ్యక్తికి ఎలాంటి గాయాలు కాలేదు. వేసవిలో ఎండల తీవ్రతతో ఫోన్లు వేడెక్కి పేలిపోతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో, నిపుణులు ఎలక్ట్రానిక్ పరికరాల పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచిస్తున్నారు.
    1
    కామారెడ్డి జిల్లాలోని మగ్దుంపూర్‌లో చంద్ర గౌడ్ అనే వ్యక్తి షర్ట్ జేబులో ఉన్న సామ్ సంగ్ ఫోన్ ఎండ వేడికి ఒక్కసారిగా పేలిపోయింది. అతను వెంటనే అప్రమత్తమవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో సదరు వ్యక్తికి ఎలాంటి గాయాలు కాలేదు.

వేసవిలో ఎండల తీవ్రతతో ఫోన్లు వేడెక్కి పేలిపోతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో, నిపుణులు ఎలక్ట్రానిక్ పరికరాల పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచిస్తున్నారు.
    user_Journalist SIDDHU
    Journalist SIDDHU
    Guntur, Andhra Pradesh•
    5 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.