Shuru
Apke Nagar Ki App…
కామారెడ్డి జిల్లాలో చేయూత పింఛన్లపై ప్రభుత్వ ప్రచారం షురూ లోకల్ కేబుల్ ఛానళ్ల ద్వారా ప్రజల్లోకి ప్రభుత్వ సందేశం కామారెడ్డి: జిల్లాలో చేయూత పింఛన్లపై రాష్ట్ర ప్రభుత్వ ప్రచారం ప్రారంభమైంది చేయూత పింఛన్లకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ప్రత్యేక వీడియో క్లిప్పింగ్‌ను జిల్లాలోని లోకల్ కేబుల్ ఛానళ్ల ద్వారా ప్రసారం చేస్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వం పంపించిన వీడియో క్లిప్పింగ్‌ను జిల్లాలోని అన్ని లోకల్ కేబుల్ ఛానళ్లలో ప్రసారం చేయాలని ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు అందించినట్లు ఇన్చార్జి డీపీఆర్ఓ ఎన్.వై. గిరి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల సమాచారాన్ని ప్రజలకు చేరవేయడంలో మీడియా ప్రతినిధులు సహకరించాలని ఆయన కోరారు.
Vukkalkar Rajendernath
కామారెడ్డి జిల్లాలో చేయూత పింఛన్లపై ప్రభుత్వ ప్రచారం షురూ లోకల్ కేబుల్ ఛానళ్ల ద్వారా ప్రజల్లోకి ప్రభుత్వ సందేశం కామారెడ్డి: జిల్లాలో చేయూత పింఛన్లపై రాష్ట్ర ప్రభుత్వ ప్రచారం ప్రారంభమైంది చేయూత పింఛన్లకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ప్రత్యేక వీడియో క్లిప్పింగ్‌ను జిల్లాలోని లోకల్ కేబుల్ ఛానళ్ల ద్వారా ప్రసారం చేస్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వం పంపించిన వీడియో క్లిప్పింగ్‌ను జిల్లాలోని అన్ని లోకల్ కేబుల్ ఛానళ్లలో ప్రసారం చేయాలని ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు అందించినట్లు ఇన్చార్జి డీపీఆర్ఓ ఎన్.వై. గిరి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల సమాచారాన్ని ప్రజలకు చేరవేయడంలో మీడియా ప్రతినిధులు సహకరించాలని ఆయన కోరారు.
- Taluka press club president:Sambu.chandra sekharఅచ్చంపేట, నాగర్‌కర్నూల్, తెలంగాణమీరు ఇస్తున్న చేయూత పెన్షన్లు ఆసరాగా ఉండొచ్చు కానీ నిరుద్యోగులుగా ఉన్న యువతకి ఇప్పటివరకు ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా పెన్షన్లను ఇచ్చినట్లు దాఖలాలలో లేవు నిరుద్యోగులకు పెన్షన్ దరఖాస్తు చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పూర్తిస్థాయిలో గైడ్‌లైన్స్ అధికారులు వారికి కల్పించడం లేదు అసలు గైడ్‌లైన్స్ వచ్చిందా లేదా కూడా ఎవరికీ తెలియదు వయస్సు నిర్ధారణ ధ్రువీకరణ పత్రాలు దానికి సంబంధించిన విధివిధానాలను రూపొందించి నిరుద్యోగులకు బాసటగా నిలిచి వారికి నిరుద్యోగ పెన్షన్ కల్పిస్తే నిరుద్యోగులు అంతా కూడా హర్షిస్తారు సహనందిస్తారు.17 hrs ago
More news from తెలంగాణ and nearby areas
- ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఇళ్లలో దీపావళి వేడుకలు కుటుంబాలతో కలిసి పండుగ జరుపుకున్న ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి బాన్సువాడ: రుద్రూర్ మండలం బొప్పాపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల కుటుంబాలతో కలిసి తెలంగాణ ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి దీపావళి పండుగను జరుపుకున్నారు. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి కుటుంబ సభ్యులతో ఆత్మీయంగా గడిపి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి నిరుపేద కుటుంబానికి సొంతింటి కలను సాకారం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోందన్నారు. ఇందిరమ్మ ఇళ్లలో దీపాల వెలుగులతో పాటు ప్రతి కుటుంబంలో సంతోషం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బొప్పాపూర్ గ్రామానికి చెందిన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు నామ్ గంగమణి, తేలగాడం వరలక్ష్మి, వడ్ల మమత, పాట్ల సుమిత్ర, బొమ్మడి సుధ కుటుంబాలతో పాటు రుద్రూర్ మండల ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.1
- శ్రీశ్రీశ్రీ రాజరాజేశ్వర దేవాలయం కృష్ణాజివాడి గ్రామం తాడువాయి మండలం కామారెడ్డి జిల్లా తెలంగాణ ఇండియా విశ్వం జై గురుదేవ్ జై జై గురుదేవ్ శ్రీశ్రీశ్రీ రాజరాజేశ్వర దేవాలయం కృష్ణాజివాడి గ్రామం తాడువాయి మండలం కామారెడ్డి జిల్లా తెలంగాణ ఇండియా విశ్వం జై గురుదేవ్ జై జై గురుదేవ్2
- ఖరీఫ్ లో పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి 10000 చేరిస్తామని ప్రకటించిన ప్రభుత్వం చెల్లించాలి రబీలో జిల్లాలో రైతులు ఆరుతడిపంటలుసాగు చేయాలి సిటిజన్ ఫోరం అధ్యక్షులు కొండల్ రెడ్డి మెదక్ జిల్లాలో వర్షాభావపరిస్థితులవల్ల చెక్ డ్యామ్ లవద్ద నీటి నిల్వలుచూసిన రైతులు రబిలోవరిసాగుకు సన్నద్దం అవుతున్నారని, చెక్ డ్యామ్ లలో నీరు తాగడానికిఉప యోగిస్తారని సిటిజెన్ ఫోరంఅధ్యక్షులు కొండల్ రెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ కు వినతిపత్రం సమర్పించారు. కరెంట్ సరఫరాఅతితక్కువగా ఉంటుందని తౄలిపారు. ఈ మేరకు జిల్లాఅధికారయంత్రాంగంరైతులుదుక్కిదున్నకముందే వారికి అవగాహన కల్పించాలని ఆయన కోరారు.జిల్లాలో అతివృష్టి వల్ల వాగులు చెరువులు పొంగి పడడంతో రైతులు నష్టపోయినరని ప్రభుత్వం ప్రకటించిన ఎకరాకు పదివేల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు1
- నస్రుల్లాబాద్ మండల కేంద్రంలో రెండవ రోజు దీపావళి వేడుకలు నస్రుల్లాబాద్ మండల కేంద్రంలో రెండవ రోజు దీపావళి పండుగ సందర్భంగా ప్రతీ ఇంటా దీపాలతో వెలిగిపోయింది. చివరి రోజు కావడంతో పిల్లలు పెద్దలు తేడ లేకుండా పండుగను జరుపుకున్నారు.అనంతరం ప్రతి ఇంటి ముందు దీపాలను వెలిగించి, టపాసులను కాల్చారు. ఈ ఉత్సవంలో పిల్లలు టపాసులను కలుస్తూ, సంతోషంగా పండుగలో పాల్గొన్నారు. మండల కేంద్రం మొత్తం టపాసుల శబ్దంతో, వెలుగుతో నిండిపోయింది.1
- హార్వెస్టర్ మిషన్లు లీజుకు ఇస్తామని నమ్మించి వ్యక్తిని కిడ్నాప్ చేసి రూ.10 లక్షలు డిమాండ్ నలుగురు నిందితులను పట్టుకున్న దోమకొండ పోలీసులు. హార్వెస్టర్ మిషన్లు లీజుకు ఇస్తామని నమ్మించి వ్యక్తిని కిడ్నాప్ చేసి రూ.10 లక్షలు డిమాండ్ నలుగురు నిందితులను పట్టుకున్న దోమకొండ పోలీసులు. జైలులో పరిచయంతో నేరాలకు పథకం – నెల రోజుల పాటు నకిలీ పేరుతో ఫోన్లో మాటలు – బాధితుడిని నమ్మించి కారులో కిడ్నాప్ చేసి దాడి, దోపిడి. మద్యం సేవించి నిద్రలోకి జారుకొన్న నిందితులు, వారి చెర నుంచి తప్పించుకున్న బాధితుడు మరోసారి కిడ్నాప్‌కు ప్రయత్నిస్తుండగా పోలీసుల పట్టివేత. సాంకేతిక ఆధారాలు, సీసీటీవీ కెమెరాల పరిశీలనతో నిందితులను గుర్తించి పట్టుకున్న రెండు ప్రత్యేక పోలీసు బృందాలు. నిందితుల వద్ద నుంచి కిడ్నాప్‌కు ఉపయోగించిన ఎర్టిగా కారు, బాధితుడి సెల్‌ఫోన్‌తో పాటు మొత్తం నాలుగు మొబైల్ ఫోన్లు, ఉన్ని టోపీ స్వాధీనం. కేసు వివరాలను వెల్లడించిన జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర, కోనాపూర్ గ్రామానికి చెందిన చిందం మహేష్ (32) వరి కోత హార్వెస్టర్ మిషన్లను లీజుకు తీసుకొని నడుపుకుంటూ జీవనోపాధి పొందుతున్నాడు. ఈ క్రమంలో కరుణాకర్ రెడ్డి అనే పేరుతో ఒక వ్యక్తి పరిచయం చేసుకొని అతని హార్వెస్టర్ మిషన్లు లీజుకు ఇస్తానని నమ్మించినాడని తేదీ 22-10-2026న రాత్రి మాట్లాడుదాం అని పిలిచి కారులో కిడ్నాప్ చేశారని, మార్గమధ్యలో మరో ఇద్దరితో కలిసి బాధితుడి ముఖానికి ఉన్ని టోపీ ని మాస్క్ ల వేసి, దాడి చేసి, చంపేస్తామని బెదిరించి అతని వద్ద ఉన్న POCO M6 5G సెల్‌ఫోన్, పర్సులోని రూ.2,500 నగదును బలవంతంగా లాక్కున్నారు అని నిందితుల చెర నుంచి తప్పించుకున్న బాధితుడు ఇందల్వాయి బస్‌స్టాండ్‌కు చేరుకొని తన గ్రామస్థులకు సమాచారం అందించాడు. అక్కడి నుండి దోమకొండకు వచ్చి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు మేరకు దోమకొండ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించడం జరిగింది. జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర, ఆదేశాల మేరకు కామారెడ్డి డీఎస్పీ మధుసూదన్ పర్యవేక్షణలో భిక్నూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ నరేష్, దోమకొండ ఎస్ఐ ప్రభాకర్ మరియు సిబ్బందితో రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో బాధితుడు ఇచ్చిన సమాచారం, సీసీటీవీ కెమెరాల పరిశీలన, సాంకేతిక ఆధారాల సహాయంతో నిందితులను గుర్తించి పట్టుకునేందుకు పోలీసులు చర్యలని వేగవంతం చేశారు. కేసు వివరాల్లోకి వెళితే: నిందితులు నిట్టూ నరసింగ రావు కు ఎరుగు నగేష్, చిందం శ్రీకాంత్ గతంలో జైలులో ఉన్న సమయంలో ఒకరికొకరు పరిచయమై, జైలు నుంచి విడుదలైన అనంతరం సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో డబ్బున్న వ్యక్తిని కిడ్నాప్ చేసి, దాడి చేసి, బెదిరించి డబ్బులు వసూలు చేయాలని పథకం రూపొందించుకున్నారు. ఈ క్రమంలో చిందం శ్రీకాంత్‌కు పరిచయమున్న కోనాపూర్ గ్రామానికి చెందిన చిందం మహేష్ అనే వ్యక్తి దగ్గర డబ్బు, వ్యవసాయం మరియు పిరికి అని అతనిని లక్ష్యంగా ఎంచుకున్నారు. మహేష్ హార్వెస్టర్ మిషన్లను లీజుకు తీసుకొని నడుపుతాడని తెలుసుకొని అదే అదనుతో అతనికి హార్వెస్టర్ మిషన్లు అద్దెకు ఇస్తామని నమ్మించి అతడిని కిడ్నాప్ చేసి అదిక మొత్తములో డబ్బు వసూలు చేయాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా నిట్టూ నర్సింగరావు కరుణాకర్ రెడ్డి అనే నకిలీ పేరుతో, దొరికిన సిమ్ కార్డ్ ఉపయోగించి సుమారు నెల రోజుల పాటు మహేష్‌తో మాట్లాడి హార్వెస్టర్ మిషన్లు అద్దెకు ఇస్తామని నమ్మించాడు. మరోవైపు నిందితులు ముందుగానే బాధితుడి ఇంటి పరిసరాలు, రాకపోకల మార్గాలను పరిశీలించి పతకం ప్రకారం తెల్లరంగు మారుతి ఎర్టిగా కారును అద్దెకు తీసుకున్నారు. ఈ పథకంలో ఎరుగు నగేష్, నిట్టూ నర్సింగరావు, తెడ్డూ సురేష్ ప్రత్యక్షంగా పాల్గొనగా, చిందం శ్రీకాంత్ గ్రామంలోనే ఉండి బాధితుడి కుటుంబ సభ్యుల కదలికలు, పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయాలను గమనిస్తూ వారికి సమాచారం అందించే బాధ్యత తీసుకున్నాడు. తేదీ 22-10-2026న నిందితులు కారులో కోనాపూర్ గ్రామానికి చేరుకొని, హార్వెస్టర్ మిషన్లు చూపిస్తామని చెప్పి మహేష్‌ను వారి దగ్గరకు పిలిచి నమ్మించి కారులో ఎక్కించుకొని కిడ్నాప్ చేశారు. కొంతదూరం వెళ్లిన తర్వాత అతడిని ఉన్ని టోపీని మాస్క్‌లా ఏమి కనపడకుండా తొడిగి కాళ్లతో తన్నుతూ, చేతులతో కొడుతూ రూ.10 లక్షలు ఇవ్వాలని లేదంటే చంపేస్తామని బెదిరించారు. అనంతరం బాధితుడి వద్ద ఉన్న POCO M6 5G సెల్‌ఫోన్, పర్సు, అందులోని రూ.2,500 నగదును బలవంతంగా లాక్కొని వివిధ ప్రాంతాల్లో తిప్పుతూ, బయపెడ్తూ, దాడి చేస్తూ డబ్బులు తెప్పించాలని ఒత్తిడి చేశారు. అయితే నిందితులు మద్యం సేవించి, ఇందల్వాయి ఒక దభ హోటల్ వద్ద కారు నిలిపి నిద్రలోకి జారుకున్న సమయంలో బాధితుడు వారి చెర నుంచి తప్పించుకొని బస్‌స్టాండ్‌కు చేరుకున్నాడు. ఈ ఘటన అనంతరం నిందితులు తమ నేరాన్ని కప్పిపుచ్చుకునేందుకు గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్‌లకు ఫోన్ చేసి తాము బీహార్‌కు చెందిన వారమని, బాధితుడు తమ మహిళలతో అసభ్యంగా ప్రవర్తించినందున అతడిని తీసుకెళ్లి బెదిరించి వదిలిపెట్టామని తప్పుడు సమాచారం ఇచ్చి పోలీసులను, గ్రామస్థులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా, బాధితుడు మొదటిసారి కిడ్నాప్ సమయంలో తీవ్ర భయాందోళనకు గురై తనకు ఆడ పిల్లలు కలరు తనకు హాని చేయ వద్దు ఎంతైనా డబ్బులు ఇస్తానని చెప్పినందున, అతడిని మరోసారి కిడ్నాప్ చేసి డబ్బులు వసూలు చేయాలని నిందితులు మరో సారి పథకం వేశారు. ఇందులో భాగంగా తేదీ 09-11-2026న తిరిగి అదే కారును అద్దెకు తీసుకొని కోనాపూర్ గ్రామ శివారులోని ఎల్లమ్మ గుడి వద్ద ఉండగా పోలీసులు కారును అనుమానించి వారిని అదుపులోకి తీసుకొని విచారించగ వారు చేసిన కిడ్నాప్, దోపిడి బయటపడింది. నిందితుల పూర్తి వివరాలు A-1: నిట్టూ నర్సింగరావు, తండ్రి :నాగేందహార్ రావ్, చిట్యాల గ్రామం, తాడ్వాయి ( 3 కేసులు, తాడ్వాయి PS పరిధిలో 1) భూ వివాదం, 2) హత్యాయత్నం & పేలుడు పదార్థాల కేసు, 3) కిడ్నాప్ & ఆయుధాల చట్టం కేసు A-2: ఎరుగు నగేష్ @ నాయేష్, తండ్రి : మహేందర్, గన్నారం గ్రామం, ఇందల్వాయి, నిజామాబాద్ జిల్లా. (ఇందల్వాయి PS పరిధిలో తన 9 నెలల గర్భవతి గల భార్యను హత్య చేసిన కేసు కలదు.) A-3: తెడ్డూ సురేష్, తండ్రి : బాబయ్య, గన్నారం గ్రామం, ఇందల్వాయి, నిజామాబాద్ జిల్లా. )మెదటి నేరం) A-4: చిందం శ్రీకాంత్, తండ్రి : మల్లయ్య, కోనాపూర్ గ్రామం, బీబీపేట మండలం. )దోమకొండ PS పరిధిలో దొంగతనం కేసు కలదు.( స్వాధీనం చేసుకున్న వస్తువులు 1. తెల్లరంగు Ertiga కార్ (TS 16 EF 8889) 2. సెల్‌ఫోన్ – బాధితుడి నుంచి అపహరించినది మరియు (4) నిందితుల సెల్‌ఫోన్స్ 3. బాధితుడి ముఖానికి మాస్క్ ల ఉపయోగించిన ఉన్ని టోపీ. 4. ఒక ద్విచక్ర వాహనం. ఈ కేసును ఛేదించడంలో చురుకుగా పనిచేసిన భిక్నూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ నరేష్, దోమకొండ ఎస్ఐ ప్రభాకర్ మరియు కానిస్టేబుల్ సాయిబాబా , బాలకృష్ణ, బైరవప్రసాద్, హోం గార్డ్ శ్రీకాంత్ లను జిల్లా ఎస్పీ అభినందించారు.1
- मदनूर मंडल केंद्र में बडी भक्ती भाव सें कार्तिक महा में भंजन करते हुये ग्राम देवता फेरी जारी है.! कामारेड्डी जिलें कें मदनूर मंडल केंद्र में प्रति वर्ष तरह इस वर्ष भी कार्तिक मास कें उपलक्ष्ये में संगयप्पा महाराज कें मंत्रोच्चारों सें 40 दिन पाल पार्णिमा तक ग्राम कें सभी देवता कें मंदिर जाकर भक्ती भाव सें आरती महापुजा करते है. यह ब्रह्म मुहुर्त पर ही प्रभात फेरी करते हैं. इस प्रभात फेरी में छोटे सें लेकर बडें बुर्जुगों नें भाग लेते हैं. इस अवसर पर . भगवान कें नामस्मरण करते हुये भजन गाते हुये प्रभात फेरी कर बालाजी मंदीर फिर जाकर पुजा _ अर्चना, आरती, महा प्रसाद लेतें हैं. इस अवसर पर काकांनी परिवार, शर्माजी परिवार, मोदानी परिवार, तोष्णीवाल परिवार, पारिक परिवार, शंकर संदुरवार,रचावार खुशाल, तुमवार गगांधर हणमुवार हाणमंडलू, उडतावार सुरेश,संजू, हाणमंडलू,आदी सभी समाज कें भक्तगंण उपस्थित होते हैं.1
- చేయూత పింఛన్లపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వీడియోను విడుదల చేసింది చేయూత పింఛన్లపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా జారీచేసిన వీడియో క్లిప్పింగ్ పంపించడం జరిగింది లోకల్ కేబుల్ ఛానల్ లో ప్రసారం చేసి ఆ యొక్క వీడియో క్లిప్పింగ్. ను నా యొక్క వాట్సాప్ కు పంపగలరు డి పి ఆర్ ఓ కామారెడ్డి1
- మనోహరాబాద్ మండలం జీడిపల్లి వద్ద బైక్ ఢీకొని కార్మికుడికి గాయాలు మనోహరాబాద్ మండలం జీడిపల్లి వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జార్ఖండ్‌కు చెందిన లీలేశ్వర్ (33) ద్విచక్ర వాహనం ఢీకొనడంతో గాయపడ్డాడు. ఓ కంపెనీలో కార్మికుడిగా పనిచేస్తున్న ఆయన జీడిపల్లి నుంచి రైల్వే స్టేషన్‌కు కాలినడకన వెళ్తుండగా బైక్ ఢీకొట్టింది. సమాచారం అందుకున్న 108 సిబ్బంది ఈఎంటీ శివ, పైలెట్ రమేష్ ఘటనా స్థలానికి చేరుకుని బాధితుడిని గాంధీ ఆసుపత్రికి తరలించారు.1