దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘ది గోల్డెన్ థీఫ్’ సుబోధ్ సింగ్ విచారణలో అనేక ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దేశ రక్షణ విభాగాల్లో సేవ చేయాలనుకున్న వ్యక్తి జీవితం ఒక చిన్న కేసు కారణంగా పూర్తిగా మారిపోయిందట. ప్రస్తుతం కరీంనగర్ పోలీసుల అదుపులో ఉన్న సుబోధ్ సింగ్ అలియాస్ బాబువాను వారం రోజులపాటు కస్టడీలోకి తీసుకుని విచారించనున్నారు. బిహార్‌లోని నలంద జిల్లాకు చెందిన సుబోధ్ సింగ్ పోలీసులకే పెద్ద సవాల్‌గా మారడానికి అనేక కారణాలు ఉన్నాయని దర్యాప్తులో తేలుతోంది. సుబోధ్ సింగ్ ఒకప్పుడు పారా మిలటరీ విభాగంలో చేరేందుకు అర్హత సాధించారు. ఉద్యోగంలో చేరేందుకు రైలులో వెళ్తుండగా, సంబంధం లేని ఒక కేసులో ఆయన ఇరుక్కుపోయినట్లు తెలుస్తోంది. ఈ కేసు కారణంగా విధుల్లో చేరలేకపోయినందుకు సుబోధ్ సింగ్ తీవ్రంగా మదనపడేవాడని సమాచారం. ఆ తర్వాతే ఆయన క్రిమినల్ మార్గంలోకి మళ్ళాడని, క్రమంగా దోపిడీ ముఠాలను ఏర్పాటు చేసుకుని ఈ స్థాయికి చేరుకున్నాడని పోలీసులు అనుమానిస్తున్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో బంగారు ఆభరణాలను మాత్రమే లక్ష్యంగా చేసుకుని ఆయన ముఠాలు దోపిడీలకు పాల్పడటంతో సుబోధ్ సింగ్‌కు 'గోల్డెన్ థీఫ్'గా పేరు వచ్చింది. దేశంలోని పలు రాష్ట్రాలలో జరిగిన దోపిడీ కేసుల్లో సుబోధ్ సింగ్‌కు సంబంధాలు ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు. ఒకప్పుడు దేశ భద్రతా విభాగంలో ఉద్యోగం సంపాదించుకున్న సుబోధ్ సింగ్, ఇప్పుడు దేశ అంతర్గత భద్రతకే సవాల్ విసిరే స్థాయికి చేరుకున్నాడని అభిప్రాయపడుతున్నారు. కరీంనగర్ పీఎంజే జ్యువెల్లరీ షాప్ చోరీ కేసులో సుబోధ్ సింగ్ ప్రమేయానికి సంబంధించిన ఆధారాలను కరీంనగర్ కోర్టులో ప్రవేశపెట్టినట్లయితే, ఈ కేసు ఇతర రాష్ట్రాలకు చెందిన పోలీసులకు ఒక అధ్యయన అంశంగా మారే అవకాశం ఉంది. కరీంనగర్ పోలీసులు సుబోధ్ సింగ్ నేర ప్రవృత్తిని ఎలా గుర్తించారు, సాక్ష్యాలను ఎలా సేకరించారు, దర్యాప్తు ఎలా చేశారనే వివరాలను తెలుసుకోవడానికి ఇతర రాష్ట్రాల పోలీసులు కూడా రంగంలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘ది గోల్డెన్ థీఫ్’ సుబోధ్ సింగ్ విచారణలో అనేక ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దేశ రక్షణ విభాగాల్లో సేవ చేయాలనుకున్న వ్యక్తి జీవితం ఒక చిన్న కేసు కారణంగా పూర్తిగా మారిపోయిందట. ప్రస్తుతం కరీంనగర్ పోలీసుల అదుపులో ఉన్న సుబోధ్ సింగ్ అలియాస్ బాబువాను వారం రోజులపాటు కస్టడీలోకి తీసుకుని విచారించనున్నారు. బిహార్‌లోని నలంద జిల్లాకు చెందిన సుబోధ్ సింగ్ పోలీసులకే పెద్ద సవాల్‌గా మారడానికి అనేక కారణాలు ఉన్నాయని దర్యాప్తులో తేలుతోంది. సుబోధ్ సింగ్ ఒకప్పుడు పారా మిలటరీ విభాగంలో చేరేందుకు అర్హత సాధించారు. ఉద్యోగంలో చేరేందుకు రైలులో వెళ్తుండగా, సంబంధం లేని ఒక కేసులో ఆయన ఇరుక్కుపోయినట్లు తెలుస్తోంది. ఈ కేసు కారణంగా విధుల్లో చేరలేకపోయినందుకు సుబోధ్ సింగ్ తీవ్రంగా మదనపడేవాడని సమాచారం. ఆ తర్వాతే ఆయన క్రిమినల్ మార్గంలోకి మళ్ళాడని, క్రమంగా దోపిడీ ముఠాలను ఏర్పాటు చేసుకుని ఈ స్థాయికి చేరుకున్నాడని
పోలీసులు అనుమానిస్తున్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో బంగారు ఆభరణాలను మాత్రమే లక్ష్యంగా చేసుకుని ఆయన ముఠాలు దోపిడీలకు పాల్పడటంతో సుబోధ్ సింగ్‌కు 'గోల్డెన్ థీఫ్'గా పేరు వచ్చింది. దేశంలోని పలు రాష్ట్రాలలో జరిగిన దోపిడీ కేసుల్లో సుబోధ్ సింగ్‌కు సంబంధాలు ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు. ఒకప్పుడు దేశ భద్రతా విభాగంలో ఉద్యోగం సంపాదించుకున్న సుబోధ్ సింగ్, ఇప్పుడు దేశ అంతర్గత భద్రతకే సవాల్ విసిరే స్థాయికి చేరుకున్నాడని అభిప్రాయపడుతున్నారు. కరీంనగర్ పీఎంజే జ్యువెల్లరీ షాప్ చోరీ కేసులో సుబోధ్ సింగ్ ప్రమేయానికి సంబంధించిన ఆధారాలను కరీంనగర్ కోర్టులో ప్రవేశపెట్టినట్లయితే, ఈ కేసు ఇతర రాష్ట్రాలకు చెందిన పోలీసులకు ఒక అధ్యయన అంశంగా మారే అవకాశం ఉంది. కరీంనగర్ పోలీసులు సుబోధ్ సింగ్ నేర ప్రవృత్తిని ఎలా గుర్తించారు, సాక్ష్యాలను ఎలా సేకరించారు, దర్యాప్తు ఎలా చేశారనే వివరాలను తెలుసుకోవడానికి ఇతర రాష్ట్రాల పోలీసులు కూడా రంగంలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
- ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా, మహిళా సంక్షేమ వారోత్సవాల కింద సిరిసిల్లలోని జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో నిర్వహించిన మాక్ పార్లమెంట్ చూపరులను విశేషంగా ఆకట్టుకుంది. స్నేహ (సేఫ్టీ, న్యూట్రిషన్, ఎంపవర్ మెంట్ అండ్ హెల్త్ ఫర్ అడో లేస్సెంట్) సంఘాల సభ్యులు ఈ మాక్ పార్లమెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే పాల్గొన్నారు. ఈ మాక్ పార్లమెంట్‌లో స్నేహ సంఘాల విద్యార్థులు అధికార, ప్రతిపక్ష పార్టీ సభ్యులుగా ఏర్పడి, స్పీకర్ సమక్షంలో పలు కీలక అంశాలపై చర్చించారు. బాల్య వివాహాల నిర్మూలన, బాలికల హక్కులు, విద్య, వివిధ సామాజిక అంశాలపై సుదీర్ఘంగా చర్చించి, అందరికీ ఆయా అంశాలపై అవగాహన కల్పించేలా చక్కగా వివరించారు. కార్యక్రమం ప్రారంభంలో జయ జయహే తెలంగాణ పాటను ఆలపించారు. అమ్మకు అక్షరమాల పథకం కింద చదువు నేర్చుకున్న వారిని ఈ సందర్భంగా సన్మానించారు. మాక్ పార్లమెంట్‌లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి నగదు బహుమతితో పాటు షీల్డును అందజేసి అభినందనలు తెలియజేశారు.4
- రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మానకొండూర్ నియోజకవర్గం పరిధిలో గల ఇల్లంతకుంట మండల కేంద్రంలో వీఓఏల (గ్రామ సంఘ సహాయకులు) సమ్మె నేటి శనివారం, 30/05/2026 నాటికి 12వ రోజుకు చేరుకుంది. ఈ సమ్మెలో భాగంగా కేంద్రంలోని వీఓఏలు బతుకమ్మలతో వినూత్నంగా నిరసన తెలిపారు. ఈ నిరసన కార్యక్రమంలో వీఓఏల అధ్యక్షురాలు బాలలక్ష్మి, కార్యదర్శి బంగారు అంజలి, కోశాధికారి మహంకాళి ఉమారాణి పాల్గొన్నారు. వారితో పాటు వివిధ గ్రామాల నుండి రాణి, వినోద, దేవేంద్ర, లావణ్య, స్వప్న, రజిత, రాజశ్రీ, అంజలి, వనిత, జ్యోతి, వజ్రవ్వ, సంధ్య, రేణుక, నిర్మల, ఇందిరా, సంధ్య అరుణ, రాజశ్రీ, అనిత తదితర వీఓఏలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.1
- కరీంనగర్ జిల్లాలో ఎలాంటి అనుమతులు లేకుండా ఇంటర్మీడియట్ అడ్మిషన్లు జరుపుతున్న 'ర్యాంక్ ఫోర్డ్ అకాడమీ'ని తక్షణమే మూసివేయాలని భారత విద్యార్థి ఫెడరేషన్ (SFI) జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. నిబంధనలు ఉల్లంఘిస్తున్న అకాడమీ యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కూడా SFI కోరింది. ఈ మేరకు శనివారం SFI ఆధ్వర్యంలో రేకుర్తిలోని ర్యాంక్ ఫోర్డ్ అకాడమీ ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా SFI జిల్లా కార్యదర్శి గజ్జెల శ్రీకాంత్ మాట్లాడుతూ, అకాడమీల పేరుతో, కనీస ఇంటర్మీడియట్ అనుమతులు లేకుండానే విచ్చలవిడిగా అడ్మిషన్లు చేస్తూ తల్లిదండ్రులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. రకరకాల ఆఫర్ల పేరిట నమ్మించి, ఒక లాడ్జి కింద రూములను అద్దెకు తీసుకుని అడ్మిషన్ల ప్రక్రియ సాగిస్తున్నారని ఆయన ఆరోపించారు. అపార్ట్‌మెంట్లలో ఇలాంటి నకిలీ కళాశాలలు నడుస్తున్నా విద్యాశాఖ అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని శ్రీకాంత్ ప్రశ్నించారు. ఇంటర్మీడియట్ విద్యాధికారి ఇప్పటికైనా స్పందించి, జిల్లాలో అనుమతులు లేని ఇంటర్మీడియట్ కళాశాలలు, అకాడమీల పేర్లను బహిర్గతం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మోసపూరిత అడ్మిషన్లు చేస్తున్న యాజమాన్యాలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని SFI కోరింది. అధికారులు ఇప్పటికీ స్పందించకపోతే, ఈ అకాడమీలపై ఉద్యమాన్ని మరింత ఉద్రిక్తం చేస్తామని SFI హెచ్చరించింది. ఈ కార్యక్రమంలో SFI జిల్లా సహాయ కార్యదర్శి అసంపల్లి వినయ్ సాగర్, జిల్లా కమిటీ సభ్యులు సందేశ్, అక్షయ్, సన్నీ, రాకేష్, ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు.2
- భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్‌ఎఫ్‌ఐ) కరీంనగర్ జిల్లా కమిటీ శనివారం రేకుర్తిలోని 'ర్యాంక్ ఫోర్డ్ అకాడమీ' ముందు ధర్నా నిర్వహించింది. ఎలాంటి అనుమతులు లేకుండా ఇంటర్మీడియట్ అడ్మిషన్లు జరుపుతున్న ఈ అకాడమీని తక్షణమే మూసివేయాలని, నిబంధనలు ఉల్లంఘిస్తున్న యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి గజ్జెల శ్రీకాంత్ మాట్లాడుతూ, అకాడమీల పేరుతో, కనీస ఇంటర్మీడియట్ అనుమతులు లేకుండా విచ్చలవిడిగా అడ్మిషన్లు చేస్తూ తల్లిదండ్రులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. రకరకాల ఆఫర్ల పేరిట నమ్మిస్తూ, ఒక లాడ్జి కింద రూములను అద్దెకు తీసుకుని అడ్మిషన్ల ప్రక్రియ సాగిస్తున్నారని ఆయన వివరించారు. అపార్ట్‌మెంట్లలో ఇలాంటి నకిలీ కళాశాలలు నడుస్తున్నా విద్యాశాఖ అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని శ్రీకాంత్ ప్రశ్నించారు. ఇప్పటికైనా ఇంటర్మీడియట్ విద్యాధికారి స్పందించి, జిల్లాలో అనుమతులు లేని ఇంటర్మీడియట్ కళాశాలలు, అకాడమీల పేర్లను బహిర్గతం చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ డిమాండ్ చేసింది. మోసపూరిత అడ్మిషన్లు చేస్తున్న యాజమాన్యాలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని శ్రీకాంత్ అన్నారు. అధికారులు ఇప్పటికీ స్పందించకపోతే 'అకాడమీల అకాడమీ పైన' ఉద్యమాన్ని మరింత ఉద్రిక్తం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా సహాయ కార్యదర్శి అసంపల్లి వినయ్ సాగర్, జిల్లా కమిటీ సభ్యులు సందేశ్, అక్షయ్, సన్నీ, రాకేష్, ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు.2
- రాజన్న సిరిసిల్ల జిల్లాలోని కోనరావుపేట మండలంలో వివోఏల (విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్) నిరవధిక సమ్మెకు తెలంగాణ రక్షణ సేన (టిఆర్ఎస్) నాయకులు సంఘీభావం తెలిపారు.1
- ఉత్తర తెలంగాణకు నీటి వరప్రదాయిని అయిన కాళేశ్వరం ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం మీనామేషాలు లెక్కించకుండా వెంటనే రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని మాజీ గవర్నర్, బిజెపి సీనియర్ నేత బండారు దత్తాత్రేయ డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో మీడియాతో మాట్లాడిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సాంకేతిక లోపాలను సాకుగా చూపి ప్రాజెక్టును నిరుపయోగంగా మార్చేందుకు కుట్ర జరుగుతోందని దత్తాత్రేయ ఆరోపించారు. లక్ష కోట్ల రూపాయలు వెచ్చించి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు గుర్తింపు బీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందనే భావనతో రేవంత్ సర్కార్ దానిపై సీత కన్నేసిందని ఆయన విమర్శించారు. రెండు ప్రభుత్వాల మధ్య ఉన్న అహం వల్ల రైతులకు నీరు అందక గోస పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిర్మాణం పూర్తయిన ప్రాజెక్టును నిరుపయోగంగా వదిలేస్తే పరిసర ప్రాంతాల పర్యావరణంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అన్నారం, సుందిళ్ల, మేడిగడ్డ ప్రాజెక్టులకు తక్షణమే అవసరమైన మరమ్మతులు చేసి, కాళేశ్వరం ప్రాజెక్టును రైతులకు ఉపయోగకరంగా తీసుకురావాలని దత్తాత్రేయ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలతో పాటు సాగునీటి ప్రాజెక్టులకు నిధులు కేటాయించి రైతులను ఆదుకోవాలని ఆయన సూచించారు. కాంగ్రెస్ రెండున్నరేళ్ళ పాలనలో వ్యవసాయం నీరు లేక వెనకబడిపోయిందని, ఇప్పటికైనా ప్రభుత్వం చొరవ తీసుకొని కాళేశ్వరం ప్రాజెక్టును తాగు, సాగునీటి అవసరాల కోసం అందుబాటులోకి తీసుకురావాలని దత్తాత్రేయ డిమాండ్ చేశారు.1
- శుక్రవారం అర్ధరాత్రి భువనేశ్వర్‌లోని హైవేపై ఒక లారీ బీభత్సం సృష్టించింది. సైడ్ ఇచ్చే విషయంలో తలెత్తిన వివాదంతో ఆగ్రహించిన లారీ డ్రైవర్, ఒక కారును ఢీకొట్టి సుమారు 500 మీటర్ల దూరం ఈడ్చుకెళ్లాడు. పలాసునీ బ్రిడ్జి వద్ద జరిగిన ఈ భయానక ఘటన స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేసింది. ఈ ఘటనలో కారు పూర్తిగా ధ్వంసమైంది. అయితే, కారులో ప్రయాణిస్తున్న తండ్రి, కుమార్తెకు స్వల్ప గాయాలు మాత్రమే కావడంతో, ప్రాణాపాయం తప్పినందుకు అందరూ ఊపిరి పీల్చుకున్నారు. నిందితుడైన లారీ డ్రైవర్‌పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.1