Shuru
Apke Nagar Ki App…
PACS మాజీ చైర్మన్ నగులవంచ వెంకటేశ్వర్లు జన్మదిన వేడుకలో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే వేముల నకిరేకల్ నియోజకవర్గo నకిరేకల్ మండల మాజీ PACS చైర్మన్ నాగులవంచ వెంకటేశ్వర్లు గారి జన్మదినం సందర్భంగా నియోజకవర్గ ఎమ్మెల్యే వేముల వీరేశం గారు వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి స్వీట్ తినిపించి శుభాకాంక్షలు తెలియజేసారు ఆయనతో పాటు స్థానిక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు గౌరవ నకిరేకల్ ఎమ్మెల్యే శ్రీ వేముల వీరేశం గారు
Nagesh Kothapalli
PACS మాజీ చైర్మన్ నగులవంచ వెంకటేశ్వర్లు జన్మదిన వేడుకలో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే వేముల నకిరేకల్ నియోజకవర్గo నకిరేకల్ మండల మాజీ PACS చైర్మన్ నాగులవంచ వెంకటేశ్వర్లు గారి జన్మదినం సందర్భంగా నియోజకవర్గ ఎమ్మెల్యే వేముల వీరేశం గారు వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి స్వీట్ తినిపించి శుభాకాంక్షలు తెలియజేసారు ఆయనతో పాటు స్థానిక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు గౌరవ నకిరేకల్ ఎమ్మెల్యే శ్రీ వేముల వీరేశం గారు
More news from తెలంగాణ and nearby areas
- మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పెద్ద ఎల్లాపురం గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తులు గుండాగాని రాజు అనే రైతుకు చెందిన మొక్కజొన్న చేనులో నిప్పు పెట్టారు. ఈ ఘటన బుధవారం చోటుచేసుకున్నది. బాధిత రైతు తెలిపిన వివరాల ప్రకారం, మొక్కజొన్న కంకి పూర్తిగా కాలిపోగా, సుమారు రూ.2 లక్షల వరకు ఆర్థిక నష్టం నమోదైనట్టు ఆయన తెలిపారు. పోలీసులు ఘటన పై విచారణ చేపట్టారు.1
- మహబూబాబాద్ : రోడ్డు ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యంగా ద్విచక్ర వాహనదారుల్లో హెల్మెట్ వినియోగంపై అవగాహన పెంచేందుకు మహబూబాబాద్ టౌన్ పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. బుధవారం కలెక్టరేట్ ప్రధాన గేట్ వద్ద టౌన్ సీఐ మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో వాహనాలపై విస్తృత తనిఖీలు చేపట్టారు. కలెక్టరేట్‌కు ద్విచక్ర వాహనాలపై వచ్చే వారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలనే నిబంధనను కఠినంగా అమలు చేశారు. హెల్మెట్ లేకుండా వచ్చిన వాహనదారులతో పాటు పోలీసు సిబ్బందిని కూడా గేటు వద్దే ఆపి లోపలికి అనుమతించలేదు.హెల్మెట్ ధరించిన తర్వాత మాత్రమే వారికి కలెక్టరేట్‌లోకి ప్రవేశం కల్పించారు. హెల్మెట్ లేకుండా వచ్చిన కొంత మంది వాహనదారులకు పోలీసులు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు.1
- Post by డాక్టర్ బాబు 70364451131
- గంగారం మండలం: మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పెద్ద ఎల్లాపురం గ్రామంలో ఓ రైతుకు చెందిన చేనులో గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టిన ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో రైతు గుండా గాని రాజుకు చెందిన మొక్కజొన్న పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. గ్రామానికి సమీపంలోని పొలంలో ఉన్న మొక్కజొన్న కంకులు అకస్మాత్తుగా మంటలు చెలరేగి కాలిపోవడంతో స్థానికులు గమనించారు. అనంతరం గ్రామస్థులు వెంటనే స్పందించి మంటలను ఆర్పేందుకు ప్రయత్నించినప్పటికీ అప్పటికే పంటలో కొంత భాగం పూర్తిగా కాలిపోయింది. ఈ ఘటన వల్ల రైతు గుండా గాని రాజుకు ఆర్థికంగా నష్టం వాటిల్లినట్లు తెలిసింది. చేనులో గుర్తు తెలియని వ్యక్తులు కావాలనే నిప్పు పెట్టి ఉండవచ్చని గ్రామస్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై సంబంధిత అధికారులు స్పందించి ఘటనపై దర్యాప్తు చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు. అలాగే నష్టపోయిన రైతుకు ప్రభుత్వం నుంచి తగిన పరిహారం అందించాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.1
- డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో జిల్లా హౌసింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ల వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు.1
- వరంగల్ జిల్లా : ఖానాపురం మండలం చిలకమ్మ నగర్ గ్రామ పంచాయతీ పరిధిలోని గోవిందు తండాలో ప్రమాదం చోటు చేసుకుంది. మంగళవారం గోవిందు తండాలో గుడి పండగ చేసుకున్నారు. ఈ క్రమంలో ఓ ట్రాన్స్ జెండర్ అక్కడికి చేరుకుంది. అత్యుత్సాహంతో పెట్రోల్ తో విన్యాసాలు చేసేందుకు ప్రయత్నం చేసింది. ఈ నేపథ్యంలో అనుకోకుండా చుట్టు ఉన్న జనాల్లో కొందరి మీద పెట్రోల్ పడింది. విన్యాసం మొదలు పెట్టే క్రమంలో మంటలు చెలరేగి ముందు వరుసలో ఉన్న ముంసావత్ దేవేందర్, బోడ పుల్య, దరావత్ బుజ్జి లకు మంటలు అంటున్నాయి. వీరితో పాటుగా చందు, నరేష్, గణేష్ అనే వ్యక్తులకు సైతం మంటలు అంటున్నట్లు తెలుస్తోంది. వెంటనే స్పందించిన స్థానికులు మంటలను ఆర్పడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లు తెలుస్తోంది. గాయపడిన వీరిని నర్సంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వీరిలో ముగ్గురు తీవ్రంగా గాయపడగా.. ఇద్దరు స్వల్పంగా గాయపడినట్టు సమాచారం.3
- గజ్వేల్ సిద్దిపేట జిల్లా మార్చ్ 10 ప్రజా తెలంగాణ న్యూస్ / – 5వ రోజు కార్యాచరణలో భాగంగా 4వ వార్డులో కచ్చానాల తవ్వకం, ప్రభుత్వ ఆసుపత్రి శుభ్రత. – నిబంధనలు అతిక్రమించి కాలువల్లో చెత్త వేసే వారికి నోటీసులు జారీకి కమిషనర్ ఆదేశాలు. తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమం *‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల* కార్యాచరణలో భాగంగా గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో పారిశుద్ధ్య పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి. 5వ రోజు కార్యాచరణలో భాగంగా *మున్సిపల్ ఛైర్‌పర్సన్ శ్రీమతి G. చందన రవీందర్* గారు మరియు *మున్సిపల్ కమిషనర్ శ్రీ R. వెంకట్ గోపాల్* గారు పలు అభివృద్ధి మరియు పారిశుద్ధ్య పనులను స్వయంగా పర్యవేక్షించారు. _*ప్రధాన అంశాలు:*_ * వార్డు నం. 4లో ప్రత్యేక డ్రైవ్: TYR గార్డెన్ వెనుక భాగంలో ప్రజ్ఞాపూర్ నుండి వచ్చే వరద కాలువ పూర్తిగా నిండిపోవడం వల్ల నీరు నిలిచి, అంటువ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందని స్థానికులు ఫిర్యాదు చేశారు. దీనిపై తక్షణమే స్పందించిన పాలకవర్గం, కచ్చానాల (తాత్కాలిక కాలువ) తవ్వించి నీటి నిల్వను తొలగించేలా చర్యలు తీసుకుంది. * నోటీసుల జారీ: కాలువలను పరిశీలించగా, ప్రజలు నేరుగా చెత్తను కాలువల్లో వేయడం వల్ల నీటి ప్రవాహం ఆగిపోతున్నట్లు అధికారులు గుర్తించారు. బాధ్యులైన వారికి తక్షణమే నోటీసులు జారీ చేయాలని కమిషనర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. * *క్రిమిసంహారకాల పిచికారీ:* మురికి కాలువల్లో దోమల నివారణకు దోమల మందు పిచికారీ మరియు బ్లీచింగ్ పౌడర్ చల్లించడం జరిగింది. * *ప్రభుత్వ ఆసుపత్రి శుభ్రత:* ప్రజా ప్రదేశాల శుభ్రతలో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో పచ్చదనం-పరిశుభ్రత కార్యక్రమం చేపట్టారు. అక్కడ ఉన్న UGD సమస్యను పరిష్కరించి, ఆవరణలో పెరిగిన పిచ్చి మొక్కలను, పొదలను తొలగించి ప్రాంగణమంతా క్రిమిసంహారక మందులు చల్లించారు. ఈ కార్యక్రమంలో స్థానిక 4వ వార్డు కౌన్సిలర్ రొట్టెల శ్రీనివాస్, 3వ వార్డు కాముని మురళి గారు, 6వ వార్డు బొగ్గుల స్వప్న గారు, 13వ వార్డు భాగ్యలక్ష్మి గారు, ఇతర ప్రజా ప్రతినిధులు, మున్సిపల్ అధికారులు, మెప్మా RPలు, SHG మహిళా సంఘాల సభ్యులు మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. *కమిషనర్,* గజ్వేల్–ప్రజ్ఞాపూర్ పురపాలక సంఘం.4
- జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం జడలపేట గ్రామంలో నకిలీ వైద్యుడు నడిపిస్తున్న క్లినిక్‌పై తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు దాడి చేశారు. దాడిలో యాంటీబయోటిక్స్, స్టెరాయిడ్స్ సహా సుమారు 50 రకాల మందులు స్వాధీనం చేసుకోబడ్డాయి, వీటి విలువ సుమారు ₹45,000. అర్హతలేని వ్యక్తులు యాంటీబయోటిక్స్ మరియు స్టెరాయిడ్స్ విక్రయించడం ప్రజారోగ్యానికి ప్రమాదకరమని అధికారులు హెచ్చరించారు. కేసుపై మరింత దర్యాప్తు కొనసాగుతోంది.1