logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ములుగు జిల్లా కన్నాయిగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలో 2023లో నమోదైన క్రైం నెం. 04/2023, భారతీయ శిక్షా స్మృతి మరియు పోక్సో చట్టం కింద ఒక బాలికపై జరిగిన లైంగిక దాడి కేసులో ములుగు ప్రత్యేక పోక్సో కోర్టు కఠిన తీర్పును వెలువరించింది. కన్నాయిగూడెం గ్రామానికి చెందిన కొరగట్ల సత్యనారాయణ (45) అనే నిందితుడిని ప్రత్యేక పోక్సో కోర్టు న్యాయమూర్తి ఎస్.వి.పి. సూర్య చంద్ర కళ దోషిగా నిర్ధారించి, అతనికి 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ. 6,000 జరిమానా విధించారు. అదేవిధంగా, బాధితురాలికి రూ. 10 లక్షల పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది. ఈ కేసు దర్యాప్తులో అప్పటి ఎస్ఐ ఎం. సురేష్ మొదట ఎఫ్ఐఆర్ నమోదు చేయగా, తదుపరి దర్యాప్తు అధికారులు సీఐ కె. శివప్రసాద్ మరియు సీఐ ఎం. రాజు కీలక పాత్ర పోషించారు. కోర్టులో కేసును సమర్థవంతంగా నడిపించడంలో కోర్టు మానిటరింగ్ ఆఫీసర్ డీఎస్పీ కిషోర్, కోర్టు లైజనింగ్ ఆఫీసర్ ఎస్ఐ నాగరాజు, సీడీఓ సిబ్బంది కానిస్టేబుల్ కె. మౌనిక, పీసీ జె. మంగీలాల్ విశేష కృషి చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ కేకాన్ సుధీర్ రామనాథ్ మాట్లాడుతూ, దర్యాప్తు అధికారులు, కోర్టు మానిటరింగ్ ఆఫీసర్, కోర్టు లైజనింగ్ ఆఫీసర్, స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ మరియు కేసు విజయవంతమైన తీర్పుకు సహకరించిన పోలీసు సిబ్బందిని అభినందించారు. మహిళలు, చిన్నారులపై జరిగే నేరాల పట్ల ములుగు జిల్లా పోలీసులు అత్యంత కఠినంగా వ్యవహరిస్తారని, బాధితులకు న్యాయం జరిగేలా ప్రతి కేసును సమగ్రంగా ఇన్వెస్టిగేషన్ చేసి నిందితులకు శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని ఎస్పీ స్పష్టం చేశారు.

3 hrs ago
user_Chunchu Ramesh
Chunchu Ramesh
Insurance Agent ములుగు, ములుగు, తెలంగాణ•
3 hrs ago

ములుగు జిల్లా కన్నాయిగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలో 2023లో నమోదైన క్రైం నెం. 04/2023, భారతీయ శిక్షా స్మృతి మరియు పోక్సో చట్టం కింద ఒక బాలికపై జరిగిన లైంగిక దాడి కేసులో ములుగు ప్రత్యేక పోక్సో కోర్టు కఠిన తీర్పును వెలువరించింది. కన్నాయిగూడెం గ్రామానికి చెందిన కొరగట్ల సత్యనారాయణ (45) అనే నిందితుడిని ప్రత్యేక పోక్సో కోర్టు న్యాయమూర్తి ఎస్.వి.పి. సూర్య చంద్ర కళ దోషిగా నిర్ధారించి, అతనికి 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ. 6,000 జరిమానా విధించారు. అదేవిధంగా, బాధితురాలికి రూ. 10 లక్షల పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది. ఈ కేసు దర్యాప్తులో అప్పటి ఎస్ఐ ఎం. సురేష్ మొదట ఎఫ్ఐఆర్ నమోదు చేయగా, తదుపరి దర్యాప్తు అధికారులు సీఐ కె. శివప్రసాద్ మరియు సీఐ ఎం. రాజు కీలక పాత్ర పోషించారు. కోర్టులో కేసును సమర్థవంతంగా నడిపించడంలో కోర్టు మానిటరింగ్ ఆఫీసర్ డీఎస్పీ కిషోర్, కోర్టు లైజనింగ్ ఆఫీసర్ ఎస్ఐ నాగరాజు, సీడీఓ సిబ్బంది కానిస్టేబుల్ కె. మౌనిక, పీసీ జె. మంగీలాల్ విశేష కృషి చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ కేకాన్ సుధీర్ రామనాథ్ మాట్లాడుతూ, దర్యాప్తు అధికారులు, కోర్టు మానిటరింగ్ ఆఫీసర్, కోర్టు లైజనింగ్ ఆఫీసర్, స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ మరియు కేసు విజయవంతమైన తీర్పుకు సహకరించిన పోలీసు సిబ్బందిని అభినందించారు. మహిళలు, చిన్నారులపై జరిగే నేరాల పట్ల ములుగు జిల్లా పోలీసులు అత్యంత కఠినంగా వ్యవహరిస్తారని, బాధితులకు న్యాయం జరిగేలా ప్రతి కేసును సమగ్రంగా ఇన్వెస్టిగేషన్ చేసి నిందితులకు శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని ఎస్పీ స్పష్టం చేశారు.

More news from తెలంగాణ and nearby areas
  • వరంగల్ జిల్లాలోని నెక్కొండ మండలం గుండ్రపల్లి గ్రామంలో అంతర్జాతీయ హరిత మిత్ర అవార్డు గ్రహీత, వన ప్రేమికుడు నల్లగొండ సమ్మయ్య ఆధ్వర్యంలో వన మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్దమ్మ తల్లి దేవాలయం వద్ద చెరువు కట్టకు ఇరువైపులా ముందు తరాలకు ఉపయోగపడే విధంగా మర్రి, రావి, జువ్వి, వేప, కానుగ, వెదురు, చీమ చింత, అల్ల నేరేడు వంటి 50 మొక్కలను నాటారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన నెక్కొండ మండల కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు తాడిపర్తి నాగేంద్రమ్మ మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణ కోసం నిరంతరం మొక్కలు నాటి, చెట్లను పెంచుతున్న నల్లగొండ సమ్మయ్య సేవలు ముందు తరాలకు గొప్ప వరమని కొనియాడారు. ఈ వన మహోత్సవంలో మాజీ వార్డు సభ్యులు పడిగపాటి శివ, పార్వతి, లాక లక్ష్మి, కళ్లెం జయమ్మ, కొల్లూరి ఉప్పలమ్మ, నాలం భాగ్యమ్మ తదితరులు పాల్గొన్నారు.
    2
    వరంగల్ జిల్లాలోని నెక్కొండ మండలం గుండ్రపల్లి గ్రామంలో అంతర్జాతీయ హరిత మిత్ర అవార్డు గ్రహీత, వన ప్రేమికుడు నల్లగొండ సమ్మయ్య ఆధ్వర్యంలో వన మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్దమ్మ తల్లి దేవాలయం వద్ద చెరువు కట్టకు ఇరువైపులా ముందు తరాలకు ఉపయోగపడే విధంగా మర్రి, రావి, జువ్వి, వేప, కానుగ, వెదురు, చీమ చింత, అల్ల నేరేడు వంటి 50 మొక్కలను నాటారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన నెక్కొండ మండల కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు తాడిపర్తి నాగేంద్రమ్మ మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణ కోసం నిరంతరం మొక్కలు నాటి, చెట్లను పెంచుతున్న నల్లగొండ సమ్మయ్య సేవలు ముందు తరాలకు గొప్ప వరమని కొనియాడారు. ఈ వన మహోత్సవంలో మాజీ వార్డు సభ్యులు పడిగపాటి శివ, పార్వతి, లాక లక్ష్మి, కళ్లెం జయమ్మ, కొల్లూరి ఉప్పలమ్మ, నాలం భాగ్యమ్మ తదితరులు పాల్గొన్నారు.
    user_Chetty:Ramesh
    Chetty:Ramesh
    నర్సంపేట, వరంగల్, తెలంగాణ•
    4 hrs ago
  • వీణవంక మండలం లస్మక్కపల్లి గ్రామంలో గతంలో మూసివేయబడిన ప్రాథమిక పాఠశాలను సోమవారం రోజు గ్రామ సర్పంచ్ గెల్లు శ్రీనివాస్ మరియు మండల విద్యాధికారి శోభారాణి పునఃప్రారంభించారు. విద్యార్థులతో పాఠశాల ప్రాంగణం పండుగ వాతావరణంతో నిండిపోయింది. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ గెల్లు శ్రీనివాస్ మాట్లాడుతూ, తమ గ్రామానికి ఇతర చోట్లకు వెళ్లడానికి రవాణా సౌకర్యం లేదని, ఉన్న ఊరిలోనే పాఠశాలను తిరిగి ప్రారంభించాలని కోరుతూ జిల్లా విద్యాధికారిని కలిసినట్లు తెలిపారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రోత్సాహంతో, నియోజకవర్గ ఇన్ చార్జ్ వొడితల ప్రణవ్ చొరవతో ఈ పాఠశాలను ప్రారంభించుకున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎక్కటి రఘుపాల్ రెడ్డి, సాహెబ్ హుస్సేన్, వార్డు మెంబర్లు, గ్రామస్తులు మరియు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
    1
    వీణవంక మండలం లస్మక్కపల్లి గ్రామంలో గతంలో మూసివేయబడిన ప్రాథమిక పాఠశాలను సోమవారం రోజు గ్రామ సర్పంచ్ గెల్లు శ్రీనివాస్ మరియు మండల విద్యాధికారి శోభారాణి పునఃప్రారంభించారు. విద్యార్థులతో పాఠశాల ప్రాంగణం పండుగ వాతావరణంతో నిండిపోయింది.

ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ గెల్లు శ్రీనివాస్ మాట్లాడుతూ, తమ గ్రామానికి ఇతర చోట్లకు వెళ్లడానికి రవాణా సౌకర్యం లేదని, ఉన్న ఊరిలోనే పాఠశాలను తిరిగి ప్రారంభించాలని కోరుతూ జిల్లా విద్యాధికారిని కలిసినట్లు తెలిపారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రోత్సాహంతో, నియోజకవర్గ ఇన్ చార్జ్ వొడితల ప్రణవ్ చొరవతో ఈ పాఠశాలను ప్రారంభించుకున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎక్కటి రఘుపాల్ రెడ్డి, సాహెబ్ హుస్సేన్, వార్డు మెంబర్లు, గ్రామస్తులు మరియు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
    user_T. sridhar✍️
    T. sridhar✍️
    వీణవంక, కరీంనగర్, తెలంగాణ•
    5 hrs ago
  • వరంగల్ శివనగర్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ ఇంటి సంపులో పెయింటింగ్ పనులు చేస్తుండగా, కెమికల్ రియాక్షన్ కారణంగా పెయింటర్ రాము స్పృహ తప్పి పడిపోయాడు. అతడిని కాపాడేందుకు ప్రయత్నించిన ఇంటి యజమాని రమేష్ మరియు ఆయన కుమారుడు దినేష్ కూడా స్పృహ కోల్పోయారు. ఈ ఘటనలో రమేష్ ఊపిరాడక మృతి చెందగా, 108 సిబ్బంది రాము మరియు దినేష్‌ను సంపులో నుండి బయటకు తీశారు. వారిని వెంటనే ఎంజీఎం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
    1
    వరంగల్ శివనగర్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ ఇంటి సంపులో పెయింటింగ్ పనులు చేస్తుండగా, కెమికల్ రియాక్షన్ కారణంగా పెయింటర్ రాము స్పృహ తప్పి పడిపోయాడు. అతడిని కాపాడేందుకు ప్రయత్నించిన ఇంటి యజమాని రమేష్ మరియు ఆయన కుమారుడు దినేష్ కూడా స్పృహ కోల్పోయారు.

ఈ ఘటనలో రమేష్ ఊపిరాడక మృతి చెందగా, 108 సిబ్బంది రాము మరియు దినేష్‌ను సంపులో నుండి బయటకు తీశారు. వారిని వెంటనే ఎంజీఎం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    2 hrs ago
  • మహబూబాబాద్ ఎమ్మెల్యే బుక్యా మురళినాయక్ గారు తన ఈ-కేవైసీ (e-KYC) ప్రక్రియను పూర్తి చేసుకునేందుకు మహబూబాబాద్ గ్యాస్ ఏజెన్సీని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాల ప్రకారం ప్రతి ఎల్పీజీ (LPG) వినియోగదారుడు తప్పనిసరిగా ఈ-కేవైసీ పూర్తి చేసుకోవాలని సూచించారు. ఈ ప్రక్రియను పూర్తి చేయడం ద్వారా వినియోగదారులు గ్యాస్ సబ్సిడీతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలను ఎలాంటి ఇబ్బందులు లేకుండా పొందగలరని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. అందువల్ల, మహబూబాబాద్ జిల్లాలోని ఎల్పీజీ వినియోగదారులందరూ తమ సమీప గ్యాస్ ఏజెన్సీని లేదా గ్యాస్ డెలివరీ చేసే డెలివరీ బాయ్‌ను సంప్రదించి వీలైనంత త్వరగా ఈ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని ఆయన కోరారు. అలాగే, హెచ్‌పీ పే (HP Pay) మొబైల్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని ఇంటి వద్ద నుంచే సులభంగా ఈ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చని కూడా ఆయన సూచించారు.
    1
    మహబూబాబాద్ ఎమ్మెల్యే బుక్యా మురళినాయక్ గారు తన ఈ-కేవైసీ (e-KYC) ప్రక్రియను పూర్తి చేసుకునేందుకు మహబూబాబాద్ గ్యాస్ ఏజెన్సీని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాల ప్రకారం ప్రతి ఎల్పీజీ (LPG) వినియోగదారుడు తప్పనిసరిగా ఈ-కేవైసీ పూర్తి చేసుకోవాలని సూచించారు. ఈ ప్రక్రియను పూర్తి చేయడం ద్వారా వినియోగదారులు గ్యాస్ సబ్సిడీతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలను ఎలాంటి ఇబ్బందులు లేకుండా పొందగలరని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

అందువల్ల, మహబూబాబాద్ జిల్లాలోని ఎల్పీజీ వినియోగదారులందరూ తమ సమీప గ్యాస్ ఏజెన్సీని లేదా గ్యాస్ డెలివరీ చేసే డెలివరీ బాయ్‌ను సంప్రదించి వీలైనంత త్వరగా ఈ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని ఆయన కోరారు. అలాగే, హెచ్‌పీ పే (HP Pay) మొబైల్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని ఇంటి వద్ద నుంచే సులభంగా ఈ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చని కూడా ఆయన సూచించారు.
    user_Mogulagani Mahendar Mogulagani Mahendar
    Mogulagani Mahendar Mogulagani Mahendar
    మహబూబాబాద్, మహబూబాబాద్, తెలంగాణ•
    4 hrs ago
  • రాజన్న సిరిసిల్ల జిల్లాలో ధాన్యం కుంభకోణంపై గతంలో వెల్లువెత్తిన ప్రశ్నలు నేడు నిజమయ్యాయి, భారీ కుంభకోణం బట్టబయలైంది. ఈ కుంభకోణంలో కేవలం కొందరు వ్యక్తులపై చర్యలు తీసుకుని చేతులు దులుపుకోవడం సరికాదని, దీని వెనుక ఉన్న మొత్తం వ్యవస్థను వెలికితీయాలని డిమాండ్ చేస్తున్నారు. పెద్ద అధికారులు, రైస్ మిల్లర్లు, సెంటర్ ఇంచార్జిల పాత్రపై కూడా సమగ్ర విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. దొరికిన దొంగలు కొంతమందేనని, ఇంకా దొరకాల్సిన 'తిమింగలాలు' చాలానే ఉన్నాయని పేర్కొన్నారు.
    1
    రాజన్న సిరిసిల్ల జిల్లాలో ధాన్యం కుంభకోణంపై గతంలో వెల్లువెత్తిన ప్రశ్నలు నేడు నిజమయ్యాయి, భారీ కుంభకోణం బట్టబయలైంది. ఈ కుంభకోణంలో కేవలం కొందరు వ్యక్తులపై చర్యలు తీసుకుని చేతులు దులుపుకోవడం సరికాదని, దీని వెనుక ఉన్న మొత్తం వ్యవస్థను వెలికితీయాలని డిమాండ్ చేస్తున్నారు.

పెద్ద అధికారులు, రైస్ మిల్లర్లు, సెంటర్ ఇంచార్జిల పాత్రపై కూడా సమగ్ర విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. దొరికిన దొంగలు కొంతమందేనని, ఇంకా దొరకాల్సిన 'తిమింగలాలు' చాలానే ఉన్నాయని పేర్కొన్నారు.
    user_Bollam Saireddy జయం న్యూస్ మీడ
    Bollam Saireddy జయం న్యూస్ మీడ
    Interior designer Manakondur, Karimnagar•
    13 hrs ago
  • హనుమకొండ జిల్లాలోని మడికొండలో జరిగిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పార్టీ కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని తీవ్రంగా హెచ్చరించారు. ఎవరైనా సరే, వారు పదవీ విరమణ చేసినా లేదా ఎక్కడికి వెళ్లినా, వారిని తిరిగి తీసుకొచ్చి సమాధానం చెప్పించే బాధ్యత తనదేనని కేటీఆర్ స్పష్టం చేశారు. కష్టపడి పనిచేసే కార్యకర్తలే భవిష్యత్తులో జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ముఖ్య నాయకులుగా ఎదగాలని కేటీఆర్ సూచించారు. పార్టీ ఓటమి తర్వాత ఎవరు నిజమైనవారు, ఎవరు కాదో స్పష్టంగా తెలిసిందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.
    1
    హనుమకొండ జిల్లాలోని మడికొండలో జరిగిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పార్టీ కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని తీవ్రంగా హెచ్చరించారు. ఎవరైనా సరే, వారు పదవీ విరమణ చేసినా లేదా ఎక్కడికి వెళ్లినా, వారిని తిరిగి తీసుకొచ్చి సమాధానం చెప్పించే బాధ్యత తనదేనని కేటీఆర్ స్పష్టం చేశారు.

కష్టపడి పనిచేసే కార్యకర్తలే భవిష్యత్తులో జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ముఖ్య నాయకులుగా ఎదగాలని కేటీఆర్ సూచించారు. పార్టీ ఓటమి తర్వాత ఎవరు నిజమైనవారు, ఎవరు కాదో స్పష్టంగా తెలిసిందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    5 hrs ago
  • కరీంనగర్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో, ముఖ్యంగా శంకరపట్నం మండలంలోని మొలంగూర్, కొత్తగట్టు, గొల్లపల్లి గ్రామాల్లో మధ్యాహ్నం అరగంట పాటు కుండపోత వర్షం కురిసింది. ఈ జోరు వాన కారణంగా కొత్తగట్టు గ్రామంలో అనేక ఇళ్లలోకి వరద నీరు చేరి ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలిగింది. కొత్తగట్టు గ్రామ పంచాయతీ కార్యాలయం కూడా వర్షపు నీటితో నిండిపోయింది. ఇటీవల పూర్తిచేసిన కరీంనగర్-వరంగల్ జాతీయ రహదారి పనుల వల్ల గ్రామ పంచాయతీ కార్యాలయ భవనం రహదారికి కిందికి ఉండడమే ఇందుకు కారణం. దీంతో వర్షపు నీరు నేరుగా కార్యాలయంలోకి ప్రవేశించి సిబ్బందికి తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. అయితే, ఈ వర్షాకాలంలో శంకరపట్నం మండలంలో ఇదే తొలి భారీ వర్షం కావడంతో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేశారు.
    1
    కరీంనగర్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో, ముఖ్యంగా శంకరపట్నం మండలంలోని మొలంగూర్, కొత్తగట్టు, గొల్లపల్లి గ్రామాల్లో మధ్యాహ్నం అరగంట పాటు కుండపోత వర్షం కురిసింది. ఈ జోరు వాన కారణంగా కొత్తగట్టు గ్రామంలో అనేక ఇళ్లలోకి వరద నీరు చేరి ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలిగింది.

కొత్తగట్టు గ్రామ పంచాయతీ కార్యాలయం కూడా వర్షపు నీటితో నిండిపోయింది. ఇటీవల పూర్తిచేసిన కరీంనగర్-వరంగల్ జాతీయ రహదారి పనుల వల్ల గ్రామ పంచాయతీ కార్యాలయ భవనం రహదారికి కిందికి ఉండడమే ఇందుకు కారణం. దీంతో వర్షపు నీరు నేరుగా కార్యాలయంలోకి ప్రవేశించి సిబ్బందికి తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి.

అయితే, ఈ వర్షాకాలంలో శంకరపట్నం మండలంలో ఇదే తొలి భారీ వర్షం కావడంతో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేశారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    3 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.