logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

లక్కవరపుకోట కేజీబీవీ పాఠశాలను పరిశీలించిన ఎమ్మెల్సీ ఇందుకూరి రఘు రాజు విజయనగరం జిల్లా లక్కవరపుకోట మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాన్ని విజయనగరం స్థానిక సంస్థల శాసనమండలి సభ్యులు ఇందుకూరి రఘురాజు శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని పలు విభాగాలను తనిఖీ చేసిన ఆయన, విద్యార్థినుల విద్యా ప్రమాణాలు, వసతులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థినులను ఉద్దేశించి ఎమ్మెల్సీ మాట్లాడుతూ, విద్యావ్యవస్థ బలోపేతమైతేనే సుదృఢమైన సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని ఉద్ఘాటించారు. విద్య అనేది కేవలం అక్షరాస్యతకే పరిమితం కాకూడదని, ఉద్యోగ, ఉపాధి అవకాశాలను పెంపొందించేలా ఉండాలని స్పష్టం చేశారు. విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమైనదని, వారిలో ప్రాక్టికల్ పరిజ్ఞానాన్ని పెంపొందించే దిశగా బోధన సాగాలని ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. ​పాఠశాల విద్యార్థినులలో మానసిక ఒత్తిడిని తగ్గించి, ఏకాగ్రతను పెంచేందుకు యోగా, ధ్యానం లను దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ​విద్యార్థులలో పరిశీలనా శక్తి, ఏకాగ్రత స్థాయిలను అంచనా వేసేందుకు ఆయన వారితో స్వయంగా కొన్ని మానసిక వికాస వ్యాయామాలు చేయించారు. అంకెలను వెనుక నుండి క్రమబద్ధంగా చెప్పడం వంటి సరళమైన పద్ధతుల ద్వారా జ్ఞాపకశక్తిని, దృష్టిని ఏ విధంగా కేంద్రీకరించవచ్చో ప్రత్యక్షంగా వివరించారు. ​ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది, విద్యార్థినులు పాల్గొన్నారు.

10 hrs ago
user_ARIGI SATYARAO
ARIGI SATYARAO
Local News Reporter గంట్యాడ, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
10 hrs ago

లక్కవరపుకోట కేజీబీవీ పాఠశాలను పరిశీలించిన ఎమ్మెల్సీ ఇందుకూరి రఘు రాజు విజయనగరం జిల్లా లక్కవరపుకోట మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాన్ని విజయనగరం స్థానిక సంస్థల శాసనమండలి సభ్యులు ఇందుకూరి రఘురాజు శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని పలు విభాగాలను తనిఖీ చేసిన ఆయన, విద్యార్థినుల విద్యా ప్రమాణాలు, వసతులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థినులను ఉద్దేశించి ఎమ్మెల్సీ మాట్లాడుతూ, విద్యావ్యవస్థ

cec6d494-2b19-4e3e-89fc-c8e12cf59a94

బలోపేతమైతేనే సుదృఢమైన సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని ఉద్ఘాటించారు. విద్య అనేది కేవలం అక్షరాస్యతకే పరిమితం కాకూడదని, ఉద్యోగ, ఉపాధి అవకాశాలను పెంపొందించేలా ఉండాలని స్పష్టం చేశారు. విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమైనదని, వారిలో ప్రాక్టికల్ పరిజ్ఞానాన్ని పెంపొందించే దిశగా బోధన సాగాలని ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. ​పాఠశాల విద్యార్థినులలో మానసిక ఒత్తిడిని తగ్గించి, ఏకాగ్రతను పెంచేందుకు యోగా, ధ్యానం

d4b88ad5-4f56-4d31-9ccf-6ba979d91425

లను దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ​విద్యార్థులలో పరిశీలనా శక్తి, ఏకాగ్రత స్థాయిలను అంచనా వేసేందుకు ఆయన వారితో స్వయంగా కొన్ని మానసిక వికాస వ్యాయామాలు చేయించారు. అంకెలను వెనుక నుండి క్రమబద్ధంగా చెప్పడం వంటి సరళమైన పద్ధతుల ద్వారా జ్ఞాపకశక్తిని, దృష్టిని ఏ విధంగా కేంద్రీకరించవచ్చో ప్రత్యక్షంగా వివరించారు. ​ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది, విద్యార్థినులు పాల్గొన్నారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • కృష్ణవరం పోలవరం కాల్వ పనులు పరిశీలించిన మంత్రి నిమ్మల.. వెంట ఎమ్మెల్యే నెహ్రూ కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం కృష్ణవరం వద్ద పోలవరం ఎడమ కాల్వలో జరుగుతున్న పనులను రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభతో కలిసి పరిశీలించారు. అనంతరం పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం రెండో దశ పంపింగ్ స్టేషన్‌ను సందర్శించారు. తొండంగి మండలం బెండపూడి వద్ద ఎన్‌హెచ్ క్రాసింగ్ వంతెన నిర్మాణ పనులను కూడా పరిశీలించారు. అధికారులకు పనులు వేగవంతంగా, నాణ్యతతో పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు.
    1
    కృష్ణవరం పోలవరం కాల్వ పనులు పరిశీలించిన మంత్రి నిమ్మల.. వెంట ఎమ్మెల్యే నెహ్రూ
కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం కృష్ణవరం వద్ద పోలవరం ఎడమ కాల్వలో జరుగుతున్న పనులను రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభతో కలిసి పరిశీలించారు. అనంతరం పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం రెండో దశ పంపింగ్ స్టేషన్‌ను సందర్శించారు. తొండంగి మండలం బెండపూడి వద్ద ఎన్‌హెచ్ క్రాసింగ్ వంతెన నిర్మాణ పనులను కూడా పరిశీలించారు. అధికారులకు పనులు వేగవంతంగా, నాణ్యతతో పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు.
    user_SAI DURGA
    SAI DURGA
    Local News Reporter కిర్లంపూడి, కాకినాడ, ఆంధ్రప్రదేశ్•
    12 hrs ago
  • డీఎస్సీపై లోకేష్ విసిరిన సవాల్‌కు సమాధానం చెప్పలేక జగన్ బెంగళూరుకు వెళ్లారు – ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి వ్యాఖ్యలు ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి మీడియా సమావేశంలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై విమర్శలు చేశారు. డీఎస్సీ అంశంపై మంత్రి నారా లోకేష్ విసిరిన సవాల్‌కు సమాధానం చెప్పలేక జగన్ బెంగళూరుకు వెళ్లారని ఆయన వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో డీఎస్సీ నిర్వహణ, విద్యా రంగానికి సంబంధించిన పలు అంశాలపై మాట్లాడిన ఆయన, ప్రభుత్వ చర్యలను వివరించారు. అలాగే ప్రతిపక్షం చేస్తున్న విమర్శలకు సమాధానం ఇస్తూ పలు రాజకీయ అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు. ఈ మీడియా సమావేశం అమరావతిలోని ఎన్టీఆర్ భవన్‌లో నిర్వహించబడగా, అక్కడి నుంచి ప్రత్యక్ష ప్రసారం చేశారు.
    1
    డీఎస్సీపై లోకేష్ విసిరిన సవాల్‌కు సమాధానం చెప్పలేక జగన్ బెంగళూరుకు వెళ్లారు – ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి వ్యాఖ్యలు
ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి మీడియా సమావేశంలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై విమర్శలు చేశారు. డీఎస్సీ అంశంపై మంత్రి నారా లోకేష్ విసిరిన సవాల్‌కు సమాధానం చెప్పలేక జగన్ బెంగళూరుకు వెళ్లారని ఆయన వ్యాఖ్యానించారు.
ఈ సందర్భంగా రాష్ట్రంలో డీఎస్సీ నిర్వహణ, విద్యా రంగానికి సంబంధించిన పలు అంశాలపై మాట్లాడిన ఆయన, ప్రభుత్వ చర్యలను వివరించారు. అలాగే ప్రతిపక్షం చేస్తున్న విమర్శలకు సమాధానం ఇస్తూ పలు రాజకీయ అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు.
ఈ మీడియా సమావేశం అమరావతిలోని ఎన్టీఆర్ భవన్‌లో నిర్వహించబడగా, అక్కడి నుంచి ప్రత్యక్ష ప్రసారం చేశారు.
    user_Apsv9 News channel
    Apsv9 News channel
    Media company Yeleswaram, Kakinada•
    15 hrs ago
  • ఆగస్టు 2న మూలారెడ్డి వర్ధంతి కార్యక్రమాలు :ఎమ్మెల్యే నల్లమిల్లి దివంగత మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి మూలారెడ్డి వర్ధంతి సందర్భంగా ఆగస్టు 2న బలభద్రపురంలో స్మారక పురస్కారాల సభ, ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి తెలిపారు. ముఖ్య అతిథిగా ఉమ్మడి ఏపీ మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి హాజరవుతారని, సత్యవాణి, డాక్టర్ రామచంద్రరెడ్డిలకు పురస్కారాలు అందజేస్తామన్నారు.పసలపూడిలో మూలారెడ్డి విగ్రహావిష్కరణ జరుగుతుందని,కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
    1
    ఆగస్టు 2న మూలారెడ్డి వర్ధంతి కార్యక్రమాలు :ఎమ్మెల్యే నల్లమిల్లి 
దివంగత మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి మూలారెడ్డి వర్ధంతి సందర్భంగా ఆగస్టు 2న బలభద్రపురంలో స్మారక పురస్కారాల సభ, ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి తెలిపారు. ముఖ్య అతిథిగా ఉమ్మడి ఏపీ మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి హాజరవుతారని, సత్యవాణి, డాక్టర్ రామచంద్రరెడ్డిలకు పురస్కారాలు అందజేస్తామన్నారు.పసలపూడిలో మూలారెడ్డి విగ్రహావిష్కరణ జరుగుతుందని,కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
    user_DEVENDRA
    DEVENDRA
    Journalist అనపర్తి, తూర్పు గోదావరి, ఆంధ్రప్రదేశ్•
    8 hrs ago
  • పెద్ది సుదర్శన్ రెడ్డి గారి అంతిమ యాత్రలో పాల్గొనేందుకు, ఆయన స్వగ్రామం నల్లబెల్లికి చేరుకున్నాం. పెద్ది సుదర్శన్ రెడ్డి గారి అంతిమ యాత్రలో పాల్గొనేందుకు, ఆయన స్వగ్రామం నల్లబెల్లికి చేరుకున్నాం.
    1
    పెద్ది సుదర్శన్ రెడ్డి గారి అంతిమ యాత్రలో పాల్గొనేందుకు, 
ఆయన స్వగ్రామం నల్లబెల్లికి చేరుకున్నాం.
పెద్ది సుదర్శన్ రెడ్డి గారి అంతిమ యాత్రలో పాల్గొనేందుకు, 
ఆయన స్వగ్రామం నల్లబెల్లికి చేరుకున్నాం.
    user_Degala samson
    Degala samson
    Chef మణుగూరు, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    7 hrs ago
  • పెద్ది సుదర్శన్ రెడ్డి అంత్యక్రియల్లో కన్నీళ్లు పెట్టుకున్న మాజీ మంత్రి హరీష్ రావు * వరంగల్ జిల్లా మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, అంతిమయాత్రలో మాజీ మంత్రి హరీశ్‌ రావు కన్నీళ్లు పెట్టు కున్నారు. బీఆర్‌ఎస్‌ నాయకుల తో కలిసి అంతిమ యాత్రలో పాల్గొన్న ఆయన ఆప్త మిత్రుడితో ఉన్న అనుంబంధాన్ని గుర్తు చేసుకొని భావోద్వేగా నికి లోనై కన్నీటి పర్యంతమయ్యారు. కాగా, సుదర్శన్ రెడ్డికి తుది వీడ్కోలు పలికేందుకు వేలాది గా ప్రజలు నర్సంపేట కు తరలివచ్చారు. అభిమాన నాయకు డిని చివరిసారిగా చూసేందుకు జనం పోటెత్తడంతో పట్టణ మంతా జనసంద్రంగా మారింది. పెద్ది అంతిమయాత్ర సందర్భంగా ప్రధాన రహదారులపై సుమా రు రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించ గా, ఎటు చూసినా పెద్ది అభిమానులే కనిపించారు.పెద్ది సుదర్శన్ రెడ్డి పార్థివ దేహం వరంగల్‌ జిల్లాలోని నర్సంపేట కు చేరుకున్నప్పటి నుంచి పట్టణంలోని వీధులు జనంతో కిక్కిరిసిపోయాయి. చిన్నా,పెద్దా తేడా లేకుండా అన్ని వర్గాల ప్రజలు తమ అభిమాన నాయకు డికి చివరి వీడ్కోలు పలికేందుకు బారులు తీరారు.అభిమానుల రద్దీతో నర్సంపేట ప్రధాన రహదారులపై సుమారు రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్
    1
    పెద్ది సుదర్శన్ రెడ్డి అంత్యక్రియల్లో కన్నీళ్లు పెట్టుకున్న మాజీ మంత్రి హరీష్ రావు
*
వరంగల్ జిల్లా
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, అంతిమయాత్రలో మాజీ మంత్రి హరీశ్‌ రావు కన్నీళ్లు పెట్టు కున్నారు. బీఆర్‌ఎస్‌ నాయకుల తో కలిసి అంతిమ యాత్రలో పాల్గొన్న ఆయన ఆప్త మిత్రుడితో ఉన్న అనుంబంధాన్ని గుర్తు చేసుకొని భావోద్వేగా నికి లోనై కన్నీటి పర్యంతమయ్యారు. 
కాగా, సుదర్శన్ రెడ్డికి తుది వీడ్కోలు పలికేందుకు వేలాది గా ప్రజలు నర్సంపేట కు తరలివచ్చారు. అభిమాన నాయకు డిని చివరిసారిగా చూసేందుకు జనం పోటెత్తడంతో పట్టణ మంతా జనసంద్రంగా మారింది. 
పెద్ది అంతిమయాత్ర సందర్భంగా ప్రధాన రహదారులపై సుమా రు రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించ గా, ఎటు చూసినా పెద్ది అభిమానులే కనిపించారు.పెద్ది సుదర్శన్ రెడ్డి పార్థివ దేహం వరంగల్‌ జిల్లాలోని నర్సంపేట కు చేరుకున్నప్పటి నుంచి పట్టణంలోని వీధులు జనంతో కిక్కిరిసిపోయాయి. 
చిన్నా,పెద్దా తేడా లేకుండా అన్ని వర్గాల ప్రజలు తమ అభిమాన నాయకు డికి చివరి వీడ్కోలు పలికేందుకు బారులు తీరారు.అభిమానుల రద్దీతో నర్సంపేట  ప్రధాన రహదారులపై సుమారు రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్
    user_Ramprasad Pothuganti
    Ramprasad Pothuganti
    Local News Reporter బుర్గుంపహాడ్, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    10 hrs ago
  • అమ్మఒడి పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిగిలిపల్లి మదన్ కుమార్ ప్రభుత్వ ఆదేశాలను పట్టించుకోకుండా పాఠశాలను నడుపుతున్న అమ్మఒడి టెక్కలి : శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా భోగాపురం ఎయిర్ పోర్టు ప్రారంభోత్సవం సందర్భంగా జిల్లాలో ఉన్న అన్ని ప్రైవేట్ స్కూళ్లకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది.  టెక్కలి మండల పరిధిలో ఉన్న అమ్మ ఒడి ప్రైవేట్ పాఠశాల ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ ఆదేశాలను వదిలేసి ఇష్టం రాజ్యాంగా శుక్రవారం పాఠశాలను నిర్వహించారు. పాఠశాల నడుస్తుందని తెలుసుకున్న అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నాయకులు అక్కడికి చేరుకొని స్థానిక విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. వెంటనే  ఎంఈఓ లు దశరధి, చిన్నారావులు అక్కడికి చేరుకొని పాఠశాల యాజమాన్యంకి షో కాజ్  నోటీసులు జారీ చేశారు. దీనిపై అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిగిలిపల్లి మదన్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాలకు విరుద్ధంగా పాఠశాల నడుపుతున్న అమ్మఒడి పాఠశాలపై చర్యలు తీసుకోవాలని ఆయన విద్యాశాఖ అధికారులకు డిమాండ్ చేశారు. చర్యలు తీసుకోకపోతే అఖిల భారతీయ విద్యార్ధి పరిషత్ తీవ్ర ఆందోళన చేయడానికి కూడా సిద్ధంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు శ్యామ్, సంతోష్ కుమార్, ప్రశాంత్, పాల్గొన్నారు.
    1
    అమ్మఒడి పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి
ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిగిలిపల్లి మదన్ కుమార్
ప్రభుత్వ ఆదేశాలను పట్టించుకోకుండా పాఠశాలను నడుపుతున్న అమ్మఒడి
టెక్కలి  :  శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా భోగాపురం ఎయిర్ పోర్టు ప్రారంభోత్సవం సందర్భంగా జిల్లాలో ఉన్న అన్ని ప్రైవేట్ స్కూళ్లకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది.  టెక్కలి మండల పరిధిలో ఉన్న అమ్మ ఒడి ప్రైవేట్ పాఠశాల ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ ఆదేశాలను వదిలేసి ఇష్టం రాజ్యాంగా శుక్రవారం పాఠశాలను నిర్వహించారు. పాఠశాల నడుస్తుందని తెలుసుకున్న అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నాయకులు అక్కడికి చేరుకొని స్థానిక విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. వెంటనే  ఎంఈఓ లు దశరధి, చిన్నారావులు అక్కడికి చేరుకొని పాఠశాల యాజమాన్యంకి షో కాజ్  నోటీసులు జారీ చేశారు. దీనిపై అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిగిలిపల్లి మదన్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాలకు విరుద్ధంగా పాఠశాల నడుపుతున్న అమ్మఒడి పాఠశాలపై చర్యలు తీసుకోవాలని ఆయన విద్యాశాఖ అధికారులకు డిమాండ్ చేశారు. చర్యలు తీసుకోకపోతే అఖిల భారతీయ విద్యార్ధి పరిషత్ తీవ్ర ఆందోళన చేయడానికి కూడా సిద్ధంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు శ్యామ్, సంతోష్ కుమార్, ప్రశాంత్, పాల్గొన్నారు.
    user_Karri Sankara Reddy
    Karri Sankara Reddy
    జర్నలిస్ట్ సంతబొమ్మాళి, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
    10 hrs ago
  • కృష్ణవరం పోలవరం కాల్వ పనులు పరిశీలించిన మంత్రి నిమ్మల.. వెంట ఎమ్మెల్యే నెహ్రూ కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం కృష్ణవరం వద్ద పోలవరం ఎడమ కాల్వలో జరుగుతున్న పనులను రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభతో కలిసి పరిశీలించారు. అనంతరం పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం రెండో దశ పంపింగ్ స్టేషన్‌ను సందర్శించారు. తొండంగి మండలం బెండపూడి వద్ద ఎన్‌హెచ్ క్రాసింగ్ వంతెన నిర్మాణ పనులను కూడా పరిశీలించారు. అధికారులకు పనులు వేగవంతంగా, నాణ్యతతో పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు.
    1
    కృష్ణవరం పోలవరం కాల్వ పనులు పరిశీలించిన మంత్రి నిమ్మల.. వెంట ఎమ్మెల్యే నెహ్రూ
కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం కృష్ణవరం వద్ద పోలవరం ఎడమ కాల్వలో జరుగుతున్న పనులను రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభతో కలిసి పరిశీలించారు. అనంతరం పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం రెండో దశ పంపింగ్ స్టేషన్‌ను సందర్శించారు. తొండంగి మండలం బెండపూడి వద్ద ఎన్‌హెచ్ క్రాసింగ్ వంతెన నిర్మాణ పనులను కూడా పరిశీలించారు. అధికారులకు పనులు వేగవంతంగా, నాణ్యతతో పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు.
    user_SAI DURGA
    SAI DURGA
    Local News Reporter కిర్లంపూడి, కాకినాడ, ఆంధ్రప్రదేశ్•
    12 hrs ago
  • శ్రీ సీతారామచంద్రస్వామి అన్నదాన సత్రం సమీపానికి గోదావరి బ్యాక్‌వాటర్‌ శ్రీ సీతారామచంద్రస్వామి అన్నదాన సత్రం సమీపానికి గోదావరి బ్యాక్‌వాటర్‌ భద్రాచలం: గోదావరి నీటిమట్టం 48 అడుగులకు చేరడంతో వరద బ్యాక్‌వాటర్‌ భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం సమీపంలోని అన్నదాన సత్రం వద్దకు చేరింది. శుక్రవారం మధ్యాహ్నం 3.48 గంటలకు గోదావరి నీటిమట్టం 48 అడుగులకు చేరగా 11,44,645 క్యూసెక్కుల వరద ప్రవాహం నమోదైంది. దీంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.
    1
    శ్రీ సీతారామచంద్రస్వామి అన్నదాన సత్రం సమీపానికి గోదావరి బ్యాక్‌వాటర్‌
శ్రీ సీతారామచంద్రస్వామి అన్నదాన సత్రం సమీపానికి గోదావరి బ్యాక్‌వాటర్‌
భద్రాచలం: గోదావరి నీటిమట్టం 48 అడుగులకు చేరడంతో వరద బ్యాక్‌వాటర్‌ భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం సమీపంలోని అన్నదాన సత్రం వద్దకు చేరింది. శుక్రవారం మధ్యాహ్నం 3.48 గంటలకు గోదావరి నీటిమట్టం 48 అడుగులకు చేరగా 11,44,645 క్యూసెక్కుల వరద ప్రవాహం నమోదైంది. దీంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.
    user_JAI TEJ
    JAI TEJ
    బుర్గుంపహాడ్, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    8 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.