భానుతేజ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన రాజేశ్వరమ్మ..* *భానుతేజ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన రాజేశ్వరమ్మ..* *డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, బండారులంకలో కేతా భానుతేజ గారి పుట్టినరోజు వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో పాల్గొని భానుతేజ గారికి శాలువాతో సన్మానం చేసి, బొకే అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన* ✨ *శ్రీమతి పాముల రాజేశ్వరిదేవి గారు (రాజోలు నియోజకవర్గం వైసీపీ ఇంచార్జి, మాజీ శాసనసభ్యురాలు)* ✨ *ప్రకాష్ పాముల గారు (వైసీపీ రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి)* ✨ *చింత అనురాధ గారు (మాజీ పార్లమెంట్ సభ్యులు)* మరియు ఇతర ముఖ్య నాయుకులు..: *చెల్లుబోయిన శ్రీను గారు (వైసీపీ రాష్ట్ర కార్యదర్శి, ముమ్మిడివరం నియోజకవర్గం పరిశీలకులు)* *దొమ్మేటి సత్యమోహన్ (జిల్లా సోషల్ మీడియా అధ్యక్షులు)* *దొమ్మేటి వెంకటేశ్వరావు గారు (MPP)* *ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు, పాల్గొని భానుతేజ గారికి తమ ఆశీస్సులు, శుభాకాంక్షలు అందజేశారు.*
భానుతేజ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన రాజేశ్వరమ్మ..* *భానుతేజ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన రాజేశ్వరమ్మ..* *డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, బండారులంకలో కేతా భానుతేజ గారి పుట్టినరోజు వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో పాల్గొని భానుతేజ గారికి శాలువాతో సన్మానం చేసి, బొకే అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన* ✨ *శ్రీమతి పాముల రాజేశ్వరిదేవి గారు (రాజోలు నియోజకవర్గం వైసీపీ ఇంచార్జి, మాజీ శాసనసభ్యురాలు)* ✨ *ప్రకాష్ పాముల గారు (వైసీపీ రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి)* ✨ *చింత అనురాధ గారు (మాజీ పార్లమెంట్ సభ్యులు)* మరియు ఇతర ముఖ్య నాయుకులు..: *చెల్లుబోయిన శ్రీను గారు (వైసీపీ రాష్ట్ర కార్యదర్శి, ముమ్మిడివరం నియోజకవర్గం పరిశీలకులు)* *దొమ్మేటి సత్యమోహన్ (జిల్లా సోషల్ మీడియా అధ్యక్షులు)* *దొమ్మేటి వెంకటేశ్వరావు గారు (MPP)* *ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు, పాల్గొని భానుతేజ గారికి తమ ఆశీస్సులు, శుభాకాంక్షలు అందజేశారు.*
- పిఠాపురం: స్థానిక రూత్ నీలిమ బేకరీలో ఆహార భద్రతా అధికారులు (ఫుడ్ ఇన్స్పెక్టర్) తనిఖీలు చేపట్టారు. ఆదివారం రాత్రి జీవన్ నగర్ కు చెందిన వినియోగదారుడు కొనుగోలు చేసిన బిస్కెట్లలో పురుగులు వచ్చాయన్న వార్తలు మీడియాలో ప్రముఖంగా రావడంతో అధికారులు రంగంలోకి దిగారు. బేకరీలోని వివిధ ఆహార పదార్థాలను పరిశీలించిన అధికారులు ముఖ్యంగా రంగు ఎక్కువగా ఉన్నట్లు అనుమానం వచ్చిన హల్వా నమూనాలను సేకరించి విశ్లేషణ కోసం ల్యాబ్‌కు పంపారు. బిస్కెట్ల వ్యవహారంపై స్పందించిన బేకరీ నిర్వాహకులు... గడువు ముగిసిన స్టాక్‌ను పక్కన పెట్టగా,కొత్తగా చేరిన సిబ్బంది తెలియక వాటిని కౌంటర్‌లో పెట్టి విక్రయించారని అధికారులకు వివరించారు. సదరు బేకరీకి ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్సు ఉందని, అలాగే పట్టణంలోని వారి ఇతర బ్రాంచ్‌లకు కూడా లైసెన్సులు ఉన్నాయని ఫుడ్ ఇన్‌స్పెక్టర్ సుబ్బారావు వెల్లడించారు. ల్యాబ్ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. స్థానిక కుటీర పరిశ్రమల ఉత్పత్తుల పై తయారీ,గడువు తేదీలు లేకపోవడాన్ని గుర్తించిన అధికారులు,నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పండుగలు మరియు ప్రత్యేక సందర్భాల్లో ప్రజలు నాణ్యమైన ఆహార పదార్థాలనే విక్రయించాలని, ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటే సహించేది లేదని అధికారులు స్పష్టం చేశారు.3
- శృంగేరి శంకరమఠానికి చెందిన పిఠాపురం శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో పంచమ వార్షిక మహోత్సవాలు ఆఖరి రోజుకు ఘనంగా చేరుకున్నాయి ఆలయ ఉత్తరాధికారి ఇంద్రగంటి గోపాలకృష్ణశర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి పంచామృత అభిషేకాలు సహస్రనామార్చన తదితర పూజా కార్యక్రమాలు ఘనంగా జరిపారు1
- Post by కొప్పుల విజయ బాబు10
- జడ్డంగి: ముందస్తు సమాచారం మేరకు జడ్డంగి పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో భారీగా గంజాయి పట్టుబడింది. పోలవరం ఎస్‌పి ఆదేశాలతో, రంపచోడవరం ఎస్‌డీపీవో మరియు రాజవొమ్మంగి సిఐ పర్యవేక్షణలో హైవే నెం. 516E లోని SRC క్యాంప్ వద్ద వాహన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా ఉన్న బొలేరో వాహనాన్ని తనిఖీ చేయగా, సుమారు రూ. 4 లక్షల విలువైన 80 కిలోల గంజాయి లభ్యమైంది. పోలీసులు గంజాయితో పాటు వాహనం, రెండు మొబైల్ ఫోన్లు, రూ. 900 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో జి.కె.వీడి మండలానికి చెందిన పాంగి నూకరాజు, ఒడిశా రాష్ట్రానికి చెందిన కొప్పు దేవరాజులను అరెస్ట్ చేశారు. గెజిటెడ్ అధికారి జి. సీతారామ్ సమక్షంలో జరిగిన ఈ రైడ్ అనంతరం, అక్రమ రవాణాకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.1
- manasuloni mata1
- గుంటూరు: ప్రత్తిపాడులో అంకమ్మ గుడి సెంటర్ వద్ద ఆర్టీసీ బస్సు టైర్ క్రింద మహిళ పడిన సంఘటన సోమవారం చోటుచేసుకుంది.ఈ సంఘటనలోరెండు కాళ్లు నుజ్జునుజ్ అయ్యాయి.ప్రత్తిపాడు మిరపకాయలకు కూలి పని చేసుకుని బస్సు ఎక్కే క్రమంలో జారిపడి ప్రమాదం జరిగింది. ప్రమాదానికి గురి అయిన మహిళ పెదనందిపాడు కు చెందిన బొమ్మతోటి సౌదామని అనే మహిళ గా గుర్తించారు.1
- ఈ సందర్భంగా దేవతామూర్తులకు పంచామృతాభిషేకం, బిల్వార్చన, పుష్పాలంకరణ చేయించిన తరువాత దేవాలయ ఆవరణలో ముఖ్యమంత్రి గారితో పాటు మంత్రుల బృందాన్ని దేవాలయ అధికారులు స్వామి శేషవస్త్రాలతో సత్కరించి దేవతామూర్తి ప్రతిమను, చిత్రపటాలను కానుకగా అందజేశారు. వేద పండితుల చేత వేదాశీర్వచనం, తీర్థప్రసాదాలను స్వీకరించారు. అనంతరం ముఖ్యమంత్రి గారు కాళేశ్వరం ఆలయఅభివృద్ధి పనులకు భూమిపూజ, బస్ స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.1
- పిఠాపురం: యువత డ్రగ్స్ వంటి దురలవాట్లకు దూరంగా ఉండి, దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆకాంక్షిస్తూ పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలులోని ఆదర్శ కళాశాల వేదికగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వైబ్రంట్స్ ఆఫ్ కలాం ఆధ్వర్యంలో దండి మార్చ్ 2.0 పేరుతో చేపట్టిన సైకిల్ యాత్రలో భాగంగా విద్యార్థులకు మాదకద్రవ్యాల వినియోగంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఈగల్ అడిషనల్ ఎస్పీ ప్రభాకర్ బాబు మాట్లాడుతూ... మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే చట్టపరమైన ఇబ్బందులను, శిక్షలను వివరించారు. చిన్న వయసులో డ్రగ్స్‌కు బానిసలైతే భవిష్యత్తు నాశనమవడమే కాకుండా, ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హులవుతారని హెచ్చరించారు. వ్యసనాల నుంచి బయటపడటానికి ఉన్న మార్గాలను విద్యార్థులకు సూచించారు. కాకినాడ జిల్లా ఈగల్ సీఐ (సర్కిల్ ఇన్‌స్పెక్టర్) మాట్లాడుతూ... వందల అడుగుల ఎత్తులో ఎగిరే గ్రద్ద భూమిపై ఉన్న ఆహారాన్ని ఎంత స్పష్టంగా గమనిస్తుందో...ఈగల్ విభాగం మరియు లా అండ్ ఆర్డర్ పోలీసులు కూడా అదే స్థాయిలో నిఘా ఉంచుతున్నారని, డ్రగ్స్, గంజాయి విక్రయించినా లేదా వినియోగించినా చట్టం నుంచి తప్పించుకోలేరని, డ్రగ్స్ వినియోగం అనేది కేవలం వ్యక్తిగత సమస్య కాదని, అది జాతీయ భద్రతకే ముప్పు అని ఆయన స్పష్టం చేశారు. ఏదైనా సమాచారం ఉంటే ఈగల్ టోల్ ఫ్రీ నంబర్ 1972 కు ఫిర్యాదు చేయాలని సూచించారు. వైబ్రంట్స్ ఆఫ్ కలాం ఫౌండర్ విజయ్ కలాం మాట్లాడుతూ... అబ్దుల్ కలాంను యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు. నిజమైన దేశభక్తి ఉన్నవారు ఎవరూ డ్రగ్స్ జోలికి వెళ్లరని, విద్యార్థులు చదువుపై ఏకాగ్రత వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆదర్శ కళాశాల చైర్మన్ బుర్రా అనుబాబు,ఈగల్ ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్వరరావు,గొల్లప్రోలు ఎస్సై ఎన్. రామకృష్ణ, ప్రిన్సిపాల్ వి. శ్రీనివాసరావు, వైబ్రంట్స్ ఆఫ్ కలాం కోఆర్డినేటర్లు, కళాశాల అధ్యాపకులు, ఎన్ఎస్ఎస్ విద్యార్థులు మరియు ఈగల్ విభాగం సిబ్బంది పాల్గొన్నారు.3