10వ తరగతి విద్యార్థులకు పరీక్షా సామగ్రి పంపిణీ చేసిన మండలనేని చరణ్ తేజ 10వ తరగతి విద్యార్థులకు పరీక్షా సామగ్రి పంపిణీ చేసిన మండలనేని చరణ్ తేజ చిలకలూరిపేట పట్టణంలో శ్రీ శారద జిల్లా పరిషత్ హై స్కూల్‌లో 10వ తరగతి చదువుతున్న 161 మంది విద్యార్థులకు పబ్లిక్ పరీక్షల సందర్భంగా అవసరమైన పరీక్షా సామగ్రిని అందజేశారు. ప్రముఖ పారిశ్రామికవేత్త మరియు జనసేన నాయకులు మండలనేని చరణ్ తేజ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్యాడ్, పెన్, స్కేలు వంటి పరీక్షా సామగ్రిని అందించారు. ఈ సామగ్రిని పాఠశాల ప్రధానోపాధ్యాయులు కే. రత్నజ్యోతి విద్యార్థినీ-విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా మండలనేని చరణ్ తేజ గారు విద్యార్థులు రాబోయే పబ్లిక్ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షిస్తూ వారికి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో విద్యా కమిటీ చైర్‌పర్సన్ పిల్లి ధనలక్ష్మి, తోట వెంకట సురేష్, తూబాటి పరమేశ్వరి, ముత్తంశెట్టి ప్రసాద్, తోట మల్లికార్జునరావు,నల్లమల్ల ఉదయలక్ష్మి,వట్టిప్రోలు శ్రావణి తదితరులు పాల్గొన్నారు.కార్యక్రమం ముగింపులో పాఠశాల తరఫున ప్రధానోపాధ్యాయులు కే. రత్నజ్యోతి కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.

- Post by దాసరి ప్రేమ్1
- అమరావతి: గుంటూరు రోడ్ లో సీఎం చంద్రబాబు నాయుడు రాకకై ఎలిఫ్యాడ్ ఏర్పాటు చేశారు. పల్నాడు జిల్లా ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు సీఎం రాకకై ఎలిఫ్యాడ్ వద్దకు చేరుకొని పరిసరాలను పరిశీలించారు. బందోబస్తు ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. ముఖ్య నేతలు మొత్తం సీఎంకు ఘనస్వాగతం పలికేందుకు ఎలిఫ్యాడ్ వద్ద సిద్ధంగా ఉన్నారు.1
- కారంపూడి గ్రామంలోని మాచర్ల రోడ్డు నందు dr అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఘన నివాళులు సమర్పించుకోవడం జరిగింది.1
- జావేద్ మృతి పార్టీకి, ఖమ్మం నగర ప్రజలకు తీరని లోటు. ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. కుటుంబానికి భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను. మల్లు భట్టి విక్రమార్క ఉపముఖ్యమంత్రి1
- Post by V Ramarao3
- Post by Bondhu Suresh1
- పేదలకు కూడు, గూడు, గుడ్డ కల్పించడమే టిడిపి విధానం - కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చాక రాష్ట్రవ్యాప్తంగా 207 అన్న క్యాంటీన్లు. - మలి విడతగా నేడు 67 అన్న క్యాంటీన్ల ప్రారంభం. - అన్న క్యాంటీన్లు రోజుకు సుమారు 2 లక్షల 10 వేల మంది ఆకలి తీరుస్తున్నాయి. - గత ప్రభుత్వం కక్షపూరితంగా అన్నా క్యాంటీన్లను మూసివేసింది. - కోవూరులో అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి. సమాజమే దేవాలయం - ప్రజలే దేవుళ్లు అనే ఎన్టీఆర్ సిద్ధాంతమే తెలుగుదేశం పార్టీకి పునాది అని, ఆ ఆశయ సాధనలో భాగంగానే పేదల ఆకలి తీర్చేందుకు అన్నా క్యాంటీన్లను పునః ప్రారంభించామని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పేర్కొన్నారు. కోవూరులో నూతనంగా ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్‌ను ఆమె ప్రారంభించారు. అన్న క్యాంటీన్లో భోజనం చేసేందుకు వచ్చిన వారికి ఆమె స్వయంగా భోజనం వడ్డించి వారితో కలిసి అక్కడే భోజనం చేసారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ నాడు అన్న ఎన్టీఆర్ ఇచ్చిన కూడు, గూడు, గుడ్డ నినాదమే నేడు పేద ప్రజల కోసం అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి స్ఫూర్తినిచ్చిందన్నారు. గత ప్రభుత్వం కక్షపూరితంగా అన్నా క్యాంటీన్లను మూసివేసి పేదల కడుపు కొట్టిందని నేడు కూటమి ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా వీటిని పునరుద్ధరించి రోజుకు సుమారు 2 లక్షల 10 వేల మంది ఆకలి తీరుస్తోందని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి వెల్లడించారు.కోవూరులో అన్నా క్యాంటీన్ లేదని గతంలో చాలా బాధపడేదానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సహకారంతో నేడు ఇక్కడ క్యాంటీన్ ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. గ్రామాల నుంచి ఆసుపత్రి పనుల కోసం, ఇతర అవసరాల కోసం కోవూరు వచ్చే పేదలకు కేవలం 5 రూపాయలకే నాణ్యమైన, రుచికరమైన భోజనం అందించడం ప్రభుత్వం యొక్క నిబద్ధతకు నిదర్శనమని ఆమె కొనియాడారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అడుగుజాడల్లో నడుస్తూ, ప్రజా సేవలో ముందుంటానని ఆమె స్పష్టం చేశారు. తనకు పార్టీలో అత్యున్నత నిర్ణయాత్మక కమిటీ అయిన పొలిట్ బ్యూరో సభ్యురాలిగా అవకాశం కల్పించినందుకు చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలు తెలిపారు. తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పార్టీ బలోపేతం కోసం అంకితభావంతో పనిచేస్తానని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక టిడిపి ముఖ్య నాయకులు, కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.4
- 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో మన జిల్లా ముద్దుబిడ్డ మన అందరి *ప్రియ నాయకుడు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు గారు.* ఈ జిల్లాలో ఆయన హయాములో చేసిన అభివృద్ధి ఆయనను 100 ఏళ్ళు గుర్తుండే విధంగా ఉంటాయి. నలుగురు ముఖ్యమంత్రి దగ్గర రాష్ట్ర మంత్రిగా పని చేసి చరిత్ర సృష్టించిన *తుమ్మల గారు* వాజేడు నుంచి వెంకటాపురం, చర్ల నుంచి భద్రాచలం,సత్తుపల్లి, పాలేరు నియోజకవర్గాలకు ఆయన చేసిన అభివృద్ధిని ప్రత్యర్థ పార్టీ నాయకులైన సరే,కార్యకర్తలు అయినా సరే *మంత్రి తుమ్మలను* మెచ్చుకుంటారు. పదవులు శాశ్వతం కాదు చేసిన అభివృద్ధి శాశ్వతం అని నమ్మే నాయకుడు *మంత్రి తుమ్మల* గారు. ఈ జిల్లా చరిత్ర పుటల్లో ఆయన స్థానం ఎప్పటికీ పదిలమే.1