వనపర్తి జిల్లా జిల్లాలో వ్యవసాయ, వ్యవసాయేతర భూములు 22-ఎ కింద నమోదు అయిన భూ వివరాలను గుర్తించి నిర్ణీత ప్రొఫార్మాలో పొందుపరచి వివరాలు సమర్పించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి రెవెన్యూ అధికారులను ఆదేశించారు రాష్ట్రంలోని 22-ఏ, భూభారతి, ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని ఎంచుకొని అందులో సమగ్ర రిసర్వే చేసేందుకు నిర్దేశించిన అంశాల పై గురువారం రాష్ట్ర రెవెన్యూ కార్యదర్శి లోకేష్ కుమార్ జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడిన రెవెన్యూ కార్యదర్శి లోకేష్ కుమార్ భూభారతి డాటా ఆధారంగా ఎక్కడైనా 22 ఎ ఎక్స్ టెంట్ లో తేడాలు వస్తే వాటిని భూభారతి పోర్టల్ లోనే పరిష్కరించాలని సూచించారు. వ్యవసాయ, వ్యవసాయేతర భూముల్లో 22a కింద నమోదు అయినట్లు ఉంటే వాటిని గుర్తించి నిర్ణీత ప్రొఫార్మాలో తాసిల్దార్ ల నుంచి సేకరించి నివేదిక సమర్పించాలని కలెక్టర్లను సూచించారు. ఇందుకోసం స్టాండర్డ్ ఆపరేషన్ సిస్టం అమలు చేయాలని తెలియజేశారు. ఎస్ ఆర్ ఓ లో వచ్చిన ఫిర్యాదులను ఏరోజుకారోజు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని ఎంచుకొని ఆ గ్రామంలో సమగ్రంగా భూ రీసర్వే నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని వాటి సత్ఫలితాలు ఆధారంగా అన్ని గ్రామాల్లో రీ-సర్వే చేయాల్సి ఉంటుందని తెలియజేశారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టర్ రెవెన్యూ అధికారులతో మాట్లాడుతూ వనపర్తి జిల్లాలోని ఆయా గ్రామాలు మండలాల్లో వ్యవసాయ వ్యవసాయెతర భూములు 22 ఎ లో నమోదు అయిన వాటిని గుర్తించి వివరాలు సమర్పించాలని ఆదేశించారు. ప్రతి మండలంలోని ఒక గ్రామంలో భూముల రి సర్వే నిర్వహించే విధంగా సర్సయర్లను నియమించి అందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఏడి ల్యాండ్ సర్వేయర్ ను ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ టి వినోద్ కుమార్ ఆర్డిఓ సుబ్రహ్మణ్యం ఎడి ల్యాండ్ సర్వేయర్ శ్రీనివాసులు, డి సెక్షన్ సూపర్డెంట్ సునీత, తదితరులు పాల్గొన్నారు.
వనపర్తి జిల్లా జిల్లాలో వ్యవసాయ, వ్యవసాయేతర భూములు 22-ఎ కింద నమోదు అయిన భూ వివరాలను గుర్తించి నిర్ణీత ప్రొఫార్మాలో పొందుపరచి వివరాలు సమర్పించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి రెవెన్యూ అధికారులను ఆదేశించారు రాష్ట్రంలోని 22-ఏ, భూభారతి, ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని ఎంచుకొని అందులో సమగ్ర రిసర్వే చేసేందుకు నిర్దేశించిన అంశాల పై గురువారం రాష్ట్ర రెవెన్యూ కార్యదర్శి లోకేష్ కుమార్ జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడిన రెవెన్యూ కార్యదర్శి లోకేష్ కుమార్ భూభారతి డాటా ఆధారంగా ఎక్కడైనా 22 ఎ ఎక్స్ టెంట్ లో తేడాలు వస్తే వాటిని భూభారతి పోర్టల్ లోనే పరిష్కరించాలని సూచించారు. వ్యవసాయ, వ్యవసాయేతర భూముల్లో 22a కింద నమోదు అయినట్లు ఉంటే వాటిని గుర్తించి నిర్ణీత ప్రొఫార్మాలో తాసిల్దార్ ల నుంచి సేకరించి నివేదిక సమర్పించాలని కలెక్టర్లను సూచించారు. ఇందుకోసం స్టాండర్డ్
ఆపరేషన్ సిస్టం అమలు చేయాలని తెలియజేశారు. ఎస్ ఆర్ ఓ లో వచ్చిన ఫిర్యాదులను ఏరోజుకారోజు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని ఎంచుకొని ఆ గ్రామంలో సమగ్రంగా భూ రీసర్వే నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని వాటి సత్ఫలితాలు ఆధారంగా అన్ని గ్రామాల్లో రీ-సర్వే చేయాల్సి ఉంటుందని తెలియజేశారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టర్ రెవెన్యూ అధికారులతో మాట్లాడుతూ వనపర్తి జిల్లాలోని ఆయా గ్రామాలు మండలాల్లో వ్యవసాయ వ్యవసాయెతర భూములు 22 ఎ లో నమోదు అయిన వాటిని గుర్తించి వివరాలు సమర్పించాలని ఆదేశించారు. ప్రతి మండలంలోని ఒక గ్రామంలో భూముల రి సర్వే నిర్వహించే విధంగా సర్సయర్లను నియమించి అందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఏడి ల్యాండ్ సర్వేయర్ ను ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ టి వినోద్ కుమార్ ఆర్డిఓ సుబ్రహ్మణ్యం ఎడి ల్యాండ్ సర్వేయర్ శ్రీనివాసులు, డి సెక్షన్ సూపర్డెంట్ సునీత, తదితరులు పాల్గొన్నారు.
- మంగనూరులో విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో రాఖీ పండుగ వేడుకలు బిజినేపల్లి: మండలంలోని మంగనూరు గ్రామంలో విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో రక్షాబంధన్ వేడుకలు కన్నులపండువగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా పాఠశాల విద్యార్థులు ఒకరికొకరు రక్షణ సూత్రాలు కట్టుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ‘నువ్వు నాకు రక్ష.. నేను నీకు రక్ష, మనమంతా దేశానికి రక్ష’ అంటూ విద్యార్థులు దేశభక్తిని చాటారు. అనంతరం మహాత్మా పూలే, అంబేద్కర్‌లకు జైకొడుతూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో విజ్ఞాన వేదిక అధ్యక్షుడు శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శి కొండయ్య, సభ్యులు వెంకటయ్య, రాములు తదితరులు పాల్గొన్నారు1
- ఏ రేవంత్ రెడ్డి అంటే అనుముల రేవంత్ రెడ్డి కాదు, ఆంధ్ర రేవంత్ రెడ్డి: కవిత ఏ రేవంత్ రెడ్డి అంటే అనుముల రేవంత్ రెడ్డి కాదు, ఆంధ్ర రేవంత్ రెడ్డి అనాల్సిన పరిస్థితి వస్తుందని టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల కవిత అన్నారు. తెలంగాణ బ్రాహ్మణ పరిషత్ పదవులను పక్క రాష్ట్రం వారికి ఇవ్వడాన్ని మరియు మన ఉద్యమకారులను దూషించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అన్నారు. తెలంగాణ బ్రాహ్మణులకు గౌరవం దక్కాల్సిందే, బ్రాహ్మణ పరిషత్ చైర్మన్, వైస్ చైర్మన్‌లను తక్షణమే తొలగించాలన్నారు.1
- శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం నిర్మాణం కొరకు భూమి పూజ బండి ఆత్మకూరు మండలం జి. సీ. పాలెం గ్రామం నందు శ్రీవాణి ట్రస్ట్ ధ్వరా శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి కి దేవాలయం పూజ మరియు శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది . ఈ దేవాలయం నిర్మాణానికి రూ. 40 లక్షలు, అనుమతులు మంజూరు చేయించినటువంటి శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి గారికి గ్రామం తరపున ధన్యవాదములు తెలపడం జరిగింది. ఈ కార్యక్రమములో కంచెర్ల లింగారెడ్డి, సుబ్బయ్య, మోహనరావు, గోపాల్, వై రమణ, ప్రసాద్, వై శ్రీను, శివుడు, లక్ష్మీ రెడ్డి, సుబ్బారెడ్డి మరియు గ్రామ ప్రజలు భక్తి శ్రద్ధలతో అందరు పాల్గొని పూజా కార్యక్రమాన్ని జయప్రదం చేసినారు.1
- రైతులు ఉధ్యాన పంటలపై మెగ్గు చూపాలి:రాష్ట్ర ఉద్యాన సెరికల్చర్ డైరెక్టర్ డాక్టర్ కే. శ్రీనివాసులు రైతులు మంచి ఆదాయాన్ని ఇచ్చే ఉద్యాన పంటలపై మెగ్గు చూపాలని రాష్ట్ర ఉద్యాన సెరికల్చర్ డైరెక్టర్ డాక్టర్ కే. శ్రీనివాసులు పేర్కొన్నారు.బుధవారం మహానంది మండలం గాజులపల్లె గ్రామంలోని ఉద్యాన పంటలను సందర్శించారు. అనంతరం రైతులు వేసిన అంతర పంట యాలక్కి అరటి, 30 రకాల విత్తనాలతో వేసిన పీఎండీస్, ఫారం పాండ్లు, బిందు సేద్యం పద్ధతి ద్వారా సాగు చేస్తున్న బంతిపూలు, గులాబి, మామిడి, అన్న యాపిల్ పంటలను పరిశీలించారు. అనంతరం రైతులతో పంటల సాగు, పద్ధతులు, మార్కెటింగ్ గురించి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యాన శాఖ అధికారి నాగరాజు, జిల్లా సూక్ష్మ సేద్య సాగు అధికారిణి విజయలక్ష్మి , నంద్యాల ఉద్యాన శాఖ అధికారి హరేంద్ర, రైతులు హుస్సేన్, హుస్సేన్ రెడ్డి,మస్తాన్ తదితరులు పాల్గొన్నారు.1
- మానససరోవర యాత్రికులకు ఎమ్మెల్యే ఫోన్ ద్వారా పరామర్శ..! మానససరోవర యాత్రకు వెళ్లిన ఆదోనికి చెందిన శ్రీ రఘునాథ్ శాస్త్రి, భాస్కర్ శాస్త్రి కుటుంబ సభ్యులతో సహా నలుగురు హిమాలయాల్లో చిక్కుకున్నారు. అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్న వారిని ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి వాల్మీకి ఫోన్ ద్వారా పరామర్శించి ధైర్యం చెప్పారు. ప్రస్తుతం అందరూ క్షేమంగానే ఉన్నట్లు వారు ఎమ్మెల్యేకు తెలిపారు. వారిని సురక్షితంగా ఆదోనికి తీసుకురావడానికి అవసరమైన తిరుగు ప్రయాణ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.1
- వెలిగొండ ప్రాజెక్టు నీటి విడుదల సందర్భంగా కృతజ్ఞతగా 1000 బైకులతో భారీ ర్యాలీ ఆగస్టు 31వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వెలుగొండ ప్రాజెక్టు నీటి విడుదల సందర్భంగా కృతజ్ఞతగా మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి మరియు కూటమి నేతల ఆధ్వర్యంలో మార్కాపురం పట్టణంలో 1000 బైకులతో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ బైక్ ర్యాలీకి నియోజకవర్గంలోని కూటమి శ్రేణులు,రైతులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. మొదటిగా మార్కాపురం పట్టణంలోని అల్లూరి పోలేరమ్మ గుడి వద్ద నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఈ బైక్ ర్యాలీ తర్లుపాడు రోడ్డు, ఆర్టీసీ బస్టాండ్, కోర్ట్ సెంటర్, కంభం బస్టాండ్, దోర్నాల బస్టాండ్, సప్తగిరి సెంటర్, తూర్పు వీధి మీదుగా శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి మాట్లాడుతూ ఎన్నో ఏళ్ల కల అయిన వెలుగొండ ప్రాజెక్టు 1996వ సంవత్సరంలో నారా చంద్రబాబునాయుడు శంకుస్థాపన చేశారని అనంతరం పలు ఇబ్బందులను దాటుకొని ఈ నెల 31వ తేదీన ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవం జరుపుకోవడం ఈ ప్రాంత ప్రజలకు పట్టరాని సంతోషంతో ఉన్నారని అన్నారు. వైసిపి నాయకులు నిర్వాసితులను రెచ్చగొట్టాలని చూస్తున్నారని కానీ ఇప్పటికే 768 కోట్ల రూపాయలు నిర్వాసితులకు పరిహారంగా చెల్లించడం జరిగిందని ప్రతి నిర్వాసితునికి న్యాయం జరుగుతుందని ఈ విషయంలో ఎవరు ఎటువంటి అపోహలకు లోను కావద్దని ముంపు గ్రామాల ప్రజలు త్యాగదనులని వారి వలన నాలుగు లక్షల 60 వేల ఎకరాలకు సాగునీరు, 22 లక్షల మందికి త్రాగునీరు అందించడం జరుగుతుందని వారి త్యాగాలు వెలకట్టలేనివి అని అన్నారు. ఈనెల 31వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెలుగును ప్రాజెక్ట్ నుండి నీటి విడుదల చేసి జల హారతి కార్యక్రమంలో పాల్గొంటారని ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరూ విచ్చేసి విజయవంతం చేయగలరని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టిడిపి పోల్ మేనేజ్మెంట్ క్లస్టర్ ఇంచార్జ్ కందుల రామిరెడ్డి, యువ నాయకులు కందుల విగ్నేష్ రెడ్డి , మార్కాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ ఇమ్మడి కాశీనాథ్ , బిజెపి జిల్లా అధ్యక్షులు పీవీ కృష్ణారావు , కూటమి నాయకులు కార్యకర్తలు వారి సంఖ్యలో పాల్గొన్నారు.1
- మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్.. పోలీసుల దురుసు ప్రవర్తన హరీష్ రావు పట్ల పోలీసుల దురుసు ప్రవర్తన కనీసం వాహనం కూడా ఎక్కించకుండా కలెక్టరేట్ నుంచి పోలీస్ స్టేషన్‌కు కాలినడకన హరీష్ రావుని పోలీసులు తరలించారు. దీంతో హనుమకొండ కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత TNGO ధర్నాలో పాల్గొన్న హరీష్ రావుని పోలీసులు అరెస్ట్ చేశారు. పాలిటెక్నిక్ విద్యార్థులను కలవకుండా అదుపులోకి తీసుకొని.. సుబేదారి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోలీసుల తీరుపై బీఆర్ఎస్ శ్రేణులు మండిపడుతున్నారు.1
- అక్రమంగా బ్లాస్టింగ్ కు పాల్పడుతున్న భారత్‌మాల ప్రాజెక్టు కంపెనీపై చర్యలు తీసుకోవాలి.. పురుగుల మందు తాగి చికిత్స పొందుతున్న రైతును పరామర్శించిన తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్) గద్వాల నియోజకవర్గ ఇన్‌చార్జి గొంగళ్ల రంజిత్. జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం సల్కాపురం గ్రామంలో భారత్ మాల ప్రాజెక్టు కంపెనీకి సంబంధించిన క్రషర్ మిషన్ బ్లాస్టింగ్ వల్ల వచ్చే దూలి మరియు ప్రకంపనల వల్ల తన బోర్ ఎండిపోతుందని అధికారులకు ఎన్నిసార్లు విన్నవించిన న్యాయం జరగలేదని రైతు యేసు పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడి గద్వాల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యేసును పరామర్శించి, ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న గొంగల్ల రంజిత్ కుమార్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గట్టు మండలం సల్కాపురం గ్రామానికి చెందిన రైతు యేసు తన పట్టా భూమిలో సుమారు మూడు ఎకరాల్లో వ్యవసాయం చేసుకుంటున్నారని తెలిపారు. ఆయన వ్యవసాయ భూమికి సమీపంలో భారత్‌మాల ప్రాజెక్టు కంపెనీకి సంబంధించిన కాంట్రాక్టర్ బ్లాస్టింగ్ కు పాల్పడటం తో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లే పరిస్థితి ఏర్పడిందన్నారు. క్రషర్ నిర్వహణతో పాటు తరచూ బ్లాస్టింగ్ చేపట్టడం వల్ల 100 మందికి పైగా రైతులు, గ్రామ ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని అన్నాన్నారు. బ్లాస్టింగ్ సమయంలో రాళ్లు ఎగిరిపడటంతో పాటు భారీ ప్రకంపనలు చోటుచేసుకుంటున్నాయని, దీంతో రైతుల పంట పొలాల్లో బోర్లు ప్రకంపన చెంది బోర్లు చెడిపోతున్నాయని , ప్రజల భద్రతకు ముప్పు ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల ప్రాణాలు, రైతుల పంటలకు నష్టం కలిగించే విధంగా క్రషర్ నిర్వహణ కొనసాగించడం సరికాదని అన్నారు. రైతు సమస్యపై జిల్లా ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి భారత్ మాల ప్రాజెక్టు కంపెనీ క్రషర్ మిషన్‌ను నిలిపివేయడంతో పాటు బ్లాస్టింగ్ వల్ల ప్రజలకు, రైతులకు కలుగుతున్న ఇబ్బందులపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. రైతులకు న్యాయం జరిగే వరకు తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.సమస్య పరిష్కారం కాకపోతే సల్కాపురం గ్రామంలో పెద్ద ఎత్తున ఉద్యమ కార్యాచరణ చేపడతామని, అవసరమైతే రైతుల తరఫున న్యాయస్థానాన్ని ఆశ్రయించి న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం, సంబంధిత అధికారులు వెంటనే స్పందించి రైతులు, గ్రామ ప్రజల భద్రతకు భరోసా కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రక్షణ సేన నాయకులు బుచ్చిబాబు, కార్తీక్ విష్ణు, మీసాల కిష్టన్న, గోవిందు, మల్దకల్ విజయ్, రమేష్, రంగస్వామి, లక్ష్మన్న, స్వామి, సామెల్, ప్రేమ్‌రాజ్, చిన్న రాముడు, సుదర్శన్ నాయుడు, జమ్మన్న, గోపాల్, సుభాష్, దొడ్డన్న, భీమన్ గౌడ్, వీరేష్, రేనప్ప, శాంతిరాజ్ తదితరులు పాల్గొన్నారు.2