logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

భారత ఎన్నికల సంఘం కార్యదర్శులు సంతోష్ కుమార్ దూబే, నవీన్ కుమార్ లు శ్రీశైలంలో నంద్యాల, కర్నూలు, ప్రకాశం, కడప జిల్లాల ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలతో ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్)-2026 అమలుపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఓటర్ల జాబితా ఎన్నికల ప్రక్రియకు పునాది అని నొక్కిచెప్పిన వారు, అర్హులైన ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పించడంతో పాటు అనర్హులు జాబితాలో చేరకుండా ప్రత్యేక సమగ్ర సవరణ-2026ను అత్యంత పారదర్శకంగా, ఖచ్చితత్వంతో నిర్వహించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఓటర్ల జాబితా శుద్ధీకరణలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేదని, డూప్లికేట్, అనర్హ ఓటర్ల నమోదును అరికట్టాలని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా భారత ఎన్నికల సంఘం కార్యదర్శి సంతోష్ కుమార్ దూబే మాట్లాడుతూ, ఎన్నికల జాబితా శుద్ధీకరణ అనేది నిరంతర ప్రక్రియ అని, ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలు, బీఎల్ఓలు సమన్వయంతో పనిచేసి డూప్లికేట్, మరణించిన, వలస వెళ్లిన ఓటర్ల వివరాలను ఎప్పటికప్పుడు నవీకరించాల్సిన బాధ్యత ఉందన్నారు. ప్రజా ప్రాతినిధ్య చట్టం -1951లోని సెక్షన్-21 ప్రకారం ఎన్నికల సంఘానికి ప్రత్యేక సంక్షిప్త సవరణ నిర్వహించే అధికారం ఉందని ఆయన వివరించారు. ఓటరుగా నమోదు కావాలంటే భారతీయ పౌరుడై ఉండి 18 సంవత్సరాల వయస్సు పూర్తై ఉండాలని, సాధారణ నివాసిగా ఉండాలని, చట్టపరంగా అనర్హతలు లేకుండా ఉండాలని తెలిపారు. ఆధార్ కార్డును కేవలం గుర్తింపు పత్రంగా మాత్రమే పరిగణించాలని, దానిని చిరునామా లేదా పుట్టిన తేదీ రుజువుగా స్వీకరించరాదని ఆయన ఆదేశించారు. త్వరలో ప్రారంభమయ్యే ఎన్యుమరేషన్ ప్రక్రియలో బీఎల్ఓలు ప్రతి ఇంటిని సందర్శించి ఫారాలు పంపిణీ చేయాలని, తాళం వేసి ఉన్న ఇళ్లను కనీసం మూడు సార్లు సందర్శించి వివరాలను నమోదు చేయాలని సూచించారు. ఓటరు అందుబాటులో లేని పరిస్థితుల్లో నిర్దేశిత విధానాలను పాటిస్తూ ఫోటో ఆధారాలు, సందర్శన వివరాలు నమోదు చేయాలన్నారు. ఎన్యుమరేషన్ ఫారాలు, ఫోటోలు, అనుబంధ పత్రాల సేకరణలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, లైవ్ ఫోటోలు సేకరించేందుకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచిస్తూ, ఫారాల స్కానింగ్ సమయంలో సంతకాలు, వివరాలు స్పష్టంగా ఉండాలని, నిర్లక్ష్యం వల్ల భవిష్యత్తులో వివాదాలు తలెత్తే అవకాశం ఉందని హెచ్చరించారు. ఓటర్ల జాబితాలో ఉన్న అనామలీలను గుర్తించి సరిదిద్దడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, డెమోగ్రాఫిక్ సిమిలారిటీ ఎంట్రీలు, బహుళ నమోదులు, తప్పు వివరాల నమోదు వంటి అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని దూబే ఆదేశించారు. బీఎల్ఓ యాప్, ఈఆర్ఓ లాగిన్‌లలో కనిపించే హెచ్చరికలను నిర్లక్ష్యం చేయకుండా పరిశీలించాలన్నారు. డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా తయారీలో రేషనలైజేషన్ నిబంధనలను తప్పనిసరిగా అమలు చేయాలని, ఓటర్లు తమ పోలింగ్ కేంద్రానికి సమీపంలోనే ఉండేలా చర్యలు తీసుకోవాలని, ఒకే కుటుంబ సభ్యుల పేర్లు ఒకే పోలింగ్ స్టేషన్ పరిధిలో ఉండేలా ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. క్లెయిమ్‌లు, అభ్యంతరాల పరిష్కారంలో న్యాయబద్ధత, పారదర్శకతకు ప్రాధాన్యం ఇవ్వాలని, దరఖాస్తుల ఆమోదం లేదా తిరస్కరణ సమయంలో సరైన కారణాలు నమోదు చేయాలని, ప్రతి నిర్ణయం ఎన్నికల సంఘానికి సమర్పించే డిజిటల్ అఫిడవిట్‌తో సమానమని గుర్తుంచుకోవాలన్నారు. అర్హుడైన ఓటరు అనవసరంగా జాబితా వెలుపల ఉండకుండా, అనర్హుడు చొరబడకుండా అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన స్పష్టం చేశారు. రాజకీయ పార్టీల బీఎల్‌ఏలతో తరచూ సమావేశాలు నిర్వహించి ప్రక్రియపై అవగాహన కల్పించాలని, ఏఎస్‌డీ (Absent, Shifted, Dead) జాబితాలను క్రమం తప్పకుండా పంచుకోవాలని సూచిస్తూ, ఫామ్-6, 7, 8లతో పాటు క్లెయిమ్‌లు, అభ్యంతరాల వివరాలను నిబంధనల ప్రకారం ప్రజలకు అందుబాటులో ఉంచాలని తెలిపారు. ఎన్నికల సంఘం కార్యదర్శి నవీన్ కుమార్ మాట్లాడుతూ, ఎస్‌ఐఆర్ ప్రక్రియ దేశవ్యాప్తంగా విజయవంతంగా అమలవుతోందని, ఇప్పటివరకు దాదాపు 60 శాతం ఓటర్ల కవరేజీ పూర్తైందని వెల్లడించారు. ఈ ప్రక్రియ ద్వారా ఎన్నికల జాబితాల నాణ్యత మెరుగుపడటంతో పాటు ఓటర్ల భాగస్వామ్యం కూడా పెరిగిందని చెప్పారు. ఫీల్డ్ స్థాయిలో ఎదురయ్యే సందేహాల నివృత్తికి ఎన్నికల సంఘం, జిల్లా ఎన్నికల అధికారులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని పేర్కొంటూ, ఎస్‌ఐఆర్ ప్రక్రియను చివరి రోజులకు వాయిదా వేయకుండా ప్రారంభ దశ నుంచే వేగవంతంగా చేపట్టాలని, అవసరమైతే రాజకీయ అనుబంధాలు లేని వాలంటీర్ల సహకారాన్ని వినియోగించుకోవచ్చని సూచించారు. ముందస్తుగా పనులు పూర్తి చేస్తే లోపాలను సరిదిద్దుకునేందుకు తగిన సమయం లభిస్తుందని తెలిపారు. నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా మాట్లాడుతూ, శ్రీశైలంలో జరుగుతున్న ఈ సమావేశంలో, ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రతి బూత్ స్థాయి అధికారి (బీఎల్‌వో) ఇంటింటికీ వెళ్లి ఎన్యూమరేషన్ ఫారమ్‌ల పంపిణీ చేపట్టాలని ఆదేశించారు. ఒకే కుటుంబంలో ఉన్న ప్రతి ఓటరికి ప్రత్యేకంగా ఫారమ్ అందజేసి, వాటిని సేకరించి తప్పనిసరిగా డిజిటలైజ్ చేయాలని సూచించారు. ఫారమ్‌లపై ముందుగానే ఫోటో ముద్రించి ఉన్నప్పటికీ తాజా ఫోటోగ్రాఫ్‌ను తప్పనిసరిగా సేకరించాలని, ఫోటో అందుబాటులో లేని సందర్భాల్లో BLOs యాప్ ద్వారా మాత్రమే కొత్త ఫోటో తీసి నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా అప్‌లోడ్ చేయాలని ఆమె తెలిపారు. డిజిటలైజేషన్ సమయంలో సంబంధిత ఫోటోను ఎన్యూమరేషన్ ఫారమ్‌కు అనుసంధానం చేయాల్సి ఉంటుందని కలెక్టర్ వివరించారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో బీఎల్‌ఓలు, బూత్ స్థాయి ఏజెంట్లు పరస్పర సమన్వయంతో పనిచేయడం అత్యంత కీలకమని కలెక్టర్ రాజకుమారి గణియా పేర్కొన్నారు. రాజకీయ పార్టీలు వెంటనే బూత్ స్థాయి ఏజెంట్ల నియామకాన్ని పూర్తి చేయాలని సూచిస్తూ, ప్రస్తుతం రెండు రాజకీయ పార్టీలు మాత్రమే బూత్ స్థాయి ఏజెంట్లను నియమించాయని తెలిపారు. బూత్ స్థాయి ఏజెంట్ రోజుకు 50 వరకు ఎన్యూమరేషన్ ఫారమ్‌లను సమర్పించే అవకాశం ఉందని, దీనికి ఎటువంటి గరిష్ట పరిమితి లేదన్నారు. అయితే, క్లెయిమ్‌లు, అభ్యంతరాల దశలో రోజుకు 10 చొప్పున దరఖాస్తులు సమర్పించవచ్చని, మొత్తం ప్రక్రియలో గరిష్టంగా 30 వరకు మాత్రమే అనుమతి ఉంటుందని ఆమె వివరించారు. రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ 70 నుంచి 75 శాతం వరకు పూర్తైందని, మిగిలిన అన్‌మ్యాప్డ్ ఓటర్ల వివరాల కోసం భారత ఎన్నికల సంఘం నిర్దేశించిన ధ్రువపత్రాలను తప్పనిసరిగా సేకరించాలని ఆదేశించారు. ఆధార్ కార్డు కేవలం గుర్తింపు పత్రంగా మాత్రమే పరిగణించబడుతుందని, అది నివాస ధ్రువీకరణ లేదా జనన తేదీ నిర్ధారణ పత్రంగా చెల్లదని స్పష్టం చేశారు. అందువల్ల అన్‌మ్యాప్డ్ ఓటర్ల నుంచి అవసరమైన అన్ని ఆధారాలను సేకరించి రికార్డులను పూర్తి చేయాలని సూచిస్తూ, అర్హత కలిగిన ఒక్క ఓటరు కూడా జాబితా వెలుపల మిగిలిపోకుండా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ఎన్యూమరేషన్ ఫారమ్ తిరిగి అందిన తర్వాత మాత్రమే సంబంధిత ఓటరు పేరు ముసాయిదా ఓటర్ల జాబితాలో నమోదు చేయబడుతుందని ఆమె తెలిపారు. ఈ సమావేశంలో ఎన్నికల సంఘం అండర్ సెక్రటరీ శీష్ రామ్ తో పాటు సంబంధిత జిల్లాల ఎన్నికల అధికారులు, ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలు పాల్గొన్నారు.

5 hrs ago
user_Naga kanth
Naga kanth
బండి ఆత్మకూరు, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
5 hrs ago
c4f1934a-f179-4640-96e5-eb1718ee4c1b

భారత ఎన్నికల సంఘం కార్యదర్శులు సంతోష్ కుమార్ దూబే, నవీన్ కుమార్ లు శ్రీశైలంలో నంద్యాల, కర్నూలు, ప్రకాశం, కడప జిల్లాల ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలతో ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్)-2026 అమలుపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఓటర్ల జాబితా ఎన్నికల ప్రక్రియకు పునాది అని నొక్కిచెప్పిన వారు, అర్హులైన ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పించడంతో పాటు అనర్హులు జాబితాలో చేరకుండా ప్రత్యేక సమగ్ర సవరణ-2026ను అత్యంత పారదర్శకంగా, ఖచ్చితత్వంతో నిర్వహించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఓటర్ల జాబితా శుద్ధీకరణలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేదని, డూప్లికేట్, అనర్హ ఓటర్ల నమోదును అరికట్టాలని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా భారత ఎన్నికల సంఘం కార్యదర్శి సంతోష్ కుమార్ దూబే మాట్లాడుతూ, ఎన్నికల జాబితా శుద్ధీకరణ అనేది నిరంతర ప్రక్రియ అని, ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలు, బీఎల్ఓలు సమన్వయంతో పనిచేసి డూప్లికేట్, మరణించిన, వలస వెళ్లిన ఓటర్ల వివరాలను ఎప్పటికప్పుడు నవీకరించాల్సిన బాధ్యత ఉందన్నారు. ప్రజా ప్రాతినిధ్య చట్టం -1951లోని సెక్షన్-21 ప్రకారం ఎన్నికల సంఘానికి ప్రత్యేక సంక్షిప్త సవరణ నిర్వహించే అధికారం ఉందని ఆయన వివరించారు. ఓటరుగా నమోదు కావాలంటే భారతీయ పౌరుడై ఉండి 18 సంవత్సరాల వయస్సు పూర్తై ఉండాలని, సాధారణ నివాసిగా ఉండాలని, చట్టపరంగా అనర్హతలు లేకుండా ఉండాలని తెలిపారు. ఆధార్ కార్డును కేవలం గుర్తింపు పత్రంగా మాత్రమే పరిగణించాలని, దానిని చిరునామా లేదా పుట్టిన తేదీ రుజువుగా స్వీకరించరాదని ఆయన ఆదేశించారు. త్వరలో ప్రారంభమయ్యే ఎన్యుమరేషన్ ప్రక్రియలో బీఎల్ఓలు ప్రతి ఇంటిని సందర్శించి ఫారాలు పంపిణీ చేయాలని, తాళం వేసి ఉన్న ఇళ్లను కనీసం మూడు సార్లు సందర్శించి వివరాలను నమోదు చేయాలని సూచించారు. ఓటరు అందుబాటులో లేని పరిస్థితుల్లో నిర్దేశిత విధానాలను పాటిస్తూ ఫోటో ఆధారాలు, సందర్శన వివరాలు నమోదు చేయాలన్నారు. ఎన్యుమరేషన్ ఫారాలు, ఫోటోలు, అనుబంధ పత్రాల సేకరణలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, లైవ్ ఫోటోలు సేకరించేందుకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచిస్తూ, ఫారాల స్కానింగ్ సమయంలో సంతకాలు, వివరాలు స్పష్టంగా ఉండాలని, నిర్లక్ష్యం వల్ల భవిష్యత్తులో వివాదాలు తలెత్తే అవకాశం ఉందని హెచ్చరించారు. ఓటర్ల జాబితాలో ఉన్న అనామలీలను గుర్తించి సరిదిద్దడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, డెమోగ్రాఫిక్ సిమిలారిటీ ఎంట్రీలు, బహుళ నమోదులు, తప్పు వివరాల నమోదు వంటి అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని దూబే ఆదేశించారు. బీఎల్ఓ యాప్, ఈఆర్ఓ లాగిన్‌లలో కనిపించే హెచ్చరికలను నిర్లక్ష్యం చేయకుండా పరిశీలించాలన్నారు. డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా తయారీలో రేషనలైజేషన్ నిబంధనలను తప్పనిసరిగా అమలు చేయాలని, ఓటర్లు తమ పోలింగ్ కేంద్రానికి సమీపంలోనే ఉండేలా చర్యలు తీసుకోవాలని, ఒకే కుటుంబ సభ్యుల పేర్లు ఒకే పోలింగ్ స్టేషన్ పరిధిలో ఉండేలా ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. క్లెయిమ్‌లు, అభ్యంతరాల పరిష్కారంలో న్యాయబద్ధత, పారదర్శకతకు ప్రాధాన్యం ఇవ్వాలని, దరఖాస్తుల ఆమోదం లేదా తిరస్కరణ సమయంలో సరైన కారణాలు నమోదు చేయాలని, ప్రతి నిర్ణయం ఎన్నికల సంఘానికి సమర్పించే డిజిటల్ అఫిడవిట్‌తో సమానమని గుర్తుంచుకోవాలన్నారు. అర్హుడైన ఓటరు అనవసరంగా జాబితా వెలుపల ఉండకుండా, అనర్హుడు చొరబడకుండా అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన స్పష్టం చేశారు. రాజకీయ పార్టీల బీఎల్‌ఏలతో తరచూ సమావేశాలు నిర్వహించి ప్రక్రియపై అవగాహన కల్పించాలని, ఏఎస్‌డీ (Absent, Shifted, Dead) జాబితాలను క్రమం తప్పకుండా పంచుకోవాలని సూచిస్తూ, ఫామ్-6, 7,

f0629549-0359-4538-916e-6085f9e96a2f

8లతో పాటు క్లెయిమ్‌లు, అభ్యంతరాల వివరాలను నిబంధనల ప్రకారం ప్రజలకు అందుబాటులో ఉంచాలని తెలిపారు. ఎన్నికల సంఘం కార్యదర్శి నవీన్ కుమార్ మాట్లాడుతూ, ఎస్‌ఐఆర్ ప్రక్రియ దేశవ్యాప్తంగా విజయవంతంగా అమలవుతోందని, ఇప్పటివరకు దాదాపు 60 శాతం ఓటర్ల కవరేజీ పూర్తైందని వెల్లడించారు. ఈ ప్రక్రియ ద్వారా ఎన్నికల జాబితాల నాణ్యత మెరుగుపడటంతో పాటు ఓటర్ల భాగస్వామ్యం కూడా పెరిగిందని చెప్పారు. ఫీల్డ్ స్థాయిలో ఎదురయ్యే సందేహాల నివృత్తికి ఎన్నికల సంఘం, జిల్లా ఎన్నికల అధికారులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని పేర్కొంటూ, ఎస్‌ఐఆర్ ప్రక్రియను చివరి రోజులకు వాయిదా వేయకుండా ప్రారంభ దశ నుంచే వేగవంతంగా చేపట్టాలని, అవసరమైతే రాజకీయ అనుబంధాలు లేని వాలంటీర్ల సహకారాన్ని వినియోగించుకోవచ్చని సూచించారు. ముందస్తుగా పనులు పూర్తి చేస్తే లోపాలను సరిదిద్దుకునేందుకు తగిన సమయం లభిస్తుందని తెలిపారు. నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా మాట్లాడుతూ, శ్రీశైలంలో జరుగుతున్న ఈ సమావేశంలో, ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రతి బూత్ స్థాయి అధికారి (బీఎల్‌వో) ఇంటింటికీ వెళ్లి ఎన్యూమరేషన్ ఫారమ్‌ల పంపిణీ చేపట్టాలని ఆదేశించారు. ఒకే కుటుంబంలో ఉన్న ప్రతి ఓటరికి ప్రత్యేకంగా ఫారమ్ అందజేసి, వాటిని సేకరించి తప్పనిసరిగా డిజిటలైజ్ చేయాలని సూచించారు. ఫారమ్‌లపై ముందుగానే ఫోటో ముద్రించి ఉన్నప్పటికీ తాజా ఫోటోగ్రాఫ్‌ను తప్పనిసరిగా సేకరించాలని, ఫోటో అందుబాటులో లేని సందర్భాల్లో BLOs యాప్ ద్వారా మాత్రమే కొత్త ఫోటో తీసి నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా అప్‌లోడ్ చేయాలని ఆమె తెలిపారు. డిజిటలైజేషన్ సమయంలో సంబంధిత ఫోటోను ఎన్యూమరేషన్ ఫారమ్‌కు అనుసంధానం చేయాల్సి ఉంటుందని కలెక్టర్ వివరించారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో బీఎల్‌ఓలు, బూత్ స్థాయి ఏజెంట్లు పరస్పర సమన్వయంతో పనిచేయడం అత్యంత కీలకమని కలెక్టర్ రాజకుమారి గణియా పేర్కొన్నారు. రాజకీయ పార్టీలు వెంటనే బూత్ స్థాయి ఏజెంట్ల నియామకాన్ని పూర్తి చేయాలని సూచిస్తూ, ప్రస్తుతం రెండు రాజకీయ పార్టీలు మాత్రమే బూత్ స్థాయి ఏజెంట్లను నియమించాయని తెలిపారు. బూత్ స్థాయి ఏజెంట్ రోజుకు 50 వరకు ఎన్యూమరేషన్ ఫారమ్‌లను సమర్పించే అవకాశం ఉందని, దీనికి ఎటువంటి గరిష్ట పరిమితి లేదన్నారు. అయితే, క్లెయిమ్‌లు, అభ్యంతరాల దశలో రోజుకు 10 చొప్పున దరఖాస్తులు సమర్పించవచ్చని, మొత్తం ప్రక్రియలో గరిష్టంగా 30 వరకు మాత్రమే అనుమతి ఉంటుందని ఆమె వివరించారు. రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ 70 నుంచి 75 శాతం వరకు పూర్తైందని, మిగిలిన అన్‌మ్యాప్డ్ ఓటర్ల వివరాల కోసం భారత ఎన్నికల సంఘం నిర్దేశించిన ధ్రువపత్రాలను తప్పనిసరిగా సేకరించాలని ఆదేశించారు. ఆధార్ కార్డు కేవలం గుర్తింపు పత్రంగా మాత్రమే పరిగణించబడుతుందని, అది నివాస ధ్రువీకరణ లేదా జనన తేదీ నిర్ధారణ పత్రంగా చెల్లదని స్పష్టం చేశారు. అందువల్ల అన్‌మ్యాప్డ్ ఓటర్ల నుంచి అవసరమైన అన్ని ఆధారాలను సేకరించి రికార్డులను పూర్తి చేయాలని సూచిస్తూ, అర్హత కలిగిన ఒక్క ఓటరు కూడా జాబితా వెలుపల మిగిలిపోకుండా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ఎన్యూమరేషన్ ఫారమ్ తిరిగి అందిన తర్వాత మాత్రమే సంబంధిత ఓటరు పేరు ముసాయిదా ఓటర్ల జాబితాలో నమోదు చేయబడుతుందని ఆమె తెలిపారు. ఈ సమావేశంలో ఎన్నికల సంఘం అండర్ సెక్రటరీ శీష్ రామ్ తో పాటు సంబంధిత జిల్లాల ఎన్నికల అధికారులు, ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలు పాల్గొన్నారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • కాస్త ఈ రోడ్డు కూడా వేసి పుణ్యం కట్టుకోండి మహాప్రభో..! తిమ్మాపురం గ్రామస్తుల ఆవేదన నంద్యాల జిల్లా మహానంది : కాస్త మా వీధి రోడ్డు కూడా వేసి పుణ్యం కట్టుకోండి మహాప్రభో అంటూ గ్రామస్తులు వేడుకుంటున్నారు. శనివారం మహానంది మండలంలో తెల్లవారుజామున కురిసిన వర్షానికి మండల కేంద్రమైన తిమ్మాపురం గ్రామంలో పెద్దమ్మ అరుగు వీధి రోడ్డు జలమయమైంది. చినుకు చిటుక్కుమంటే చాలు రోడ్డంతా వర్షపు నీరు నిలిచిపోయి కాలనీవాసులు తిరగడానికి కూడా లేని పరిస్థితి, గ్రామంలో అన్ని సిసి రోడ్లు అయితే వేశారు. కానీ మా కాలనీ రోడ్డు తరుగు అవడంతో వర్షపు నీరు చేరి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్డు వేసి పుణ్యం కట్టుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
    1
    కాస్త ఈ రోడ్డు కూడా వేసి పుణ్యం కట్టుకోండి మహాప్రభో..! తిమ్మాపురం గ్రామస్తుల ఆవేదన
నంద్యాల జిల్లా మహానంది :  కాస్త మా వీధి రోడ్డు కూడా వేసి పుణ్యం కట్టుకోండి మహాప్రభో అంటూ గ్రామస్తులు వేడుకుంటున్నారు. శనివారం మహానంది మండలంలో తెల్లవారుజామున కురిసిన వర్షానికి మండల కేంద్రమైన తిమ్మాపురం గ్రామంలో పెద్దమ్మ అరుగు వీధి రోడ్డు జలమయమైంది. చినుకు చిటుక్కుమంటే చాలు రోడ్డంతా వర్షపు నీరు నిలిచిపోయి కాలనీవాసులు తిరగడానికి కూడా లేని పరిస్థితి, గ్రామంలో అన్ని సిసి రోడ్లు అయితే వేశారు. కానీ మా కాలనీ రోడ్డు తరుగు అవడంతో వర్షపు నీరు చేరి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్డు వేసి పుణ్యం కట్టుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
    user_Naga kanth
    Naga kanth
    బండి ఆత్మకూరు, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    12 hrs ago
  • నంద్యాల జిల్లాలోని చాగలమర్రి మండలానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు నరేంద్ర రోడ్డు ప్రమాదంలో మరణించారు. కొత్త కారు కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ ప్రక్రియ కోసం నంద్యాల వెళ్లి తిరిగి వస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. ఆళ్లగడ్డ వీరాయిపల్లె సమీపంలో ఆయన కారు రోడ్డు డివైడర్‌ను బలంగా ఢీకొనడంతో పూర్తిగా నుజ్జయింది. ఈ ఘోర ప్రమాదంలో నరేంద్ర సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోగా, కారులో ఉన్న మరో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం వారికి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.
    1
    నంద్యాల జిల్లాలోని చాగలమర్రి మండలానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు నరేంద్ర రోడ్డు ప్రమాదంలో మరణించారు. కొత్త కారు కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ ప్రక్రియ కోసం నంద్యాల వెళ్లి తిరిగి వస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. ఆళ్లగడ్డ వీరాయిపల్లె సమీపంలో ఆయన కారు రోడ్డు డివైడర్‌ను బలంగా ఢీకొనడంతో పూర్తిగా నుజ్జయింది.

ఈ ఘోర ప్రమాదంలో నరేంద్ర సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోగా, కారులో ఉన్న మరో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం వారికి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.
    user_MK news telugu
    MK news telugu
    Media company Midthur, Nandyal•
    12 hrs ago
  • వనపర్తి జిల్లా పోలీసు కార్యాలయం కంట్రోల్ రూమ్ ఎస్సైగా విధులు నిర్వర్తించిన సుబ్బరాజు 37 సంవత్సరాల విశిష్ట సేవలు అందించిన తర్వాత పదవీ విరమణ పొందారు. ప్రజాసేవను పరమావధిగా, క్రమశిక్షణను జీవిత సూత్రంగా భావించి, పోలీసు శాఖలో క్రమశిక్షణ, నిజాయితీ, విధి నిబద్ధతకు చిరునామాగా ఆయన నిలిచారని జిల్లా ఎస్పీ సునీత రెడ్డి పేర్కొన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన పదవీ విరమణ సన్మాన కార్యక్రమంలో అదనపు ఎస్పీ రాజేష్ మీనాతో కలిసి ఎస్పీ సుబ్బరాజును, ఆయన సతీమణిని పూలమాలలు, శాలువాలతో సత్కరించి ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా జ్ఞాపికను అందజేసి ఆయన విశిష్ట సేవలను కొనియాడారు. ఎస్పీ సునీత రెడ్డి మాట్లాడుతూ, కానిస్టేబుల్ స్థాయి నుంచి ఎస్సై స్థాయికి ఎదిగిన సుబ్బరాజు ప్రయాణం యువ పోలీసులకు స్ఫూర్తిదాయకం అన్నారు. పోలీసు ఉద్యోగం కేవలం ఉపాధి కాదని, అది సమాజ భద్రత కోసం చేసే త్యాగయాత్ర అని, అలాంటి యాత్రను 37 సంవత్సరాలపాటు అత్యంత నిజాయితీతో, నిబద్ధతతో కొనసాగించిన అధికారి సుబ్బరాజు అని ఆమె ప్రశంసించారు. 1989లో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా పోలీసు శాఖలో కానిస్టేబుల్‌గా సేవలు ప్రారంభించిన ఆయన కృషి, పట్టుదల, క్రమశిక్షణతో అంచెలంచెలుగా ఎదిగి సబ్ ఇన్‌స్పెక్టర్ హోదాను అందుకోవడం ప్రతి పోలీసు సిబ్బందికి ఆదర్శమని తెలిపారు. మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, గద్వాల, వనపర్తి వంటి ప్రాంతాల్లో, నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో సైతం ధైర్యసాహసాలతో సేవలందించి, తన సర్వీసు కాలమంతా ఎటువంటి ప్రతికూల వ్యాఖ్యలు లేకుండా విధులు నిర్వర్తించడం ఆయన నిష్కళంక సేవలకు నిదర్శనమని ఎస్పీ కొనియాడారు. ఆయన చూపిన విధి నిబద్ధత, ప్రజల పట్ల మానవీయ దృక్పథం, సహోద్యోగులతో స్నేహపూర్వక వైఖరి యువతరం పోలీసులకు మార్గదర్శకంగా నిలుస్తాయని అన్నారు. పదవీ విరమణ ప్రతి ఉద్యోగి జీవితంలో ఒక కొత్త అధ్యాయమని, ఉద్యోగ బాధ్యతల నుంచి విముక్తి పొందిన అనంతరం కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఎస్పీ సునీత రెడ్డి ఆకాంక్షించారు. ప్రభుత్వం అందించే జీపీఎఫ్, ఇన్సూరెన్స్, ఇతర పదవీ విరమణ ప్రయోజనాలను సక్రమంగా వినియోగించుకోవాలని సూచించారు. అంతేకాకుండా, పదవీ విరమణ అనంతరం అందాల్సిన అన్ని ఆర్థిక ప్రయోజనాలు, బకాయిలు త్వరితగతిన అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వనపర్తి డీఎస్పీ గిరిబాబు, డీసీఆర్‌బీ డీఎస్పీ బాలాజీనాయక్, వనపర్తి సీఐ సుగంధ రత్నం, కొత్తకోట సీఐ రాంబాబు, ఆత్మకూరు సీఐ శివకుమార్, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ అప్పలనాయుడు, ఇతర అధికారులు, సుబ్బరాజు కుటుంబ సభ్యులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
    3
    వనపర్తి జిల్లా పోలీసు కార్యాలయం కంట్రోల్ రూమ్ ఎస్సైగా విధులు నిర్వర్తించిన సుబ్బరాజు 37 సంవత్సరాల విశిష్ట సేవలు అందించిన తర్వాత పదవీ విరమణ పొందారు. ప్రజాసేవను పరమావధిగా, క్రమశిక్షణను జీవిత సూత్రంగా భావించి, పోలీసు శాఖలో క్రమశిక్షణ, నిజాయితీ, విధి నిబద్ధతకు చిరునామాగా ఆయన నిలిచారని జిల్లా ఎస్పీ సునీత రెడ్డి పేర్కొన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన పదవీ విరమణ సన్మాన కార్యక్రమంలో అదనపు ఎస్పీ రాజేష్ మీనాతో కలిసి ఎస్పీ సుబ్బరాజును, ఆయన సతీమణిని పూలమాలలు, శాలువాలతో సత్కరించి ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా జ్ఞాపికను అందజేసి ఆయన విశిష్ట సేవలను కొనియాడారు.

ఎస్పీ సునీత రెడ్డి మాట్లాడుతూ, కానిస్టేబుల్ స్థాయి నుంచి ఎస్సై స్థాయికి ఎదిగిన సుబ్బరాజు ప్రయాణం యువ పోలీసులకు స్ఫూర్తిదాయకం అన్నారు. పోలీసు ఉద్యోగం కేవలం ఉపాధి కాదని, అది సమాజ భద్రత కోసం చేసే త్యాగయాత్ర అని, అలాంటి యాత్రను 37 సంవత్సరాలపాటు అత్యంత నిజాయితీతో, నిబద్ధతతో కొనసాగించిన అధికారి సుబ్బరాజు అని ఆమె ప్రశంసించారు. 1989లో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా పోలీసు శాఖలో కానిస్టేబుల్‌గా సేవలు ప్రారంభించిన ఆయన కృషి, పట్టుదల, క్రమశిక్షణతో అంచెలంచెలుగా ఎదిగి సబ్ ఇన్‌స్పెక్టర్ హోదాను అందుకోవడం ప్రతి పోలీసు సిబ్బందికి ఆదర్శమని తెలిపారు. మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, గద్వాల, వనపర్తి వంటి ప్రాంతాల్లో, నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో సైతం ధైర్యసాహసాలతో సేవలందించి, తన సర్వీసు కాలమంతా ఎటువంటి ప్రతికూల వ్యాఖ్యలు లేకుండా విధులు నిర్వర్తించడం ఆయన నిష్కళంక సేవలకు నిదర్శనమని ఎస్పీ కొనియాడారు. ఆయన చూపిన విధి నిబద్ధత, ప్రజల పట్ల మానవీయ దృక్పథం, సహోద్యోగులతో స్నేహపూర్వక వైఖరి యువతరం పోలీసులకు మార్గదర్శకంగా నిలుస్తాయని అన్నారు.

పదవీ విరమణ ప్రతి ఉద్యోగి జీవితంలో ఒక కొత్త అధ్యాయమని, ఉద్యోగ బాధ్యతల నుంచి విముక్తి పొందిన అనంతరం కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఎస్పీ సునీత రెడ్డి ఆకాంక్షించారు. ప్రభుత్వం అందించే జీపీఎఫ్, ఇన్సూరెన్స్, ఇతర పదవీ విరమణ ప్రయోజనాలను సక్రమంగా వినియోగించుకోవాలని సూచించారు. అంతేకాకుండా, పదవీ విరమణ అనంతరం అందాల్సిన అన్ని ఆర్థిక ప్రయోజనాలు, బకాయిలు త్వరితగతిన అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వనపర్తి డీఎస్పీ గిరిబాబు, డీసీఆర్‌బీ డీఎస్పీ బాలాజీనాయక్, వనపర్తి సీఐ సుగంధ రత్నం, కొత్తకోట సీఐ రాంబాబు, ఆత్మకూరు సీఐ శివకుమార్, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ అప్పలనాయుడు, ఇతర అధికారులు, సుబ్బరాజు కుటుంబ సభ్యులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
    user_RK JOURNALIST
    RK JOURNALIST
    వీపనగండ్ల, వనపర్తి, తెలంగాణ•
    3 hrs ago
  • టీడీపీ యువ నాయకులు ఓబుల్ నాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సార్ గారికి తనను తాను ఒక 'పిచ్చి అభిమాని'గా పరిచయం చేసుకుంటూ ఒక కథను సమర్పించారు. ఈ కథ ద్వారా ఆయన చంద్రబాబు నాయుడు పట్ల తనకున్న అభిమానాన్ని వ్యక్తం చేశారు.
    1
    టీడీపీ యువ నాయకులు ఓబుల్ నాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సార్ గారికి తనను తాను ఒక 'పిచ్చి అభిమాని'గా పరిచయం చేసుకుంటూ ఒక కథను సమర్పించారు. ఈ కథ ద్వారా ఆయన చంద్రబాబు నాయుడు పట్ల తనకున్న అభిమానాన్ని వ్యక్తం చేశారు.
    user_బోడికే పెద్ద ఓబులేసు
    బోడికే పెద్ద ఓబులేసు
    Brahmamgarimattam, Y.S.R. (Kadapa)•
    9 hrs ago
  • ధరూరు మండలంలోని నారదగడ్డ చెన్న బసవేశ్వర స్వామి దేవస్థానానికి చెందిన ఆలయ భూమిని గతంలో లీజుకు తీసుకున్న వ్యక్తుల నుండి విడిపించి, ఆ భూమిని దేవస్థాన సేవకులకు వ్యవసాయం చేసుకోవడానికి అందజేయాలని నాగర్ దొడ్డి గ్రామ ప్రజలు తీవ్రంగా వేడుకుంటున్నారు. దేవాలయ భూమిని తక్షణమే కాపాడాలని, ప్రస్తుత పరిస్థితిలో దానిని అలాగే వదిలేస్తే పూర్తిగా కబ్జా అయ్యే ప్రమాదం ఉందని గ్రామ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
    1
    ధరూరు మండలంలోని నారదగడ్డ చెన్న బసవేశ్వర స్వామి దేవస్థానానికి చెందిన ఆలయ భూమిని గతంలో లీజుకు తీసుకున్న వ్యక్తుల నుండి విడిపించి, ఆ భూమిని దేవస్థాన సేవకులకు వ్యవసాయం చేసుకోవడానికి అందజేయాలని నాగర్ దొడ్డి గ్రామ ప్రజలు తీవ్రంగా వేడుకుంటున్నారు. దేవాలయ భూమిని తక్షణమే కాపాడాలని, ప్రస్తుత పరిస్థితిలో దానిని అలాగే వదిలేస్తే పూర్తిగా కబ్జా అయ్యే ప్రమాదం ఉందని గ్రామ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
    user_Ram  Ram
    Ram Ram
    Journalist గద్వాల్, జోగులాంబ గద్వాల్, తెలంగాణ•
    5 hrs ago
  • బద్వేలు మున్సిపాలిటీ అభివృద్ధికి విశేష కృషి చేసిన మున్సిపల్ కమిషనర్ వి.వి. నరసింహారెడ్డి వ్యక్తిగత కారణాల రీత్యా సెలవుపై వెళ్లడం బాధాకరమని ఉమ్మడి కడప డీసీసీ బ్యాంక్ చైర్మన్ మంచూరు సూర్యనారాయణ రెడ్డి కొనియాడారు. ఆయన హయాంలో పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా జరుగుతున్నాయని, ప్రజలకు మెరుగైన సేవలు అందాయని పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం 'డైల్ యువర్ కమిషనర్' వంటి కార్యక్రమాలను ప్రవేశపెట్టి పారిశుద్ధ్య నిర్వహణ, లైటింగ్, వాటర్ సప్లై, పట్టణ అభివృద్ధిలో ఆయన చూపిన చొరవ ప్రశంసనీయమని సూర్యనారాయణ రెడ్డి తెలిపారు. ప్రజల పట్ల అంకితభావంతో పనిచేసే ఇలాంటి కమిషనర్లు చాలా అరుదుగా ఉంటారని అభినందించారు. ఈ సందర్భంగా వి.వి. నరసింహారెడ్డిని ఘనంగా సన్మానించి, ఆయన సేవలను ప్రశంసిస్తూ అభినందనలు తెలియజేశారు. సెలవుల అనంతరం మళ్లీ బద్వేలు మున్సిపాలిటీలోనే విధులు చేపట్టి, పట్టణ అభివృద్ధిని కొనసాగించాలని తమ ఆకాంక్ష అని ఉమ్మడి కడప డీసీసీ బ్యాంక్ చైర్మన్ మంచూరు సూర్యనారాయణ రెడ్డి ఈ సందర్భంగా కోరారు.
    1
    బద్వేలు మున్సిపాలిటీ అభివృద్ధికి విశేష కృషి చేసిన మున్సిపల్ కమిషనర్ వి.వి. నరసింహారెడ్డి వ్యక్తిగత కారణాల రీత్యా సెలవుపై వెళ్లడం బాధాకరమని ఉమ్మడి కడప డీసీసీ బ్యాంక్ చైర్మన్ మంచూరు సూర్యనారాయణ రెడ్డి కొనియాడారు. ఆయన హయాంలో పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా జరుగుతున్నాయని, ప్రజలకు మెరుగైన సేవలు అందాయని పేర్కొన్నారు.

ప్రజా సమస్యల పరిష్కారం కోసం 'డైల్ యువర్ కమిషనర్' వంటి కార్యక్రమాలను ప్రవేశపెట్టి పారిశుద్ధ్య నిర్వహణ, లైటింగ్, వాటర్ సప్లై, పట్టణ అభివృద్ధిలో ఆయన చూపిన చొరవ ప్రశంసనీయమని సూర్యనారాయణ రెడ్డి తెలిపారు. ప్రజల పట్ల అంకితభావంతో పనిచేసే ఇలాంటి కమిషనర్లు చాలా అరుదుగా ఉంటారని అభినందించారు. ఈ సందర్భంగా వి.వి. నరసింహారెడ్డిని ఘనంగా సన్మానించి, ఆయన సేవలను ప్రశంసిస్తూ అభినందనలు తెలియజేశారు.

సెలవుల అనంతరం మళ్లీ బద్వేలు మున్సిపాలిటీలోనే విధులు చేపట్టి, పట్టణ అభివృద్ధిని కొనసాగించాలని తమ ఆకాంక్ష అని ఉమ్మడి కడప డీసీసీ బ్యాంక్ చైర్మన్ మంచూరు సూర్యనారాయణ రెడ్డి ఈ సందర్భంగా కోరారు.
    user_జీ.మౌలాలి.
    జీ.మౌలాలి.
    Photographer బద్వేల్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    38 min ago
  • నరసరావుపేటలో విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఎనిమిదో రోజుకు చేరుకుంది. ఈ చలివేంద్రం సేవలను రూరల్ ఎస్సై కిషోర్ అభినందించారు.
    1
    నరసరావుపేటలో విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఎనిమిదో రోజుకు చేరుకుంది. ఈ చలివేంద్రం సేవలను రూరల్ ఎస్సై కిషోర్ అభినందించారు.
    user_K AMPAIAH ACHARI
    K AMPAIAH ACHARI
    Local News Reporter ఎమ్మిగనూరు, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
  • మంత్రాలయం ప్రాంతంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది, తుంగభద్ర నదిలో కొంతమంది అదృశ్యమయ్యారు. ప్రస్తుతం, గల్లంతైన వారి కోసం విస్తృతమైన సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ గాలింపు చర్యలలో పోలీసులు మరియు మత్స్యకారులు రంగంలోకి దిగి, అదృశ్యమైన వారిని గుర్తించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
    1
    మంత్రాలయం ప్రాంతంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది, తుంగభద్ర నదిలో కొంతమంది అదృశ్యమయ్యారు. ప్రస్తుతం, గల్లంతైన వారి కోసం విస్తృతమైన సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ గాలింపు చర్యలలో పోలీసులు మరియు మత్స్యకారులు రంగంలోకి దిగి, అదృశ్యమైన వారిని గుర్తించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
    user_K AMPAIAH ACHARI
    K AMPAIAH ACHARI
    Local News Reporter ఎమ్మిగనూరు, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.