Shuru
Apke Nagar Ki App…
కోరంగిలో పర్యాటకులకు తప్పిన ప్రమాదం తాళ్లరేవు మండలం చొల్లంగి నుంచి కోరంగి హోప్ ఐలాండకు 15 మంది పర్యాటకులతో వెళ్తున్న బోటు సాంకేతిక లోపంతో నిలిచిపోయింది. దీంతో పర్యాటకులు భయాందోళన చెందారు. అటవీ శాఖ అధికారులు వెంటనే స్పందించి ప్రత్యామ్నాయ బోటును పంపి పర్యాటకులను సురక్షితంగా తరలించేందుకు చర్యలు చేపట్టారు. అందరూ క్షేమంగా ఉన్నారని అధికారులు తెలిపారు. నిత్యం బోట్ల ఫిట్నెస్ను తనిఖీ చేయాలని పర్యాటకులు కోరుతున్నారు.
Alluri DurgaPrasad
కోరంగిలో పర్యాటకులకు తప్పిన ప్రమాదం తాళ్లరేవు మండలం చొల్లంగి నుంచి కోరంగి హోప్ ఐలాండకు 15 మంది పర్యాటకులతో వెళ్తున్న బోటు సాంకేతిక లోపంతో నిలిచిపోయింది. దీంతో పర్యాటకులు భయాందోళన చెందారు. అటవీ శాఖ అధికారులు వెంటనే స్పందించి ప్రత్యామ్నాయ బోటును పంపి పర్యాటకులను సురక్షితంగా తరలించేందుకు చర్యలు చేపట్టారు. అందరూ క్షేమంగా ఉన్నారని అధికారులు తెలిపారు. నిత్యం బోట్ల ఫిట్నెస్ను తనిఖీ చేయాలని పర్యాటకులు కోరుతున్నారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- నల్లజర్ల మండలం పోతవరంలో పొగాకు పనుల కోసం నందిగామ నుంచి వలస వచ్చిన ఎస్సీ కూలీల తాత్కాలిక పాకలను స్థానికుడు కరుటూరి సత్యనారాయణ, అతని కుమారుడు ధ్వంసం చేశారని కూలీలు వాపోయారు. వారి సామాగ్రిని, ఆహారాన్ని చిందరవందర చేయడంతో బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిరుపేద కూలీల ఆవాసాలను పడగొట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, తమకు రక్షణ కల్పించాలని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.1
- మచిలీపట్నం పట్టణంలో ఆయుర్వేద వైద్య సేవలకు విశేష స్పందన లభిస్తోందని శుభకర ఆయుర్వేద వైద్యశాల వైద్యుడు రంగనాధ్ తెలిపారు. గత 18 సంవత్సరాలుగా నిరంతరంగా ప్రజలకు సేవలందించడం తనకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. ప్రాచీన భారతీయ వైద్య విధానమైన ఆయుర్వేదాన్ని ఆధునిక చికిత్సా సదుపాయాలతో కలిపి ప్రజలకు చేరువ చేయడం తమ లక్ష్యమని చెప్పారు. ముఖ్యంగా కేరళ తరహా పంచకర్మ చికిత్సలు, క్షారసూత్ర విధానం ద్వారా మూలవ్యాధి నివారణ, జలూక చికిత్స ద్వారా రక్తశుద్ధి, శిరోధార ద్వారా మానసిక ఒత్తిడి తగ్గింపు వంటి ప్రత్యేక చికిత్సలను అందిస్తున్నామని వివరించారు. దీర్ఘకాలిక నొప్పులు, సంధివాతం, చర్మవ్యాధులు, జీర్ణ సంబంధ సమస్యలకు సహజసిద్ధమైన మందులతో మెరుగైన ఫలితాలు సాధిస్తున్నామన్నారు. అవసరమైన అన్ని ఆయుర్వేద ఔషధాలను స్థానికంగానే అందుబాటులో ఉంచి, తక్కువ ఖర్చుతో నాణ్యమైన సేవలు అందించడం తమ ప్రత్యేకతగా పేర్కొన్నారు. ఇకపై కూడా ప్రజల ఆరోగ్యమే ధ్యేయంగా మరింత మెరుగైన వైద్యసేవలు అందించేందుకు కృషి కొనసాగిస్తామని తెలిపారు.1
- తుమ్మలపాలెం వద్ద ప్రమాదం.. ట్రాఫిక్ కు అంతరాయం *ఇబ్రహీంపట్నం, ఫిబ్రవరి 18,* బుధవారం ఇబ్రహీంపట్నం మండలం తుమ్మలపాలెం వద్ద పోలీసులు ఏర్పాటు చేసిన భారీకేడ్ల వద్ద ఒక కారును లారీ ఢీకొన్న సంఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనతో రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు సమస్యను పరిష్కరించడానికి చర్యలు చేపట్టారు.1
- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ కార్పొరేషన్ పరిధిలోని శ్రీనివాస బంజర కాలనీ వద్ద బుధవారం ఉదయం మహిళను ఢీకొన్న కారు. ములకలపల్లి నుండి పాల్వంచ వస్తున్న కారు అదుపుతప్పి ఆదిలక్ష్మి అనే మహిళను ఢీకొంది. ప్రమాదంలో ఆదిలక్ష్మికి గాయాలు కావటంతో స్థానికులు హుటాహుటిన స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో మూడు తోపుడు బండ్లు ధ్వంసం కాగా కారు ముందు భాగం ధ్వంసం అయింది. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులను స్థానికులు పోలీస్ స్టేషన్ కు తరలించారు. ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.4
- గుంటూరు జిల్లా:కొల్లిపర మండలంలోని గుదిబండి వారి పాలెంలో జరుగుతున్న ఆలయ వార్షికోత్సవాల్లో భాగంగా బుధవారం రెండో రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ గణపతి, నవగ్రహ, దుర్గాదేవి హోమాలతో పాటు కనకదుర్గాదేవికి కలశ పూజ, కుంకుమార్చనలు శాస్త్రోక్తంగా జరిపారు. ఈ పూజా కార్యక్రమాల్లో చుట్టుపక్కల గ్రామాల నుంచి వందలాది భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.1
- విశాఖ తీరంలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూలో, నేవీ సిబ్బంది గౌరవ వందనం స్వీకరించిన రాష్ట్రపతి. ఐఎఫ్ఆర్ కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్, సీఎం, డిప్యూటీ సీఎం.1
- హుకుంపేట: కొట్నాపల్లి-మారెల వెళ్లే దారిలోని ప్రయాణికుల విశ్రాంతి భవనం మందుబాబులకు అడ్డాగా మారింది. భవనం నిండా మందు సీసాలు, గ్లాసులు దర్శనమిస్తుండటంతో ప్రయాణికులు, ముఖ్యంగా మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రజల కోసం నిర్మించిన భవనం అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.1
- గుంటూరు జిల్లా ః *అంబటి రాంబాబు కు బెయిల్ మంజూరు* సత్తెనపల్లి లక్కీ డ్రా కేసులో అరెస్టు అయిన అంబటి ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలు లో రిమాండ్ ఖైదీ గా ఉన్న అంబటి. అంబటి కు కస్టడి పిటిషన్ డిస్మిస్ చేసిన జడ్జి1