logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

కౌలు డబ్బులడిగిన వృద్ధుడిపై దాడి: నిందితుడికి ఏడాది జైలు శిక్ష, జరిమానా.. పత్రికా ప్రకటన - తేదీ:15.09.2026 అన్నమయ్య జిల్లా - మదనపల్లె *పటిష్టమైన సాక్ష్యాధారాలతో కోర్టులో నేరాన్ని రుజువు చేసిన పోలీసులు..* కౌలుకు తీసుకున్న భూమికి డబ్బులు అడిగిన పాపానికి 75 ఏళ్ల వృద్ధుడిపై దాడికి పాల్పడిన కేసులో నిందితుడికి న్యాయస్థానం ఏడాది జైలు శిక్ష, జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. సంబేపల్లి మండలం, శెట్టిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని కడియలవాండ్లపల్లికి చెందిన మద్దిపట్ల నారాయణ (75) తన వ్యవసాయ భూమిని అదే గ్రామానికి చెందిన కడియాల పాపయ్య (52) కు కౌలుకు ఇచ్చాడు. కౌలు గడువు ముగిసినప్పటికీ పాపయ్య డబ్బులు చెల్లించకుండా ఎగవేస్తూ వచ్చాడు. ఈ క్రమంలో తన కౌలు డబ్బులు ఇవ్వాలని అడిగినందుకు ఆగ్రహించిన పాపయ్య, వృద్ధుడైన నారాయణపై భౌతికంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. ఈ ఘటనపై బాధితుని ఫిర్యాదు మేరకు అప్పటి సంబేపల్లి ఎస్ఐ ఎం. హాసం గారు 2018లో కేసు నమోదు చేశారు (రాయచోటి సబ్ డివిజన్, సంబేపల్లి పోలీస్ స్టేషన్ క్రైమ్ నెంబర్: 295/2018, IPC సెక్షన్లు 324, 325). పకడ్బందీగా దర్యాప్తు చేపట్టి, సరైన ఆధారాలను సేకరించి కోర్టులో త్వరితగతిన ఛార్జ్ షీట్ (CC నెంబర్ 508/2019) దాఖలు చేశారు. ఈ కేసుపై రాయచోటి ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ కోర్టు న్యాయమూర్తి శ్రీ టి. సుయోధన గారి ఎదుట జరిగిన విచారణలో నిందితుడు పాపయ్యపై నేరం రుజువు కావడంతో, నేడు అతనికి ఒక సంవత్సరం జైలు శిక్షతో పాటు ₹5,000/- జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తుది తీర్పు వెలువరించారు. ఈ తీర్పుపై అన్నమయ్య జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ గారు హర్షం వ్యక్తం చేశారు. వృద్ధులు, బలహీన వర్గాలపై దాడులకు పాల్పడితే ఎంతటి వారైనా చట్టం ముందు శిక్షార్హులేనని ఈ తీర్పు స్పష్టం చేస్తోందన్నారు. ఈ కేసును మొదటి నుంచి సమర్థవంతంగా పర్యవేక్షించి నిందితుడికి శిక్ష పడేలా చేసిన రాయచోటి డీఎస్పీ ఎం.ఆర్. కృష్ణమోహన్, రాయచోటి రూరల్ సీఐ ఎస్.కె. రోషన్, సంబేపల్లి ఎస్ఐ జి. రవికుమార్ లను ఎస్పీ గారు అభినందించారు. అలాగే, న్యాయస్థానంలో వాదనలు బలంగా వినిపించిన అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎస్.లక్ష్మి సాయి రామకృష్ణను, ఎలాంటి జాప్యం లేకుండా సాక్షులను సకాలంలో కోర్టులో హాజరుపరచడంలో కీలక పాత్ర పోషించిన కోర్టు కానిస్టేబుల్ జి. శివశంకర్ మరియు లైజన్ ఆఫీసర్ వి. మస్తాన్ వలి ల పనితీరును ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు.

12 hrs ago
user_S Reddy Raghavendra Raju
S Reddy Raghavendra Raju
Photographer Punganur, Chittoor•
12 hrs ago
605193ac-ccfd-45f9-b447-29fe8b1e405d

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • వినాయక చవితి వేళ పుంగనూరులో వర్షం పుంగనూరు మండలం, అన్నమయ్య జిల్లా: వినాయక చవితి పర్వదినం సందర్భంగా పుంగనూరులో వర్షం కురవడంతో ప్రజల్లో ఆనందం నెలకొంది. ఉదయం నుంచి ఆకాశం మేఘావృతంగా ఉండగా, సాయంత్రం వర్షం పడటంతో వాతావరణం చల్లబడింది. వినాయకుడి పండుగ వేళ వర్షం కురవడం శుభసూచకంగా భావిస్తూ భక్తులు, స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు. వర్షంతో పుంగనూరు పట్టణంలో ఆహ్లాదకర వాతావరణం నెలకొంది. వినాయక చవితి వేళ పుంగనూరులో వర్షం పుంగనూరు మండలం, అన్నమయ్య జిల్లా: వినాయక చవితి పర్వదినం సందర్భంగా పుంగనూరులో వర్షం కురవడంతో ప్రజల్లో ఆనందం నెలకొంది. ఉదయం నుంచి ఆకాశం మేఘావృతంగా ఉండగా, సాయంత్రం వర్షం పడటంతో వాతావరణం చల్లబడింది. వినాయకుడి పండుగ వేళ వర్షం కురవడం శుభసూచకంగా భావిస్తూ భక్తులు, స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు. వర్షంతో పుంగనూరు పట్టణంలో ఆహ్లాదకర వాతావరణం నెలకొంది.
    1
    వినాయక చవితి వేళ పుంగనూరులో వర్షం
పుంగనూరు మండలం, అన్నమయ్య జిల్లా:
వినాయక చవితి పర్వదినం సందర్భంగా పుంగనూరులో వర్షం కురవడంతో ప్రజల్లో ఆనందం నెలకొంది. ఉదయం నుంచి ఆకాశం మేఘావృతంగా ఉండగా, సాయంత్రం వర్షం పడటంతో వాతావరణం చల్లబడింది.
వినాయకుడి పండుగ వేళ వర్షం కురవడం శుభసూచకంగా భావిస్తూ భక్తులు, స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు. వర్షంతో పుంగనూరు పట్టణంలో ఆహ్లాదకర వాతావరణం నెలకొంది.

    user_పిండిరాల ధనుంజయ్
    పిండిరాల ధనుంజయ్
    Photographer పుంగనూరు, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    10 hrs ago
  • పుంగనూరులో ఎన్టీఆర్ సంజీవని ఆరోగ్య రథం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం పుంగనూరు, అన్నమయ్య జిల్లా పుంగనూరు పట్టణంలో ఈరోజు ఎన్టీఆర్ సంజీవని ఆరోగ్య రథం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించబడింది. ఈ శిబిరంలో పేద, మధ్య తరగతి ప్రజలకు ఉచితంగా బీపీ, షుగర్ పరీక్షలు, గుండె పరీక్షలు, కంటి పరీక్షలు, సాధారణ ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. అనుభవజ్ఞులైన వైద్యులు పాల్గొని ప్రజలకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. ప్రజల ఆరోగ్యమే మా ట్రస్ట్ లక్ష్యమని, ఇలాంటి ఉచిత శిబిరాలను ప్రతి నెలా నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మధు ల్యాబ్ టెక్నీషియన్ ఝాన్సీ రాణి, ఫార్మాసిస్ట్ స్రవంతి, బాల గణేష్ తదితరులు పాల్గొన్నారు ఈ సేవలను సద్వినియోగం చేసుకున్నందుకు ప్రజలు హర్షం వ్యక్తం చేసి, నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు.
    3
    పుంగనూరులో ఎన్టీఆర్ సంజీవని ఆరోగ్య రథం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

పుంగనూరు, అన్నమయ్య జిల్లా
పుంగనూరు పట్టణంలో ఈరోజు ఎన్టీఆర్ సంజీవని ఆరోగ్య రథం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించబడింది.
ఈ శిబిరంలో పేద, మధ్య తరగతి ప్రజలకు ఉచితంగా బీపీ, షుగర్ పరీక్షలు, గుండె పరీక్షలు, కంటి పరీక్షలు, సాధారణ ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. అనుభవజ్ఞులైన వైద్యులు పాల్గొని ప్రజలకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. ప్రజల ఆరోగ్యమే మా ట్రస్ట్ లక్ష్యమని, ఇలాంటి ఉచిత శిబిరాలను ప్రతి నెలా నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ మధు ల్యాబ్ టెక్నీషియన్ ఝాన్సీ రాణి, ఫార్మాసిస్ట్ స్రవంతి, బాల గణేష్ తదితరులు పాల్గొన్నారు
ఈ సేవలను సద్వినియోగం చేసుకున్నందుకు ప్రజలు హర్షం వ్యక్తం చేసి, నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు.
    user_Manjunath Chakkala Sr.Reporter
    Manjunath Chakkala Sr.Reporter
    పుంగనూరు, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    14 hrs ago
  • పలమనేరులో ఘనంగా మండల ,జిల్లా పరిషత్ ప్రాదేశిక సభ్యుల వీడ్కోలు సమావేశం చిత్తూరు జిల్లా పలమనేరు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీటీసీ, జెడ్పిటిసి సభ్యుల వీడ్కోలు సమావేశం ఘనంగా జరిగినది.. 2021 సంవత్సరంలో ఎన్నుకోబడి 2026 సంవత్సరం సెప్టెంబర్ 23వ తేదీన ఎంపీటీసీ జడ్పిటిసిల పదవీకాలం ముగియుండడంతో మంగళవారం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీటీసీ జడ్పిటిసి సభ్యులకు ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఈ కార్యక్రమానికి చిత్తూరు జిల్లా పరిషత్ చైర్మన్ జి శ్రీనివాసులు @ వాసన్న ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైయస్ జగన్ హయాంలో 2021లో ఎంపీటీసీ, జడ్పిటిసిలుగా ఎన్నుకోబడి ప్రజలందరికీ అన్ని రంగాలలో సేవలు అందించిన జడ్పిటిసిలు ఎంపీటీసీలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఎంపీటీసీలు జడ్పీటీసీల పదవీకాలం ముగిసిన తర్వాత నెమ్మదిగా ఉండగా అనునిత్యం ప్రజలతో మమేకమై సేవ చేయాలని మళ్లీ వచ్చే ఎన్నికలలో దీటుగా నిలబడి గెలవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి మల్లికా రంగనాథం, ఎంపీపీ రోజా, వైస్ఎంపీపీ వన్ జయశ్రీ బాలాజీ, వైస్ ఎంపీపీ టు గజేంద్ర ఇతర ఎంపీటీసీలు, వైసిపి నాయకులు రంగనాథం, బాలాజీ, విశ్వనాథరెడ్డి, రాజారెడ్డి మొదలగు వారు పాల్గొన్నారు.
    1
    పలమనేరులో ఘనంగా మండల ,జిల్లా పరిషత్ ప్రాదేశిక సభ్యుల వీడ్కోలు సమావేశం 

చిత్తూరు జిల్లా పలమనేరు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీటీసీ, జెడ్పిటిసి సభ్యుల వీడ్కోలు సమావేశం ఘనంగా జరిగినది.. 2021 సంవత్సరంలో ఎన్నుకోబడి 2026 సంవత్సరం సెప్టెంబర్ 23వ తేదీన ఎంపీటీసీ జడ్పిటిసిల పదవీకాలం ముగియుండడంతో మంగళవారం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీటీసీ జడ్పిటిసి సభ్యులకు ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఈ కార్యక్రమానికి చిత్తూరు జిల్లా పరిషత్ చైర్మన్ జి శ్రీనివాసులు @ వాసన్న  ముఖ్య అతిథిగా పాల్గొన్నారు
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైయస్ జగన్ హయాంలో 2021లో ఎంపీటీసీ, జడ్పిటిసిలుగా ఎన్నుకోబడి ప్రజలందరికీ   అన్ని రంగాలలో సేవలు అందించిన జడ్పిటిసిలు ఎంపీటీసీలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఎంపీటీసీలు జడ్పీటీసీల  పదవీకాలం ముగిసిన తర్వాత నెమ్మదిగా ఉండగా అనునిత్యం ప్రజలతో మమేకమై సేవ చేయాలని మళ్లీ వచ్చే ఎన్నికలలో దీటుగా నిలబడి గెలవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జడ్పిటిసి మల్లికా రంగనాథం, ఎంపీపీ రోజా, వైస్ఎంపీపీ  వన్ జయశ్రీ బాలాజీ,  వైస్ ఎంపీపీ టు గజేంద్ర ఇతర ఎంపీటీసీలు, వైసిపి నాయకులు రంగనాథం, బాలాజీ, విశ్వనాథరెడ్డి, రాజారెడ్డి మొదలగు వారు పాల్గొన్నారు.
    user_Gangamma
    Gangamma
    పలమనేరు, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    9 hrs ago
  • పండగ రోజు పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాల్ని పస్తులు పెట్టిన కూటమి ప్రభుత్వం నెల్లూరు జిల్లాలోని అల్లూరు నగర పంచాయతీ పరిధిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకి 2 నెలలుగా అందని వేతనాలు వినాయక చవితి రోజు కనీసం పండగ సరుకులు కొనుగోలు చేయడానికి కూడా తమ వద్ద డబ్బులు లేవని.. ఆఖరికి దేవుడికి కూడా సంతోషంగా కొబ్బరికాయ కొట్టలేకపోయామని కార్మికులు ఆవేదన వేతనాలు అందే వరకూ విధుల్లోకి వచ్చేది లేదంటూ కార్మికులు విధులు బహిష్కరణ ఠంచనుగా ఒకటో తారీఖున జీతాలు/వేతనాలు ఇచ్చేస్తామంటూ బీరాలు పలికావు.. మరి ఇదేంటి చంద్రబాబు ? పండగ రోజు పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాల్ని పస్తులు పెట్టిన కూటమి ప్రభుత్వం నెల్లూరు జిల్లాలోని అల్లూరు నగర పంచాయతీ పరిధిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకి 2 నెలలుగా అందని వేతనాలు వినాయక చవితి రోజు కనీసం పండగ సరుకులు కొనుగోలు చేయడానికి కూడా తమ వద్ద డబ్బులు లేవని.. ఆఖరికి దేవుడికి కూడా సంతోషంగా కొబ్బరికాయ కొట్టలేకపోయామని కార్మికులు ఆవేదన వేతనాలు అందే వరకూ విధుల్లోకి వచ్చేది లేదంటూ కార్మికులు విధులు బహిష్కరణ ఠంచనుగా ఒకటో తారీఖున జీతాలు/వేతనాలు ఇచ్చేస్తామంటూ బీరాలు పలికావు.. మరి ఇదేంటి చంద్రబాబు ?
    1
    పండగ రోజు  పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాల్ని పస్తులు పెట్టిన కూటమి ప్రభుత్వం 

నెల్లూరు జిల్లాలోని అల్లూరు నగర పంచాయతీ  పరిధిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకి 2 నెలలుగా అందని వేతనాలు 

వినాయక చవితి రోజు కనీసం పండగ సరుకులు కొనుగోలు చేయడానికి కూడా తమ వద్ద డబ్బులు లేవని.. ఆఖరికి దేవుడికి కూడా సంతోషంగా కొబ్బరికాయ కొట్టలేకపోయామని కార్మికులు ఆవేదన 

వేతనాలు అందే వరకూ విధుల్లోకి వచ్చేది లేదంటూ కార్మికులు విధులు బహిష్కరణ 

ఠంచనుగా ఒకటో తారీఖున జీతాలు/వేతనాలు ఇచ్చేస్తామంటూ బీరాలు పలికావు.. మరి ఇదేంటి చంద్రబాబు ?

    user_Stv9 Press
    Stv9 Press
    తిరుపతి (గ్రామీణ), తిరుపతి, ఆంధ్రప్రదేశ్•
    12 hrs ago
  • గుడిపల్లి మండలo. O.N. కొత్తూరు గ్రామ సమీపంలోని కొండ సముద్రం గ్రామ సమీపంలోని వ్యవసాయ పొలాల వద్ద ఆరు ఏనుగులు తిష్టి .. గుడిపల్లి మండలo. O.N. కొత్తూరు గ్రామ సమీపంలోని కొండ సముద్రం గ్రామ సమీపంలోని వ్యవసాయ పొలాల వద్ద ఆరు ఏనుగులు తిష్టి వేసి. ఉండడంతో గ్రామస్తులు భయపడుతున్నారు ఫారెస్ట్ అధికారులు అప్రమతంగా ఉండాలని ప్రజలకు సూచించారు. తమిళనాడు. నుండి కుప్పం వైపు వస్తున్న ప్రజలు , వాహనదారులు. జాగ్రత్తగా ఉండాలని. తెలిపారు
    1
    గుడిపల్లి మండలo. O.N. కొత్తూరు గ్రామ సమీపంలోని కొండ సముద్రం గ్రామ సమీపంలోని వ్యవసాయ పొలాల వద్ద ఆరు ఏనుగులు తిష్టి .. 
గుడిపల్లి మండలo. O.N. కొత్తూరు గ్రామ సమీపంలోని కొండ సముద్రం గ్రామ సమీపంలోని వ్యవసాయ పొలాల వద్ద ఆరు ఏనుగులు తిష్టి వేసి. ఉండడంతో గ్రామస్తులు భయపడుతున్నారు ఫారెస్ట్ అధికారులు అప్రమతంగా ఉండాలని ప్రజలకు సూచించారు. తమిళనాడు. నుండి కుప్పం వైపు వస్తున్న ప్రజలు , వాహనదారులు. జాగ్రత్తగా ఉండాలని. తెలిపారు
    user_Kumar
    Kumar
    Photographer కుప్పం, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    19 hrs ago
  • 2027 సెప్టెంబర్‌లో జగనన్న పాదయాత్ర! 🔥✊🏻 వచ్చే ఎలక్షన్ కోసం జగనన్న సంతోషం కామెంట్స్ 2027 సెప్టెంబర్‌లో జగనన్న పాదయాత్ర! 🔥✊🏻 వచ్చే ఎలక్షన్ కోసం కార్యకర్తలకు మంచిగా అడ్వైజ్ చేస్తున్న జగన్ అన్న సంతోషంగా కామెంట్స్
    1
    2027 సెప్టెంబర్‌లో జగనన్న పాదయాత్ర! 🔥✊🏻 వచ్చే ఎలక్షన్ కోసం జగనన్న సంతోషం కామెంట్స్
2027 సెప్టెంబర్‌లో జగనన్న పాదయాత్ర! 🔥✊🏻 వచ్చే ఎలక్షన్ కోసం కార్యకర్తలకు మంచిగా అడ్వైజ్ చేస్తున్న జగన్ అన్న సంతోషంగా కామెంట్స్
    user_Stv9 Press
    Stv9 Press
    తిరుపతి (గ్రామీణ), తిరుపతి, ఆంధ్రప్రదేశ్•
    21 hrs ago
  • పులివెందుల లోని మైత్రి లే ఔట్ వినాయక స్వామి విగ్రహం వద్ద ఘర్షణ కడప జిల్లా..... పులివెందుల..... పులివెందుల లోని మైత్రి లే ఔట్ వినాయక స్వామి విగ్రహం వద్ద ఘర్షణ....... టిడిపికి చెందిన ఇద్దరు నాయకుల మధ్య ఘర్షణ..... గాలి లోకి ఒక రౌండ్ కాల్పులు చేసిన హజ్ కమిటీ డైరెక్టర్ మాహబూబ్ భాష గన్మెన్.... టిడిపి పార్టీ కి చెందిన పుష్ప నాథ్ రెడ్డి, విజయ్ కుమార్ రెడ్డి ల మధ్య ఘర్షణ...... విజయ్ కుమార్ ఇంటి వద్ద ఉన్న 3 వాహనాలు ధ్వంసం.....
    1
    పులివెందుల లోని మైత్రి లే ఔట్  వినాయక స్వామి విగ్రహం వద్ద ఘర్షణ

కడప జిల్లా.....
పులివెందుల.....
పులివెందుల లోని మైత్రి లే ఔట్  వినాయక స్వామి విగ్రహం వద్ద ఘర్షణ.......
టిడిపికి చెందిన ఇద్దరు నాయకుల మధ్య ఘర్షణ.....
గాలి లోకి ఒక రౌండ్ కాల్పులు చేసిన హజ్ కమిటీ డైరెక్టర్ మాహబూబ్ భాష గన్మెన్....
టిడిపి పార్టీ కి చెందిన పుష్ప నాథ్ రెడ్డి, విజయ్ కుమార్ రెడ్డి ల మధ్య ఘర్షణ...... 
విజయ్ కుమార్ ఇంటి వద్ద ఉన్న 3 వాహనాలు ధ్వంసం.....
    user_K. Ravi Sekhar
    K. Ravi Sekhar
    పులివెందుల, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    21 hrs ago
  • కుప్పం మున్సిపల్ పరిధిలో ని అనిమిగానిపల్లి గ్రామంలో వెంకటేష్ పై కత్తి తో గుర్తు తెలియని వ్యక్తి దాడి. కుప్పం మున్సిపల్ పరిధిలో ని అనిమిగానిపల్లి గ్రామంలో వెంకటేష్ పై గుర్తు తెలియని వ్యక్తి దాడి. ఈరోజు ఉదయం 6గంటలు సమయంలో బూత్రూమ్ వెళ్ళతపాడు అతను పై దాడి చేసినట్లు చెప్పారు. అతను కేకలు వేయండతో వెంటేవే తమ్ముడు కొడుకు వచ్చి సరికి అక్కడ నుంచి పారిపోయారు. వెంకటేష్ ను ప్రైవేట్ ఆస్పత్రులు కు తీసుకున్న వచ్చారు. కుప్పం పోలీసులు కు సమాచారం ఇచ్చిరు పూర్తి వివరాలు తెలిసి ఉంది.
    1
    కుప్పం మున్సిపల్ పరిధిలో ని అనిమిగానిపల్లి గ్రామంలో వెంకటేష్ పై కత్తి తో గుర్తు తెలియని వ్యక్తి దాడి.
కుప్పం మున్సిపల్ పరిధిలో ని అనిమిగానిపల్లి గ్రామంలో వెంకటేష్ పై గుర్తు తెలియని వ్యక్తి దాడి. ఈరోజు ఉదయం 6గంటలు సమయంలో బూత్రూమ్ వెళ్ళతపాడు అతను పై దాడి చేసినట్లు చెప్పారు. అతను కేకలు వేయండతో వెంటేవే తమ్ముడు కొడుకు  వచ్చి సరికి అక్కడ నుంచి పారిపోయారు. వెంకటేష్ ను ప్రైవేట్ ఆస్పత్రులు కు తీసుకున్న వచ్చారు. కుప్పం పోలీసులు కు సమాచారం ఇచ్చిరు పూర్తి వివరాలు తెలిసి ఉంది.
    user_Kumar
    Kumar
    Photographer కుప్పం, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    17 hrs ago
  • పులివెందుల పట్టణంలోని మైత్రి లేఔట్లో అర్ధరాత్రి ఇరు వర్గాల ఘర్షణ సీసీ ఫుటేజ్ కడప జిల్లా పులివెందుల పట్టణంలోని మైత్రి లేఔట్లో అర్ధరాత్రి ఇరు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించిన సీసీ టీవీ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఓ నాయకుడి ఇంటి వద్దకు జనాలు గుంపుగా వెళ్లి కర్రలతో వాహనాలను ధ్వంసం చేస్తున్న దృశ్యాలు సీసీ ఫుటేజ్లో చూడవచ్చు. విషయం తెలుసుకున్న పోలీసులు మెరుపు వేగంతో ఘటనా స్థలానికి చేరుకుని జనాలను చల్లాచెదురు చేశారు.
    1
    పులివెందుల పట్టణంలోని మైత్రి లేఔట్లో అర్ధరాత్రి ఇరు వర్గాల ఘర్షణ సీసీ ఫుటేజ్
కడప జిల్లా పులివెందుల పట్టణంలోని మైత్రి లేఔట్లో అర్ధరాత్రి ఇరు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించిన సీసీ టీవీ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్
అవుతున్నాయి. ఓ నాయకుడి ఇంటి వద్దకు జనాలు గుంపుగా వెళ్లి కర్రలతో వాహనాలను ధ్వంసం చేస్తున్న దృశ్యాలు  సీసీ ఫుటేజ్లో చూడవచ్చు. విషయం
తెలుసుకున్న పోలీసులు మెరుపు వేగంతో ఘటనా స్థలానికి చేరుకుని జనాలను చల్లాచెదురు చేశారు.
    user_LAKKU SIVA SANKAR reddy
    LAKKU SIVA SANKAR reddy
    Court reporter పులివెందుల, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    18 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.