logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ఆదివారం అర్ధరాత్రి సత్తుపల్లి మండలం కిష్టారం గ్రామ శివారులో భార్యాభర్తలు కొబ్బరి బోండాలు నరికే కత్తులతో దాడి చేయగా ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని సత్తుపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బంధువులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఏపీలోని తిరువూరు మండలం నుండి వచ్చిన నాగమణి, హనుమంతరావు అనే భార్యాభర్తలు కిష్టారం గ్రామ సమీపంలో వ్యభిచార గృహం నిర్వహిస్తున్నారు. దీనిపై కిష్టారం ఎస్సీ కాలనీకి చెందిన గ్రామ పెద్దలు మారోజు నాగేశ్వరరావు, నక్క వెంకటేశ్వరరావు వెళ్లి, గ్రామ సమీపంలో వ్యభిచార గృహం నడపడం సరైన పద్ధతి కాదని హెచ్చరించారు. దీంతో ఇరువురి మధ్య వివాదం తలెత్తింది. ఈ క్రమంలోనే నాగమణి, హనుమంతరావులు ఆ ఇద్దరు గ్రామ పెద్దలపై కొబ్బరి బొండాలు నరికే కత్తితో దాడి చేయడంతో వారికి తీవ్ర గాయాలయ్యాయి. సత్తుపల్లి 108 సిబ్బంది గాయపడిన వారిని సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అక్కడి వైద్యులు వైద్య సేవలు అందిస్తున్నారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. ఈ దాడికి పాల్పడిన నాగమణి, హనుమంతరావులు పరారీలో ఉండగా, కొత్తగూడెంకు చెందిన సోనిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటనపై వి.యం.బంజర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

2 hrs ago
user_V Ramarao
V Ramarao
సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
2 hrs ago
9a110dae-3dd8-46e6-9246-b70cee5a56c2

ఆదివారం అర్ధరాత్రి సత్తుపల్లి మండలం కిష్టారం గ్రామ శివారులో భార్యాభర్తలు కొబ్బరి బోండాలు నరికే కత్తులతో దాడి చేయగా ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని సత్తుపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బంధువులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఏపీలోని తిరువూరు మండలం నుండి వచ్చిన నాగమణి, హనుమంతరావు అనే భార్యాభర్తలు కిష్టారం గ్రామ సమీపంలో వ్యభిచార గృహం నిర్వహిస్తున్నారు. దీనిపై కిష్టారం ఎస్సీ కాలనీకి చెందిన గ్రామ పెద్దలు మారోజు నాగేశ్వరరావు, నక్క వెంకటేశ్వరరావు వెళ్లి, గ్రామ సమీపంలో వ్యభిచార గృహం నడపడం సరైన పద్ధతి కాదని హెచ్చరించారు. దీంతో

3b6e04c5-846f-42ef-b371-58a541ec606f

ఇరువురి మధ్య వివాదం తలెత్తింది. ఈ క్రమంలోనే నాగమణి, హనుమంతరావులు ఆ ఇద్దరు గ్రామ పెద్దలపై కొబ్బరి బొండాలు నరికే కత్తితో దాడి చేయడంతో వారికి తీవ్ర గాయాలయ్యాయి. సత్తుపల్లి 108 సిబ్బంది గాయపడిన వారిని సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అక్కడి వైద్యులు వైద్య సేవలు అందిస్తున్నారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. ఈ దాడికి పాల్పడిన నాగమణి, హనుమంతరావులు పరారీలో ఉండగా, కొత్తగూడెంకు చెందిన సోనిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటనపై వి.యం.బంజర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

More news from తెలంగాణ and nearby areas
  • ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బుగ్గపాడు ఫుడ్ పార్క్ భూ వివాదంపై ఎమ్మెల్యే మట్టా రాగమయి స్పందించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, కొందరు రాజకీయ ప్రయోజనాల కోసం ఫుడ్ పార్క్ విషయంలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. గ్రామీణ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని, అదే ఉద్దేశంతో ఫుడ్ పార్క్‌ను అభివృద్ధి చేస్తున్నామని స్పష్టం చేశారు. బుగ్గపాడు ఫుడ్ పార్క్‌ను ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టామని, గతంలో మూతపడిన ఈ ప్రాజెక్టును తమ ప్రభుత్వం తిరిగి పునరుద్ధరించిందని ఎమ్మెల్యే రాగమయి తెలిపారు. 2008 నుంచి 2014 వరకు రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో 61.13 ఎకరాల విస్తీర్ణంలో భూసేకరణ జరిగిందని, గిరిజన ప్రాంతాల అభివృద్ధి, స్థానికులకు ఉపాధి కల్పించడమే దీని ప్రధాన ఉద్దేశమని ఆమె పేర్కొన్నారు. ఇప్పటి వరకు రూ.109 కోట్లతో ఫుడ్ పార్క్ అభివృద్ధి పనులు చేపట్టగా, కొన్ని కంపెనీలు ఇప్పటికే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేశాయని వివరించారు. అయితే, పరిశ్రమలు స్థాపించేందుకు పెట్టుబడిదారులు ముందుకు రాకపోవడంతో, రూ.650 కోట్లకు పైగా పెట్టుబడితో దీపక్ నెక్స్ట్ జెన్ కంపెనీ ముందుకు వచ్చిందని ఎమ్మెల్యే వెల్లడించారు. ఈ సంస్థ రొయ్యల ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేసి సుమారు 3 వేల మందికి ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చింది. దీనికోసం ఇతర ప్రాంతాల్లో కూడా భూములను పరిశీలించినప్పటికీ, బుగ్గపాడు అనుకూలమని భావించి, మంత్రులు తుమ్మల, పొంగులేటి, స్థానిక ప్రజాప్రతినిధుల ఆమోదంతోనే భూములు కేటాయించామని రాగమయి స్పష్టం చేశారు. ఈ ప్రక్రియలో ఎలాంటి అవకతవకలు లేదా చెడు కోణం లేదని ఆమె తేల్చిచెప్పారు. అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతుంటే కొందరు రాజకీయ పార్టీలు రంధ్రాన్వేషణ చేసి అడ్డంకులు సృష్టించడం సరికాదని ఎమ్మెల్యే మట్టా రాగమయి విమర్శించారు. ప్రాంత ప్రజల సంక్షేమం, ఉపాధి కల్పనే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆమె పునరుద్ఘాటించారు.
    1
    ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బుగ్గపాడు ఫుడ్ పార్క్ భూ వివాదంపై ఎమ్మెల్యే మట్టా రాగమయి స్పందించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, కొందరు రాజకీయ ప్రయోజనాల కోసం ఫుడ్ పార్క్ విషయంలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. గ్రామీణ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని, అదే ఉద్దేశంతో ఫుడ్ పార్క్‌ను అభివృద్ధి చేస్తున్నామని స్పష్టం చేశారు.

బుగ్గపాడు ఫుడ్ పార్క్‌ను ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టామని, గతంలో మూతపడిన ఈ ప్రాజెక్టును తమ ప్రభుత్వం తిరిగి పునరుద్ధరించిందని ఎమ్మెల్యే రాగమయి తెలిపారు. 2008 నుంచి 2014 వరకు రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో 61.13 ఎకరాల విస్తీర్ణంలో భూసేకరణ జరిగిందని, గిరిజన ప్రాంతాల అభివృద్ధి, స్థానికులకు ఉపాధి కల్పించడమే దీని ప్రధాన ఉద్దేశమని ఆమె పేర్కొన్నారు. ఇప్పటి వరకు రూ.109 కోట్లతో ఫుడ్ పార్క్ అభివృద్ధి పనులు చేపట్టగా, కొన్ని కంపెనీలు ఇప్పటికే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేశాయని వివరించారు.

అయితే, పరిశ్రమలు స్థాపించేందుకు పెట్టుబడిదారులు ముందుకు రాకపోవడంతో, రూ.650 కోట్లకు పైగా పెట్టుబడితో దీపక్ నెక్స్ట్ జెన్ కంపెనీ ముందుకు వచ్చిందని ఎమ్మెల్యే వెల్లడించారు. ఈ సంస్థ రొయ్యల ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేసి సుమారు 3 వేల మందికి ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చింది. దీనికోసం ఇతర ప్రాంతాల్లో కూడా భూములను పరిశీలించినప్పటికీ, బుగ్గపాడు అనుకూలమని భావించి, మంత్రులు తుమ్మల, పొంగులేటి, స్థానిక ప్రజాప్రతినిధుల ఆమోదంతోనే భూములు కేటాయించామని రాగమయి స్పష్టం చేశారు. ఈ ప్రక్రియలో ఎలాంటి అవకతవకలు లేదా చెడు కోణం లేదని ఆమె తేల్చిచెప్పారు.

అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతుంటే కొందరు రాజకీయ పార్టీలు రంధ్రాన్వేషణ చేసి అడ్డంకులు సృష్టించడం సరికాదని ఎమ్మెల్యే మట్టా రాగమయి విమర్శించారు. ప్రాంత ప్రజల సంక్షేమం, ఉపాధి కల్పనే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆమె పునరుద్ఘాటించారు.
    user_Chandu
    Chandu
    Local News Reporter సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    18 hrs ago
  • సత్తుపల్లి సింగరేణిలోని జేవియర్ ఓసి కిష్టారంతో పాటు జిఎం కార్యాలయాల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమాన్ని గొప్పగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిఎం చింతల శ్రీనివాస్ గారు, ఎస్ ఓ టూ జిఎం శ్రీ బొల్లం శ్రీనివాస్ గారు, ఏరియా ఇంజనీర్ కె సోమశేఖర్ రావు గారు, జే వి ఆర్ ఓ సి ప్రాజెక్టు అధికారి ఏ ఎల్ ఎస్ వి సునీల్ వర్మ గారు, జే వి ఆర్ సి హెచ్ పి ఇన్చార్జి శ్రీ సాయినాథ్ గారితో పాటు ఉద్యోగ కార్మికులందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు.
    4
    సత్తుపల్లి సింగరేణిలోని జేవియర్ ఓసి కిష్టారంతో పాటు జిఎం కార్యాలయాల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమాన్ని గొప్పగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిఎం చింతల శ్రీనివాస్ గారు, ఎస్ ఓ టూ జిఎం శ్రీ బొల్లం శ్రీనివాస్ గారు, ఏరియా ఇంజనీర్ కె సోమశేఖర్ రావు గారు, జే వి ఆర్ ఓ సి ప్రాజెక్టు అధికారి ఏ ఎల్ ఎస్ వి సునీల్ వర్మ గారు, జే వి ఆర్ సి హెచ్ పి ఇన్చార్జి శ్రీ సాయినాథ్ గారితో పాటు ఉద్యోగ కార్మికులందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు.
    user_Sudhakar kota
    Sudhakar kota
    Photographer పెనుబల్లి, ఖమ్మం, తెలంగాణ•
    12 hrs ago
  • 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని పెనుబల్లి మండలంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఆయుష్ విభాగం మరియు హార్ట్ ఫుల్ వారి ఆధ్వర్యంలో యోగాసనాలు, యోగ ప్రాముఖ్యతను వివరిస్తూ వివిధ విన్యాసాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హోమియో డాక్టర్ శ్రీనివాస్, యోగా మాస్టర్ సిహెచ్ రామకృష్ణ, లంక సాగర్ పీహెచ్‌సీ వైద్యులు కిరణ్ కుమార్, ఎంఈఓ మోహన్ రావు, వియం బంజర్ సర్పంచ్, గంగదేవి పాడు సర్పంచ్ మాలోత్ కృష్ణ, హార్ట్ ఫుల్ నెస్ నుండి రమణ, ఆశా వర్కర్లు, ఆయుష్ విభాగం నుండి సాధన చేస్తున్న యోగా సాధకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సన్మాన కార్యక్రమం కూడా నిర్వహించారు.
    4
    12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని పెనుబల్లి మండలంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఆయుష్ విభాగం మరియు హార్ట్ ఫుల్ వారి ఆధ్వర్యంలో యోగాసనాలు, యోగ ప్రాముఖ్యతను వివరిస్తూ వివిధ విన్యాసాలు ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో హోమియో డాక్టర్ శ్రీనివాస్, యోగా మాస్టర్ సిహెచ్ రామకృష్ణ, లంక సాగర్ పీహెచ్‌సీ వైద్యులు కిరణ్ కుమార్, ఎంఈఓ మోహన్ రావు, వియం బంజర్ సర్పంచ్, గంగదేవి పాడు సర్పంచ్ మాలోత్ కృష్ణ, హార్ట్ ఫుల్ నెస్ నుండి రమణ, ఆశా వర్కర్లు, ఆయుష్ విభాగం నుండి సాధన చేస్తున్న యోగా సాధకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సన్మాన కార్యక్రమం కూడా నిర్వహించారు.
    user_Chalamala narasimharao
    Chalamala narasimharao
    పెనుబల్లి, ఖమ్మం, తెలంగాణ•
    20 hrs ago
  • అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా పశ్చిమ బెంగాల్‌లోని జల్దపార నేషనల్ పార్కులో ప్రకృతి ఒడిలో ప్రత్యేక వేడుకలు జరిగాయి. పచ్చని అడవి మధ్య, నదీ తీరాన అటవీ శాఖ సిబ్బంది అత్యంత ఉత్సాహంగా యోగాసనాలు వేశారు. ఈ ప్రత్యేక ప్రదర్శనలో సిబ్బందితో పాటు మావటిల సమక్షంలో ఏనుగులు కూడా పాల్గొని ఈ కార్యక్రమానికి మరింత ప్రత్యేక ఆకర్షణను తెచ్చాయి. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం విస్తృతంగా వైరల్ అవుతోంది.
    1
    అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా పశ్చిమ బెంగాల్‌లోని జల్దపార నేషనల్ పార్కులో ప్రకృతి ఒడిలో ప్రత్యేక వేడుకలు జరిగాయి. పచ్చని అడవి మధ్య, నదీ తీరాన అటవీ శాఖ సిబ్బంది అత్యంత ఉత్సాహంగా యోగాసనాలు వేశారు. ఈ ప్రత్యేక ప్రదర్శనలో సిబ్బందితో పాటు మావటిల సమక్షంలో ఏనుగులు కూడా పాల్గొని ఈ కార్యక్రమానికి మరింత ప్రత్యేక ఆకర్షణను తెచ్చాయి. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం విస్తృతంగా వైరల్ అవుతోంది.
    user_పామర్తి రవి కుమార్
    పామర్తి రవి కుమార్
    General Store నూజివీడు, ఏలూరు, ఆంధ్రప్రదేశ్•
    22 hrs ago
  • ఖమ్మం జిల్లాలోని చింతకాని మండలం లచ్చగూడెం గ్రామానికి ఈనెల 30న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో, PDSU ఖమ్మం జిల్లా కమిటీ విద్యారంగ సమస్యలపై ఆయనకు బహిరంగ లేఖ రాసింది. ఖమ్మం జిల్లాలో నెలకొన్న విద్యారంగ సమస్యలపై ముఖ్యమంత్రి స్పష్టమైన హామీ ఇవ్వాలని PDSU డిమాండ్ చేస్తోంది. పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ మరియు స్కాలర్‌షిప్‌లను వెంటనే విడుదల చేయాలని, అలాగే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలను మూసివేస్తామనే మాటలను వెనక్కి తీసుకోవాలని వారు ఆ లేఖలో స్పష్టం చేశారు. PDSU లేవనెత్తిన ప్రధాన డిమాండ్లలో ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమలు చేయడం, ఖమ్మం జిల్లాలో జనరల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయడం ఉన్నాయి. అద్దె భవనాలలో కొనసాగుతున్న హాస్టళ్లు, గురుకులాలకు సొంత భవనాలను నిర్మించాలని, పెండింగ్‌లో ఉన్న ఉపాధ్యాయులు, లెక్చరర్లు, ప్రొఫెసర్‌ల పోస్టులను భర్తీ చేయాలని వారు కోరారు. రెగ్యులర్ ఎంఈఓ, డిఈఓ పోస్టులను భర్తీ చేయడంతో పాటు, అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు కార్పొరేట్ విద్యాసంస్థలను రద్దు చేయాలని PDSU డిమాండ్ చేసింది. అనుమతులు లేకుండా నడుస్తున్న ప్రైవేటు కార్పొరేట్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకొని, వాటి గుర్తింపును రద్దు చేయాలని సూచించారు. హాస్టల్ విద్యార్థులకు మెను ఛార్జీలు విడుదల చేయాలని, ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ప్రతి మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలను ఏర్పాటు చేయాలని, పెండింగ్‌లో ఉన్న జూనియర్ కళాశాల బిల్డింగులను పూర్తి చేయాలని డిమాండ్లలో పేర్కొన్నారు. అటానమస్ ఎస్ఆర్ బీజీ ఎన్ఆర్ డిగ్రీ, పీజీ కళాశాలలకు నూతన బిల్డింగ్, కేయూ అనుబంధ పీజీ బీపీడీ డిగ్రీ కళాశాలకు జనరల్ గర్ల్స్ హాస్టల్ ఏర్పాటు చేయాలని, ప్రతి మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల అనుబంధ హాస్టళ్లను ఏర్పాటు చేయాలని PDSU విజ్ఞప్తి చేసింది. పెండింగ్‌లో ఉన్న జేఎన్‌టీయూహెచ్ కళాశాల మరియు మెడికల్ కళాశాల బిల్డింగులను పూర్తి చేయాలని, ప్రతి గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని కూడా వారు డిమాండ్ చేశారు. విద్యారంగ సమస్యలతో పాటు, నిరుద్యోగ సమస్యను, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను కూడా పరిష్కరించాలని PDSU కోరింది. ఈ సమస్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చర్చించడానికి అవకాశం ఇవ్వాలని PDSU ఖమ్మం జిల్లా కమిటీ డిమాండ్ చేస్తోంది. ఒకవేళ తమ డిమాండ్లు నెరవేర్చకపోతే లేదా ముఖ్యమంత్రి తమకు కలిసే అవకాశం ఇవ్వకపోతే, ఆందోళన కార్యక్రమాలు చేపడతామని PDSU హెచ్చరించింది.
    1
    ఖమ్మం జిల్లాలోని చింతకాని మండలం లచ్చగూడెం గ్రామానికి ఈనెల 30న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో, PDSU ఖమ్మం జిల్లా కమిటీ విద్యారంగ సమస్యలపై ఆయనకు బహిరంగ లేఖ రాసింది. ఖమ్మం జిల్లాలో నెలకొన్న విద్యారంగ సమస్యలపై ముఖ్యమంత్రి స్పష్టమైన హామీ ఇవ్వాలని PDSU డిమాండ్ చేస్తోంది. పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ మరియు స్కాలర్‌షిప్‌లను వెంటనే విడుదల చేయాలని, అలాగే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలను మూసివేస్తామనే మాటలను వెనక్కి తీసుకోవాలని వారు ఆ లేఖలో స్పష్టం చేశారు.

PDSU లేవనెత్తిన ప్రధాన డిమాండ్లలో ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమలు చేయడం, ఖమ్మం జిల్లాలో జనరల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయడం ఉన్నాయి. అద్దె భవనాలలో కొనసాగుతున్న హాస్టళ్లు, గురుకులాలకు సొంత భవనాలను నిర్మించాలని, పెండింగ్‌లో ఉన్న ఉపాధ్యాయులు, లెక్చరర్లు, ప్రొఫెసర్‌ల పోస్టులను భర్తీ చేయాలని వారు కోరారు. రెగ్యులర్ ఎంఈఓ, డిఈఓ పోస్టులను భర్తీ చేయడంతో పాటు, అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు కార్పొరేట్ విద్యాసంస్థలను రద్దు చేయాలని PDSU డిమాండ్ చేసింది. అనుమతులు లేకుండా నడుస్తున్న ప్రైవేటు కార్పొరేట్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకొని, వాటి గుర్తింపును రద్దు చేయాలని సూచించారు. హాస్టల్ విద్యార్థులకు మెను ఛార్జీలు విడుదల చేయాలని, ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ప్రతి మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలను ఏర్పాటు చేయాలని, పెండింగ్‌లో ఉన్న జూనియర్ కళాశాల బిల్డింగులను పూర్తి చేయాలని డిమాండ్లలో పేర్కొన్నారు. అటానమస్ ఎస్ఆర్ బీజీ ఎన్ఆర్ డిగ్రీ, పీజీ కళాశాలలకు నూతన బిల్డింగ్, కేయూ అనుబంధ పీజీ బీపీడీ డిగ్రీ కళాశాలకు జనరల్ గర్ల్స్ హాస్టల్ ఏర్పాటు చేయాలని, ప్రతి మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల అనుబంధ హాస్టళ్లను ఏర్పాటు చేయాలని PDSU విజ్ఞప్తి చేసింది. పెండింగ్‌లో ఉన్న జేఎన్‌టీయూహెచ్ కళాశాల మరియు మెడికల్ కళాశాల బిల్డింగులను పూర్తి చేయాలని, ప్రతి గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని కూడా వారు డిమాండ్ చేశారు. విద్యారంగ సమస్యలతో పాటు, నిరుద్యోగ సమస్యను, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను కూడా పరిష్కరించాలని PDSU కోరింది.

ఈ సమస్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చర్చించడానికి అవకాశం ఇవ్వాలని PDSU ఖమ్మం జిల్లా కమిటీ డిమాండ్ చేస్తోంది. ఒకవేళ తమ డిమాండ్లు నెరవేర్చకపోతే లేదా ముఖ్యమంత్రి తమకు కలిసే అవకాశం ఇవ్వకపోతే, ఆందోళన కార్యక్రమాలు చేపడతామని PDSU హెచ్చరించింది.
    user_ARUNKUMAR
    ARUNKUMAR
    Local News Reporter నేలకొండపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    1 hr ago
  • ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య జగ్గయ్యపేట మండలంలోని గరుడాచలంలో, అలాగే రెడ్డి నాయక్ తండాలో జరుగుతున్న రహదారి నిర్మాణ పనులను పరిశీలించారు. గరుడాచలంలోని శ్రీ వీర నరసింహ స్వామి వారి పుణ్యక్షేత్రానికి DMF నిధుల ద్వారా రూ.1.50 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న నూతన ఘాట్ రోడ్డు పనులు ఇందులో భాగంగా ఉన్నాయి. అంతేకాకుండా, రెడ్డి నాయక్ తండాలో రూ.90 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న రహదారి ప్రతిపాదిత మార్గాన్ని కూడా ఆయన పరిశీలించారు. ఈ అభివృద్ధి పనుల పరిశీలనలో ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్యతో పాటు పంచాయతీ రాజ్ శాఖ సూపరింటెండింగ్ ఇంజనీర్, డివిజనల్ ఇంజనీర్ మరియు స్థానిక నాయకులు ఉన్నారు. వీరందరితో కలిసి ఆయన జరుగుతున్న పనులను సమీక్షించారు.
    1
    ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య జగ్గయ్యపేట మండలంలోని గరుడాచలంలో, అలాగే రెడ్డి నాయక్ తండాలో జరుగుతున్న రహదారి నిర్మాణ పనులను పరిశీలించారు. గరుడాచలంలోని శ్రీ వీర నరసింహ స్వామి వారి పుణ్యక్షేత్రానికి DMF నిధుల ద్వారా రూ.1.50 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న నూతన ఘాట్ రోడ్డు పనులు ఇందులో భాగంగా ఉన్నాయి. అంతేకాకుండా, రెడ్డి నాయక్ తండాలో రూ.90 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న రహదారి ప్రతిపాదిత మార్గాన్ని కూడా ఆయన పరిశీలించారు.

ఈ అభివృద్ధి పనుల పరిశీలనలో ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్యతో పాటు పంచాయతీ రాజ్ శాఖ సూపరింటెండింగ్ ఇంజనీర్, డివిజనల్ ఇంజనీర్ మరియు స్థానిక నాయకులు ఉన్నారు. వీరందరితో కలిసి ఆయన జరుగుతున్న పనులను సమీక్షించారు.
    user_Kakaraparthi ramesh
    Kakaraparthi ramesh
    జగ్గయ్యపేట, ఎన్టీఆర్, ఆంధ్రప్రదేశ్•
    14 hrs ago
  • సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి బుగ్గపాడు ఫుడ్ పార్క్ అభివృద్ధిపై బీఆర్ఎస్ నాయకుల తీరును తీవ్రంగా ఖండించారు. ఫుడ్ పార్క్ అభివృద్ధిని అడ్డుకునే ఉద్దేశ్యంతో బీఆర్ఎస్ నాయకులు అవాస్తవ ప్రచారం చేస్తున్నారని ఆమె ఆరోపించారు. గిరిజన మరియు వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసమే ఈ ఫుడ్ పార్క్ ఏర్పాటు చేయబడిందని ఎమ్మెల్యే రాగమయి స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చొరవతో ఫుడ్ పార్క్‌ను తిరిగి అభివృద్ధి చేస్తున్నామని ఆమె తెలిపారు. ఈ క్రమంలో దీపక్ కంపెనీ ద్వారా మూడు వేల మందికి ఉపాధి కల్పించే పరిశ్రమను తీసుకువస్తున్నట్లు ఆమె వెల్లడించారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఒక్క పరిశ్రమను కూడా తీసుకురాలేకపోయారని ఆమె విమర్శించారు. అవినీతి ఆరోపణలకు సంబంధించి బీఆర్ఎస్ నాయకుల వద్ద ఏవైనా ఆధారాలు ఉంటే, ఈ నెల 24న జరగనున్న కేటీఆర్ సభలో బహిరంగ చర్చకు రావాలని మట్టా రాగమయి సవాల్ విసిరారు. అభివృద్ధిని ప్రోత్సహించాలే తప్ప రాజకీయ కారణాలతో అడ్డుకోవద్దని సూచించిన ఆమె, సోషల్ మీడియా మరియు యూట్యూబ్‌లలో తప్పుడు ప్రచారాలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు.
    4
    సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి బుగ్గపాడు ఫుడ్ పార్క్ అభివృద్ధిపై బీఆర్ఎస్ నాయకుల తీరును తీవ్రంగా ఖండించారు. ఫుడ్ పార్క్ అభివృద్ధిని అడ్డుకునే ఉద్దేశ్యంతో బీఆర్ఎస్ నాయకులు అవాస్తవ ప్రచారం చేస్తున్నారని ఆమె ఆరోపించారు.

గిరిజన మరియు వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసమే ఈ ఫుడ్ పార్క్ ఏర్పాటు చేయబడిందని ఎమ్మెల్యే రాగమయి స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చొరవతో ఫుడ్ పార్క్‌ను తిరిగి అభివృద్ధి చేస్తున్నామని ఆమె తెలిపారు. ఈ క్రమంలో దీపక్ కంపెనీ ద్వారా మూడు వేల మందికి ఉపాధి కల్పించే పరిశ్రమను తీసుకువస్తున్నట్లు ఆమె వెల్లడించారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఒక్క పరిశ్రమను కూడా తీసుకురాలేకపోయారని ఆమె విమర్శించారు.

అవినీతి ఆరోపణలకు సంబంధించి బీఆర్ఎస్ నాయకుల వద్ద ఏవైనా ఆధారాలు ఉంటే, ఈ నెల 24న జరగనున్న కేటీఆర్ సభలో బహిరంగ చర్చకు రావాలని మట్టా రాగమయి సవాల్ విసిరారు. అభివృద్ధిని ప్రోత్సహించాలే తప్ప రాజకీయ కారణాలతో అడ్డుకోవద్దని సూచించిన ఆమె, సోషల్ మీడియా మరియు యూట్యూబ్‌లలో తప్పుడు ప్రచారాలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు.
    user_V Ramarao
    V Ramarao
    సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    18 hrs ago
  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ములకలపల్లి మండలంలో ఈరోజు మధ్యాహ్నం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. పూసుగూడెం, మాదారం అటవీ ప్రాంతంలో ఒక కారు అదుపుతప్పి చెట్టును బలంగా ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన సంభవించింది. మృతి చెందిన వారిలో భార్యాభర్తలు సాయి ప్రకాష్, సంధ్య మరియు వారి ఐదేళ్ల కొడుకు మోక్షిత్ ఉన్నారు. ఈ ప్రమాదంలో తల్లి జ్యోతికి తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను వెంటనే 108 వాహనంలో పాల్వంచ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం, మృతులంతా భద్రాచలం పట్టణానికి చెందినవారు. వీరంతా ములకలపల్లిలోని బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి భద్రాచలం వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పాల్వంచ ప్రభుత్వాసుపత్రికి తరలిస్తున్నారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
    1
    భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ములకలపల్లి మండలంలో ఈరోజు మధ్యాహ్నం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. పూసుగూడెం, మాదారం అటవీ ప్రాంతంలో ఒక కారు అదుపుతప్పి చెట్టును బలంగా ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన సంభవించింది.

మృతి చెందిన వారిలో భార్యాభర్తలు సాయి ప్రకాష్, సంధ్య మరియు వారి ఐదేళ్ల కొడుకు మోక్షిత్ ఉన్నారు. ఈ ప్రమాదంలో తల్లి జ్యోతికి తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను వెంటనే 108 వాహనంలో పాల్వంచ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

పోలీసుల కథనం ప్రకారం, మృతులంతా భద్రాచలం పట్టణానికి చెందినవారు. వీరంతా ములకలపల్లిలోని బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి భద్రాచలం వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పాల్వంచ ప్రభుత్వాసుపత్రికి తరలిస్తున్నారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
    user_V Ramarao
    V Ramarao
    సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    17 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.