కుప్పం( M) లో ప్రియుడి మోజులో భర్తను హత్య. చేసిన భార్య, ప్రియుడు అరెస్ట్ ప్రియుడి మోజులో భర్తను హత్య చేసిన భార్య, ప్రియుడు అరెస్ట్ – కుప్పం అర్బన్ ఇన్స్పెక్టర్ శ్రీ శంకరయ్య.* *తమ అక్రమ సంబందానికి అడ్డు వస్తున్నాడని, తమ సంబంధం గురించి గొడవ పడుతున్నాడని భర్తను హత్య చేసిన ఘటనలో భార్య మరియు ఆమె ప్రియుడిని కుప్పం అర్బన్ పోలీసులు ఈరోజు అరెస్ట్ చేశారు.* *వివరాలు:* చిత్తూరు జిల్లా కుప్పం అర్బన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మోట్లచేను గ్రామం మండలం నందు మృతుడు బాలరాజు మరియు అతని బార్య సూర్య @ మగ నివసించేవారు. ఈ నేపధ్యంలో సూర్య @ మగ తిరుపతి అనే వ్యక్తితో అక్రమ సంబంధం ఏర్పరుచుకుంది. ఈ విషయం తెలుసుకున్న బాలరాజు ఇవి మానుకోవాలని సూచించిన వినకపోవడంతో వారిద్దరికీ తరచుగా కుటుంబ కలహాలు జరగేవి. ఈ నేపథ్యంలో భర్త ను ఎలాగైనా హత్య చేయాలని యోచించిన భార్య, ఆమె తన ప్రియుడు తిరుపతి తో కలిసి ముందుగానే ప్రణాళిక రచించారు. దీని ప్రకారం, 12.03.2026 తేదీన రాత్రి సమయంలో బాలరాజు నిద్రపోయే సమయంలో అతనిని కత్తులతో నరికి హత్య చేసి పారిపోయారు. దీనిపై బాలరాజు కుటుంబ సబ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు క్రైమ్ నం. 50/2026 గా నమోదు చేసి, U/S 103(1) r/w 3(5) BNS ప్రకారం కేసు నమోదు చేయబడింది. జిల్లా ఎస్పీ శ్రీ తుషార్ డూడి, IPS గారి ఆదేశాల మేరకు, కుప్పం సబ్-డివిజన్ డి.ఎస్పీ శ్రీ పార్థసారధి గారి పర్యవేక్షణలో కుప్పం ఇన్స్పెక్టర్ గారు సమగ్ర విచారణ చేపట్టగా మృతుడి భార్య తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసినట్టు తేలగా, ఈరోజు కుప్పం అర్బన్ ఇన్స్పెక్టర్ శ్రీ శంకరయ్య కు రాబడిన సమాచారం మేరకు నిందితులను నిందితులను మొట్ల చెను బస్ స్టాప్ వద్ద అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ముద్దాయిల వివరాలు: A1 - డి. తిరుపతి, వయస్సు 28 సంవత్సరాలు, తండ్రి స్వర్గీయ యు. దేవరాజు, పొనంగూరు, వల్లూరు గ్రామం, కుప్పం మండలం, చిత్తూరు జిల్లా. A2 - ఎస్. సూర్య @ మగా, వయస్సు 24 సంవత్సరాలు, భర్త పి.బాలరాజు, వల్లూరు గ్రామం, కుప్పం మండలం, చిత్తూరు జిల్లా.
కుప్పం( M) లో ప్రియుడి మోజులో భర్తను హత్య. చేసిన భార్య, ప్రియుడు అరెస్ట్ ప్రియుడి మోజులో భర్తను హత్య చేసిన భార్య, ప్రియుడు అరెస్ట్ – కుప్పం అర్బన్ ఇన్స్పెక్టర్ శ్రీ శంకరయ్య.* *తమ అక్రమ సంబందానికి అడ్డు వస్తున్నాడని, తమ సంబంధం గురించి గొడవ పడుతున్నాడని భర్తను హత్య చేసిన ఘటనలో భార్య మరియు ఆమె ప్రియుడిని కుప్పం అర్బన్ పోలీసులు ఈరోజు అరెస్ట్ చేశారు.* *వివరాలు:* చిత్తూరు జిల్లా కుప్పం అర్బన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మోట్లచేను గ్రామం మండలం నందు మృతుడు బాలరాజు మరియు అతని బార్య సూర్య @ మగ నివసించేవారు. ఈ నేపధ్యంలో సూర్య @ మగ తిరుపతి అనే వ్యక్తితో అక్రమ సంబంధం ఏర్పరుచుకుంది. ఈ విషయం తెలుసుకున్న బాలరాజు ఇవి మానుకోవాలని సూచించిన వినకపోవడంతో వారిద్దరికీ తరచుగా కుటుంబ కలహాలు జరగేవి. ఈ నేపథ్యంలో భర్త ను ఎలాగైనా హత్య చేయాలని యోచించిన భార్య, ఆమె తన ప్రియుడు తిరుపతి తో కలిసి ముందుగానే ప్రణాళిక రచించారు. దీని ప్రకారం, 12.03.2026 తేదీన రాత్రి సమయంలో బాలరాజు నిద్రపోయే సమయంలో అతనిని కత్తులతో నరికి హత్య చేసి పారిపోయారు. దీనిపై బాలరాజు కుటుంబ సబ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు క్రైమ్ నం. 50/2026 గా నమోదు చేసి, U/S 103(1) r/w 3(5) BNS ప్రకారం కేసు నమోదు చేయబడింది. జిల్లా ఎస్పీ శ్రీ తుషార్ డూడి, IPS గారి ఆదేశాల మేరకు, కుప్పం సబ్-డివిజన్ డి.ఎస్పీ శ్రీ పార్థసారధి గారి పర్యవేక్షణలో కుప్పం ఇన్స్పెక్టర్ గారు సమగ్ర విచారణ చేపట్టగా మృతుడి భార్య తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసినట్టు తేలగా, ఈరోజు కుప్పం అర్బన్ ఇన్స్పెక్టర్ శ్రీ శంకరయ్య కు రాబడిన సమాచారం మేరకు నిందితులను నిందితులను మొట్ల చెను బస్ స్టాప్ వద్ద అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ముద్దాయిల వివరాలు: A1 - డి. తిరుపతి, వయస్సు 28 సంవత్సరాలు, తండ్రి స్వర్గీయ యు. దేవరాజు, పొనంగూరు, వల్లూరు గ్రామం, కుప్పం మండలం, చిత్తూరు జిల్లా. A2 - ఎస్. సూర్య @ మగా, వయస్సు 24 సంవత్సరాలు, భర్త పి.బాలరాజు, వల్లూరు గ్రామం, కుప్పం మండలం, చిత్తూరు జిల్లా.
- నరసరావుపేట–గుంటూరు రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. మృతులు గుండాలపాడు గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. ప్రమాదం ఎలా జరిగింది అనే వివరాలు ఇంకా పూర్తిగా తెలియాల్సి ఉంది. ఘటన స్థలానికి పోలీసులు చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో గుండాలపాడు గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.1
- *అన్నమయ్య జిల్లా: మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాన్వాయ్‌లో తృటిలో తప్పిన పెనుప్రమాదం* తిరుపతి–బెంగళూరు జాతీయ రహదారిపై మదనపల్లి పట్టణంలోని ఎస్టేట్ కరెంట్ ఆఫీస్ సమీపంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాన్వాయ్‌లో ప్రమాదం చోటుచేసుకుంది. కాన్వాయ్‌లో ఉన్న మూడు కార్లు ఒకదానికొకటి ఢీకొనడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఈ ఘటనలో మూడు వాహనాలు దెబ్బతిన్నప్పటికీ, ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో పెద్ద ప్రమాదం తృటిలో తప్పింది. కాన్వాయ్‌లో ఉన్న మదనపల్లి నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు, వైసీపీ మదనపల్లి రూరల్ మండల పార్టీ పరిశీలకుడు హర్షవర్ధన్ రెడ్డి ప్రయాణిస్తున్న ఫార్చ్యూనర్ వాహనం కూడా తీవ్రంగా దెబ్బతింది.2
- కదిరి యోగి వేమన ఉత్సవాలలో విచక్షణారహితంగా హుస్సేన్, దేవా కానిస్టేబుళ్లు వంశీ అనే వ్యక్తిపై దాడి చేసి గాయపరిచినట్లు బాధితుడు ఎస్పీకి విజ్ఞప్తి చేశారు. సోమవారం రాత్రి జరుగుతున్న ఉత్సవాలలో వేదిక ప్రక్కన ఉన్న వంశీని చితకబాదినట్లు వంశి మీడియాతో వెల్లడించారు. ఫ్రెండ్లీ పోలీస్ అంటే ఇదేనా అని ప్రభుత్వ వైద్యశాలలో మీడియా ద్వారా ఆయన ప్రశ్నించారు. ఆ ఇద్దరినీ సస్పెండ్ చేయాలని ఎస్పీకి విజ్ఞప్తి చేశారు.1
- *జాతీయ రహదారి 40(కర్నూల్ - కడప) రోడ్డు లో వ్యతిరేక దిశలో వాహనాన్ని నడిపి మనిషి చనిపోవడానికి కారణం అయిన వ్యక్తి అరెస్టు* *మర్డర్ కేసుతో సమానమైన సెక్షన్ వేసి కోర్టు ముందు హాజరు పరచడం అయినది* ముద్దాయి పేరు: షేక్ మస్తాన్, వయసు: 58 సం’’రాలు తండ్రి: లేట్ మౌలాలి, వృత్తి: కూలి, కులం: ముస్లిం, D.No.01/15, అద్దంకి రోడ్డు, St కాలనీ, దర్శి టౌన్ & మండలం, ప్రకాశం జిల్లా. నేరము జరిగిన తేది సమయము మరియు స్థలము: 25.03.2026 వ తేదీన మద్యాహ్నం సుమారు 02.30 గంటల సమయం లో కడప జిల్లా, మైదుకూరు టౌన్, ప్రొద్దుటూరు రోడ్డులో జాతీయ రహదారి- 40 (కర్నూల్ - కడప రోడ్డు)లో నుండి సర్వీసు రోడ్డు కలిసే ప్రదేశం అరెస్ట్ జరిగిన తేది మరియు సమయము: On 30.03.2026 at 11.30 AM కడప - కర్నూల్ రోడ్డులోని శ్రీనగరము గ్రామము దగ్గర. Seizure:- AP39 VE 0499 పాల ట్యాంకర్. Brief facts of the case: పైన తెలిపిన ముద్దాయి AP 39 VE 0499 పాల ట్యాంకర్ లో ధర్మవరము నుండి మైదుకూరు లోని అమృత మిల్క్ డైరీకి పాలు తోలుతూ ఉన్న క్రమములో 25.03.2026 వ తేదిన పాలు అమృత మిల్క్ డైరి నందు దించి మరలా ధర్మవరానికి వెళ్తున్న క్రమములో సుమారు 02.30 PM గంటల సమయములో పైన తెలిపిన ముద్దాయి, పైన తెలిపిన స్థలం వద్దకు పాల ట్యాంకర్ ను నడుపుతూ ఆపోసిట్/ రాంగు రోడ్డులో వెళితే ప్రమాదాలు జరిగి మనుషుల ప్రాణాలు పోతాయి అని తెలిసి కూడా ఆపోసిట్/ రాంగు రోడ్డులో ట్యాంకర్ ను నిర్లక్షంగా నడిపి మోటర్ సైకిల్ పైన వస్తున్న వారికి తగిలించి దువ్వూరు కు చెందిన భాను ప్రకాష్ చనిపోడానికి, గంగా ప్రసాద్ గాయపడటానికి కారణము అయినాడు కాబట్టి అతనిని మైదుకూరు పోలీసు స్టేషన్ ఇన్స్పెక్టర్ కె. రమణారెడ్డి అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపించడమైనది. జాతీయ రహదారి మరియు ఇతర రోడ్డులలో వ్యతిరేక దిశలో వాహనాలను నడిపి ప్రమాదాలకు కారణం అయితే వారిపై మర్డర్ కేసుతో సమానమైన సెక్షన్ను పెట్టి, అరెస్టు చేసి, ప్రమాదాలకు కారణం అయిన వాహనాలను సీజ్ చేయడం జరుగుతుంది. కె.రమణా రెడ్డి ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ మైదుకూరు అర్బన్ పీఎస్.1
- బద్వేలు :రూరల్ పోలీస్ స్టేషన్ పరిదిలో చంపుతామని కతితో బెదిరించి వృద్దురాలి మెడలో నుండి బంగారు గోలుసు చోరీ చేసిన కేసులో కీలక నిందితుడిని అరెస్ చేసి, చోరీ సొతు, నేరానికి ఉపయోగించిన కారు, 2 బైకులను స్వాధీనం బద్వేలు రూరల్ పోలీసులు చేసుకున్నరు. కేసు వివరాలు: 27.03.2026 శ్రీరామనవమి పండుగ రోజున బద్వేలు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీనివాసపురం గ్రామంలో ఒక వృద్దురాలిని కతితో బెదిరించి, ఆమె మెడలోని బంగారు గొలుసును లాక్కొని పారిపోయిన ఘటనపై కేసు (Cr.No.30/2026 U/s 307 r/w 3(5) BNS) బద్వేలు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పర్యవేక్షణలో ఎస్.ఐ ఎం. రంగారావు మరియు వారి సిబ్బంది బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టగా వారికి అందిన నమ్మకమైన సమాచారం మేరకు, 29.03.2026 తేదీన సాయంకాలము గోపవరం మండలం, ద్వారకనగర్ సమీపంలోని గరుడయ్య సత్రము వద్ద అనుమానాస్పదంగా ఉన్న షైక్ ఈసు మీరా వల్లి (23 సం||, మార్కాపురం టౌన్ & జిల్లా) అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా, సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నేర చరిత్ర మరియు ముఠా వివరాలు: నిందితుడు మీరా వల్లి గతంలో మార్కాపురంలో దొంగతనం చేసి జైలుకు వెళ్ళాడు. జైలులో ఇతనికి మజీద్, అంజిరెడ్డి, వెంకటేశు అనే కరుడు గట్టిన పాత నేరస్థులతో పరిచయం ఏర్పడి, విరు నలుగురు ఒక గ్యాంగ్ ఏర్పడ్డారు. శ్రీరామనవమి సమయంలో జనసమ్మర్థం ఉన్న చోట, మహిళలు నగలు వేసుకొని వుంటారు కావున అక్కడ దొంగతనాలు చేయాలని, ఎవరైనా అడ్డుకుంటే కత్తులతో చంపడానికైనా సిద్ధపడాలని నిర్ణయించుకొని పథకం వేసుకొని, కత్తులు కొన్నారు. వీరందరూ కలిసి 25.03.2026 తేదీ పొదిలి సమీపంలో ఒక HF Deluxe బైకు, 26.03.2026 తేదీ నరసరావు పేట సమీపంలో ఒక యునికర్న్ బైకు, పామూరు సమీపంలో ఒక పల్సర్ బైకు దొంగిలించారు. ఈ క్రమంలో శ్రీనివాసపురం వద్ద ఒంటరిగా ఉన్న వృద్ధురాలిని, ఆమె కుమారుడిని కత్తులతో బెదిరించి సుమారు 2.5 లక్షల విలువైన బంగారు దొంగిలించుకొని పారిపోయినారు. స్వాధీనం చేసుకున్న సొత్తు: నిందితుని నుండి ఈ క్రింది వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు: నిందితుని నుండి ఈ క్రింది వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు: 1. బంగారు గొలుసు: సుమారు 18 గ్రాముల బరువున్న తెగిపోయిన బంగారు చైన్. 2. కారు: నేరానికి ఉపయోగించిన వోక్స్ వ్యాగన్ పోలో (Volkswagen Polo) కారు (AP07BT8543). 3. ద్విచక్ర వాహనాలు: నరసరావుపేట మరియు పొదిలి ప్రాంతాల్లో దొంగిలించిన ఒక హోండా యూనికార్న్ మరియు ఒక హెచ్.ఎఫ్ డీలక్స్ మోటార్ సైకిళ్ళు. 4. ఆయుధం: బెదిరింపులకు ఉపయోగించిన పదునైన కత్తి, అభినందనలు: నేరం గురించి తెలిసిన వెంటనే స్పందించి, బద్వేలు రూరల్ SI రంగారావు మరియు బి.. కోడూరు SI సూర్య నారాయణ రెడ్డి ల ఆధ్వర్యంలో రెండు బృందాలను ఏర్పాటు చేసి, తీవ్ర గాలింపు చర్యలు చేసి, జిల్లా దొంగల ముఠా గుట్టురట్టు చేసి, వారి నుండి బద్వేలు రూరల్ పరిధిలో దొంగిలించిన బంగారు చైన్ కాకుండా, ఇతర జిల్లాలో దొంగిలించిన మోటారు సైకిళ్ళను, నేరానికి ఉపయోగించిన కారును కుడా స్వాధీనం చేసుకొని వారి ఆట కట్టించిన బద్వేలు రూరల్ CI నద్యాల క్రిష్నయ్యను మరియు వారి సిబ్బందిని మైదుకూరు DSP రాజేంద్ర ప్రసాద్ అభినిందించారు. పోలీసుల హెచ్చరిక:నిందితుడు మీరా వల్లిని అరెస్ట్ చేసి రిమాండుకు తరలించడం జరిగింది. ఈ కేసులో పరారీలో ఉన్న మిగిలిన ముగ్గురు నిందితుల (మజీద్, అంజిరెడ్డి, వెంకటేశు) కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశామని ఎస్.ఐ రంగారావు తెలిపారు. నిందితులపై కొత్త చట్టం ప్రకారం (111 BNS) గ్యాంగ్ నేరాలకు సంబంధించిన కఠిన సెక్షన్లు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.1
- రాష్ట్రంలో వార్డు వాలెంటీర్ల సేవలను పునరుద్దించి నిరుద్యోగులను ఆదుకోవాలని ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు కోట్రేష్ డిమాండ్ చేశాడు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో 99 వేల ఖాళీలను తక్షణమే భర్తీ చేయాలని, నిరుద్యోగులకు ఇచ్చిన 3000 నిరుద్యోగ భృతి హామీని తక్షణమే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.గత వైకాపా పాలనలో ప్రజలకు సేవాలందించిన వాలంటీర్లకి ప్రతిపక్షంలో ఉన్న ప్రస్తుత కూటమి ప్రభుత్వం తాము అధికారంలోకి రాగానే 10,000 జీతం అందిస్తామని హామీ ఇచ్చి వారిని నిర్దాక్షిణ్యంగా తీసివేసి వారిని బజారులు పాలు చేయడం దుర్మార్గమన్నారు.1
- ఎమ్మిగనూరు పట్టణంలో రాజకీయంగా కీలక పరిణామం చోటుచేసుకుంది… పట్టణంలోని 8వ వార్డు నుంచి 50 కుటుంబాలకు పైగా… సుమారు 200 మంది… కర్నూల్ పార్లమెంట్ వైస్ ప్రెసిడెంట్ భాస్కర్ల చంద్రశేఖర్, పట్టణ కార్యదర్శి కదిరికోట అనిల్ కుమార్ ఆధ్వర్యంలో… మడ్రి ఏసేబు మరియు వారి అనుచరులతో కలిసి తెలుగుదేశం పార్టీలో చేరారు… ఈ సందర్భంగా… ఎమ్మెల్యే డాక్టర్ బీ.వీ. జయనాగేశ్వర్ రెడ్డి గారు… కొత్తగా చేరిన వారికి పసుపు కండువాలు కప్పి… పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు… ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు… పట్టణ కమిటీ సభ్యులు… నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు… ఎమ్మిగనూరులో ఈ చేరికలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి…1
- మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాన్వాయ్‌లో తృటిలో తప్పిన పెనుప్రమాదం* తిరుపతి–బెంగళూరు జాతీయ రహదారిపై మదనపల్లి పట్టణంలోని ఎస్టేట్ కరెంట్ ఆఫీస్ సమీపంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాన్వాయ్‌లో ప్రమాదం చోటుచేసుకుంది. కాన్వాయ్‌లో ఉన్న మూడు కార్లు ఒకదానికొకటి ఢీకొనడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఈ ఘటనలో మూడు వాహనాలు దెబ్బతిన్నప్పటికీ, ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో పెద్ద ప్రమాదం తృటిలో తప్పింది. కాన్వాయ్‌లో ఉన్న మదనపల్లి నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు, వైసీపీ మదనపల్లి రూరల్ మండల పార్టీ పరిశీలకుడు హర్షవర్ధన్ రెడ్డి ప్రయాణిస్తున్న ఫార్చ్యూనర్ వాహనం కూడా తీవ్రంగా దెబ్బతింది.2