logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం అడవిమల్లెలలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో TSWREIS వారి ఆదేశానుసారం నూతన పేరెంట్స్ కమిటీ ఎన్నిక పూర్తయింది. ఈ ఎన్నికకు సంబంధించిన వివరాలను కళాశాల ప్రిన్సిపాల్ శ్రీమతి జి. విజయకుమారి ఒక ప్రకటన ద్వారా వెల్లడించారు. నూతన కమిటీ ప్రెసిడెంట్‌గా శ్రీమతి నల్లాంటి సింధూజ, వైస్ ప్రెసిడెంట్‌గా శ్రీమతి కె. అరుణ ఎంపికయ్యారు. అలాగే కమిటీలో ఐ. శారద, కె. లక్ష్మీనారాయణ, మాణిక్యాలరావు తదితరులు సభ్యులుగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులను ప్రిన్సిపాల్ అభినందించారు. కళాశాల ఎదుగుదలకు వారి సహాయసహకారాలు ఎంతో అవసరమని పేర్కొంటూ, అందుకు తగిన విధంగా సహకరించాల్సిందిగా ఆమె కోరారు.

3 hrs ago
user_Chalamala narasimharao
Chalamala narasimharao
Court reporter పెనుబల్లి, ఖమ్మం, తెలంగాణ•
3 hrs ago
615d94d3-8033-4b17-9d41-47f27dec16e8
56dce880-9ffe-4682-ba76-3f0795e72cca
58c7638b-3766-4509-9f80-2c122b46b284

ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం అడవిమల్లెలలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో TSWREIS వారి ఆదేశానుసారం నూతన పేరెంట్స్ కమిటీ ఎన్నిక పూర్తయింది. ఈ ఎన్నికకు సంబంధించిన వివరాలను కళాశాల ప్రిన్సిపాల్ శ్రీమతి జి. విజయకుమారి ఒక ప్రకటన ద్వారా వెల్లడించారు. నూతన కమిటీ ప్రెసిడెంట్‌గా శ్రీమతి నల్లాంటి సింధూజ, వైస్ ప్రెసిడెంట్‌గా శ్రీమతి కె. అరుణ ఎంపికయ్యారు. అలాగే కమిటీలో ఐ. శారద, కె. లక్ష్మీనారాయణ, మాణిక్యాలరావు తదితరులు సభ్యులుగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులను ప్రిన్సిపాల్ అభినందించారు. కళాశాల ఎదుగుదలకు వారి సహాయసహకారాలు ఎంతో అవసరమని పేర్కొంటూ, అందుకు తగిన విధంగా సహకరించాల్సిందిగా ఆమె కోరారు.

More news from తెలంగాణ and nearby areas
  • తెలంగాణ పాలిట కాళేశ్వరం కేవలం ఒక ప్రాజెక్టు మాత్రమే కాదని, అది రాష్ట్ర జీవధార అని ఈ సందర్భంగా కొనియాడారు. కాళేశ్వరం అంటే కేవలం మేడిగడ్డ ఒక్కటే కాదని, ఇందులో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లతో కూడిన మూడు బరాజ్‌లు భాగమని స్పష్టం చేశారు. కన్నెపల్లితో సహా 20కి పైగా భారీ పంప్ హౌజ్‌లు, నీటి ప్రవాహం కోసం కిలోమీటర్ల పొడవైన సొరంగాలు, 19 సబ్ స్టేషన్లు, 15 రిజర్వాయర్లతో పాటు వందల కిలోమీటర్ల కాలువలు ఈ ప్రాజెక్టులో ఉన్నాయని వివరించారు. 240 టీఎంసీల నీటిని ఎత్తిపోసే సామర్థ్యం గల ఈ ప్రాజెక్టు, కేసీఆర్ కలల పంట అని పేర్కొన్నారు. కరువు కాలంలో కూడా తెలంగాణ గోసలను తీర్చేలా సాగునీటి ముక్తీశ్వరంగా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు నిలిచిందని ప్రశంసించారు.
    1
    తెలంగాణ పాలిట కాళేశ్వరం కేవలం ఒక ప్రాజెక్టు మాత్రమే కాదని, అది రాష్ట్ర జీవధార అని ఈ సందర్భంగా కొనియాడారు. కాళేశ్వరం అంటే కేవలం మేడిగడ్డ ఒక్కటే కాదని, ఇందులో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లతో కూడిన మూడు బరాజ్‌లు భాగమని స్పష్టం చేశారు. కన్నెపల్లితో సహా 20కి పైగా భారీ పంప్ హౌజ్‌లు, నీటి ప్రవాహం కోసం కిలోమీటర్ల పొడవైన సొరంగాలు, 19 సబ్ స్టేషన్లు, 15 రిజర్వాయర్లతో పాటు వందల కిలోమీటర్ల కాలువలు ఈ ప్రాజెక్టులో ఉన్నాయని వివరించారు. 240 టీఎంసీల నీటిని ఎత్తిపోసే సామర్థ్యం గల ఈ ప్రాజెక్టు, కేసీఆర్ కలల పంట అని పేర్కొన్నారు. కరువు కాలంలో కూడా తెలంగాణ గోసలను తీర్చేలా సాగునీటి ముక్తీశ్వరంగా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు నిలిచిందని ప్రశంసించారు.
    user_NIMMANAGANTI ANIL BABU
    NIMMANAGANTI ANIL BABU
    Local News Reporter డోర్నకల్, మహబూబాబాద్, తెలంగాణ•
    3 hrs ago
  • ఈ సంవత్సరం వర్షాలు తక్కువగా కురిసే అవకాశం ఉందని వాతావరణ అంచనాలు చెబుతున్న నేపథ్యంలో, రైతులు వర్షాభావ పరిస్థితులకు అనుగుణంగానే పంటలను సాగు చేసుకోవాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచించారు. ఖమ్మం రూరల్ మండల పర్యటనలో భాగంగా ఆయన మాట్లాడుతూ, తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులు మొగ్గు చూపడం ఉత్తమమని అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలోనే అన్నదాతలకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని మంత్రి భరోసా ఇచ్చారు.
    1
    ఈ సంవత్సరం వర్షాలు తక్కువగా కురిసే అవకాశం ఉందని వాతావరణ అంచనాలు చెబుతున్న నేపథ్యంలో, రైతులు వర్షాభావ పరిస్థితులకు అనుగుణంగానే పంటలను సాగు చేసుకోవాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచించారు. ఖమ్మం రూరల్ మండల పర్యటనలో భాగంగా ఆయన మాట్లాడుతూ, తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులు మొగ్గు చూపడం ఉత్తమమని అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలోనే అన్నదాతలకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని మంత్రి భరోసా ఇచ్చారు.
    user_ARUNKUMAR
    ARUNKUMAR
    Local News Reporter నేలకొండపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    7 hrs ago
  • కాళేశ్వరం ప్రాజెక్టు అంటే కేవలం ఒక బ్యారేజ్ మాత్రమే కాదు. ఇది వందల కిలోమీటర్ల పొడవైన కాలువలు, సొరంగ మార్గాలు (టన్నెల్స్), ఆసియాలోనే అతిపెద్ద భూగర్భ పంప్‌హౌస్‌లు, భారీ సబ్‌స్టేషన్లు మరియు బాహుబలి మోటార్ల సమాహారం. లక్షల ఎకరాలకు జీవం పోసే విశాలమైన రిజర్వాయర్లు కలిగిన ఈ ప్రాజెక్టును ఒక్క మాటలో చెప్పాలంటే “తెలంగాణ జీవధార కాళేశ్వరం” అని అభివర్ణించవచ్చు.
    1
    కాళేశ్వరం ప్రాజెక్టు అంటే కేవలం ఒక బ్యారేజ్ మాత్రమే కాదు. ఇది వందల కిలోమీటర్ల పొడవైన కాలువలు, సొరంగ మార్గాలు (టన్నెల్స్), ఆసియాలోనే అతిపెద్ద భూగర్భ పంప్‌హౌస్‌లు, భారీ సబ్‌స్టేషన్లు మరియు బాహుబలి మోటార్ల సమాహారం. లక్షల ఎకరాలకు జీవం పోసే విశాలమైన రిజర్వాయర్లు కలిగిన ఈ ప్రాజెక్టును ఒక్క మాటలో చెప్పాలంటే “తెలంగాణ జీవధార కాళేశ్వరం” అని అభివర్ణించవచ్చు.
    user_Degala samson
    Degala samson
    Chef మణుగూరు, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    4 hrs ago
  • గుంటూరులో గురువారం జరిగిన సీపీఐ సోషల్ మీడియా వర్క్షాప్‌లో ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు కీలక వ్యాఖ్యలు చేశారు. అధికార, ప్రతిపక్ష పార్టీలు వ్యక్తిగత దూషణలతో సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తూ, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆయన మండిపడ్డారు. ఈ నేపథ్యంలో, సోషల్ మీడియా వేదికగా ప్రజా పోరాటాలను మరింత ఉధృతం చేయాలని ఆయన కార్యకర్తలకు సూచించారు. ప్రజల సమస్యలు, ప్రభుత్వ విధానాలపై వాస్తవాలను సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలని ముప్పాళ్ల నాగేశ్వరరావు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
    1
    గుంటూరులో గురువారం జరిగిన సీపీఐ సోషల్ మీడియా వర్క్షాప్‌లో ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు కీలక వ్యాఖ్యలు చేశారు. అధికార, ప్రతిపక్ష పార్టీలు వ్యక్తిగత దూషణలతో సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తూ, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆయన మండిపడ్డారు. ఈ నేపథ్యంలో, సోషల్ మీడియా వేదికగా ప్రజా పోరాటాలను మరింత ఉధృతం చేయాలని ఆయన కార్యకర్తలకు సూచించారు. ప్రజల సమస్యలు, ప్రభుత్వ విధానాలపై వాస్తవాలను సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలని ముప్పాళ్ల నాగేశ్వరరావు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
    user_SHOT NEWS
    SHOT NEWS
    Advertising agency Guntur, Andhra Pradesh•
    6 hrs ago
  • రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు విమర్శలు చేశారు. రిటైర్డ్ ఇంజనీర్లు వాస్తవాలు వెల్లడిస్తే వారిపై చర్యలు తీసుకుంటామని బెదిరిస్తున్నారంటూ ఆయన ఆరోపించారు. రిటైర్డ్ ఇంజనీర్లపై ప్రభుత్వం తీవ్ర ఒత్తిడి తెస్తోందని హరీష్ రావు పేర్కొన్నారు. మోటార్లు ఆన్ చేసి నీటిని విడుదల చేస్తే ప్రభుత్వం చేస్తున్న ప్రచారంలోని వాస్తవాలు బయటపడతాయనే ఉద్దేశంతోనే నీటి విడుదలకు అడ్డుపడుతున్నారని ఆయన విమర్శించారు. ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వం ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలని డిమాండ్ చేశారు. అయితే సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ, నీటి విడుదలపై ప్రభుత్వం సాంకేతిక అంశాలను పరిగణనలోకి తీసుకుని నిర్ణయాలు తీసుకుంటోందని అధికార వర్గాలు చెబుతున్నాయి.
    1
    రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు విమర్శలు చేశారు. రిటైర్డ్ ఇంజనీర్లు వాస్తవాలు వెల్లడిస్తే వారిపై చర్యలు తీసుకుంటామని బెదిరిస్తున్నారంటూ ఆయన ఆరోపించారు. రిటైర్డ్ ఇంజనీర్లపై ప్రభుత్వం తీవ్ర ఒత్తిడి తెస్తోందని హరీష్ రావు పేర్కొన్నారు.

మోటార్లు ఆన్ చేసి నీటిని విడుదల చేస్తే ప్రభుత్వం చేస్తున్న ప్రచారంలోని వాస్తవాలు బయటపడతాయనే ఉద్దేశంతోనే నీటి విడుదలకు అడ్డుపడుతున్నారని ఆయన విమర్శించారు. ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వం ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలని డిమాండ్ చేశారు. అయితే సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ, నీటి విడుదలపై ప్రభుత్వం సాంకేతిక అంశాలను పరిగణనలోకి తీసుకుని నిర్ణయాలు తీసుకుంటోందని అధికార వర్గాలు చెబుతున్నాయి.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    6 hrs ago
  • బాపట్ల జిల్లా రేపల్లెలోని జగనన్న కాలనీలో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. రేపల్లె డిఎస్పీ అబ్దుల్ అజీజ్ ఆధ్వర్యంలో పోలీసులు ప్రతి ఇంటిని క్షుణ్ణంగా సోదా చేశారు. ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని 67 బైకులు, 2 ఆటోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మాదకద్రవ్యాల నిర్మూలనే ధ్యేయంగా ఈ తనిఖీలు చేపట్టినట్లు డిఎస్పీ అబ్దుల్ అజీజ్ తెలిపారు. ఈ తనిఖీల్లో పట్టణ సిఐ అశోక్, రూరల్ సిఐ సురేష్, సబ్ డివిజన్‌లోని పోలీసు సిబ్బందితో పాటు ఈగల్ టీం సభ్యులు కూడా పాల్గొన్నారు.
    3
    బాపట్ల జిల్లా రేపల్లెలోని జగనన్న కాలనీలో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. రేపల్లె డిఎస్పీ అబ్దుల్ అజీజ్ ఆధ్వర్యంలో పోలీసులు ప్రతి ఇంటిని క్షుణ్ణంగా సోదా చేశారు. ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని 67 బైకులు, 2 ఆటోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

మాదకద్రవ్యాల నిర్మూలనే ధ్యేయంగా ఈ తనిఖీలు చేపట్టినట్లు డిఎస్పీ అబ్దుల్ అజీజ్ తెలిపారు. ఈ తనిఖీల్లో పట్టణ సిఐ అశోక్, రూరల్ సిఐ సురేష్, సబ్ డివిజన్‌లోని పోలీసు సిబ్బందితో పాటు ఈగల్ టీం సభ్యులు కూడా పాల్గొన్నారు.
    user_M.Vijay Kishore
    M.Vijay Kishore
    Cherukupalle H/O Arumbaka, Bapatla•
    8 hrs ago
  • తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో తీవ్ర కలకలం రేపిన ఓ అమానుష ఘటన వెలుగుచూసింది. మూడు రోజుల క్రితం సత్తుపల్లి మండలం చంద్రాయపాలెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ధారావత్ మధుసూదన్ రావు అనే యువకుడు ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడని ఆసుపత్రి సిబ్బంది కుటుంబ సభ్యులకు సమాచారం అందించి మృతదేహాన్ని అప్పగించారు. అయితే, బంధువులు ఆ మృతదేహాన్ని స్వగ్రామమైన సత్తుపల్లి మండలం కిష్టాపురానికి తీసుకెళ్లి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తుండగా, ఊహించని విధంగా ఆ యువకుడిలో గుండె స్పందనలు ఉన్నట్లు గుర్తించారు. వెంటనే అతడిని సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అక్కడి వైద్యులు పరీక్షించి యువకుడు ఇంకా ప్రాణాలతోనే ఉన్నట్లు నిర్ధారించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం వైద్యుల సూచన మేరకు అంబులెన్స్‌లో హైదరాబాద్‌కు తరలిస్తుండగా, ఖమ్మం దాటిన కొద్దిసేపటికే ఆ యువకుడు మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ దారుణ ఘటనపై బాధిత కుటుంబ సభ్యులు ఖమ్మంలోని ఆ ప్రైవేట్ ఆసుపత్రిపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. బ్రెయిన్ సర్జరీ పేరుతో తమ వద్ద సుమారు మూడు లక్షల రూపాయలు వసూలు చేశారని, ఆ తర్వాత మృతి చెందినట్లు ప్రకటించి మృతదేహాన్ని అప్పగించారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
    4
    తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో తీవ్ర కలకలం రేపిన ఓ అమానుష ఘటన వెలుగుచూసింది. మూడు రోజుల క్రితం సత్తుపల్లి మండలం చంద్రాయపాలెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ధారావత్ మధుసూదన్ రావు అనే యువకుడు ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడని ఆసుపత్రి సిబ్బంది కుటుంబ సభ్యులకు సమాచారం అందించి మృతదేహాన్ని అప్పగించారు.

అయితే, బంధువులు ఆ మృతదేహాన్ని స్వగ్రామమైన సత్తుపల్లి మండలం కిష్టాపురానికి తీసుకెళ్లి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తుండగా, ఊహించని విధంగా ఆ యువకుడిలో గుండె స్పందనలు ఉన్నట్లు గుర్తించారు. వెంటనే అతడిని సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అక్కడి వైద్యులు పరీక్షించి యువకుడు ఇంకా ప్రాణాలతోనే ఉన్నట్లు నిర్ధారించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం వైద్యుల సూచన మేరకు అంబులెన్స్‌లో హైదరాబాద్‌కు తరలిస్తుండగా, ఖమ్మం దాటిన కొద్దిసేపటికే ఆ యువకుడు మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

ఈ దారుణ ఘటనపై బాధిత కుటుంబ సభ్యులు ఖమ్మంలోని ఆ ప్రైవేట్ ఆసుపత్రిపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. బ్రెయిన్ సర్జరీ పేరుతో తమ వద్ద సుమారు మూడు లక్షల రూపాయలు వసూలు చేశారని, ఆ తర్వాత మృతి చెందినట్లు ప్రకటించి మృతదేహాన్ని అప్పగించారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
    user_V Ramarao
    V Ramarao
    సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    23 hrs ago
  • ఖమ్మం రూరల్ మండల పరిధిలో పర్యటించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులతో కలిసి వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో సంక్షేమం మరియు అభివృద్ధి కార్యక్రమాలను ఎక్కడా తగ్గకుండా అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. తెలంగాణను అన్ని రంగాల్లో మరింత ముందుకు తీసుకెళ్లేందుకు తమ ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలతో సిద్ధమవుతోందని మంత్రి తెలిపారు.
    1
    ఖమ్మం రూరల్ మండల పరిధిలో పర్యటించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులతో కలిసి వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో సంక్షేమం మరియు అభివృద్ధి కార్యక్రమాలను ఎక్కడా తగ్గకుండా అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. తెలంగాణను అన్ని రంగాల్లో మరింత ముందుకు తీసుకెళ్లేందుకు తమ ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలతో సిద్ధమవుతోందని మంత్రి తెలిపారు.
    user_ARUNKUMAR
    ARUNKUMAR
    Local News Reporter నేలకొండపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    7 hrs ago
  • రైతులకు సాగునీరు అందించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర విమర్శలు చేశారు. రైతులకు నీళ్లు ఇవ్వడానికి తమ రక్తం అడ్డమైతే ఆ రక్తాన్ని కూడా ఇవ్వడానికి సిద్ధమని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుపై తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పిస్తూ ప్రభుత్వ విధానాలను తప్పుబట్టారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమవుతోందని దుయ్యబట్టారు. ఈ సందర్భంగా హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. కాగా, ప్రభుత్వం మాత్రం రైతుల సంక్షేమం, సాగునీటి సరఫరాకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని చెబుతోంది.
    1
    రైతులకు సాగునీరు అందించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర విమర్శలు చేశారు. రైతులకు నీళ్లు ఇవ్వడానికి తమ రక్తం అడ్డమైతే ఆ రక్తాన్ని కూడా ఇవ్వడానికి సిద్ధమని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుపై తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పిస్తూ ప్రభుత్వ విధానాలను తప్పుబట్టారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమవుతోందని దుయ్యబట్టారు.

ఈ సందర్భంగా హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. కాగా, ప్రభుత్వం మాత్రం రైతుల సంక్షేమం, సాగునీటి సరఫరాకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని చెబుతోంది.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    6 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.