గజ్వేల్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఘనంగా “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక ఎడ్యుకేషన్ వీక్” ప్రారంభం గజ్వేల్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక ఎడ్యుకేషన్ వీక్” కార్యక్రమం సోమవారం ఘనంగా ప్రారంభమైంది. కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ అనిత అబ్రహాం అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి గజ్వేల్ మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీమతి గంగిశెట్టి చందన రవీందర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 13వ వార్డు కౌన్సిలర్, అధ్యాపకులు, విద్యార్థినులు, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మే 11 నుంచి 17 వరకు నిర్వహించనున్న ఎడ్యుకేషన్ వీక్ కార్యక్రమాల యాక్షన్ ప్లాన్‌ను అధికారికంగా విడుదల చేశారు. కళాశాలలో కోతుల సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని మున్సిపల్ చైర్‌పర్సన్‌కు ప్రిన్సిపాల్ వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో భాగంగా నూతనంగా అభివృద్ధి చేసిన యోగ రూమ్, ఈ-క్లాస్‌రూమ్స్, స్టాఫ్ రూమ్, 45 కంప్యూటర్లతో ఏర్పాటు చేసిన ఆధునిక కంప్యూటర్ ల్యాబ్‌ను ప్రారంభించారు. కంప్యూటర్ ల్యాబ్‌లో ఇన్వర్టర్, యూపీఎస్ సౌకర్యాలు కూడా ఏర్పాటు చేశారు.ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ అనిత అబ్రహాం మాట్లాడుతూ, ఈ-క్లాస్‌రూమ్స్‌కు అవసరమైన ప్రొజెక్టర్లు, యూపీఎస్ వ్యవస్థలు, కంప్యూటర్లు కళాశాల సమీకృత నిధులతో TGTS సహకారంతో కొనుగోలు చేసినట్లు తెలిపారు. అలాగే యోగ రూమ్, ప్లే కోర్టులు, స్టాఫ్ రూమ్ ప్రత్యేక ఫీజు నిధులతో అభివృద్ధి చేసినట్లు వెల్లడించారు. విద్యార్థినుల్లో క్రీడాస్ఫూర్తి పెంపొందించేందుకు వాలీబాల్ కోర్ట్, టెన్నికోయిట్ కోర్ట్‌లను కూడా ప్రారంభించారు. విద్యతో పాటు క్రీడలు, సహపాఠ్య కార్యక్రమాలు విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి దోహదపడతాయని ప్రిన్సిపాల్ పేర్కొన్నారు. అడ్మిషన్ ప్రచార కార్యక్రమంలో భాగంగా కళాశాలలో అందుబాటులో ఉన్న కోర్సులు, సౌకర్యాల వివరాలతో కూడిన అడ్మిషన్ పాంఫ్లెట్లు విడుదల చేశారు. ముఖ్యంగా AEDP కోర్సు – బి.ఎస్‌సి హెల్త్ కేర్ మేనేజ్‌మెంట్‌పై ప్రత్యేక అవగాహన కల్పించారు. ఎడ్యుకేషన్ వీక్ లక్ష్యాలు ప్రజలకు చేరవేసేందుకు ప్రత్యేక ఫ్లెక్సీలు, పాంఫ్లెట్లు విడుదల చేసి పంపిణీ చేశారు. అనంతరం అతిథులు కళాశాల ఆవరణలో గులాబీ మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, విద్యార్థినులు, ప్రజాప్రతినిధులు ఉత్సాహంగా పాల్గొన్నారు. కళాశాల విద్యా ప్రగతి, మౌలిక వసతుల అభివృద్ధి, విద్యార్థి సాధికారతకు కట్టుబడి ఉందని కార్యక్రమం ద్వారా స్పష్టమైంది.
గజ్వేల్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఘనంగా “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక ఎడ్యుకేషన్ వీక్” ప్రారంభం గజ్వేల్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక ఎడ్యుకేషన్ వీక్” కార్యక్రమం సోమవారం ఘనంగా ప్రారంభమైంది. కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ అనిత అబ్రహాం అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి గజ్వేల్ మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీమతి గంగిశెట్టి చందన రవీందర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 13వ వార్డు కౌన్సిలర్, అధ్యాపకులు, విద్యార్థినులు, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మే 11 నుంచి 17 వరకు నిర్వహించనున్న ఎడ్యుకేషన్ వీక్ కార్యక్రమాల యాక్షన్ ప్లాన్‌ను అధికారికంగా విడుదల చేశారు.
కళాశాలలో కోతుల సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని మున్సిపల్ చైర్‌పర్సన్‌కు ప్రిన్సిపాల్ వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో భాగంగా నూతనంగా అభివృద్ధి చేసిన యోగ రూమ్, ఈ-క్లాస్‌రూమ్స్, స్టాఫ్ రూమ్, 45 కంప్యూటర్లతో ఏర్పాటు చేసిన ఆధునిక కంప్యూటర్ ల్యాబ్‌ను ప్రారంభించారు. కంప్యూటర్ ల్యాబ్‌లో ఇన్వర్టర్, యూపీఎస్ సౌకర్యాలు కూడా ఏర్పాటు చేశారు.ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ అనిత అబ్రహాం మాట్లాడుతూ, ఈ-క్లాస్‌రూమ్స్‌కు అవసరమైన ప్రొజెక్టర్లు, యూపీఎస్ వ్యవస్థలు, కంప్యూటర్లు కళాశాల సమీకృత నిధులతో TGTS సహకారంతో కొనుగోలు చేసినట్లు తెలిపారు. అలాగే యోగ రూమ్, ప్లే కోర్టులు, స్టాఫ్ రూమ్ ప్రత్యేక ఫీజు నిధులతో అభివృద్ధి చేసినట్లు వెల్లడించారు. విద్యార్థినుల్లో క్రీడాస్ఫూర్తి పెంపొందించేందుకు వాలీబాల్ కోర్ట్, టెన్నికోయిట్ కోర్ట్‌లను కూడా ప్రారంభించారు.
విద్యతో పాటు క్రీడలు, సహపాఠ్య కార్యక్రమాలు విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి దోహదపడతాయని ప్రిన్సిపాల్ పేర్కొన్నారు. అడ్మిషన్ ప్రచార కార్యక్రమంలో భాగంగా కళాశాలలో అందుబాటులో ఉన్న కోర్సులు, సౌకర్యాల వివరాలతో కూడిన అడ్మిషన్ పాంఫ్లెట్లు విడుదల చేశారు. ముఖ్యంగా AEDP కోర్సు – బి.ఎస్‌సి హెల్త్ కేర్ మేనేజ్‌మెంట్‌పై ప్రత్యేక అవగాహన కల్పించారు. ఎడ్యుకేషన్ వీక్ లక్ష్యాలు ప్రజలకు చేరవేసేందుకు ప్రత్యేక ఫ్లెక్సీలు, పాంఫ్లెట్లు విడుదల చేసి పంపిణీ చేశారు. అనంతరం అతిథులు కళాశాల ఆవరణలో గులాబీ మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, విద్యార్థినులు, ప్రజాప్రతినిధులు ఉత్సాహంగా పాల్గొన్నారు. కళాశాల విద్యా ప్రగతి, మౌలిక వసతుల అభివృద్ధి, విద్యార్థి సాధికారతకు కట్టుబడి ఉందని కార్యక్రమం ద్వారా స్పష్టమైంది.
- బండి సంజయ్ కొడుకు కేసులో పోలీసులు తమ బాధ్యత విస్మరిస్తే.. రేపు వాళ్లకి కూడా పనిష్మెంట్ తప్పదు - మంత్రి పొన్నం ప్రభాకర్ బండి సంజయ్ కొడుకు కేసులో పోలీసులు తమ బాధ్యత విస్మరిస్తే.. రేపు వాళ్లకి కూడా పనిష్మెంట్ తప్పదు - మంత్రి పొన్నం ప్రభాకర్1
- హైదరాబాద్ పర్యటనలో ప్రధాని మోదీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిల మధ్య అరుదైన ఆత్మీయ సన్నివేశం చోటుచేసుకుంది. హెచ్‌ఐసీసీ కార్యక్రమంలో పక్కపక్కనే కూర్చుని, నవ్వుతూ ముచ్చటించుకున్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర-రాష్ట్ర నేతలు రాజకీయ విభేదాలను పక్కన పెట్టి కలవడం చర్చనీయాంశంగా మారింది.1
- సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో ప్రముఖ వ్యాపారవేత్త నంగునూరు సత్యనారాయణ జన్మదినం సందర్భంగా నిరుపేదలకు అల్పాహారం పంపిణీ చేశారు. నిత్యం ప్రజా సేవలో ఉంటూ, పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఆయనకు మరెన్నో జన్మదినాలు జరుపుకోవాలని పలువురు ఆకాంక్షించారు.4
- యాదగిరిగుట్ట పరిసర ప్రాంతాలకు చిన్న విన్నపం దీని దీని వెంటనే స్పందించి డిఈ గారు దీనిపై తగు చర్యలు తీసుకోవాలి అట్లనే ఏఈ గారు యాదగిరిగుట్ట గారికి చిన్న విన్నపిస్తున్నాము దయచేసి దీనిపై వెంటనే చర్యలు తీసుకోండి ఎందుకంటే ఇది ఇలా మధ్యలోకి వెళ్లి పాస్ అయితే లైన్ ఇది చాలా అంటే చాలా వైబ్రేట్ అవుతుంది. ఒక్కసారి మీరు వచ్చి అధికారులతో నిధిని పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని వినిపిస్తున్నాం 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼1
- Post by Mana Velugu1
- తెలంగాణలోని ప్రముఖ యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి ఆదివారం ఒక్కరోజే రూ.51.80 లక్షలకు పైగా ఆదాయం సమకూరింది. ప్రసాద విక్రయాలు, VIP దర్శనాలు, కార్ పార్కింగ్ వంటి వివిధ విభాగాల ద్వారా ఈ భారీ ఆదాయం లభించిందని ఈవో భవాని శంకర్ తెలిపారు.1
- ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలి : వికారాబాద్ ఆర్డిఓ వాసు చంద్ర. వికారాబాద్ : ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు సద్వినిగం చేసుకోవాలని వికారాబాద్ ఆర్టీవో వాసు చంద్ర ఒక ప్రకటనలో సోమవారం కోరారు. గతంలో ప్రజావాణి కేవలం కలెక్టర్ కార్యాలయంలో మాత్రమే నిర్వహించే వారిని కానీ ఇకనుండి ప్రజావాణి కార్యక్రమం ప్రజలకు మరింత చేరువగా వస్తుందని ఇక నుండి ప్రజావాణి కార్యక్రమం డివిజన్ స్థాయిలో కూడా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజావాణి కార్యక్రమం వికారాబాద్ కార్యాలయం తో పాటుగా తాండూర్ వికారాబాద్ ఆర్డీవో ఆఫీస్ లో పరిధిలో కూడా నిర్వహించినట్లు తెలిపారు.1
- మొక్కజొన్నలు తెచ్చి రెండు నెలలు అవుతుంది ఇప్పటి వరకు కొనుగోలు చేయలేదు అకాల వర్షాలకు మొలకలు వస్తున్నాయి ఏ రాత్రి ఏం జరుగుతుందో అని ఇక్కడే కాపలా ఉండాల్సి వస్తుంది ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులను ఆదుకోవాలి అత్తా కోడళ్ళు వెంటనే రావాలి అంటూ యశస్విని రెడ్డి, ఝాన్సీ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మండల కేంద్రంలో రైతుల రాస్తారోకో1