Shuru
Apke Nagar Ki App…
రైతు విభాగం జిల్లా జనరల్ సెక్రటరీగా రామాంజనేయులు ఎంపిక కళ్యాణదుర్గానికి చెందిన గాజులు రామాంజనేయులు వైసీపీ జిల్లా రైతు విభాగం జనరల్ సెక్రటరీగా ఎంపికయ్యారు. ఈ మేరకు బుధవారం వైసీపీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. రామాంజనేయులు మాట్లాడుతూ.. పదవిని బాధ్యతగా భావించి పార్టీ బలోపేతమే లక్ష్యంగా పనిచేస్తానన్నారు. రైతు సమస్యలపై ఉద్యమిస్తానన్నారు. పార్టీ అధినేత వైఎస్ జగన్, జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
M vinod kumar
రైతు విభాగం జిల్లా జనరల్ సెక్రటరీగా రామాంజనేయులు ఎంపిక కళ్యాణదుర్గానికి చెందిన గాజులు రామాంజనేయులు వైసీపీ జిల్లా రైతు విభాగం జనరల్ సెక్రటరీగా ఎంపికయ్యారు. ఈ మేరకు బుధవారం వైసీపీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. రామాంజనేయులు మాట్లాడుతూ.. పదవిని బాధ్యతగా భావించి పార్టీ బలోపేతమే లక్ష్యంగా పనిచేస్తానన్నారు. రైతు సమస్యలపై ఉద్యమిస్తానన్నారు. పార్టీ అధినేత వైఎస్ జగన్, జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- ప్రభుత్వ కార్యాలయాల్లో ఎవరైనా లంచం అడిగితే భయపడకుండా ఏసీబీని ఆశ్రయించాలని ATP ఏసీబీ CI పి.హమీద్ ఖాన్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో విడుదల చేశారు. అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల ప్రజలు అవినీతి రహిత సమాజం కోసం సహకరించాలని కోరారు. బాధితులు నేరుగా అనంతపురం పట్టణం ఏసీబీ కార్యాలయానికి రావచ్చు లేదా 14400 టోల్ ఫ్రీ నంబర్కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చన్నారు.1
- అనంతపురం నగరంలో ఈరోజు “సేవ్ ఆర్‌డీటీ” ప్రజా సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడిస్తూ భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఆర్‌డీటీకి సంబంధించిన అంశాలపై కేంద్ర ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేస్తూ వివిధ ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నిరసనకారులు ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేస్తూ కార్యాలయాల వద్ద ఆందోళన చేపట్టారు. తమ డిమాండ్లు నెరవేర్చే వరకు పోరాటం కొనసాగిస్తామని జేఏసీ నాయకులు హెచ్చరించారు. ప్రభుత్వ విధానాల వల్ల ప్రజలకు నష్టం జరుగుతోందని వారు ఆరోపించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతా ఏర్పాట్లు చేశారు. జేఏసీ ప్రతినిధులు తమ సమస్యలపై అధికారులకు వినతిపత్రం అందజేసి తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.1
- శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం కోర్టులో బాంబు కలకలం కోర్టు కాంప్లెక్స్ నుండి బయటకు వచ్చిన జ్యుడిషియల్ కోర్టు సిబ్బంది,కక్షిదారులు జిల్లా కోర్టు ఆదేశాల మేరకు మధ్యాహ్నం 12 గంటల 5 నిముషాల కు 12 ఆర్డి ఎక్స్ బాంబులు పేలుతుంది అనే మెయిల్ సమాచారం వచ్చినట్లు తెలిపిన కోర్టు అధికారులు. అయితే సమయం గడచిపోవడంతో ఉత్తిదేనని ఊపిరి పీల్చుకున్న అధికారులు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.3
- మదనపల్లి ఘటనపై స్పందించిన కర్నూల్ రేంజ్ DIG1
- మదనపల్లెలో బాలిక హత్య పై కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ స్పందన. మదనపల్లెలో బాలిక హత్య కేసు దర్యాప్తు వేగవంతం చేసినట్లు కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ వెల్లడించారు. జిల్లా ప్రభుత్వాసుపత్రి ఆవరణలో డీఐజీ మీడియాతో మాట్లాడారు. 'సోమవారం సాయంత్రం బాలిక అదృశ్యమైన వెంటనే తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. సీఐ మహమ్మద్ రఫీ స్పందించి సిబ్బందితో గాలించారు. నేను ఇప్పుడే మదనపల్లెకు వచ్చాను. త్వరలో అన్నీ వివరాలు వెల్లడిస్తా' అని డీఐజీ చెప్పారు.1
- అన్నమయ్య జిల్లా మదనపల్లిలో అదృశ్యమైన బాలిక దారుణ హత్య చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ మృతురాలి తల్లిదండ్రులు,బంధువులు రోడ్డుపై ఆందోళన.... ఆందోళన కారులకు మద్దతు తెలిపిన మదనపల్లె వైసిపి ఇన్ ఛార్జ్ నిస్సార్ అహ్మద్.... ట్రాఫిక్ మళ్లించిన పోలీసులు.... పోలీసుల అదుపులో నిందితుడు1
- బద్వేలు : మల్లా రెడ్డి వయస్సు 80 సం,, అను వ్యక్తి వై. ఎస్. ఆర్ కడప జిల్లా బద్వేలు మండలంలోని గొడుగునూరు గ్రామం నందు సగిలేరు చెక్ డ్యామ్ నందు నీటిలో ప్రమాదవసత్తు పడి చనిపోయారు. చెక్ డ్యామ్ నీటిలో నుండి బాడీ ని తిసి పోలీస్ వారికి S. F. O బద్వేలు ఫైర్ సిబ్బంది అప్పగించారు. వివరాలు లోకి వెళ్తే పుట్టాయిపల్లె పంచాయతీ గొడుగునూరు గ్రామంలో ఉండే బైసాని మల్లారెడ్డి వయసు( 80 )సంవత్సరాలు నీటిలో ప్రమాదవసత్తు పడి మరణించారు.ఆయనకి ఇద్దరు కుమారులు ఇద్దరు కుమార్తెలు. ఆయన పెద్ద అల్లుడు వంకెల పెద్దపోలి రెడ్డి ప్రముఖ వైఎస్ఆర్సిపి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గా . ఆయన అన్నకుమారుడు ప్రస్తుతం బైసాని ప్రతాప్ రెడ్డి కడప జిల్లా తెలుగుదేశం పార్లమెంటరీ ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఉన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..1
- తమ ప్రభుత్వం ప్రతి ఒక్కరి ప్రాణం విలువైనదిగా భావిస్తుందని మంత్రి సత్యకుమార్ అన్నారు.ఆళ్లగడ్డ, వాయల్పాడు, కొవ్వూరు, కోవూరులలో 50 పడకల ఆస్పత్రులను 100 పడకలకు మార్చాలని సభ్యులు కోరగా మంత్రి రిప్లై ఇచ్చారు. 'కొత్త పాలసీ రూపొందిస్తున్నాం. 50 పడకల కన్నా తక్కువ ఉన్న ఆస్పత్రులను 61 నియోజకవర్గాల్లో గుర్తించాం. ఆయా నియోజకవర్గాల్లో పీపీపీ కింద 100 పడకల మల్టీస్పెషాలిటీ ఆస్పత్రులు నిర్మిస్తాం' అని తెలిపారు1