*పర్యాటక హబ్ గా ఆత్రేయపురం పరిసర ప్రాంతాల అభివృద్ధి...* *కేరళను తలదన్నేలా కోనసీమ అందాలు...* *అంగరంగ వైభవంగా ఆత్రేయపురం ఉత్సవం ప్రారంభం...* *గంగ పూజ చేసి ఈతల పోటీలు ప్రారంభించిన ఎమ్మెల్యే బండారు సత్యానందరావు...* *కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే బండారు...* కోనసీమ ప్రాంతాన్ని కేరళను తలదన్నేలా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఆత్రేయపురం ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు.మూడు రోజుల పాటు జరగనున్న ఆత్రేయపురం ఉత్సవం, సంక్రాంతి సంబరాలను తాడిపూడి వంతెన వద్ద గంగ పూజ చేసి ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ప్రారంభించారు. జెండా ఊపి ఈత పోటీలను ప్రారంభించారు.కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్, ఆర్డీవో పి శ్రీకర్, ఎస్పీ రాహుల్ మీనా, కొత్తపేట జనసేన ఇన్చార్జి బండారు శ్రీనివాస్, ఆకుల రామకృష్ణ, ముదునూరి వెంకటరాజు తదితరులతో కల్సి ఎమ్మెల్యే ఆయా కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మాట్లాడుతూ మన ఆత్రేయపురంలో కేరళ తరహాలో పడవల పోటీలు నిర్వహించడం ఆనందదాయకంగా ఉందని ఎమ్మెల్యే అన్నారు. మూడు రోజుల పాటు కార్యక్రమాలను నిర్వహించి ముగించేలా ఉండదని ఇక్కడ రిసార్ట్స్ రావాలని, పర్యాటక ఆకర్షణ పెరగాలని అందుకు అనేక ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలిపారు. లొల్ల లాకుల ప్రాంతంలో ప్రతీ ఆదివారం టూరిజం అభివృద్ధి చెందేలా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. స్థానికులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు రావాలనేదే తన ఆలోచన అన్నారు. ఎమ్ ఎస్ ఎమ్ ఈ ప్రోత్సాహకాలను సైతం ఉపయోగించుకుని యువత, మహిళలు ముందుకు వెళ్లాలన్నారు. మనదైన వంటలకు ప్రపంచవ్యాప్త మార్కెట్ సాధించాలన్నారు. పర్యాటక రంగ అభివృద్ధి ద్వారా ఇక్కడి ప్రజల జీవన ప్రమాణాలు పెరగడంతో పాటు, మన ప్రాంతం అభివృద్ధిలో దూసుకుపోవాలన్నారు. ఒక పక్క ఆనందం, ఒక పక్క సంతోషం, ఒక పక్క వైవిధ్యభరితమైన కార్యక్రమాల ద్వారా పర్యాటక ఆకర్షణ పెరుగుతుందన్నారు. సోమవారం, మంగళవారం డ్రాగన్ పడవల పోటీలు జరుగుతాయని, సాయం సమయాల్లో ఆత్రేయపురం మహాత్మా గాంధీ కళాశాల ఆవరణలో సినీ ఆర్కెస్ట్రా నిర్వహించనున్నట్లు తెలిపారు. శతమానం భవతి హీరో శర్వానంద్ నటించిన నారీ నారీ నడుమ మురారి ఫ్రీ లాంచ్ కూడా జరగనుందని తెలిపారు. కార్యక్రమానికి వన్నె తెచ్చే విధంగా మంత్రులు,ఎంపీలు, ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారని తెలిపారు. ఈ కార్యక్రమానికి అన్ని విధాల సహాయ సహకారాలు అందించిన కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మన ఆత్రేయపురం, మన ఉత్సవం అనేది మనందరి పండుగ అని ఈ ఉత్సవంతో మూడురోజుల ముందుగానే సంక్రాంతి వచ్చిందని ఇదే స్పూర్తితో ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు.

- అక్షర స్కూల్ లో వైభవంగా సంక్రాంతి సంబరాలు.... మండపేట న్యూస్... రిపోర్టర్ నందికోళ్ల రాజు.... స్థానిక గొల్లపుంత రోడ్డులోని అక్షర స్కూల్ లో డైరెక్టర్స్ విజ్ఞాన్ రాంబాబు, బొప్పన వెంకటరావుల ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు అత్యంత వైభవంగా జరిగాయి. తెలుగువారి సంస్కృతికి ప్రతీకగా రంగు రంగుల ముగ్గులతో స్కూల్ ఆవరణను అలంకరించడంతోపాటు గాలిపతంగులు, హరిదాసు కీర్తనలతో విద్యార్థులు ఆనందంగా గడిపారు. అనంతరం ఉపాధ్యాయులు విద్యార్థులపై భోగిపళ్ళు వేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందర్నీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు...3
- 🙏🙏1
- గుంటూరు నగర వనం లో మిత్రుల సందడి1
- గుంటూరు జిల్లా/ తెనాలి ఆంధ్ర రాష్ట్రంలో సినీ పరిశ్రమ అభివృద్ధి చెందేలా సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కృషి చేయాలని సినీ నటుడు సుమన్ పేర్కొన్నారు. తెనాలిలో జరిగిన షార్ట్ ఫిలిం ఫెస్టివల్‌లో పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు త్వరగా చేపట్టాలని కోరారు. రేట్లు పెంచడం వల్ల థియేటర్లకు ప్రేక్షకులు రావడం లేదని, ప్రభుత్వ స్థలాల్లో మినీ థియేటర్లు నిర్మించాలని విజ్ఞప్తి చేశారు.1
- ఆరోగ్యకరమైన దంతాలు మరియు చిగుళ్ళ కోసం సరళమైన అలవాట్లను చూపించే దంత పరిష్కారాల చెక్‌లిస్ట్.1
- మూడు చెక్కలపల్లిలో క్రీడా ప్రాంగణం చదును.. క్రీడాకారులకు క్రికెట్ బ్యాట్ బహుమతి మూడు చెక్కలపల్లి గ్రామంలో క్రీడాకారులకు అనుకూలంగా క్రీడా ప్రాంగణాన్ని చదును చేసే పనులు ఈరోజు పూర్తయ్యాయి. ఈ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ సపావట్ కవిత దేవు నాయక్ సమక్షంలో నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ యువతను ప్రోత్సహించే ఉద్దేశంతో క్రీడాకారులకు రూ.2,400 విలువగల క్రికెట్ బ్యాట్‌ను బహుమతిగా అందజేశారు. గ్రామ స్థాయిలో క్రీడలకు ప్రాధాన్యత ఇస్తూ మౌలిక వసతులు కల్పించడంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.1
- Post by Paramesh Ratnagiri1
- 🙏🙏1