logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో సీపీఐ జిల్లా సమితి ఆధ్వర్యంలో ఈ నెల 23న (మంగళవారం) ‘సర్ ఎస్ఐఆర్’ అంశంపై అవగాహన సదస్సు నిర్వహించనున్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు ఈ సమావేశం ప్రారంభమవుతుంది. సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్ఎండి ఫయాజ్ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించనున్నారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథులుగా అచ్చంపేట ఎమ్మెల్యే, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ వంశీకృష్ణ, అలాగే సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎం. బాలనరసింహ హాజరుకానున్నారు. గౌరవ అతిథిగా సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్దం పర్వతాలు పాల్గొంటారు. జిల్లా కౌన్సిల్ సభ్యులు, శాఖల కార్యదర్శులు, ప్రజాసంఘాల నాయకులు ఈ కార్యక్రమానికి తప్పక రావాలని ఫయాజ్ విజ్ఞప్తి చేశారు.

5 hrs ago
user_NAVADEEP
NAVADEEP
Nagarkurnool, Telangana•
5 hrs ago
3fb31e7a-14d1-4a48-b44b-b0e5ee787006

నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో సీపీఐ జిల్లా సమితి ఆధ్వర్యంలో ఈ నెల 23న (మంగళవారం) ‘సర్ ఎస్ఐఆర్’ అంశంపై అవగాహన సదస్సు నిర్వహించనున్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు ఈ సమావేశం ప్రారంభమవుతుంది. సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్ఎండి ఫయాజ్ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించనున్నారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథులుగా అచ్చంపేట ఎమ్మెల్యే, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ వంశీకృష్ణ, అలాగే సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎం. బాలనరసింహ హాజరుకానున్నారు. గౌరవ అతిథిగా సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్దం పర్వతాలు పాల్గొంటారు. జిల్లా కౌన్సిల్ సభ్యులు, శాఖల కార్యదర్శులు, ప్రజాసంఘాల నాయకులు ఈ కార్యక్రమానికి తప్పక రావాలని ఫయాజ్ విజ్ఞప్తి చేశారు.

More news from Telangana and nearby areas
  • మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ హన్వాడ మండలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డితో కలిసి లాల్యనాయక్ తండాలో కొత్త గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు. వెంకటమ్మ కుంట తండాలో ₹20 లక్షల నిధులతో నిర్మించిన నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ఎంపీ అరుణ ప్రారంభించారు. అదే గ్రామంలో ₹10 లక్షల వ్యయంతో నిర్మించనున్న స్వయం సహాయక సంఘ భవనానికి కూడా ఆమె భూమి పూజ చేశారు.
    1
    మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ హన్వాడ మండలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డితో కలిసి లాల్యనాయక్ తండాలో కొత్త గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు.

వెంకటమ్మ కుంట తండాలో ₹20 లక్షల నిధులతో నిర్మించిన నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ఎంపీ అరుణ ప్రారంభించారు. అదే గ్రామంలో ₹10 లక్షల వ్యయంతో నిర్మించనున్న స్వయం సహాయక సంఘ భవనానికి కూడా ఆమె భూమి పూజ చేశారు.
    user_Anji
    Anji
    Mahabubnagar Rural, Telangana•
    21 hrs ago
  • బీఆర్ఎస్ నాయకుడు మన్నె క్రిశాంక్ కాంగ్రెస్ నాయకులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ నాయకులంతా కేటీఆర్ ప్రతిష్టను దెబ్బతీసేందుకే నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని ఆయన ఆరోపించారు. కేటీఆర్ వారి స్థాయికి దిగి జవాబు చెప్పాల్సిన అవసరం లేదని, తాము (బీఆర్ఎస్ నాయకులు) చాలని మన్నె క్రిశాంక్ స్పష్టం చేశారు.
    1
    బీఆర్ఎస్ నాయకుడు మన్నె క్రిశాంక్ కాంగ్రెస్ నాయకులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ నాయకులంతా కేటీఆర్ ప్రతిష్టను దెబ్బతీసేందుకే నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని ఆయన ఆరోపించారు. కేటీఆర్ వారి స్థాయికి దిగి జవాబు చెప్పాల్సిన అవసరం లేదని, తాము (బీఆర్ఎస్ నాయకులు) చాలని మన్నె క్రిశాంక్ స్పష్టం చేశారు.
    user_Sangareddy News
    Sangareddy News
    జర్నలిస్ట్ Saidabad, Hyderabad•
    20 hrs ago
  • ఫిన్లాండ్‌లో ఉన్నత చదువుల కోసం వెళ్లిన వనస్థలిపురానికి చెందిన బీటెక్ విద్యార్థి ముత్యంరెడ్డి మణిదీప్ రెడ్డి గత 45 రోజులుగా అదృశ్యమైన ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంలో యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వ సంస్థలను కోరారు. కేటీఆర్ బాధిత కుటుంబాన్ని స్వయంగా పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. అనంతరం, కేంద్ర విదేశాంగ శాఖ, భారత రాయబార కార్యాలయం మరియు తెలంగాణ పోలీసులు సమన్వయంతో పనిచేసి మణిదీప్‌ను సురక్షితంగా గుర్తించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మణిదీప్ రెడ్డి కేసును ప్రాధాన్యతగా పరిగణించి వెంటనే పరిష్కరించాలని కేటీఆర్ నొక్కి చెప్పారు.
    1
    ఫిన్లాండ్‌లో ఉన్నత చదువుల కోసం వెళ్లిన వనస్థలిపురానికి చెందిన బీటెక్ విద్యార్థి ముత్యంరెడ్డి మణిదీప్ రెడ్డి గత 45 రోజులుగా అదృశ్యమైన ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంలో యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వ సంస్థలను కోరారు.

కేటీఆర్ బాధిత కుటుంబాన్ని స్వయంగా పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. అనంతరం, కేంద్ర విదేశాంగ శాఖ, భారత రాయబార కార్యాలయం మరియు తెలంగాణ పోలీసులు సమన్వయంతో పనిచేసి మణిదీప్‌ను సురక్షితంగా గుర్తించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మణిదీప్ రెడ్డి కేసును ప్రాధాన్యతగా పరిగణించి వెంటనే పరిష్కరించాలని కేటీఆర్ నొక్కి చెప్పారు.
    user_Ram Thotapally
    Ram Thotapally
    Local News Reporter Chandampeta, Nalgonda•
    21 hrs ago
  • గజ్వేల్ పట్టణంలోని పిడిచేట్ రోడ్ శివాజీ విగ్రహం వద్ద శ్రీ వారాహి కోల్డ్ ప్రెస్ ఆయిల్ ఆర్గానిక్ షాప్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి గజ్వేల్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై షాప్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్ రెడ్డి, షాప్ నిర్వాహకుడు చిట్యాల దినేష్ రెడ్డిని అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఆర్గానిక్ కోల్డ్ ప్రెస్ ఆయిల్, పల్లి నూనె, పొద్దు తిరుగుడు నూనె, కుసుమ నూనె, నువ్వుల నూనె, కొబ్బరి నూనె, అలాగే అనేక రకాల పిండి పదార్థాలు, గట్క పదార్థాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రజలు రసాయనాలు కలిసిన పదార్థాలకు దూరంగా ఉండి, ఆర్గానిక్ వస్తువులను ఉపయోగించి తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని వంటేరు ప్రతాప్ రెడ్డి కోరారు. ఇలాంటి ఆర్గానిక్ షాప్‌ను ప్రారంభించడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ చైర్మన్ గంగిశెట్టి చందన రవీందర్, బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఖాజా విరాసత్ అలీ, కుటుంబ సభ్యులు, తాజా మాజీ ఎంపిటిసి హరిత సంతోష్ రెడ్డి, కౌన్సిలర్లు అత్తేలి శ్రీనివాస్, మామిడి శ్రీధర్, కాముని మురళి, మాజీ కౌన్సిలర్లు ఉప్పల మెట్టయ్య, రహీం, చీర్ల మల్లేశం, ఆర్కే శ్రీనివాస్, నాయకులు అహ్మద్, హనుమంత్ రెడ్డి, స్వామి చారి, ఉమర్, గడిల సంజయ్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
    4
    గజ్వేల్ పట్టణంలోని పిడిచేట్ రోడ్ శివాజీ విగ్రహం వద్ద శ్రీ వారాహి కోల్డ్ ప్రెస్ ఆయిల్ ఆర్గానిక్ షాప్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి గజ్వేల్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై షాప్‌ను ప్రారంభించారు.

ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్ రెడ్డి, షాప్ నిర్వాహకుడు చిట్యాల దినేష్ రెడ్డిని అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఆర్గానిక్ కోల్డ్ ప్రెస్ ఆయిల్, పల్లి నూనె, పొద్దు తిరుగుడు నూనె, కుసుమ నూనె, నువ్వుల నూనె, కొబ్బరి నూనె, అలాగే అనేక రకాల పిండి పదార్థాలు, గట్క పదార్థాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రజలు రసాయనాలు కలిసిన పదార్థాలకు దూరంగా ఉండి, ఆర్గానిక్ వస్తువులను ఉపయోగించి తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని వంటేరు ప్రతాప్ రెడ్డి కోరారు. ఇలాంటి ఆర్గానిక్ షాప్‌ను ప్రారంభించడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు.

ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ చైర్మన్ గంగిశెట్టి చందన రవీందర్, బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఖాజా విరాసత్ అలీ, కుటుంబ సభ్యులు, తాజా మాజీ ఎంపిటిసి హరిత సంతోష్ రెడ్డి, కౌన్సిలర్లు అత్తేలి శ్రీనివాస్, మామిడి శ్రీధర్, కాముని మురళి, మాజీ కౌన్సిలర్లు ఉప్పల మెట్టయ్య, రహీం, చీర్ల మల్లేశం, ఆర్కే శ్రీనివాస్, నాయకులు అహ్మద్, హనుమంత్ రెడ్డి, స్వామి చారి, ఉమర్, గడిల సంజయ్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
    user_Gousuddin Md
    Gousuddin Md
    అంబర్‌పేట్, హైదరాబాద్, తెలంగాణ•
    13 hrs ago
  • వికారాబాద్ జిల్లాలోని తాండూరు పట్టణంలో ఉన్న మాతా శిశు ఆసుపత్రిని మరియు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని తాండూర్ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ పర్యటనలో ఆయన రోగులతో ఆత్మీయంగా మాట్లాడి, ఆసుపత్రి ఎలా ఉందని, చికిత్స సరిగా అందుతుందా, భోజనం పెడుతున్నారా అని అడిగి తెలుసుకున్నారు. ఏమైనా ఇబ్బందులు ఉంటే తనకు తెలియజేయాలని సూచించారు. ఉద్యోగుల హాజరు పట్టికను పరిశీలించిన ఎమ్మెల్యే, వైద్య సేవలు ఎలా అందుతున్నాయో రోగుల నుంచి ఆరా తీశారు. మందుల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు మరియు సిబ్బందికి ఆదేశించారు. అలాగే, వైద్యులు, సిబ్బంది పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండాలని సూచించారు.
    1
    వికారాబాద్ జిల్లాలోని తాండూరు పట్టణంలో ఉన్న మాతా శిశు ఆసుపత్రిని మరియు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని తాండూర్ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ పర్యటనలో ఆయన రోగులతో ఆత్మీయంగా మాట్లాడి, ఆసుపత్రి ఎలా ఉందని, చికిత్స సరిగా అందుతుందా, భోజనం పెడుతున్నారా అని అడిగి తెలుసుకున్నారు. ఏమైనా ఇబ్బందులు ఉంటే తనకు తెలియజేయాలని సూచించారు. ఉద్యోగుల హాజరు పట్టికను పరిశీలించిన ఎమ్మెల్యే, వైద్య సేవలు ఎలా అందుతున్నాయో రోగుల నుంచి ఆరా తీశారు. మందుల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు మరియు సిబ్బందికి ఆదేశించారు. అలాగే, వైద్యులు, సిబ్బంది పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండాలని సూచించారు.
    user_Thanmai Sri
    Thanmai Sri
    బొమరాస్‌పేట, వికారాబాద్, తెలంగాణ•
    18 hrs ago
  • 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఘాజీపూర్‌లోని పోలీస్ లైన్‌లో ఘాజీపూర్ పోలీసులు యోగాను అభ్యసించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ డా. ఇరాజ్ రాజా ఐపీఎస్ ప్రత్యేకంగా పాల్గొన్నారు, ఆరోగ్యకరమైన జీవనం, ఫిట్‌నెస్ మరియు శ్రేయస్సును ప్రోత్సహించారు.
    1
    12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఘాజీపూర్‌లోని పోలీస్ లైన్‌లో ఘాజీపూర్ పోలీసులు యోగాను అభ్యసించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ డా. ఇరాజ్ రాజా ఐపీఎస్ ప్రత్యేకంగా పాల్గొన్నారు, ఆరోగ్యకరమైన జీవనం, ఫిట్‌నెస్ మరియు శ్రేయస్సును ప్రోత్సహించారు.
    user_24 NEWS HAQ KI AWAZ
    24 NEWS HAQ KI AWAZ
    హిమాయత్‌నగర్, హైదరాబాద్, తెలంగాణ•
    22 hrs ago
  • మెదక్ జిల్లాలోని పాపన్నపేట మండలం, నాగసానిపల్లి గ్రామంలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో, సోమవారం అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హారతులను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఏడుపాయల శ్రీ వన దుర్గ భవాని అమ్మవారికి ప్రత్యేక మంగళహారతిని కూడా సమర్పించారు.
    1
    మెదక్ జిల్లాలోని పాపన్నపేట మండలం, నాగసానిపల్లి గ్రామంలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో, సోమవారం అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హారతులను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఏడుపాయల శ్రీ వన దుర్గ భవాని అమ్మవారికి ప్రత్యేక మంగళహారతిని కూడా సమర్పించారు.
    user_KUMAR
    KUMAR
    Patancheru, Sangareddy•
    4 hrs ago
  • సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్‌లో ఆదివారం వాసవి క్లబ్, వాసవి యూత్ క్లబ్, వాసవి వనిత క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో "డాన్ టూ డస్క్" పేరుతో పలు సేవా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వాసవి క్లబ్ సీనియర్ నాయకులు రేణుకుంట శ్రీనివాస్, గంప కృష్ణమూర్తి, చింత రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, "మానవ సేవే మాధవ సేవ" అనే లక్ష్యంతో వాసవి క్లబ్ నిరంతరం సేవా కార్యక్రమాలు చేపడుతోందని పేర్కొన్నారు. లక్షకు పైగా సభ్యత్వం కలిగిన వాసవి ఇంటర్నేషనల్ క్లబ్ ద్వారా అన్ని వర్గాల ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తున్నారని వారు తెలిపారు. గజ్వేల్ ప్రాంతంలో జోన్ చైర్మన్ జె. శేఖర్ నాయకత్వంలో విశేష సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయని నాయకులు కొనియాడారు. అనంతరం నాచారం దేవస్థానం డైరెక్టర్, వాసవి క్లబ్ జోన్ చైర్మన్ జగ్గయ్యగారి శేఖర్ మాట్లాడుతూ, సేవకు ప్రతిరూపంగా వాసవి క్లబ్ నిలుస్తోందని అన్నారు. "డాన్ టూ డస్క్" కార్యక్రమంలో భాగంగా గోశాలలో గోమాతలకు పూజలు నిర్వహించి దాణా సమర్పించడం, మొక్కలు నాటడం, రక్తదాతల పేర్లు నమోదు చేయడం, కస్తూరిబా బాలికల పాఠశాలలో మెడికల్ కిట్లు పంపిణీ చేయడం, వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన వారిని సన్మానించడం వంటి కార్యక్రమాలు చేపట్టామని ఆయన వివరించారు. రాబోయే రోజుల్లో వాసవి క్లబ్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలను మరింత విస్తృత స్థాయిలో నిర్వహిస్తామని జగ్గయ్యగారి శేఖర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మరియాల శ్రీనివాస్, సిద్ది రామచంద్రం, ఉప్పల కృష్ణమూర్తి, కాశీనాథ్, గంగిశెట్టి ఉమేష్, గంగ రమేష్, కైలాస ప్రశాంత్, నితీష్, రామారం రమేష్, విక్రాంత్, గందే సంతోష్, సిరిపురం సత్యనారాయణ, తెరాల రాజు, వాసవి వనిత క్లబ్ సభ్యులు జగ్గయ్యగారి లత, సరిత, చంద్రకళతో పాటు వాసవి క్లబ్ సభ్యులు, ఆర్యవైశ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.
    4
    సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్‌లో ఆదివారం వాసవి క్లబ్, వాసవి యూత్ క్లబ్, వాసవి వనిత క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో "డాన్ టూ డస్క్" పేరుతో పలు సేవా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వాసవి క్లబ్ సీనియర్ నాయకులు రేణుకుంట శ్రీనివాస్, గంప కృష్ణమూర్తి, చింత రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, "మానవ సేవే మాధవ సేవ" అనే లక్ష్యంతో వాసవి క్లబ్ నిరంతరం సేవా కార్యక్రమాలు చేపడుతోందని పేర్కొన్నారు.

లక్షకు పైగా సభ్యత్వం కలిగిన వాసవి ఇంటర్నేషనల్ క్లబ్ ద్వారా అన్ని వర్గాల ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తున్నారని వారు తెలిపారు. గజ్వేల్ ప్రాంతంలో జోన్ చైర్మన్ జె. శేఖర్ నాయకత్వంలో విశేష సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయని నాయకులు కొనియాడారు. అనంతరం నాచారం దేవస్థానం డైరెక్టర్, వాసవి క్లబ్ జోన్ చైర్మన్ జగ్గయ్యగారి శేఖర్ మాట్లాడుతూ, సేవకు ప్రతిరూపంగా వాసవి క్లబ్ నిలుస్తోందని అన్నారు.

"డాన్ టూ డస్క్" కార్యక్రమంలో భాగంగా గోశాలలో గోమాతలకు పూజలు నిర్వహించి దాణా సమర్పించడం, మొక్కలు నాటడం, రక్తదాతల పేర్లు నమోదు చేయడం, కస్తూరిబా బాలికల పాఠశాలలో మెడికల్ కిట్లు పంపిణీ చేయడం, వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన వారిని సన్మానించడం వంటి కార్యక్రమాలు చేపట్టామని ఆయన వివరించారు. రాబోయే రోజుల్లో వాసవి క్లబ్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలను మరింత విస్తృత స్థాయిలో నిర్వహిస్తామని జగ్గయ్యగారి శేఖర్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో మరియాల శ్రీనివాస్, సిద్ది రామచంద్రం, ఉప్పల కృష్ణమూర్తి, కాశీనాథ్, గంగిశెట్టి ఉమేష్, గంగ రమేష్, కైలాస ప్రశాంత్, నితీష్, రామారం రమేష్, విక్రాంత్, గందే సంతోష్, సిరిపురం సత్యనారాయణ, తెరాల రాజు, వాసవి వనిత క్లబ్ సభ్యులు జగ్గయ్యగారి లత, సరిత, చంద్రకళతో పాటు వాసవి క్లబ్ సభ్యులు, ఆర్యవైశ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.
    user_Gousuddin Md
    Gousuddin Md
    అంబర్‌పేట్, హైదరాబాద్, తెలంగాణ•
    16 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.