సీతారామ ప్రాజెక్ట్ సందర్శన - ఆహ్వానం* యాతలకుంటలో సీతారామ ప్రాజెక్ట్ పనులను పరిశీలించేందుకు గౌరవనీయులైన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విచ్చేయనున్నారు. 📍 ప్రాంతం:తొట్టి పంపు నుండి యాతలకుంట వరకు ఈ సందర్శన కొనసాగుతుంది. 🗓 తేదీ: 22-04-2026 ⏰ సమయం: ఉదయం 8:30 గంటలకు *ముఖ్య అతిథులు:* తుమ్మల నాగేశ్వరరావు (గౌరవ రాష్ట్ర మంత్రి) మట్టా రాగమయి దయానంద్ (సత్తుపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే) డాక్టర్ మట్టా దయానంద్ (రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు) ఈ కార్యక్రమంలో మున్సిపల్ మరియు AMC చైర్మన్లు, 5 మండలాల కాంగ్రెస్ అధ్యక్షులు, మున్సిపల్ కౌన్సిలర్లు, సర్పంచ్‌లు, ఐదు మండలాల కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము. *ముఖ్య గమనిక:* ప్రజాప్రతినిధులు,నాయకులు మరియు కార్యకర్తలు అందరూ ఉదయం 8:30 గంటల కల్లా తమ కార్లతో ఎమ్మెల్యే గారి నివాసానికి చేరుకోవాలి. అక్కడ నుండి అందరం కలిసి ప్రాజెక్ట్ సందర్శనకు బయలుదేరడం జరుగుతుంది. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం - సత్తుపల్లి పట్టణం
సీతారామ ప్రాజెక్ట్ సందర్శన - ఆహ్వానం* యాతలకుంటలో సీతారామ ప్రాజెక్ట్ పనులను పరిశీలించేందుకు గౌరవనీయులైన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విచ్చేయనున్నారు. 📍 ప్రాంతం:తొట్టి పంపు నుండి యాతలకుంట వరకు ఈ సందర్శన కొనసాగుతుంది. 🗓 తేదీ: 22-04-2026 ⏰ సమయం: ఉదయం 8:30 గంటలకు *ముఖ్య అతిథులు:* తుమ్మల నాగేశ్వరరావు (గౌరవ రాష్ట్ర మంత్రి) మట్టా రాగమయి దయానంద్ (సత్తుపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే) డాక్టర్ మట్టా దయానంద్ (రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు) ఈ కార్యక్రమంలో మున్సిపల్ మరియు AMC చైర్మన్లు, 5 మండలాల కాంగ్రెస్ అధ్యక్షులు, మున్సిపల్ కౌన్సిలర్లు, సర్పంచ్‌లు, ఐదు మండలాల కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము. *ముఖ్య గమనిక:* ప్రజాప్రతినిధులు,నాయకులు మరియు కార్యకర్తలు అందరూ ఉదయం 8:30 గంటల కల్లా తమ కార్లతో ఎమ్మెల్యే గారి నివాసానికి చేరుకోవాలి. అక్కడ నుండి అందరం కలిసి ప్రాజెక్ట్ సందర్శనకు బయలుదేరడం జరుగుతుంది. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం - సత్తుపల్లి పట్టణం
- Post by Ramprasad islavath1
- Post by V Ramarao1
- చాలా చక్కటి పోస్ట్! అందరికీ అర్ధమైయ్యేట్లు వువరించారు. అందరూ విని పాటించాల్సిన విషయాలు. *చక్కని ఆరోగ్యం కోరుకునేవారు,40సం.పైబడిన వారు ఈ వీడియో చూడడానికి సమయం కేటాయించండి. ఫాలోఅవ్వండి.*2
- *ITC భద్రాచలం పేపర్ బోర్డ్స్ వద్ద ఉధృతమైన INTUC నిరసన* *14వ LTA జాప్యంపై కార్మికుల తీవ్ర ఆగ్రహం* *ఎండను సైతం లెక్క చేయక నిర్విరామంగా 8 గంటల పాటు ధర్నా* *కార్మిక నినాదాలతో మార్మోగిన అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్* *పరిశ్రమ చరిత్రలో మొదటిసారి 8 గంటల పాటు అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ ముందు ధర్నా* భద్రాచలం పేపర్ బోర్డ్స్ (ITC) యూనిట్ వద్ద INTUC మిత్రపక్షాలు ఆధ్వర్యంలో కార్మికులు భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. 14వ LTA అమలులో యాజమాన్యం చేస్తున్న జాప్యాన్ని నిరసిస్తూ సోమవారం ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు నల్ల బ్యాడ్జీలు ధరించి ప్లే కార్డులు ప్రదర్శిస్తూ. నినాదాలు చేస్తూ అడ్మిన్ బ్లాక్ ముందు కార్మికులు బైఠాయించారు. ఈ నిరసన కార్యక్రమానికి యూనియన్ అధ్యక్షులు శ్రీ గోనే రామారావు , ప్రధాన కార్యదర్శి శ్రీ యారం పిచ్చి రెడ్డి నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పరిశ్రమ లాభాల్లో నడుస్తున్నప్పటికీ, కార్మికుల న్యాయమైన కోర్కెలను తీర్చడంలో యాజమాన్యం నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శించారు. మ్యాన్ పవర్ తగ్గించి పని భారాన్ని పెంచాలనే ఆలోచనను విరమించుకోవాలని డిమాండ్ చేశారు ఇప్పటికైనా యాజమాన్యం స్పందించి సానుకూల నిర్ణయం తీసుకోకపోతే, రాబోయే రోజుల్లో ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా గుర్తింపు సంఘానికి కూడా హెచ్చరిస్తున్నాం వేతన ఒప్పందంపై ఎన్నో ఆశలతో ఉన్న కార్మికులను ఇంకా మోసగించకండి. గతంలో అపోజిషన్గా ఉండి ప్యాకేజ్ సాధనకై గొంతెత్తి అరిసిన సందర్భాలను గుర్తు చేసుకోండి! అర్ధనగ్న ప్రదర్శనలతో ఒక్క మాన్ పవర్ కూడా తీయకూడదన్న కార్మికుల ఆవేదన అర్థం చేసుకోండి! నూతన కోటర్స్ నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయండి! రిటైర్డ్, వైద్యం, విద్య, బదిలీ కార్మికుల పర్మనెంట్, శ్రీరామనవమికి పేయిడ్ హాలిడే, జాబ్ క్యాలెండర్, డిపార్ట్మెంట్ గ్రేడ్లకై వేచి ఉన్న, తపిస్తున్న కార్మికులను | దృష్టిలో పెట్టుకొని 22,000/- తగ్గకుండా వేతన ఒప్పందం పూర్తి చేయండి. అలాగే పరిశ్రమ 50 సం॥రాలు పూర్తిచేసుకున్న సందర్భంగా ప్రతి కార్మికునికి పది గ్రాముల గోల్డ్ కాయిన్ బహుమతిగా ఇప్పించండి. మీకు ప్రతికూల పరిస్థితులు ఉంటే రండి కార్మికుల్లో కలవండి కార్మికులను న్యాయం చేసే భాగంలో మాతో కలవండి మీకు పూర్తి సహాయాసహకారాలు అందిస్తామన్నారు ఈ కార్యక్రమంలో ఐ ఎన్ టి యు సి మిత్రపక్షాల ఆఫీస్ బేరర్స్ నాయకులు కార్యకర్తలు కార్మికులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు1
- నరసరావుపేట మండలం లింగంగుంటలో రాజకీయ ఘర్షణ చోటుచేసుకుంది. వైసీపీ సోషల్ మీడియా ప్రెసిడెంట్ హన్నుపై టీడీపీ నేతలు దాడి చేశారని ఆయన బంధువులు ఆరోపించారు. ఈ దాడిలో హన్నుకు గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం తక్షణమే ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై బాధిత బంధువులు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. గ్రామంలో ఉద్రిక్తత నెలకొనకుండా పోలీసులు నిఘా ఉంచారు. దాడికి గల పూర్తి కారణాలు మరియు ఇతర వివరాలు తెలియాల్సి ఉంది.1
- ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఏప్రిల్ 20వ తేదీ నుండి 26వ తేదీ వరకు వారం రోజులు రాష్ట్రవ్యాప్తంగా అన్ని వసతి గృహాలు సంక్షేమ విద్యాసంస్థలలో సంక్షేమ వారోత్సవాలు ప్రారంభం అయ్యాయి, మహబూబాబాద్ జిల్లా గూడూరు మరిమిట్టా *మహాత్మ జ్యోతిరావు పూలే వసతిగృహం* (బాలికలు) లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో *జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్* పాల్గొని పిల్లలతో కలిసి భోజనం చేశారు, ఈ సందర్భంగా కలెక్టర్ మహాత్మ జ్యోతిరావు పూలే వసతి గృహంలో పరిసరాలను పరిశీలించారు, ఈ వారం రోజులలో ప్రతిరోజు ఒక థీమ్ ద్వారా వసతి గృహాలలో సానిటేషన్, మైనర్ రిపేర్, హెల్త్, స్టోర్ పరిసరాల పరిశుభ్రత తదితర అంశాలపై ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు, వసతి గృహంలోని స్టోర్ గది, తరగతి గదులు, కిచెన్, డైనింగ్ హాల్, మరుగుదొడ్లు, లను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సంబంధిత వసతి గృహాల సిబ్బంది ఆదేశించారు, భోజనం సిద్ధం చేసే సిబ్బంది కి షెడ్యూల్ ప్రకారం వైద్య పరీక్షలు నిర్వహించాలని సూచించారు, అన్ని వసతి గృహాలలో ఫిర్యాదుల బాక్సులు ఏర్పాటు చేయాలని సూచించారు, విద్యార్థిని, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు, డైట్ నేను ప్రకారం పక్కాగా నాణ్యమైన రుచికరమైన ఆహారాన్ని అందించాలని, విద్యతోపాటు క్రీడా మానసిక వికాసం తదితర అంశాలపై శిక్షణ ఇప్పించాలని, సమ్మర్ క్యాంపు ల ద్వారా పిల్లలకు క్రీడల్లో పాల్గొనే అవకాశం కల్పించాలన్నారు, పిల్లల యొక్క విద్యాసామర్ధ్యాలను స్వయంగా పరిశీలించారు నూతన టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డిజిటల్ తరగతుల ద్వారా అత్యాధునిక వినూత్న రీతిలో విద్యాబోధనలు అందించాలని ఉపాధ్యాయునీ ఉపాధ్యాయులకు సూచించారు, అత్యుత్తమ ఫలితాలను సాధించేందుకు కృషి చేయాలని, ఈ వారం రోజులు అన్ని విద్యాసంస్థలలో రోజువారి కార్యక్రమాలను పకడ్బందీగా నిర్వహించాలని తెలిపారు, ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈరోజు నుండి ఏప్రిల్ 26 వరకు వారం రోజులు జిల్లాలో సంక్షేమ వారోత్సవాలను నిర్వహించడం కోసం ఇప్పటికే పక్కా ప్రణాళికతో ప్రతి ఒక్కరికి వసతి గృహాలు హాస్టల్స్, విద్యాసంస్థలను కేటాయించడం జరిగిందని తెలిపారు, కలెక్టర్ వెంట గూడూరు తాసిల్దార్ నాగభవాని, ఎంపీడీవో, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. -1
- జెఈఈ మెయిన్–2026 ఫలితాలలో భాష్యం అద్భుత ప్రతిభ..ఓపెన్ కేటగిరీలో 100 పర్సంటేజీ తో ఆలిండియా టాపర్ టి.దుర్గా సుప్రభాత్ Shot News:జెఈఈ మెయిన్ – 2026 ఫలితాలలో భాష్యం బఐటి జెఈఈ అకాడమీ విద్యార్థులు జాతీయ స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచారని భాష్యం విద్యాసంస్థల ఛైర్మన్ భాష్యం రామకృష్ణ తెలిపారు. మంగళవారం చంద్రమౌళినగర్లోని భాష్యం మెయిన్ క్యాంపస్లో ఆయన విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏప్రిల్లో జరిగిన జేఈఈ మెయిన్ పరీక్షలో టి.దుర్గా సుప్రభాత్ ఆంధ్రప్రదేశ్ నుండి 100 పర్సంటైల్ సాధించి చరిత్ర సృష్టించాడన్నారు. టి.దుర్గా సుప్రభాత్ 100 పర్సంటైల్తో పాటు ఓపెన్ కేటగిరీలో ఆలిండియా 11వ ర్యాంకును సాధించాడన్నారు.1
- Post by Ramprasad islavath1