ఆదర్శ కాలనీలో బాల గణేష్ మండపం వద్ద నిత్య యజ్ఞాలు – భక్తులకు అన్నదానం బాన్సువాడ పట్టణం: ఆదర్శ కాలనీలో ఏర్పాటు చేసిన బాల గణేష్ మండపం వద్ద వినాయక చవితి సందర్భంగా ప్రతిరోజూ యజ్ఞాలు, హోమాలు, ప్రత్యేక పూజలు భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్నాయి. మండపంలో నిత్య అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తూ భక్తులకు ప్రసాదాలు అందిస్తున్నారు. మంగళవారం రోజున బాన్సువాడ యూనియన్ బ్యాంక్ మేనేజర్ రావల్ కమల్జిత్ అనాల్ బాల గణేష్ మండపాన్ని సందర్శించి, అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులతో కలిసి ప్రసాదం స్వీకరించారు. అనంతరం శ్రీ బాల గణేశుడి తీర్థప్రసాదాలు తీసుకుని, భక్తి మార్గంలో నడవాలని, ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజానికి మంచి సందేశాన్ని ఇస్తాయని తెలిపారు. ఈ సందర్భంగా మండపం పరిసరాలు భజనలు, గణేష్ నామస్మరణతో మార్మోగాయి. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై గణేశునికి ప్రార్థనలు చేశారు. కార్యక్రమంలో బాల గణేష్ మండపం సభ్యులు, కాలనీ వాసులు పాల్గొన్నారు.
ఆదర్శ కాలనీలో బాల గణేష్ మండపం వద్ద నిత్య యజ్ఞాలు – భక్తులకు అన్నదానం బాన్సువాడ పట్టణం: ఆదర్శ కాలనీలో ఏర్పాటు చేసిన బాల గణేష్ మండపం వద్ద వినాయక చవితి సందర్భంగా ప్రతిరోజూ యజ్ఞాలు, హోమాలు, ప్రత్యేక పూజలు భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్నాయి. మండపంలో నిత్య అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తూ భక్తులకు ప్రసాదాలు అందిస్తున్నారు. మంగళవారం రోజున బాన్సువాడ యూనియన్ బ్యాంక్ మేనేజర్ రావల్ కమల్జిత్ అనాల్ బాల
గణేష్ మండపాన్ని సందర్శించి, అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులతో కలిసి ప్రసాదం స్వీకరించారు. అనంతరం శ్రీ బాల గణేశుడి తీర్థప్రసాదాలు తీసుకుని, భక్తి మార్గంలో నడవాలని, ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజానికి మంచి సందేశాన్ని ఇస్తాయని తెలిపారు. ఈ సందర్భంగా మండపం పరిసరాలు భజనలు, గణేష్ నామస్మరణతో మార్మోగాయి. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై గణేశునికి ప్రార్థనలు చేశారు. కార్యక్రమంలో బాల గణేష్ మండపం సభ్యులు, కాలనీ వాసులు పాల్గొన్నారు.
- రైతులకు ఇబ్బందులు లేకుండా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తాం నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట సొసైటీ ఆధ్వర్యంలో మహా గర్జన సభ సొసైటీ చైర్మన్ నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సీఈవో సంగమేశ్వర గౌడ్ మాట్లాడుతూ..1-03-2026 నుంచి 31-08-2026 వరకు చేసిన జమ కర్చుల గురించి చదివి వినిపించారు. కొనుగోలు కేంద్రాలు రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ శ్రీనివాస్,తదితరులు ఉన్నారు1
- నయాబాది టీచర్స్ కాలనీలో చిన్నారులచే హనుమాన్ చాలీసా పారాయణం ఎల్లారెడ్డి: పట్టణంలోని టీచర్స్ కాలనీలో మంగళవారం చిన్నారులు భక్తిశ్రద్ధలతో హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. ముందుగా ఆంజనేయ స్వామి చిత్రపటానికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. కార్యక్రమంలో పెద్దలు పాల్గొని చిన్నారులకు సహకరించారు.1
- బోధన్ రకాసిపేట్‌లోని మదర్సా అహ్మద్ ఉల్ ఉలూమ్లో షష్మాహీ పరీక్షల ఫలితాలు.. విద్యార్థులకు ఘనంగా బహుమతుల ప్రదానం బోధన్: బోధన్ రకాసిపేట్ ప్రాంతంలోని మదర్సా అహ్మద్ ఉల్ ఉలూమ్లో షష్మాహీ పరీక్షల ఫలితాల సందర్భంగా ఘనంగా బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు. పరీక్షల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించిన విద్యార్థులతో పాటు ఇతర ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు కూడా బహుమతులు అందజేశారు. విద్యార్థుల ప్రతిభను అభినందిస్తూ వారిని మరింతగా ప్రోత్సహించారు. ఈ సందర్భంగా మదర్సా నిర్వాహకులు మాట్లాడుతూ.. విద్యతో పాటు విద్యార్థులకు నైతిక విలువలు, ధార్మిక విద్య, క్రమశిక్షణ కూడా అందించడం ఎంతో అవసరమని తెలిపారు. సమాజంలో జ్ఞానం, నైతికత, మానవత్వం కోసం మదర్సాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న క్రెసెంట్ హైస్కూల్ ప్రిన్సిపాల్ మీర్ జావేద్ అలీ మాట్లాడుతూ.. దైవిక విద్యను అభ్యసించడం గొప్ప అదృష్టమని, విద్యార్థులు దైవిక విద్యతో పాటు భవిష్యత్తులో ఇబ్బందులు లేకుండా ఆధునిక విద్యను కూడా అభ్యసించాలని సూచించారు. వివిధ భాషల విద్యను అందించే ఉపాధ్యాయుల ఏర్పాటుకు తన వంతు సహకారం అందించేందుకు ప్రయత్నిస్తానని తెలిపారు. మదర్సా అధ్యక్షుడు సయ్యద్ లియాఖత్ హుస్సేన్ అలియాస్ బాబా బ్యాటరీ మాట్లాడుతూ.. విద్యార్థులు ధార్మిక విద్యను అభ్యసిస్తూ భవిష్యత్తులో హాఫిజ్‌లు, ఆలిమ్‌లుగా ఎదగాలని ఆకాంక్షించారు. దైవిక విద్యతో పాటు ఆధునిక విద్య, కంప్యూటర్ విద్య కూడా అవసరమని, విద్యార్థుల కోసం కంప్యూటర్లను ఏర్పాటు చేసేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానని తెలిపారు. మదర్సా ప్రధాన నిర్వాహకులు హాజీ సుల్తాన్ ఖాద్రీ పర్యవేక్షణలో విద్యార్థులకు ధార్మిక విద్యతో పాటు విద్యా రంగంలో కూడా ముందుకు సాగేలా ప్రోత్సహిస్తున్నారు. హాఫిజ్ అబ్దుల్ మతీన్ విద్యార్థులకు బోధిస్తున్నారు. విద్యార్థుల వసతి, భోజన సదుపాయాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ కార్యక్రమంలో జీ టుడే న్యూస్ చానల్ చీఫ్ ఎడిటర్ నాసిర్ మిర్జా పాల్గొని, ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు స్వయంగా బహుమతులు అందజేసి వారిని అభినందించారు. కార్యక్రమంలో సయ్యద్ లియాఖత్ హుస్సేన్ అలియాస్ బాబా బ్యాటరీ, జనరల్ సెక్రటరీ అక్బర్ ఖాన్ ఖాద్రీ, గౌస్ ఖాద్రీ, లతీఫ్ అహ్మద్ ఖాద్రీ, కౌన్సిలర్ రఫీ, కౌన్సిలర్ జావేద్, మీర్ జావేద్ అలీ, సనా పటేల్, హాఫిజ్ అబ్దుల్ మతీన్, ప్రధాన నిర్వాహకులు సుల్తాన్ ఖాద్రీ తదితర ప్రముఖులు పాల్గొన్నారు.1
- నాగిరెడ్డిపేట:పోచారం ప్రాజెక్టులోకి 306 క్యూసెక్కుల వరద ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట మండలాల వరప్రదాయిని పోచారం ప్రాజెక్టులోకి వరద ప్రవాహం కొనసాగుతోంది. రాత్రి కురిసిన వర్షాలకు మంగళవారం ఉదయం 6 గంటలకు 306 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతున్నట్లు ఏఈ అక్షయ్‌కుమార్ తెలిపారు. ప్రధాన కాలువ ద్వారా 230 క్యూసెక్కులు విడుదల చేస్తున్నామని చెప్పారు. మరో 38 క్యూసెక్కుల నీరు ఆవిరవుతోందని పేర్కొన్నారు.ప్రాజెక్టు నుండి ప్రతిరోజు మీరు విడుదల కావడంతో రెండు అడుగుల ప్రాజెక్టు నీటిమట్టం తగ్గి ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 21 కాడులు కాగా 19 అడుగులకు చేరింది మళ్లీ భారీ వర్షాలు కురిస్తే ప్రాజెక్ట్ పొంగిపొర్లి నిజాంసాగర్ ప్రాజెక్టులోకి మంజీరా నదిలోకి చేరి నిజం సార్ ప్రాజెక్టులోకి నీరు చేరుతుంది1
- కంగ్టి మండలంలో. భక్తిశ్రద్ధలతో కొలువుదీరిన గణనాథుడు SRD:మండల కేంద్రమైన కంగ్టి , తడ్కల్ పరిసరాల గ్రామాల్లో వినాయక చవితి వేడుకలు నిర్వహించారు. అనంతరం వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. పురోహితులు, యువజన సంఘం సభ్యుల ఆధ్వర్యంలో గణపతికి పూజలు, హారతులు నిర్వహించారు. వినాయకుడి విశిష్టత, విజయాన్ని పురోహితులు భక్తులకు వివరించారు. భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు తదితరులు ఉన్నారు.1
- అమర ప్రసాద్ పై దేశద్రోహం కేసు నమోదు చేయాలని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అతన్ని శిక్షించాలని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆరు బాగయ్య అమర ప్రసాద్ పైన దేశద్రోహం కేసు నమోదు చేయాలని రాసిన పుస్తకాన్ని నిషేధించాలని డిమాండ్ చేస్తూ ఎస్సీ ఎస్టీ రాష్ట్ర అధ్యక్షులు కొంగలి వెంకటి నిరాహార దీక్ష 4వ రోజు కొనసాగడం జరుగుతుంది, ఈ దీక్షకు అంబేద్కర్ సంఘం, జిల్లా అధ్యక్షుడు కొత్తోల గంగారాం, ప్రధాన కార్యదర్శి గైనీ రాజు,గౌరవ అధ్యక్షులు మల్లన్న రాష్ట్ర నాయకులు సంగీ రాజలింగం, సూపర్ టీవీ ఛానల్ స్టాప్ రిపోర్టర్ ఆశన్న,బహుజన దళిత పోరాట సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర శివరాజు జిల్లా అధ్యక్షుడు సబ్బాని స్వామి,ఎమ్మార్పీఎస్ జిల్లా మహిళా అధ్యక్షురాలు సత్తిగారి లక్ష్మీ, మాదిగ రాజకీయ పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ బాగయ్య, లింగంపేట్ మాజీ ఎంపీపీ ముధం సాయిలు, అంబేద్కర్ ఇంటర్నేషనల్ సేవాసమితి అధ్యక్షులు భూపతి , తెలంగాణ రక్షణ సేన నాయకులు పెరుమాండ్ల రాములు, ఆర్టిఐ రాష్ట్ర కార్యదర్శి లెగ్గిల రాజు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమర ప్రసాద్ పైన దేశద్రోహం కేసు నమోదుచేసి రాసిన పుస్తకన్నీ వెంటనే నిషేధించాలని అమర ప్రసాద్ ను వెంటనే అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి అమర ప్రసాద్ ను అరెస్టు చేయించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో దళిత ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్న కూడా పట్టించుకోవడం లేదని, వెంటనే పట్టించుకోనీ అమర ప్రసాద్ పైన దేశద్రోహం కేసు నమోదు చేయాలని రాసిన పుస్తకాన్ని నిషేధించాలని డిమాండ్ చేశారు.2
- బొమ్మాబొరుసుఆడుతున్న ఏడుగురు అరెస్టు24510నగదుఆరు సెల్ ఫోన్లుస్వాదీనంఎస్పీశ్రీనివాస్ రావు బొమ్మా బొరుసు ఆడుతున్న ఏడుగురు అరెస్ట్రూ.24,510 నగదు, ఆరు సెల్‌ఫోన్లు స్వాధీనంమెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు వెల్దుర్తి మండలం హక్కింపేట గ్రామ పరిధిలోని హక్కింపేట డ్యామ్ సమీపంలో బొమ్మా బొరుసు ఆడుతున్న ఏడుగురిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు తనిఖీలు నిర్వహించి జూదం ఆడుతున్న . వారిలో దేవసోత్ దశరథ్, మల్గారెడ్డి నవీన్‌రెడ్డి, ఎండీ హుస్సేన్, దొడ్డ్ల వినోద్, మల్లబోయిన గణేష్, పాశం మాణిక్‌రెడ్డి, గాండ్ల రాజు లనుఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.24,510 నగదు, ఆరు సెల్‌ఫోన్లను స్వాధీనం4 చేసుకుని కేసు నమోదు చేసినట్లు తెలిపారు.జిల్లాలో జూదం, బొమ్మా బొరుసు, బెట్టింగ్ వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు. జూదంఆడుతున్న సమాచారం 100కాల్ చేసి సమాచారం ఇవ్వాన్నారు. జూదంవల్ల కుటుంబాలు ఆర్థికంగా నష్టపోవడంతో పాటు పలు సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉందన్నారు. ప్రజలు ఇలాంటి కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచించారు. చట్టవిరుద్ధ జూదం, బెట్టింగ్‌కు సంబంధించిన సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని ఎస్పీశ్రీనివాస్ రావు కోరారు.సమాచారం ఇచ్చిన వారిపేర్లను గుప్తంగా ఉంచుతామన్నారు.1
- భజరంగ్దళ్ గణేష్ మండలి వద్ద చిన్నారులు పెద్దలచే హనుమాన్ చాలీసా పారాయణం ఎల్లారెడ్డి: పట్టణంలోని బజరంగ్దళ్ గణేష్ మండలి వద్ద ఆంజనేయ స్వామికి ఇష్టమైన మంగళవారం సందర్బంగా చిన్నారులు, యువకులు, పెద్దలు కలిసి భక్తిశ్రద్ధలతో హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. ముందుగ వినాయకునికి ఆంజనేయ స్వామికి పూజలు చేసి హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. ఈ కార్యక్రమంలో బజరంగ్దళ్ ప్రతినిధులు, పెద్దలు పాల్గొన్నారు.1