బండి సంజయ్‌కు బీఆర్ఎస్‌తో చీకటి ఒప్పందం: మాజీ సుడా చైర్మన్ నరేందర్‌రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్ట్ అవకతవకలపై జస్టిస్ ఘోష్ కమిషన్ స్పష్టమైన నివేదిక ఇచ్చినా, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఎందుకు విచారణ జరపడం లేదని మాజీ సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి తీవ్రంగా నిలదీశారు. కరీంనగర్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్‌తో కుదుర్చుకున్న చీకటి ఒప్పందాల వల్లే కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో తాత్సారం చేస్తోందని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ బాగోతాన్ని బట్టబయలు చేస్తుంటే ప్రజలు హర్షిస్తున్నారని పేర్కొన్నారు. కానీ, కరీంనగర్ అభివృద్ధి అంతా కేంద్రమంత్రే చేస్తున్నట్లు భ్రమింపజేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో మంచి జరిగితే బీజేపీ ఖాతాలో వేసుకుంటూ, చెడు జరిగితే ఆ నెపాన్ని కాంగ్రెస్ ప్రభుత్వంపై రుద్దుతూ రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని నరేందర్‌రెడ్డి ధ్వజమెత్తారు.
బండి సంజయ్‌కు బీఆర్ఎస్‌తో చీకటి ఒప్పందం: మాజీ సుడా చైర్మన్ నరేందర్‌రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్ట్ అవకతవకలపై జస్టిస్ ఘోష్ కమిషన్ స్పష్టమైన నివేదిక ఇచ్చినా, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఎందుకు విచారణ జరపడం లేదని మాజీ సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి తీవ్రంగా నిలదీశారు. కరీంనగర్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్‌తో కుదుర్చుకున్న చీకటి ఒప్పందాల వల్లే కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో తాత్సారం చేస్తోందని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ బాగోతాన్ని బట్టబయలు చేస్తుంటే ప్రజలు హర్షిస్తున్నారని పేర్కొన్నారు. కానీ, కరీంనగర్ అభివృద్ధి అంతా కేంద్రమంత్రే చేస్తున్నట్లు భ్రమింపజేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో మంచి జరిగితే బీజేపీ ఖాతాలో వేసుకుంటూ, చెడు జరిగితే ఆ నెపాన్ని కాంగ్రెస్ ప్రభుత్వంపై రుద్దుతూ రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని నరేందర్‌రెడ్డి ధ్వజమెత్తారు.
- కరీంనగర్‌లో పాలిటెక్నిక్ విద్య పరిరక్షణ ఉద్యమం ఉధృతం..! 32వ రోజుకు చేరిన ఆందోళన... G.O.Ms.No.97 రద్దు చేయాలంటూ అధ్యాపకుల నిరసన..! కరీంనగర్ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జీఎంఆర్ మహిళల పాలిటెక్నిక్ కళాశాలలో... భోజన విరామ సమయంలో అధ్యాపక బృందం నల్ల దుస్తులు, నల్ల మాస్కులు ధరించి నిరసన చేపట్టింది. G.O.Ms.No.97ను వెంటనే రద్దు చేయాలని TPJAC నాయకులు డిమాండ్ చేశారు. అదే సమయంలో... కేంద్ర TPJAC నాయకులు, ఉద్యోగులతో మాట్లాడే సందర్భంలో టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ అనుచిత, అన్పార్లమెంటరీ భాష ఉపయోగించారని ఆరోపిస్తూ... తీవ్రంగా ఖండించారు. కమిషనర్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మరోవైపు... రేపటి నుంచి ప్రారంభమయ్యే సెమిస్టర్ మిడ్ ఎగ్జామినేషన్స్ విధులను బహిష్కరిస్తున్నట్లు స్థానిక TPJAC యూనిట్ ప్రిన్సిపాల్‌కు రీప్రజెంటేషన్ అందజేసింది. ఉద్యమం 32వ రోజుకు చేరడంతో... ప్రభుత్వం స్పందిస్తుందా? G.O.Ms.No.97పై తదుపరి నిర్ణయం ఏంటి? అనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. పాలిటెక్నిక్ విద్య పరిరక్షణ కోసం తమ ఆందోళన కొనసాగిస్తామని స్థానిక TPJAC, కేంద్ర TPJAC స్పష్టం చేసింది.1
- కరీంనగర్ లో ఈనెల 23న గణేష్ నిమజ్జనోత్సవం...ఏర్పాట్లను పరిశీలించిన కేంద్రమంత్రి బండి సంజయ్ కరీంనగర్ లో గణేష్ నిమజ్జనోత్సవానికి పకడ్బందీగా విస్తృత ఏర్పాట్లు చేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తెలిపారు. మానకొండూరు, చింతకుంట, కొత్తపల్లిలో వినాయక నిమజ్జనానికి సంబంధించి ఏర్పాట్లను మేయర్ శ్రీనివాస్, కలెక్టర్ చిత్రా మిశ్రా సిపి గౌస్ ఆలం తో కలిసి బండి సంజయ్ పరిశీలించారు. కరీంనగర్ లో ఈ నెల 23న నిర్వహించనున్న వినాయక నిమజ్జనోత్సవాన్ని బ్రహ్మాండంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. గతంలో నిమజ్జన సమయంలో ఎదురైన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈసారి ముందస్తు ప్రణాళికతో పకడ్బందీ చర్యలు చేపట్టాలని అధికారులను కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆదేశించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తాగునీరు, విద్యుత్, లైటింగ్, భారీ క్రేన్లు, పారిశుధ్యం, ట్రాఫిక్ నియంత్రణ తదితర సౌకర్యాలను ముందుగానే సిద్ధం చేయాలని సూచించారు. మానకొండూరు చెరువుతో పాటు చింతకుంట కాకతీయ కెనాల్, కొత్తపల్లి ప్రాంతాల్లో నిమజ్జనానికి అవసరమైన నీటిని విడుదల చేయాలని సాగునీటి శాఖ మంత్రి, ఉన్నతాధికారులను కోరినట్లు ఆయన చెప్పారు. నిమజ్జనోత్సవ సమయానికి అవసరమైన నీటిని అందుబాటులోకి తీసుకురావడానికి ప్రత్యేకంగా కృషి చేస్తున్నామని తెలిపారు. ఇరిగేషన్ అధికారులు ఇందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. కరీంనగర్‌లోని సుమారు 50 శాతం వినాయక విగ్రహాలు మానకొండూరు చెరువు వద్ద నిమజ్జనం కానున్నందున అక్కడ ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని చెప్పారు.1
- వినాయక నిమజ్జనానికి పక్కాగా ఏర్పాట్లు చేయాలి జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ సిరిసిల్ల మానేరు తీరంలో నిమజ్జన వేడుకల ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితె వినాయక నిమజ్జనానికి ఏర్పాట్లు పక్కాగా చేయాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు.వినాయక విగ్రహాల నిమజ్జనానికి సిరిసిల్లలోని మానేరు తీరంలోని ప్రేమ్ నగర్, బ్రిడ్జి వద్ద చేస్తున్న ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితె పలు శాఖల అధికారుల తో కలిసి బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. వినాయక మండపాల నిర్వాహకులు తమ విగ్రహాలను భక్తి శ్రద్ధల మధ్య వేడుకలు నిర్వహిస్తూ వైభవంగా తరలించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ అధికారులకు సహకరించాలని కోరారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ముందుకు వెళ్ళి, వేడుకలను విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు. వినాయక నిమజ్జనానికి కావలసిన నీటి సౌకర్యం, స్టేజ్, విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని, వైద్య సేవలు, అగ్ని మాపక శాఖ అధికారులు సేవలు అందించాలని, పారిశుధ్య పనులు చేయించాలని, క్రేన్లు అందుబాటులో పెట్టాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు.ఇక్కడ మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ, ఆర్డీఓ శ్రీధర్ బాబు, డీఎస్పీ నాగేంద్రాచారి, నీటి పారుదల శాఖ అధికారి దయాకర్, జిల్లా వైద్యాధికారి ఏంజెలా ఆల్ఫ్రెడ్, జిల్లా మత్స్య శాఖ అధికారి సౌజన్య, తహసీల్దార్ మహేష్, మున్సిపల్ కమిషనర్ ఖదీర్ పాషా, పోలీసులు తదితరులు పాల్గొన్నారు.1
- శ్రీ కోటేశ్వర స్వామి కోటిలింగాల ఆలయ అభివృద్ధి పనులు ప్రారంభం జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం కోటిలింగాల శ్రీ పార్వతి కోటేశ్వర స్వామి దేవస్థానంలో 2027 గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని ఆలయ అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయి. నూతన ఆలయ నిర్మాణానికి రూ.4.50 కోట్లు, రాజగోపురం నిర్మాణానికి రూ.1 కోటి మంజూరయ్యాయి. నూతన ఆలయ నిర్మాణంలో భాగంగా పురాతన ఆలయ శిఖరాలను యంత్రాల సాయంతో తొలగించారు.1
- NSUI ఆధ్వర్యంలో ఖనిలో తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహణ MLA మక్కాన్ సింగ్ రాజ్ ఠాగూర్ ఆదేశాల మేరకు NSUI రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెంటం ఉదయ్ రాజ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఖని రీగల్ షూ మార్ట్ వద్ద తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొంతల రాజేష్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ముఖ్య అతిథులుగా నగర మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ పాతిపెల్లి ఎల్లయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా నిజాం నిరంకుశ పాలన నుంచి తెలంగాణ విముక్తి కోసం పోరాడిన తెలంగాణ సాయుధ పోరాట యోధులకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా NSUI రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెంటం ఉదయ్ రాజ్ మాట్లాడుతూ... 1947 ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ, హైదరాబాద్ సంస్థానం మాత్రం నిజాం పాలనలోనే కొనసాగిందని తెలిపారు. నిజాం పాలకుల నిరంకుశ పాలనకు, రజాకారుల అరాచకాలకు వ్యతిరేకంగా భూమి కోసం, భుక్తి కోసం, స్వేచ్ఛా స్వాతంత్ర్యాల కోసం ఆనాడు సామాన్య ప్రజలు ప్రజా చైతన్యంతో సాగించిన పోరాటం చరిత్రలో చిరస్మరణీయమని పేర్కొన్నారు. ప్రజా పోరాటానికి మద్దతుగా అప్పటి కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీకి చెందిన కేంద్ర హోంమంత్రి సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ నేతృత్వంలో సెప్టెంబర్ 13 నుంచి 17 వరకు నిర్వహించిన సైనిక చర్య ద్వారా హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో విలీనమైందని తెలిపారు. ప్రజా పోరాటాల ఫలితంగా రాచరిక పాలనకు ముగింపు పలికి ప్రజాస్వామ్య వ్యవస్థకు మార్గం సుగమం కావడం చారిత్రక పరిణామమని అన్నారు. ఈ ప్రజా పోరాటానికి గుర్తుగా సెప్టెంబర్ 17ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజా పాలన దినోత్సవంగా అధికారికంగా నిర్వహించడం స్వాగతించదగిన పరిణామమని మెంటం ఉదయ్ రాజ్ పేర్కొన్నారు. చరిత్రను రాజకీయ ప్రయోజనాల కోసం వక్రీకరించవద్దు: మెంటం ఉదయ్ రాజ్ తెలంగాణ విముక్తి పోరాట చరిత్రను కొందరు బీజేపీ నాయకులు రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటూ ప్రజల మధ్య మతపరమైన విభేదాలను సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని మెంటం ఉదయ్ రాజ్ విమర్శించారు. సెప్టెంబర్ 17నాటి తెలంగాణ విముక్తి పోరాటంలో రాజకీయ పార్టీల పాత్ర గురించి మాట్లాడితే, కాంగ్రెస్ పార్టీతో పాటు కమ్యూనిస్టు పార్టీలకు చెందిన నాయకులు కూడా కీలక పాత్ర పోషించారని ఆయన పేర్కొన్నారు. ఆపరేషన్ పోలో నిర్వహించిన అప్పటి కేంద్ర హోంమంత్రి సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడని,దేశ స్వాతంత్ర సమయంలోనే హైదరాబాద్‌లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన స్వామి రామానంద తీర్థ గారు స్టేట్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి అని తెలిపారు. అదేవిధంగా, దొడ్డి కొమురయ్య, రావి నారాయణరెడ్డి, మల్లు స్వరాజ్యం తదితరులు కమ్యూనిస్టు ఉద్యమానికి చెందిన ప్రముఖ పోరాట యోధులని గుర్తుచేశారు. తెలంగాణ విముక్తి పోరాట సమయంలో బీజేపీకి చెందిన నాయకుల పాత్రను చారిత్రక ఆధారాలతో పరిశీలించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. చరిత్రను వక్రీకరించే ప్రయత్నాలను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడం సరికాదని పేర్కొన్నారు. ప్రజా పోరాటాల చరిత్రను మతపరమైన, రాజకీయ విభజనలకు ఉపయోగించకుండా వాస్తవాలను ప్రజలకు తెలియజేయాలని మెంటం ఉదయ్ రాజ్ కోరారు. కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, NSUI నాయకులు, వివిధ విభాగాల అధ్యక్షులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.1
- గణేష్ నవరాత్రి ఉత్సవాల జగిత్యాల పట్టణంలో వీధి దీపాల అలంకరణ, నిమజ్జన చెరువు వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని మున్సిపల్ మందు బిజేపి నాయకుల నిరసన కమిషనర్ కు బిజెపి నాయకుల వినతి1
- ఎమ్మెల్యే గడ్డం వినోద్ నిర్లక్ష్యం వల్లే జోగాపూర్-మైలారం రోడ్డు పనులు ఆలస్యం ఎమ్మెల్యే గడ్డం వినోద్ నిర్లక్ష్యం వల్లే నెన్నెల మండలం జోగాపూర్-మైలారం రోడ్డు పనులు నిలిచిపోయాయని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. గురువారం మండల కేంద్రంలో మాట్లాడుతూ కొబ్బరికాయ కొట్టి రెండు నెలలు గడిచినా రోడ్డు పనులు ప్రారంభించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తామే పనులను అడ్డుకుంటున్నామని కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు1
- తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అమరుల స్ఫూర్తితో ఉద్యమిస్తాo సుంకరి సంపత్ అల్ ఇండియా అగ్రికల్చర్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించినారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూమికోసం భుక్తి కోసం పేద ప్రజల విముక్తి కోసం, భూస్వామ్య విధానానికి, జామిందార్లకు, జాగిర్దారులకు, వ్యతిరేకంగా సాగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నాడు 10 లక్షల ఎకరాల భూమిని పంచిందని, పదివేల గ్రామాలకు విస్తరించి నాలుగు వేల గ్రామ రాజ్యలను ఏర్పాటు చేసింది . ప్రపంచ చరిత్రలో గుర్తింపు పొందిన ఈ పోరాటాన్ని వక్రీకరించాలని బిజెపి ఆర్ఎస్ఎస్ కుట్రలు చేస్తుంది. ఈ పోరాటానికి సంబంధం లేని సంస్థలు రాజకీయ పార్టీలు ఈ పోరాటాన్ని విశ్లేషిస్తూ రాజకీయ లబ్ధి పొందాలని చరిత్రను వక్రీకరిస్తున్నారు. ఆంధ్ర మహాసభ పేరుతో ఏర్పడ సంస్థ భాష సంస్కృతిక రంగాలకు విస్తరించి నాటి నిజాం ప్రభుత్వం యొక్క నిరంకుషానికి వ్యతిరేకంగా సంఘం పెట్టి ఎర్రజెండా నాయకత్వన వీరోచితమైనటువంటి పోరాటాన్ని చేసింది ఈ పోరాటంలో 4000 మంది కమ్యూనిస్టు కార్యకర్తలు తమ ప్రాణాల్ని అర్పించారని పేదల రాజ్యం రావాలని భూస్వాముల పెట్టుబడిదారుల గుండెల్లో గుణపాలు దింపింది ఈ పోరాటం అని గుర్తు చేశారు. దీని స్ఫూర్తితో దేశంలో అనేక రాష్ట్రాలలో రైతులు కార్మికులు సంస్థలు అనేక ప్రజా ఉద్యమాల్ని నడిపాయని గుర్తు చేశారు. ఈ పోరాటాన్ని తట్టుకోలేక నిజాం ప్రభువు ఇండియన్ యూనియన్ ప్రభుత్వంతో చేతులు కలిపి హైదరాబాద్ సంస్థనాన్ని ఇండియన్ యూనియన్ గవర్నమెంట్ లో విలీనం చేశారు. ఈ విలీనం అనంతరం కమ్యూనిస్టు పార్టీలపైన సాయుధ పోరాటం నడిపిన కార్యకర్తల పైన రెండు సంవత్సరాల పాటు నెహ్రు సైన్యాలు నిర్బంధాన్ని ప్రయోగించి వేలాది మందిని జైల్లో పెట్టింది. కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలను గ్రామాలలో ఎక్కడికక్కడ కాల్పులు జరిపి చంపించారని గుర్తు చేశారు. ఇంత వీరోచితంగా స్థాయినటువంటి ఈ పోరాటాన్ని బిజెపి ఆర్ఎస్ఎస్ హిందూ ముస్లిం వ్యతిరేక పోరాటంగా మార్చి రాజకీయ లబ్ధి పొందాలని కుట్రలు చేస్తుంది. నిజాం ప్రభువు ముస్లిం, గ్రామాలలో జమీందారులుగా జాగిర్ధాలుగా విసునూరు రామచంద్రారెడ్డి లాంటి నరహంతకులు ప్రజలను హింసించారు. ఈ పోరాటంలో జమీందారులకు జాగిర్దారులకు వ్యతిరేకంగా షేక్ బంధకి, మొగ్ధం మోయినవుద్దీన్, అశ్వవుల్లా ఖాన్, సోయబుల్లాఖాన్, భీమ్ రెడ్డి నరసింహారెడ్డి, మల్లు స్వరాజ్యం, అనభేరి ప్రభాకర్ రావు సింగిరెడ్డి భూపతి రెడ్డి బద్దం ఎల్లారెడ్డి చాకలి ఐలమ్మ దొడ్డి కొమురయ్య తాను నాయక్, ఆరుట్ల కమలాదేవి. లాంటి ఎందరో వీరులు కులానికి, మతానికి ప్రాంతానికి ,వ్యతిరేకంగా భూస్వామ్య విధానానికి వ్యతిరేకంగా సాగిన ఒక వర్గ పోరాటం అని గుర్తు చేశారు. వారి స్ఫూర్తితో రానున్న కాలంలో తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్ జిల్లాలో పేద ప్రజలందరికీ ఇండ్లు ఇళ్లస్థలాల కోసం , నిరుపేదలకు భూములు పంచాలని డిమాండ్ తో రానున్న కాలంలో ఉద్యమాలు కొనసాగిస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షులు రాయి కంటి శ్రీనివాస్ సంఘం నాయకులు ఈ వెంకటేష్, బాలరాజు, సాగర్ రాజు ,తదితరులు పాల్గొన్నారు...2