మోపాల్ జిల్లా పరిషత్ పాఠశాలలో ప్రకృతితో మమేకమైన రాఖీ వేడుకలు సిరికొండ, ఆగస్ట్ 9,రాఖీ పౌర్ణమి సందర్భంగా నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని మోపాల్ మండలకేంద్రం జిల్లా పరిషత్ పాఠశాలలో యోగా కమిటీ ఆధ్వర్యంలో వినూత్నమైన, హృద్యమైన వేడుకలు ఘనంగా నిర్వహించారు. సోదర–సోదరీల బంధాన్ని స్మరించుకునే ఈ పర్వదినాన్ని ప్రకృతి సౌందర్యంతో మేళవిస్తూ, చిన్నారులు పచ్చని చెట్ల ఆకులతో “రక్షాబంధనం” అని అందంగా లిఖించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.పర్యావరణ పరిరక్షణతో పాటు సాంప్రదాయ విలువలను కాపాడే సందేశాన్ని అందించేందుకు ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. కులమతాలకు అతీతంగా గ్రామంలోని పిల్లలు, పెద్దలు ఒకచోట చేరి రాఖీలు కట్టుకుని ప్రేమ, ఐక్యత, స్నేహభావాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు రాఖీ పండుగ ప్రాముఖ్యత, అన్న–చెల్లెళ్ళ అనుబంధం, ప్రకృతి రక్షణ అవసరంపై మాట్లాడారు.చిన్నారులలో అక్షర, ఆకృతి, కన్నయ్య, హరిణి, బిట్టు అనన్య, అన్వేష్ ఉత్సాహంగా పాల్గొని ఆకర్షణీయమైన రాఖీలు కట్టారు. పెద్దలలో నవీన్ రెడ్డి, ముత్తెన్న, సంజీవ్ రెడ్డి, శేఖర్ తదితరులు హాజరై పిల్లలకు అభినందనలు తెలిపారు.పచ్చని ఆకులతో చేసిన “రక్షాబంధనం” అక్షరాలు అందరినీ ఆకట్టుకోగా, ఈ సృజనాత్మక ఆలోచన పిల్లల్లో ప్రకృతి పట్ల మమకారం, సృజనాత్మకతను పెంపొందిస్తుందని గ్రామస్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ప్రశంసించారు.

- Post by Nagesh Thalari3
- విజయవాడలో అక్రమంగా పిల్లలను విక్రయిస్తున్న ముఠా అరెస్టు1
- Post by KLakshmi Devi1
- Post by Omnamashivaya S1
- మోసం చేసి భూమి లాగేశాడు లబోదిబోమంటున్న బాధితుడు. పలమనేరు డిసెంబర్ 18( ప్రజా ప్రతిభ) అప్పు ఇస్తానని నమ్మించి మోసంతో భూమి లాగేశాడని విషయం తెలుసుకున్న బాధితుడు శంకరప్ప లబోదిబోమంటున్న కన్నీటి గాథ గురువారం వెలుగు చూసింది. బాధితుడు తెలిపిన వివరాల మేరకు గంగవరం మండలం మేలుమాయి పంచాయతీ జె. కొత్తూరు గ్రామం వాల్మీకి మొగిలప్ప కుమారుడు శంకరప్పకు సర్వే నెంబర్ 756/1సి/1 లో 2.12 సెంట్లు భూమి ఉందని తెలిపాడు. సదరు భూమిలో వ్యవసాయం చేసుకోవడానికి డబ్బు అవసరమైందని పలమనేర్ టౌన్ బసవన్న కట్ట వీధిలో ఉన్న రామ స్వామి కుమారుడు శ్రీనివాసులు శెట్టిని అప్పు అడిగానని వివరించాడు. తనకు మద్యం అలవాటు ఉందని దాని ఆసరాగా తీసుకొని శ్రీనివాసులు శెట్టి తనను మద్యం మత్తు లోకి దించి డబ్బులు ఇస్తానని పలమనేరు సబ్ రిజిస్టర్ ఆఫీస్ వద్ద కాగితాల్లో సంతకం పెట్టమని నమ్మించారన్నారు. ఈ భూమిపై గంగవరం సొసైటీ బ్యాంకులో 2021లో రూ 66,000 లోను తీసుకున్నానని ఇంతవరకు చెల్లించి లేదన్నారు. అప్పు ఇస్తానని నమ్మించి మోసం చేసిన శ్రీనివాసులు శెట్టి సంతకాలు తీసుకున్న పేపర్లు ద్వారా దొడ్డిదారుల్లో మా కుటుంబ సభ్యులు అనుమతులు లేకుండా రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లుగా తెలిసిందన్నారు. ఇప్పటి వరకు భూమిని తానే సాగు చేసుకుంటున్నానని, ప్రభుత్వం మంజూరు చేసే రైతు భరోసా, కిసాన్ డబ్బులు తన అకౌంట్లోకే పడుతున్నాయన్నారు. మోసం చేసిన విషయాన్ని తెలుసుకొని శ్రీనివాసులు శెట్టి వద్దకు వెళ్లి అడగగా ఎప్పుడో నాకు అమ్మేశావని, భూమి కావాలంటే 9 లక్షలు రూపాయలు చెల్లిస్తే తిరిగి రాసిస్తానని లేకుంటే ఇతరులకు అమ్మేస్తానని బెదిరి స్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు ఆ భూమి తప్ప వేరే మార్గం లేదని, ఈ విషయంపై జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఆర్డిఓ, తహసిల్దారు స్పందించి పరిశీలించి నాకు మద్యం తాపించి భూమి కొట్టేయాలని ఉద్దేశంతో డబ్బు ఇవ్వకుండా మోసం చేసిన శ్రీనివాసులు శెట్టి పై చట్టపరమైన చర్యలు తీసుకుని ఈ పేద వాడికి న్యాయం చేయాలని కోరాడు.1
- Post by Omnamashivaya S1
- Post by Omnamashivaya S1
- Post by Omnamashivaya S1