స్వర్ణాంధ్ర విజన్–2047 దిశగా పీ4 ప్రాజెక్టు విజయవంతం – ఏడాదిలోనే వేలాది కుటుంబాలకు అండ పీ4 ప్రాజెక్టుతో ధర్మవరంలో పేదరిక నిర్మూలనకు వేగం – మంత్రి సత్య కుమార్ యాదవ్ నాయకత్వంలో విశేష ఫలితాలు ధర్మవరం, మార్చి 30:– ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న స్వర్ణాంధ్ర విజన్–2047లో భాగంగా పేదరిక నిర్మూలన లక్ష్యంతో కొనసాగుతున్న పీ4 (P4) ప్రాజెక్టు విజయవంతంగా ఒక సంవత్సరం పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ అధ్యక్షతన పుట్టపర్తి సాయి అరామం లో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో పీ4 ప్రాజెక్టు ద్వారా సాధించిన పురోగతిని సమగ్రంగా సమీక్షించారు. పేదల జీవితాల్లో స్థిరమైన మార్పు తీసుకురావాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ ప్రాజెక్టు ధర్మవరం నియోజకవర్గంలో విశేష ఫలితాలు అందుకుంటోంది. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ గారి ఆధ్వర్యంలో, సంస్కృతి సేవా సమితి భాగస్వామ్యంతో ధర్మవరం నియోజకవర్గంలో ఇప్పటివరకు మొత్తం 6,345 బంగారు కుటుంబాలను గుర్తించడం జరిగింది. వీటిలో ఇప్పటికే 3,450 కుటుంబాలను 579 మంది మార్గదర్శులు దత్తత తీసుకుని, వారికి అవసరమైన సహకారం అందిస్తున్నారు. పీ4 కార్యక్రమం భాగంగా సంస్కృతి సేవా సమితి ఆధ్వర్యంలో సుమారు ₹98 లక్షల వ్యయంతో పలు సంక్షేమ కార్యక్రమాలు విజయవంతంగా అమలు చేయబడ్డాయి. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు 2,000 సైకిళ్ల పంపిణీ చేపట్టడం ద్వారా విద్యార్థుల విద్యాభ్యాసానికి ప్రోత్సాహం అందించారు. గ్రామీణ ప్రాంతాల్లో శుద్ధి చేసిన తాగునీరు అందుబాటులో ఉండేలా నియోజకవర్గంలోని గరిసేనపల్లి, పైపేడు, పిన్నదరి, రేగాటిపల్లి, పోతుకుంట, శివంపల్లి గ్రామాల్లో ఆర్‌ఓ ప్లాంట్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ చర్యలు గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాలను గణనీయంగా మెరుగుపరిచాయి. విద్యా రంగానికి ప్రాధాన్యత ఇస్తూ, బత్తలపల్లి మరియు ముదిగుబ్బ ప్రాంతాల్లోని పాఠశాలలు, వసతి గృహాలలో ఆధునిక సౌకర్యాలతో మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టడం జరిగింది. అదేవిధంగా ధర్మవరం బీసీ బాలుర హాస్టల్‌లో కూడా మౌలిక వసతులు అభివృద్ధి చేయబడ్డాయి. ఆరోగ్య రంగంలో కూడా మంత్రి సత్య కుమార్ యాదవ్ గారు ప్రత్యేక దృష్టి సారిస్తూ, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు మోకాళ్ల మార్పిడి శస్త్రచికిత్సలు నిర్వహించడం జరిగింది. యువత ఉపాధి సాధనలో భాగంగా నిర్వహించిన జాబ్ మేళాల ద్వారా సుమారు 2,000 మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించబడ్డాయి. అదనంగా, బ్యాంకింగ్ మరియు ఐఏఎస్ కోచింగ్ వంటి శిక్షణా కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా యువత భవిష్యత్తుకు మార్గదర్శకత్వం కల్పిస్తున్నారు. ఈ కార్యక్రమాల అమలులో విశేష కృషి చేసినందుకు సంస్కృతి సేవా సమితి పాత్రను జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్, మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి, పుట్టపర్తి ఎమ్మెల్యే శ్రీమతి పల్లె సింధూర రెడ్డి ప్రశంసించారు. ఈ సందర్భంగా మంత్రి సత్య కుమార్ యాదవ్ తరఫున ఆయన నియోజకవర్గ ఇన్చార్జ్ హరీష్ బాబు ప్రశంసా పత్రం మరియు మోమెంటును స్వీకరించారు. పీ4 ప్రాజెక్టు ద్వారా పేదరిక నిర్మూలన దిశగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, మంత్రి సత్య కుమార్ యాదవ్ గారి నాయకత్వంలో ధర్మవరం నియోజకవర్గంలో స్పష్టమైన మార్పులను తీసుకువస్తున్నాయని సమావేశంలో పేర్కొన్నారు.

- సత్య సాయి జిల్లా కదిరి నియోజకవర్గం గాండ్లపెంట మండలo కటారుపల్లి గ్రామంలో యోగువేమన ఉత్సవాలు రెండో రోజు వైభవంగా నిర్వహించారు. సోమవారం చాందిని బండ్లు పానక పన్నీరు తోపాటు ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. సుదూర ప్రాంతాల నుంచి యోగివేమన భక్తాదులు హాజరై స్వామివారిని దర్శించుకుంటున్నారు. భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు ఆలయ పీఠాధిపతులు నంద వేమారెడ్డి తెలిపారు.1
- *జాతీయ రహదారి 40(కర్నూల్ - కడప) రోడ్డు లో వ్యతిరేక దిశలో వాహనాన్ని నడిపి మనిషి చనిపోవడానికి కారణం అయిన వ్యక్తి అరెస్టు* *మర్డర్ కేసుతో సమానమైన సెక్షన్ వేసి కోర్టు ముందు హాజరు పరచడం అయినది* ముద్దాయి పేరు: షేక్ మస్తాన్, వయసు: 58 సం’’రాలు తండ్రి: లేట్ మౌలాలి, వృత్తి: కూలి, కులం: ముస్లిం, D.No.01/15, అద్దంకి రోడ్డు, St కాలనీ, దర్శి టౌన్ & మండలం, ప్రకాశం జిల్లా. నేరము జరిగిన తేది సమయము మరియు స్థలము: 25.03.2026 వ తేదీన మద్యాహ్నం సుమారు 02.30 గంటల సమయం లో కడప జిల్లా, మైదుకూరు టౌన్, ప్రొద్దుటూరు రోడ్డులో జాతీయ రహదారి- 40 (కర్నూల్ - కడప రోడ్డు)లో నుండి సర్వీసు రోడ్డు కలిసే ప్రదేశం అరెస్ట్ జరిగిన తేది మరియు సమయము: On 30.03.2026 at 11.30 AM కడప - కర్నూల్ రోడ్డులోని శ్రీనగరము గ్రామము దగ్గర. Seizure:- AP39 VE 0499 పాల ట్యాంకర్. Brief facts of the case: పైన తెలిపిన ముద్దాయి AP 39 VE 0499 పాల ట్యాంకర్ లో ధర్మవరము నుండి మైదుకూరు లోని అమృత మిల్క్ డైరీకి పాలు తోలుతూ ఉన్న క్రమములో 25.03.2026 వ తేదిన పాలు అమృత మిల్క్ డైరి నందు దించి మరలా ధర్మవరానికి వెళ్తున్న క్రమములో సుమారు 02.30 PM గంటల సమయములో పైన తెలిపిన ముద్దాయి, పైన తెలిపిన స్థలం వద్దకు పాల ట్యాంకర్ ను నడుపుతూ ఆపోసిట్/ రాంగు రోడ్డులో వెళితే ప్రమాదాలు జరిగి మనుషుల ప్రాణాలు పోతాయి అని తెలిసి కూడా ఆపోసిట్/ రాంగు రోడ్డులో ట్యాంకర్ ను నిర్లక్షంగా నడిపి మోటర్ సైకిల్ పైన వస్తున్న వారికి తగిలించి దువ్వూరు కు చెందిన భాను ప్రకాష్ చనిపోడానికి, గంగా ప్రసాద్ గాయపడటానికి కారణము అయినాడు కాబట్టి అతనిని మైదుకూరు పోలీసు స్టేషన్ ఇన్స్పెక్టర్ కె. రమణారెడ్డి అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపించడమైనది. జాతీయ రహదారి మరియు ఇతర రోడ్డులలో వ్యతిరేక దిశలో వాహనాలను నడిపి ప్రమాదాలకు కారణం అయితే వారిపై మర్డర్ కేసుతో సమానమైన సెక్షన్ను పెట్టి, అరెస్టు చేసి, ప్రమాదాలకు కారణం అయిన వాహనాలను సీజ్ చేయడం జరుగుతుంది. కె.రమణా రెడ్డి ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ మైదుకూరు అర్బన్ పీఎస్.1
- రాష్ట్రంలో వార్డు వాలెంటీర్ల సేవలను పునరుద్దించి నిరుద్యోగులను ఆదుకోవాలని ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు కోట్రేష్ డిమాండ్ చేశాడు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో 99 వేల ఖాళీలను తక్షణమే భర్తీ చేయాలని, నిరుద్యోగులకు ఇచ్చిన 3000 నిరుద్యోగ భృతి హామీని తక్షణమే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.గత వైకాపా పాలనలో ప్రజలకు సేవాలందించిన వాలంటీర్లకి ప్రతిపక్షంలో ఉన్న ప్రస్తుత కూటమి ప్రభుత్వం తాము అధికారంలోకి రాగానే 10,000 జీతం అందిస్తామని హామీ ఇచ్చి వారిని నిర్దాక్షిణ్యంగా తీసివేసి వారిని బజారులు పాలు చేయడం దుర్మార్గమన్నారు.1
- కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో భవన నిర్మాణానికి అనుమతుల పేరుతో భారీ లంచం డిమాండ్ చేశారంటూ ఆదోని ఎమ్మెల్యే పార్థసారథిపై టీడీపీ ముస్లిం మైనార్టీ సీనియర్ నాయకుడు సౌదీ రవూఫ్ సంచలన ఆరోపణలు చేశారు. బిల్డింగ్ కట్టేందుకు రూ.50 లక్షలు డిమాండ్ చేసి, అందులో ఇప్పటికే రూ.10 లక్షలు తీసుకున్నారని ఆయన తీవ్ర ఆరోపణలు గుప్పించారు. భగవద్గీత, ఖురాన్, బైబిల్ సాక్షిగా ప్రమాణం చేసి చెప్పడానికి సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. ఆదోని పట్టణంలోని ఎమ్మిగనూరు రోడ్డులో ట్రెండ్స్ సమీపంలో ప్లాట్లు విక్రయించిన సౌదీ రవూఫ్ ప్రస్తుతం అక్కడ భవనం నిర్మాణం చేపడుతున్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ అధికారులు నిర్మాణంపై అభ్యంతరాలు వ్యక్తం చేయగా, ఎమ్మెల్యేకు డబ్బులు ఇవ్వాలని సూచించారని రవూఫ్ ఆరోపించారు. తన భవన నిర్మాణానికి ఎలాంటి అడ్డంకులు లేకుండా చూడాలంటే రూ.50 లక్షలు ఇవ్వాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారని, అంత మొత్తాన్ని ఇవ్వలేనని చెప్పి వెళ్లిపోయానని తెలిపారు. అయితే తరువాత ఎమ్మెల్యే ఫోన్ చేసి రూ.40 లక్షలు ఇవ్వాలని ఒత్తిడి తెచ్చారని, మధ్యవర్తి ద్వారా ఇప్పటికే రూ.10 లక్షలు, మరో రూ.1 లక్ష కమిషన్‌గా ఇవ్వాల్సి వచ్చిందని బాధితుడు పేర్కొన్నారు. డబ్బులు ఇవ్వకపోతే పనులు ఆపేస్తామని బెదిరించారని, ఒకసారి కాదు పదేపదే డబ్బులు అడుగుతూ వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నాయకుడిననే కారణంతోనే కావాలనే టార్గెట్ చేస్తున్నారని మండిపడ్డారు.1
- బద్వేలు :రూరల్ పోలీస్ స్టేషన్ పరిదిలో చంపుతామని కతితో బెదిరించి వృద్దురాలి మెడలో నుండి బంగారు గోలుసు చోరీ చేసిన కేసులో కీలక నిందితుడిని అరెస్ చేసి, చోరీ సొతు, నేరానికి ఉపయోగించిన కారు, 2 బైకులను స్వాధీనం బద్వేలు రూరల్ పోలీసులు చేసుకున్నరు. కేసు వివరాలు: 27.03.2026 శ్రీరామనవమి పండుగ రోజున బద్వేలు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీనివాసపురం గ్రామంలో ఒక వృద్దురాలిని కతితో బెదిరించి, ఆమె మెడలోని బంగారు గొలుసును లాక్కొని పారిపోయిన ఘటనపై కేసు (Cr.No.30/2026 U/s 307 r/w 3(5) BNS) బద్వేలు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పర్యవేక్షణలో ఎస్.ఐ ఎం. రంగారావు మరియు వారి సిబ్బంది బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టగా వారికి అందిన నమ్మకమైన సమాచారం మేరకు, 29.03.2026 తేదీన సాయంకాలము గోపవరం మండలం, ద్వారకనగర్ సమీపంలోని గరుడయ్య సత్రము వద్ద అనుమానాస్పదంగా ఉన్న షైక్ ఈసు మీరా వల్లి (23 సం||, మార్కాపురం టౌన్ & జిల్లా) అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా, సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నేర చరిత్ర మరియు ముఠా వివరాలు: నిందితుడు మీరా వల్లి గతంలో మార్కాపురంలో దొంగతనం చేసి జైలుకు వెళ్ళాడు. జైలులో ఇతనికి మజీద్, అంజిరెడ్డి, వెంకటేశు అనే కరుడు గట్టిన పాత నేరస్థులతో పరిచయం ఏర్పడి, విరు నలుగురు ఒక గ్యాంగ్ ఏర్పడ్డారు. శ్రీరామనవమి సమయంలో జనసమ్మర్థం ఉన్న చోట, మహిళలు నగలు వేసుకొని వుంటారు కావున అక్కడ దొంగతనాలు చేయాలని, ఎవరైనా అడ్డుకుంటే కత్తులతో చంపడానికైనా సిద్ధపడాలని నిర్ణయించుకొని పథకం వేసుకొని, కత్తులు కొన్నారు. వీరందరూ కలిసి 25.03.2026 తేదీ పొదిలి సమీపంలో ఒక HF Deluxe బైకు, 26.03.2026 తేదీ నరసరావు పేట సమీపంలో ఒక యునికర్న్ బైకు, పామూరు సమీపంలో ఒక పల్సర్ బైకు దొంగిలించారు. ఈ క్రమంలో శ్రీనివాసపురం వద్ద ఒంటరిగా ఉన్న వృద్ధురాలిని, ఆమె కుమారుడిని కత్తులతో బెదిరించి సుమారు 2.5 లక్షల విలువైన బంగారు దొంగిలించుకొని పారిపోయినారు. స్వాధీనం చేసుకున్న సొత్తు: నిందితుని నుండి ఈ క్రింది వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు: నిందితుని నుండి ఈ క్రింది వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు: 1. బంగారు గొలుసు: సుమారు 18 గ్రాముల బరువున్న తెగిపోయిన బంగారు చైన్. 2. కారు: నేరానికి ఉపయోగించిన వోక్స్ వ్యాగన్ పోలో (Volkswagen Polo) కారు (AP07BT8543). 3. ద్విచక్ర వాహనాలు: నరసరావుపేట మరియు పొదిలి ప్రాంతాల్లో దొంగిలించిన ఒక హోండా యూనికార్న్ మరియు ఒక హెచ్.ఎఫ్ డీలక్స్ మోటార్ సైకిళ్ళు. 4. ఆయుధం: బెదిరింపులకు ఉపయోగించిన పదునైన కత్తి, అభినందనలు: నేరం గురించి తెలిసిన వెంటనే స్పందించి, బద్వేలు రూరల్ SI రంగారావు మరియు బి.. కోడూరు SI సూర్య నారాయణ రెడ్డి ల ఆధ్వర్యంలో రెండు బృందాలను ఏర్పాటు చేసి, తీవ్ర గాలింపు చర్యలు చేసి, జిల్లా దొంగల ముఠా గుట్టురట్టు చేసి, వారి నుండి బద్వేలు రూరల్ పరిధిలో దొంగిలించిన బంగారు చైన్ కాకుండా, ఇతర జిల్లాలో దొంగిలించిన మోటారు సైకిళ్ళను, నేరానికి ఉపయోగించిన కారును కుడా స్వాధీనం చేసుకొని వారి ఆట కట్టించిన బద్వేలు రూరల్ CI నద్యాల క్రిష్నయ్యను మరియు వారి సిబ్బందిని మైదుకూరు DSP రాజేంద్ర ప్రసాద్ అభినిందించారు. పోలీసుల హెచ్చరిక:నిందితుడు మీరా వల్లిని అరెస్ట్ చేసి రిమాండుకు తరలించడం జరిగింది. ఈ కేసులో పరారీలో ఉన్న మిగిలిన ముగ్గురు నిందితుల (మజీద్, అంజిరెడ్డి, వెంకటేశు) కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశామని ఎస్.ఐ రంగారావు తెలిపారు. నిందితులపై కొత్త చట్టం ప్రకారం (111 BNS) గ్యాంగ్ నేరాలకు సంబంధించిన కఠిన సెక్షన్లు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.1
- 30-03-2026 కర్నూల్ జిల్లా ఈరోజు ఆలూరు మండల కేంద్రంలో R&B గెస్ట్ హౌస్ నందు *_ఆలూరు నియోజకవర్గం MLA బుసినే విరుపాక్షి గారు_* మీడియా సమావేశంలో మాట్లాడుతూ... అమరావతి రాజధానికి మేము వ్యతిరేకం కాదు అని అన్నారు... అమరావతిలో ఇప్పుటీ వరకు అభివృద్ధి పనులు జరగలేదు అని అన్నారు.. నారా చంద్రబాబు బాబు నాయుడు, 7 సంవత్సరలు ముఖ్యమంత్రి గా ఉన్న అమరావతిని అభివృద్ధి చేయలేదు అని అన్నారు.. అమరావతిలో ఒక శాశ్వత భవనని కట్టలేదు చంద్రబాబు అని అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఒక మెయిన్ రోడ్ కూడా వేయలేదు అని అన్నారు.... ఇక్కడ ఉన్న టీడీపీ ఇంచార్జ్ గారు మాటలు తప్ప ఆలూరు నియోజకవర్గని అభివృద్ధి చేయడం లేదు అన్నారు... *_మా నాయకుడు వైస్ జగన్ మోహన్ రెడ్డి గారి_* గురించి తప్పు గా మాట్లాడితే చూస్తూ ఊరుకోము అని హెచ్చరించారు.... రాజధాని అమరావతి పేరు తో కూటమి నాయకులు ఇస్టానుసారంగా దోచుకుంటున్నారు అని అన్నారు.... నారా చంద్రబాబు నాయుడు గారికి రాయలసీమ గురించి పట్టించుకోవడం లేదు అని తెలిపారు... ఈ కార్యక్రమం లో వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, BVR అభిమానులు పాల్గొన్నారు.. 😎TEAM_BCS🇸🇱 #YSJagan #Busine_Virupakshi #Aluru_Constitunecy_MLA1
- ఎమ్మిగనూరు ఎంపీడీఓ కార్యాలయంలో P4 MBK 10-20 కార్యక్రమం స్వర్ణ ఆంధ్ర @2027 లక్ష్యంతో అవగాహన కార్యక్రమం కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ బీ.వీ. జయ నాగేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు ఒకే సంవత్సరంలో 2.1 లక్షల కుటుంబాలకు లబ్ధి – ఎమ్మెల్యే ప్రజలు–ప్రభుత్వం–ప్రైవేట్ భాగస్వామ్యంతో అభివృద్ధి P4 ద్వారా సమిష్టి అభివృద్ధి లక్ష్యం సంక్షేమం నుంచి స్వయం పోషక వ్యవస్థ వైపు రాష్ట్రం ప్రతి కుటుంబాన్ని “బంగారు కుటుంబం”గా తీర్చిదిద్దే ప్రయత్నం క్రియాశీలక మార్గదర్శకులకు సన్మానం అధికారుల, ప్రజాప్రతినిధుల, లబ్ధిదారుల పాల్గొనడం జరిగింది.1
- బద్వేలు :నియోజకవర్గ ఇన్‌చార్జ్ కే. రితేష్ రెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. తొలుత స్థానిక టిడిపి కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే విజయమ్మ మరియు నియోజకవర్గ ఇన్‌చార్జ్ రితేష్ రెడ్డి పార్టీ పసుపు జెండాను గర్వంగా ఆవిష్కరించారు. అనంతరం బద్వేల్-నెల్లూరు రోడ్డులోని విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆర్‌ఆర్ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ఆవిర్భావ వేడుకల్లో భారీ సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొని నినాదాలతో హోరెత్తించారు. వేదికపై ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించిన అనంతరం, నియోజకవర్గంలోని సీనియర్ నాయకులను రితేష్ రెడ్డి మరియు విజయమ్మ ఘనంగా సన్మానించారు. 44 ఏళ్లుగా పార్టీని నమ్ముకుని సేవ చేస్తున్న ప్రతి కార్యకర్తకు ధన్యవాదాలు తెలుపుతూ, సీనియర్ నాయకుల సేవలను తమ కుటుంబం ఎప్పటికీ మరువదని, వారికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని రితేష్ రెడ్డి గారు ఈ సందర్భంగా భావోద్వేగంగా పేర్కొన్నారు. చివరగా, విచ్చేసిన సీనియర్ నాయకులందరితో కలిసి తమ నివాసంలో మధ్యాహ్న భోజనం చేసి ఈ వేడుకలను దిగ్విజయంగా ముగించారు.2