Shuru
Apke Nagar Ki App…
పల్లె నిద్ర కార్యక్రమంలో ప్రజలకు అవగాహన కలిగించిన ఎస్సై బాడంగి మండలం పినపెంకి గ్రామంలో ఎస్‌ఐ సూర్యకుమారి బుధవారం పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించి గ్రామస్తులతో మమేకమై వారి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సైబర్ మోసాలు, మహిళల భద్రత, మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. అపరిచిత లింకులు, ఫోన్ కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని, మహిళలు, యువత భద్రతకు సహకరించాలని సూచిస్తూ, నేరాల నియంత్రణకు ప్రజల భాగస్వామ్యం అవసరమని తెలిపారు.
Venkata Satyanarayana
పల్లె నిద్ర కార్యక్రమంలో ప్రజలకు అవగాహన కలిగించిన ఎస్సై బాడంగి మండలం పినపెంకి గ్రామంలో ఎస్‌ఐ సూర్యకుమారి బుధవారం పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించి గ్రామస్తులతో మమేకమై వారి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సైబర్ మోసాలు, మహిళల భద్రత, మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. అపరిచిత లింకులు, ఫోన్ కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని, మహిళలు, యువత భద్రతకు సహకరించాలని సూచిస్తూ, నేరాల నియంత్రణకు ప్రజల భాగస్వామ్యం అవసరమని తెలిపారు.
More news from Andhra Pradesh and nearby areas
- నెల్లిమర్ల మండలం వల్లూరు మర్డర్ కేసు లో ఇద్దరు అరెస్టు నెల్లిమర్ల మండలం వల్లూరు గ్రామంలో కుటుంబ కలహాలు, ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో జరిగిన హత్య కేసులో సిరిగుడి అప్పలనారాయణ, అతని కుమారుడు శ్రీనును పోలీసులు అరెస్ట్ చేశారు. రూ.6 వేల ట్రాక్టర్ కిరాయి డబ్బుల విషయమై వివాదం జరగగా, శ్రీను కర్రతో రామారావు తలపై దాడి చేయడంతో మృతి చెందినట్లు సిఐ శ్రీనివాస్ తెలిపారు. కేసు నమోదైన 48 గంటల్లో నిందితులను అరెస్ట్ చేసిన సిబ్బందిని జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ అభినందించారు.1
- శ్రీ కనకదుర్గమ్మ తల్లి పండగ సందర్భంగా వెలిగిపోతున్న నెల్లిమర్ల నగరం నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధి సెగిడి వీధి లో శ్రీ కనకదుర్గమ్మ తల్లి పండగ 26-28వ తేదీ వరకు మూడు రోజులు నిర్వహించనున్నామని కనకదుర్గమ్మ ఆలయ కమిటీ బుధవారం తెలిపారు. నగరంలో ప్రధాన రహదారి, సెగిడివీధీలో లైటింగ్ తో నగరం మెరిసిపోతుంది. మొదటిరోజు మొయిద జంక్షన్లో డాన్స్ బేబీ డాన్స్ కార్యక్రమం,బంధువులు, స్నేహితులకు స్థానికులు విందు ఏర్పాట్లు చేశారు. గురువారం అమ్మవారికి పసుపు కుంకుమ ఇవ్వనున్నామని చెప్పారు.1
- విజయనగరం: బీసీల సంక్షేమం, అభివృద్ధి కూటమి ప్రభుత్వ లక్ష్యం: ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు.. విజయనగరం టీడీపీ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై చేస్తున్న నిరాధార ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో బీసీ నాయకులు, బీసీ వర్గాలపై జరిగిన దాడులు, అణచివేతలను గుర్తుచేస్తూ.. తొలి నుంచి తెలుగుదేశం పార్టీకి వెన్నెముకగా నిలిచిన బీసీలకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తోందని స్పష్టం చేశారు. బీసీల సంక్షేమం, ఆర్థికాభివృద్ధి, రాజకీయ ప్రాధాన్యతతో పాటు బీసీ నాయకులకు సముచిత గౌరవం, ప్రాతినిధ్యం కల్పిస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు.1
- రాజాం :శ్రీ వెంకటశ్వర స్వామి గుడి వద్ద బ్రీడ్జి ప్రక్కన సోలార్ హెచ్చరిక లైట్లు ఏర్పాటు రాజాం మండలం అంతకాపల్లి గ్రామం వెంకటేశ్వర స్వామి గుడి వద్ద బ్రీడ్జ్ పక్కన హాంజరాంపేటకు చెందిన కొల్లి రాముఅనే యువకుడు తన సొంత డబ్బులతో సోలార్ హెచ్చరిక లైట్లును అమర్చారు. ఈ ప్రాంతంలో తరచూ ప్రమాదాలు జరిగి ఎక్కువగా యువత మరణిస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ లైట్ల వల్లనైనా ప్రమాదాలు తగ్గుతాయని ఆశిస్తున్నానని పేర్కొన్న రాము చేసిన ఈ పనిని వాహనదారులు గ్రామస్తులు అభినందించారు.1
- రాజాం హాస్టల్ విద్యార్థినులతో రోడ్లపై డాన్సులు, చేయించిన వార్డెన్ రమాదేవి. రాజాం ఓ హాస్టల్ వార్డెన్ తీరు విమర్శలకు తావిస్తుంది, రాజాం సారది రోడ్ లో ఉన్న జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల, బాలికలతో, బంధువులు పెళ్లి వేడుకల్లో డాన్స్ చేయించిన వార్డెన్ రమాదేవి.1
- *అమ్మ గీతం అదిశాక్తివి ని సత్తెమ్మ తల్లి అమ్మావారు I గాజువాక II విశాఖపట్నం II *అమ్మ గీతం అదిశాక్తివి ని సత్తెమ్మ తల్లి అమ్మావారు I గాజువాక II విశాఖపట్నం II1
- చీపురుపల్లి మండలంలో బుధవారం ఎండ తీవ్రతకు అల్లాడిన ప్రజలకు మధ్యాహ్నం కురిసిన చిరుజల్లుల వర్షం ఉపశమనం కలిగించింది. మూడు రోజులుగా వర్షాలు లేకపోవడంతో వేడెక్కిన వాతావరణం చల్లబడింది. ఈ వర్షం వరి నారుమళ్లకు, అంతర పంటలకు ఎంతో ప్రయోజనకరమని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. చీపురుపల్లి మండలంలో వర్షం1
- విజయనగరం పట్టణంలో మీలాద్-ఉన్-నబి పండగ బారి ర్యాలీ నిర్వహణ విజయనగరం పట్టణం పరిధిలో ముస్లిం సోదరులు మీలాద్-ఉన్-నబి పండగ సందర్భంగా బుధవారం ఉదయం బారి ర్యాలీ నిర్వహించారు. ఇస్లాం మత స్థాపకుడు చివరి ప్రవక్త అయిన మహమ్మద్ ప్రవక్త జన్మదిన సందర్భంగా ఈ పండగ జరుపుకుంటున్నామని ముస్లిం ఐక్య సంఘం తెలిపారు. విజయనగరం కోట జంక్షన్ నుండి కాంప్లెక్స్ వరకు అధిక సంఖ్యలో ముస్లిం మత సంఘాలు అధిక సంఖ్యలో ర్యాలీలో పాల్గొన్నారు.1