logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

గోమాతకు శస్త్ర చికిత్స ..వింత దూడ జననం ఆవుకి ప్రాణాపాయం నుండి కాపాడిన డాక్టర్ కిరణ్ కుమార్ కోటబొమ్మాలి : కోటబొమ్మాలి మండల కేంద్రంలో నిమ్మాడ పశువైద్యాధికారి డాక్టర్ లఖినేని కిరణ్ కుమార్‌ సోమవారం అర్ధరాత్రి ప్రసవ వేదనతో బాధపడుతున్న గోమాతకు శస్త్ర చికిత్స చేయగా మృతి చెందిన వింత దూడ జన్మించింది. ఆవు ప్రాణాపాయం నుండి బయటపడింది. వివరాల్లోకి వెళితే.. కవిటి మండలం శవసానపుట్టుగ గ్రామానికి చెందిన రైతు ఈగల త్రినాథకు చెందిన నిండు చూలు ఆవు సోమవారం ఉదయం నుంచి ప్రసవ వేదనతో ఇబ్బంది పడుతుండగా, గ్రామంలో ఉన్న సిబ్బంది మధ్యాహ్నం వరకు సాధారణ ప్రసవానికి ప్రయత్నించారు. ఫలితం లేకపోవడంతో పశువైద్యాధికారి డాక్టర్ లఖినేని కిరణ్ కుమార్‌ ను సంప్రదించారు. అనంతరం ఆవును రాత్రి 10 గంటల సమయంలో కోటబొమ్మాళికి తరలించారు. పశువైద్యాధికారి కిరణ్ కుమార్ ఆవుని పరీక్షించి ఆవు గర్భంలో తల లేని దూడ ఉన్నట్లు గుర్తించారు. దూడ పరిమాణం, బరువు ఎక్కువగా ఉండటంతో పాటు అప్పటికే అది మృతి చెందినట్లు నిర్ధారించారు. సాధారణ ప్రసవానికి ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోవడంతో రైతు సమ్మతితో రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున 1 గంట వరకు శస్త్రచికిత్స నిర్వహించి వింత దూడను బయటకు తీశారు. నాలుగు కళ్లతో వింత ఆకారం: బయటకు తీసిన దూడకు తల లేకపోయినప్పటికీ ఒక మెడ, రెండు చెవులు, ఎముకలు  అతుక్కుని ఉన్నాయి. నాలుగు కళ్లతో పాటు అధికంగా రోమాలు ఉండటం విశేషంగా కనిపించింది. ఇలాంటి పరిస్థితిలో పుట్టిన దూడను వైద్య పరిభాషలో ‘ఎసెఫాలిక్ ఫీటస్’ (Acephalic Fetus) లేదా ‘ఫీటల్ మానస్టర్’ (Fetal Monster) అని పిలుస్తారని డాక్టర్ కిరణ్ కుమార్ తెలిపారు  గర్భస్థ పిండం అభివృద్ధి చెందుతున్న సమయంలో ఏర్పడే జన్యుపరమైన అభివృద్ధి లోపాల కారణంగా ఇలాంటి అసాధారణ పిండాలు ఏర్పడే అవకాశం ఉంటుందని ఆయన అన్నారు. సకాలంలో శస్త్రచికిత్స నిర్వహించడం వల్ల ఆవు ప్రాణాపాయం నుంచి బయటపడిందని అన్నారు. ప్రస్తుతం ఆవు ఆరోగ్యంగా ఉంది. దీంతో రైతు కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు.

20 hrs ago
user_Karri Sankara Reddy
Karri Sankara Reddy
జర్నలిస్ట్ సంతబొమ్మాళి, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
20 hrs ago
5a679192-70b9-47df-8d67-ce3e512c831f

గోమాతకు శస్త్ర చికిత్స ..వింత దూడ జననం ఆవుకి ప్రాణాపాయం నుండి కాపాడిన డాక్టర్ కిరణ్ కుమార్ కోటబొమ్మాలి : కోటబొమ్మాలి మండల కేంద్రంలో నిమ్మాడ పశువైద్యాధికారి డాక్టర్ లఖినేని కిరణ్ కుమార్‌ సోమవారం అర్ధరాత్రి ప్రసవ వేదనతో బాధపడుతున్న గోమాతకు శస్త్ర చికిత్స చేయగా మృతి చెందిన వింత దూడ జన్మించింది. ఆవు ప్రాణాపాయం నుండి బయటపడింది. వివరాల్లోకి వెళితే.. కవిటి మండలం శవసానపుట్టుగ గ్రామానికి చెందిన రైతు ఈగల త్రినాథకు చెందిన నిండు చూలు ఆవు సోమవారం ఉదయం నుంచి ప్రసవ వేదనతో ఇబ్బంది పడుతుండగా, గ్రామంలో ఉన్న సిబ్బంది మధ్యాహ్నం వరకు సాధారణ ప్రసవానికి ప్రయత్నించారు. ఫలితం లేకపోవడంతో పశువైద్యాధికారి డాక్టర్ లఖినేని కిరణ్ కుమార్‌ ను సంప్రదించారు. అనంతరం ఆవును రాత్రి 10 గంటల సమయంలో కోటబొమ్మాళికి తరలించారు. పశువైద్యాధికారి కిరణ్ కుమార్ ఆవుని పరీక్షించి ఆవు గర్భంలో తల లేని దూడ ఉన్నట్లు గుర్తించారు. దూడ పరిమాణం, బరువు ఎక్కువగా ఉండటంతో పాటు అప్పటికే అది

c103bdf1-efc8-42a7-a1b6-2e9b0a16c33e

మృతి చెందినట్లు నిర్ధారించారు. సాధారణ ప్రసవానికి ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోవడంతో రైతు సమ్మతితో రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున 1 గంట వరకు శస్త్రచికిత్స నిర్వహించి వింత దూడను బయటకు తీశారు. నాలుగు కళ్లతో వింత ఆకారం: బయటకు తీసిన దూడకు తల లేకపోయినప్పటికీ ఒక మెడ, రెండు చెవులు, ఎముకలు  అతుక్కుని ఉన్నాయి. నాలుగు కళ్లతో పాటు అధికంగా రోమాలు ఉండటం విశేషంగా కనిపించింది. ఇలాంటి పరిస్థితిలో పుట్టిన దూడను వైద్య పరిభాషలో ‘ఎసెఫాలిక్ ఫీటస్’ (Acephalic Fetus) లేదా ‘ఫీటల్ మానస్టర్’ (Fetal Monster) అని పిలుస్తారని డాక్టర్ కిరణ్ కుమార్ తెలిపారు  గర్భస్థ పిండం అభివృద్ధి చెందుతున్న సమయంలో ఏర్పడే జన్యుపరమైన అభివృద్ధి లోపాల కారణంగా ఇలాంటి అసాధారణ పిండాలు ఏర్పడే అవకాశం ఉంటుందని ఆయన అన్నారు. సకాలంలో శస్త్రచికిత్స నిర్వహించడం వల్ల ఆవు ప్రాణాపాయం నుంచి బయటపడిందని అన్నారు. ప్రస్తుతం ఆవు ఆరోగ్యంగా ఉంది. దీంతో రైతు కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • శతాబ్దాల చరిత్రకు మౌనసాక్షి..... సాలి హుండాం బౌద్ధారామం గార మండలంలో వంశధార నది ఒడ్డున కొండపై కొలువైన ప్రాచీన బౌద్ధారామం సాలిహుండం. శాతవాహనుల బౌద్ధ వారసత్వ వైభవానికి సాక్షిలా మిగిలిన ఈ ప్రదేశంలో కీ.పూ. 2వ శతాబ్ది నుంచి ఇక్కడ బౌద్ధ మత మూలాలు అంకురించాయి అనేందుకు చారిత్రాత్మక ఆధారాలు ఉన్నాయి. ఈ ప్రదేశాన్ని 1919లో ప్రముఖ విద్వాంసులు గిడుగు వెంకట రామమూర్తి కనుగొన్నారు. ఇక్కడ లభించిన అవశేషాలు క్రీస్తుపూర్వం 2వ శతాబ్దం నుండి క్రీస్తుశకం 12వ శతాబ్దం వరకు నాటివని పరిశోధకులు తేల్చారు. ఇక్కడ దొరికిన అవశేషాలు థేరవాద, మహాయాన, వజ్రయాన అనే మూడు బౌద్ధ శాఖల పరిణామాన్ని ప్రతిబింబిస్తాయి. ఇక్కడి నుండి బౌద్ధమతం సుమత్రా తదితర ఆగ్నేయాసియా దేశాలకు వ్యాపించిందని చారిత్రక ఆధారాలు ఉన్నాయి. సాలిహుండం కొండపై మహా స్థూపాలు, ఆరామాలు, చైత్యాలు మరియు భగ్నమైన శిల్ప సంపదతో పాటు తార, మారీచి దేవతల విగ్రహాలు లభించాయి. వీటిని ఇక్కడే ఓ మ్యూజియంలో భద్రపరిచారు.శ్రీలంక, జపాన్, తదితర దేశాల నుంచి సందర్శకులు ఇక్కడికి వస్తుంటారు. ఈ ప్రదేశాన్ని స్పిరిచువల్ టూరిస్ట్ స్పాట్ గా అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుతున్నారు.
    1
    శతాబ్దాల చరిత్రకు మౌనసాక్షి.....
సాలి హుండాం బౌద్ధారామం
గార మండలంలో వంశధార నది ఒడ్డున కొండపై కొలువైన ప్రాచీన బౌద్ధారామం సాలిహుండం. శాతవాహనుల బౌద్ధ వారసత్వ వైభవానికి సాక్షిలా మిగిలిన ఈ ప్రదేశంలో కీ.పూ. 2వ శతాబ్ది నుంచి ఇక్కడ బౌద్ధ మత మూలాలు అంకురించాయి అనేందుకు చారిత్రాత్మక ఆధారాలు ఉన్నాయి. ఈ ప్రదేశాన్ని 1919లో ప్రముఖ విద్వాంసులు గిడుగు వెంకట రామమూర్తి కనుగొన్నారు. ఇక్కడ లభించిన అవశేషాలు క్రీస్తుపూర్వం 2వ శతాబ్దం నుండి క్రీస్తుశకం 12వ శతాబ్దం వరకు నాటివని పరిశోధకులు తేల్చారు. ఇక్కడ దొరికిన అవశేషాలు థేరవాద, మహాయాన, వజ్రయాన అనే మూడు బౌద్ధ శాఖల పరిణామాన్ని ప్రతిబింబిస్తాయి. ఇక్కడి నుండి బౌద్ధమతం సుమత్రా తదితర ఆగ్నేయాసియా దేశాలకు వ్యాపించిందని చారిత్రక ఆధారాలు ఉన్నాయి. సాలిహుండం కొండపై మహా స్థూపాలు, ఆరామాలు, చైత్యాలు మరియు భగ్నమైన శిల్ప సంపదతో పాటు తార, మారీచి దేవతల విగ్రహాలు లభించాయి. వీటిని ఇక్కడే ఓ మ్యూజియంలో భద్రపరిచారు.శ్రీలంక, జపాన్, తదితర దేశాల నుంచి సందర్శకులు ఇక్కడికి వస్తుంటారు. ఈ  ప్రదేశాన్ని స్పిరిచువల్ టూరిస్ట్ స్పాట్ గా అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుతున్నారు.
    user_Venkata Ramana Murthy K
    Venkata Ramana Murthy K
    Yoga instructor శ్రీకాకుళం, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
  • రాజాం వసతి గృహాలలో పిల్లల కు కేర్ టేకర్ ఉన్నా ఫలితమేమి విద్యార్థుల కేర్ టేకర్ ఎవరు రాజాం, ఆగష్టు 25, షురూ న్యూస్. ఆ హాస్టల్ ల్లో విద్యార్థుల కేర్ టేకర్ ఎవరో తెలియడం లేదు. ఈ క్రమంలో చోటుచేసుకున్న పరిణామాల దృష్ట్యా విజయనగరం జిల్లా రాజాం లో ఓ హాస్టల్ వార్డెన్ తీరు విమర్శలకు తావిస్తుంది.. రాజాం సారధి రోడ్డులో ఉన్న జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల, బాలికల జూనియర్ కాలేజ్ కు అనుబంధ వసతి గృహంలో వార్డెన్గా విధులు నిర్వహిస్తున్న అడపా రమా తమ బంధువులు పెళ్లి వేడుకలలో వసతి గృహములో ఉన్న కొంతమంది బాలికలను వంజరం పేట గ్రామానికి తీసుకెళ్లి రోడ్లపై స్టెప్పులు వేయించారన్న ఆరోపణల పై స్థానికంగా పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి... కాలేజ్ ప్రిన్సిపాల్ కు గాని లేదా తమ తల్లిదండ్రులు గాని తెలియకుండా ఇలా బయటకు తీసుకువెళ్లి డాన్స్ లు వేయించడం ఎంతవరకు కరెక్ట్ అంటూ చర్చ జరుగుతుంది.
    2
    రాజాం వసతి గృహాలలో పిల్లల కు కేర్ టేకర్ ఉన్నా ఫలితమేమి
విద్యార్థుల కేర్ టేకర్ ఎవరు
రాజాం, ఆగష్టు 25, షురూ న్యూస్. 
ఆ హాస్టల్ ల్లో విద్యార్థుల కేర్ టేకర్ ఎవరో తెలియడం లేదు. ఈ క్రమంలో చోటుచేసుకున్న పరిణామాల దృష్ట్యా విజయనగరం జిల్లా రాజాం లో ఓ హాస్టల్ వార్డెన్ తీరు విమర్శలకు తావిస్తుంది.. రాజాం సారధి రోడ్డులో  ఉన్న జిల్లా పరిషత్  బాలికల ఉన్నత పాఠశాల, బాలికల జూనియర్ కాలేజ్ కు అనుబంధ వసతి గృహంలో వార్డెన్గా విధులు నిర్వహిస్తున్న అడపా రమా తమ బంధువులు పెళ్లి వేడుకలలో వసతి గృహములో ఉన్న కొంతమంది బాలికలను వంజరం పేట గ్రామానికి తీసుకెళ్లి రోడ్లపై స్టెప్పులు వేయించారన్న ఆరోపణల పై స్థానికంగా పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి... కాలేజ్ ప్రిన్సిపాల్ కు గాని లేదా తమ తల్లిదండ్రులు గాని తెలియకుండా ఇలా బయటకు తీసుకువెళ్లి డాన్స్ లు వేయించడం ఎంతవరకు కరెక్ట్ అంటూ చర్చ జరుగుతుంది.
    user_Eesarla Ramakrushna
    Eesarla Ramakrushna
    సంతకవిటి, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
  • పాలకొండ సమీపంలో ట్రాన్స్‌ఫార్మర్ పేలుడు: రూ. 5 లక్షల నష్టం పాలకొండ మండలం బెజ్జి గ్రామంలో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ ఓవర్‌లోడ్‌కు గురై ఒక్కసారిగా పేలిపోయి భారీగా మంటలు చెలరేగాయి. స్థానిక లైన్‌మెన్ గుడివాడ రాము సమాచారం మేరకు, పాలకొండ అగ్నిమాపక అధికారి జామి సర్వేశ్వరరావు ఆధ్వర్యంలో సిబ్బంది ఫైర్ ఇంజన్‌తో వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాద తీవ్రతను గమనించిన అధికారులు, ముందుగా విద్యుత్ సరఫరాను నిలిపివేయించి, అనంతరం శ్రమించి మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో ట్రాన్స్‌ఫార్మర్ పూర్తిగా దెబ్బతిని, సుమారు రూ. 5 లక్షల మేర నష్టం వాటిల్లిందని ఏపీఈపీడీసీఎల్ (APEPDCL) పాలకొండ ఏఈ నిమ్మల యోగి తెలిపారు. ఫైర్ సిబ్బంది సకాలంలో స్పందించి మంటలు అదుపు చేయడంతో సమీప ప్రాంతాలకు మంటలు వ్యాపించకుండా ప్రమాదము తప్పిందని స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
    1
    పాలకొండ సమీపంలో ట్రాన్స్‌ఫార్మర్ పేలుడు: రూ. 5 లక్షల నష్టం
పాలకొండ మండలం బెజ్జి గ్రామంలో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ ఓవర్‌లోడ్‌కు గురై ఒక్కసారిగా పేలిపోయి భారీగా మంటలు చెలరేగాయి. స్థానిక లైన్‌మెన్ గుడివాడ రాము సమాచారం మేరకు, పాలకొండ అగ్నిమాపక అధికారి జామి సర్వేశ్వరరావు ఆధ్వర్యంలో సిబ్బంది ఫైర్ ఇంజన్‌తో వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాద తీవ్రతను గమనించిన అధికారులు, ముందుగా విద్యుత్ సరఫరాను నిలిపివేయించి, అనంతరం శ్రమించి మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో ట్రాన్స్‌ఫార్మర్ పూర్తిగా దెబ్బతిని, సుమారు రూ. 5 లక్షల మేర నష్టం వాటిల్లిందని ఏపీఈపీడీసీఎల్ (APEPDCL) పాలకొండ ఏఈ నిమ్మల యోగి తెలిపారు. ఫైర్ సిబ్బంది సకాలంలో స్పందించి మంటలు అదుపు చేయడంతో  సమీప ప్రాంతాలకు మంటలు వ్యాపించకుండా ప్రమాదము తప్పిందని స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
    user_Duppada Anandarao
    Duppada Anandarao
    Lawyer పాలకొండ, పార్వతీపురం మన్యం, ఆంధ్రప్రదేశ్•
    18 hrs ago
  • డోలపేట లో శ్రీ కనక దుర్గ అమ్మ వారికి గాజులు దండలు సేవలో లీనమైన గ్రామ భక్తులు
    1
    డోలపేట లో శ్రీ కనక దుర్గ అమ్మ వారికి గాజులు 
దండలు సేవలో లీనమైన గ్రామ భక్తులు
    user_రమేష్  లావేటి
    రమేష్ లావేటి
    రేగిడి ఆమదాలవలస, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • విజయనగరం పట్టణంలో మీలాద్-ఉన్-నబి పండగ బారి ర్యాలీ నిర్వహణ విజయనగరం పట్టణం పరిధిలో ముస్లిం సోదరులు మీలాద్-ఉన్-నబి పండగ సందర్భంగా బుధవారం ఉదయం బారి ర్యాలీ నిర్వహించారు. ఇస్లాం మత స్థాపకుడు చివరి ప్రవక్త అయిన మహమ్మద్ ప్రవక్త జన్మదిన సందర్భంగా ఈ పండగ జరుపుకుంటున్నామని ముస్లిం ఐక్య సంఘం తెలిపారు. విజయనగరం కోట జంక్షన్ నుండి కాంప్లెక్స్ వరకు అధిక సంఖ్యలో ముస్లిం మత సంఘాలు అధిక సంఖ్యలో ర్యాలీలో పాల్గొన్నారు.
    1
    విజయనగరం పట్టణంలో మీలాద్-ఉన్-నబి పండగ బారి ర్యాలీ నిర్వహణ 
విజయనగరం పట్టణం పరిధిలో ముస్లిం సోదరులు మీలాద్-ఉన్-నబి పండగ సందర్భంగా బుధవారం ఉదయం బారి ర్యాలీ నిర్వహించారు. ఇస్లాం మత స్థాపకుడు చివరి ప్రవక్త అయిన మహమ్మద్ ప్రవక్త జన్మదిన సందర్భంగా ఈ పండగ జరుపుకుంటున్నామని ముస్లిం ఐక్య సంఘం తెలిపారు. విజయనగరం కోట జంక్షన్ నుండి కాంప్లెక్స్ వరకు అధిక సంఖ్యలో ముస్లిం మత సంఘాలు అధిక సంఖ్యలో ర్యాలీలో పాల్గొన్నారు.
    user_Vijay Bhaskar
    Vijay Bhaskar
    Local News Reporter నెల్లిమర్ల, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
  • బొబ్బిలి పట్టణ ప్రజలకు శుభవార్త తెలిపిన ఎమ్మెల్యే బేబీనాయన.. పట్టణంలో ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి దాడితల్లి గుడి వరకు నూతన రోడ్డు నిర్మాణ పనులకు గ్రీన్ సిగ్నల్.. - ⁠వచ్చే నెలలో టెండరు ద్వారా పనులు ప్రారంభం. బొబ్బిలి పట్టణంలో *ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి దాడితల్లి గుడి* వరకు ఉన్న రోడ్డుకు గుంతలు ఏర్పడి, ఎన్నో సంవత్సరాలుగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు గురవుతున్న పరిస్థితి అందరికీ విదితమే.. గౌరవ శాసనసభ్యులు శ్రీ *ఆర్.వీ.ఎస్.కె.కె.రంగారావు (బేబీ నాయన)* గారు ఎమ్మెల్యే అయిన తరువాత తాత్కాలికంగా గుంతలు పూడ్పించి, కొంతమేర ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయడం జరిగింది.. గౌరవ మున్సిపల్ శాఖ మంత్రివర్యులు శ్రీ *పొంగూరు నారాయణ* గారు బొబ్బిలి పర్యటనకు వచ్చినప్పుడు ఎమ్మెల్యే శ్రీ బేబీనాయన గారు ఈ సమస్యను వారి దృష్టికి తీసుకువెళ్లగా, వారు సానుకూలంగా స్పందించి *రూ2.0 కోట్లు* మంజూరు చేశారు.. ప్రభుత్వ అనుమతుల ప్రక్రియ పూర్తిచేసుకుని *టెండర్ల పిలుపుకు ఆమోదం లభించిందని*, యుద్ధప్రాతిపదికన టెండరు ప్రక్రియ పూర్తిచేసి రోడ్డు పనులను ప్రారంభించనున్నట్లు ఎమ్మెల్యే శ్రీ బేబీనాయన గారు వీడియో సందేశం ద్వారా బొబ్బిలి పట్టణ ప్రజలకు తెలియజేశారు.
    1
    బొబ్బిలి పట్టణ ప్రజలకు శుభవార్త తెలిపిన ఎమ్మెల్యే  బేబీనాయన..
పట్టణంలో ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి దాడితల్లి గుడి వరకు నూతన రోడ్డు నిర్మాణ పనులకు గ్రీన్ సిగ్నల్..
- ⁠వచ్చే నెలలో టెండరు ద్వారా పనులు ప్రారంభం.
బొబ్బిలి పట్టణంలో *ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి దాడితల్లి గుడి* వరకు ఉన్న రోడ్డుకు గుంతలు ఏర్పడి, ఎన్నో సంవత్సరాలుగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు గురవుతున్న పరిస్థితి అందరికీ విదితమే.. గౌరవ శాసనసభ్యులు శ్రీ *ఆర్.వీ.ఎస్.కె.కె.రంగారావు (బేబీ నాయన)* గారు ఎమ్మెల్యే అయిన తరువాత తాత్కాలికంగా గుంతలు పూడ్పించి, కొంతమేర ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయడం జరిగింది.. 
గౌరవ మున్సిపల్ శాఖ మంత్రివర్యులు శ్రీ *పొంగూరు నారాయణ* గారు బొబ్బిలి పర్యటనకు వచ్చినప్పుడు ఎమ్మెల్యే శ్రీ బేబీనాయన గారు ఈ సమస్యను వారి దృష్టికి తీసుకువెళ్లగా, వారు సానుకూలంగా స్పందించి *రూ2.0 కోట్లు* మంజూరు చేశారు.. ప్రభుత్వ అనుమతుల ప్రక్రియ పూర్తిచేసుకుని *టెండర్ల పిలుపుకు ఆమోదం లభించిందని*, యుద్ధప్రాతిపదికన టెండరు ప్రక్రియ పూర్తిచేసి రోడ్డు పనులను ప్రారంభించనున్నట్లు ఎమ్మెల్యే శ్రీ బేబీనాయన గారు వీడియో సందేశం ద్వారా బొబ్బిలి పట్టణ ప్రజలకు తెలియజేశారు.
    user_వెంకీ నాయుడు
    వెంకీ నాయుడు
    Photographer బొబ్బిలి, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
  • అనకాపల్లి జిల్లా: ఫ్లోరైడ్ ప్రభావిత గ్రామం రోలు గుంటలో.. మంచినీళ్లు ఇవ్వండి చేతులు జోడించి వేడుకుంటున్నాము.. దళితులు బిరుదులు పేద మహిళలు ఖాళీ బిందెలతో ర్యాలీ.. అనకాపల్లి జిల్లా రోలుగుంట కేంద్రంలో కాలనీలో దళితులు. గిరిజనులు. ఇతర పేద మహిళలు ఖాళీ బిందెలతో. మూడు వీధిలో రాలి నిర్వహించడం జరిగింది. వాటర్ ట్యాంకుల ద్వారా మంచినీళ్లు సరఫరా చేయాలి CSR. DFM నిధుల నుండి వాటర్ ట్యాంకు ద్వారా నీరు సరఫరా చేయాలి. జిల్లా కలెక్టర్ గారు జోకులు చేసుకోవాలి రోలుగుంట మండలంలో రోలుగుంట తో పాటు నిండుగొండ కే నాయుడుపాలెం కొవ్వూరు.ఎన్ కొత్తూరు. అంట్లపాలెం రాజుపేట ముని పెళ్లి గొల్లపేట గ్రామాలను ఫ్లోరైడ్ ప్రభావిత గ్రామాలుగా ప్రభుత్వం గుర్తించింది. అప్పటికి 13000 మంది జనాభా రక్షత తాగునీరు అందించడానికి 2004 సంవత్సరంలో3 కోట్ల 50 లక్షల రూపాయలతో భారీ ప్రాజెక్టు నిర్మాణం చేశారు. ఈ నిధులతో జానకిరాంపురం గ్రామం వద్ద వరాహ నదిలో 3 భారీ బోరు బావులు తవ్వించారు. అక్కడినుండి రోలుగుంట లో లక్ష లీటర్లు సామర్థ్యం ఉన్న భారీ వాటర్ ట్యాంక్ నిర్మాణం చేసి పైప్లైన్ ద్వారా అందించారు. ఈ పథకం ప్రారంభించి కొద్ది రోజులు సక్రమంగా పనిచేసింది ఇప్పుడు 20 వేల మంది జనాభా పెరిగారు. వరాహ నది బోరుబావుడు చుట్టూ ఇసుక మాఫియా తవ్వడంతో భూగర్భ జలాలు అడుగట్టిపోయాయి. దీంతో గ్రామాలకు నీరు సరఫరా బంద్ అయిపోయింది అమృత ధార ( జల్జీవన్ మిషన్)2020-21 ద్వారా ఆరు కోట్ల రూపాయలు నిధులు మంజూరు అయ్యాయి. ఆ నిధులు పనులు చేపట్టకపోవడంతో కోటమ్మ ప్రభుత్వం వచ్చి వాటిని రద్దు చేసింది తిరిగి కూటమి ప్రభుత్వానికి ప్రతిపాదన పంపించిన అని చెప్పారు. అధికారులు చెబుతున్నారు. నేటికీ ఫ్లోరిడ్ గ్రామంగా గుర్తించి 23 సంవత్సరాలు అవుతుంది. పాత పైపులు పగిలిపోయాయి. అధికారులు అప్పులు చేసుకొని రిపేర్ చేస్తున్నారు. స్కీం మాత్రం కేటాయించడం లేదు. గ్రామంలో సొంత బోర్లు తీసుకున్న నీరు రావడం లేదు. కనీసం ఫ్లోరైడ్ నీరు కూడా దొరకడం లేదు. రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రివర్యులు ప్రతి గ్రామానికి రక్షత మంచినీరు సౌకర్యం కల్పిస్తామని ప్రకటనలో చెప్తున్నారు. కనీసం మండల కేంద్రంలో నీరు సరఫరా చేయకపోవడం చాలా అన్యాయం. 12 కుటుంబాల వారు సొంతంగా బోరు తీసుకోవడం జరిగింది. నీరు పడలేదు లక్షల రూపాయలు ఖర్చులు అవుతున్నాయి నీరు రావడం లేదు దళిత గిరిజన ఇతర పేద వీధులన్నిటికీ వాటర్ ట్యాంకుల ద్వారా మంచినీరు సరఫరా చేయాలని డిమాండ్ చేయడం జరిగింది. రోలుగుంట నిండుగొండ. కొవ్వూరు రెవిన్యూ పరిధిలో 12 నల్లరాయి క్వారీలు. ఉన్నాయి. పర్యావరణ అనుమతులు గ్రామసభలు పెట్టేటప్పుడు గ్రామాలకు మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తాం. మొక్కలు నాటుదాం. పర్యావరణాన్ని కాపాడుతాం. మెడికల్ క్యాంప్ పెడతాం సభలో ప్రకటిస్తున్నారు. 20 సంవత్సరాల నుండి ఖాళీ కరాప నిర్వహిస్తున్నారు సి ఎస్ ఆర్ Csr. డిస్ట్రిక్ట్ పండు నిధులు రోలుగుంట మంచినీరికి కేటాయించకపోవడం చాలా అన్యాయం ఈ విషయంపై ఆర్డబ్ల్యూఎస్ జై గారితో ఫోన్లో మాట్లాడగా వరాహ నదిలో భూగర్భ జలాలు అడుగట్టిపోయాయి. నీరు లేదు. చెప్పారు. తక్షణమే దళిత గిరిజన కాలనీకి వాటర్ ట్యాంకర్ ద్వారా మంచినీరు సరఫరా చేయాలని డిమాండ్ చేయడం జరిగింది. సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కే గోవిందరావు v నూకరత్నం v శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.
    3
    అనకాపల్లి జిల్లా: ఫ్లోరైడ్ ప్రభావిత గ్రామం రోలు గుంటలో.. మంచినీళ్లు ఇవ్వండి చేతులు జోడించి వేడుకుంటున్నాము.. దళితులు బిరుదులు పేద మహిళలు ఖాళీ బిందెలతో ర్యాలీ..
అనకాపల్లి జిల్లా రోలుగుంట కేంద్రంలో కాలనీలో దళితులు. గిరిజనులు. ఇతర పేద మహిళలు 
ఖాళీ బిందెలతో. మూడు వీధిలో రాలి నిర్వహించడం జరిగింది.
వాటర్ ట్యాంకుల ద్వారా మంచినీళ్లు సరఫరా చేయాలి 
CSR. DFM నిధుల నుండి వాటర్ ట్యాంకు ద్వారా నీరు సరఫరా చేయాలి. జిల్లా కలెక్టర్ గారు జోకులు చేసుకోవాలి 
రోలుగుంట మండలంలో రోలుగుంట తో పాటు నిండుగొండ కే నాయుడుపాలెం కొవ్వూరు.ఎన్ కొత్తూరు. అంట్లపాలెం రాజుపేట
ముని పెళ్లి గొల్లపేట గ్రామాలను ఫ్లోరైడ్  ప్రభావిత గ్రామాలుగా ప్రభుత్వం గుర్తించింది. అప్పటికి 13000 మంది జనాభా రక్షత తాగునీరు అందించడానికి 2004 సంవత్సరంలో3 కోట్ల 50 లక్షల  రూపాయలతో భారీ ప్రాజెక్టు నిర్మాణం చేశారు. ఈ నిధులతో జానకిరాంపురం గ్రామం వద్ద వరాహ నదిలో 3 భారీ బోరు బావులు తవ్వించారు. అక్కడినుండి రోలుగుంట లో లక్ష లీటర్లు సామర్థ్యం ఉన్న భారీ వాటర్ ట్యాంక్ నిర్మాణం చేసి పైప్లైన్ ద్వారా అందించారు. ఈ పథకం ప్రారంభించి కొద్ది రోజులు సక్రమంగా పనిచేసింది 
ఇప్పుడు  20 వేల మంది జనాభా పెరిగారు. వరాహ నది బోరుబావుడు చుట్టూ ఇసుక మాఫియా తవ్వడంతో భూగర్భ జలాలు అడుగట్టిపోయాయి. దీంతో గ్రామాలకు నీరు సరఫరా బంద్ అయిపోయింది 
అమృత ధార ( జల్జీవన్ మిషన్)2020-21 ద్వారా ఆరు కోట్ల రూపాయలు నిధులు మంజూరు అయ్యాయి. ఆ నిధులు పనులు చేపట్టకపోవడంతో కోటమ్మ ప్రభుత్వం వచ్చి వాటిని రద్దు చేసింది తిరిగి కూటమి  ప్రభుత్వానికి ప్రతిపాదన పంపించిన అని చెప్పారు. అధికారులు చెబుతున్నారు.
నేటికీ ఫ్లోరిడ్ గ్రామంగా గుర్తించి 23 సంవత్సరాలు అవుతుంది. పాత పైపులు పగిలిపోయాయి. అధికారులు అప్పులు చేసుకొని రిపేర్ చేస్తున్నారు. స్కీం మాత్రం కేటాయించడం లేదు. గ్రామంలో సొంత బోర్లు తీసుకున్న నీరు రావడం లేదు. కనీసం ఫ్లోరైడ్ నీరు కూడా దొరకడం లేదు. రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రివర్యులు ప్రతి గ్రామానికి రక్షత మంచినీరు సౌకర్యం కల్పిస్తామని ప్రకటనలో చెప్తున్నారు. కనీసం మండల కేంద్రంలో నీరు సరఫరా చేయకపోవడం చాలా అన్యాయం. 12 కుటుంబాల వారు సొంతంగా బోరు తీసుకోవడం జరిగింది. నీరు పడలేదు లక్షల రూపాయలు ఖర్చులు అవుతున్నాయి నీరు రావడం లేదు 
దళిత గిరిజన ఇతర పేద వీధులన్నిటికీ వాటర్ ట్యాంకుల ద్వారా మంచినీరు సరఫరా చేయాలని డిమాండ్ చేయడం జరిగింది. 
రోలుగుంట నిండుగొండ. కొవ్వూరు రెవిన్యూ పరిధిలో 12 నల్లరాయి క్వారీలు. ఉన్నాయి. పర్యావరణ అనుమతులు గ్రామసభలు పెట్టేటప్పుడు గ్రామాలకు మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తాం. మొక్కలు నాటుదాం. పర్యావరణాన్ని కాపాడుతాం. మెడికల్ క్యాంప్ పెడతాం సభలో ప్రకటిస్తున్నారు. 20 సంవత్సరాల నుండి ఖాళీ కరాప నిర్వహిస్తున్నారు సి ఎస్ ఆర్  Csr. డిస్ట్రిక్ట్ పండు నిధులు రోలుగుంట మంచినీరికి కేటాయించకపోవడం చాలా అన్యాయం 
ఈ విషయంపై ఆర్డబ్ల్యూఎస్ జై గారితో ఫోన్లో మాట్లాడగా 
వరాహ నదిలో భూగర్భ జలాలు అడుగట్టిపోయాయి. నీరు లేదు. చెప్పారు.
తక్షణమే దళిత గిరిజన కాలనీకి వాటర్ ట్యాంకర్ ద్వారా మంచినీరు సరఫరా చేయాలని డిమాండ్ చేయడం జరిగింది. సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కే గోవిందరావు v నూకరత్నం v శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.
    user_Sativada Venkatarao
    Sativada Venkatarao
    గజపతినగరం, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • సర్వీసు లో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ రద్దు చేయాలి యూటిఎఫ్ సర్వీస్ లో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ మినహాయింపు యూటిఎఫ్ డిమాండ్ రాజాం /సంతకవిటి, షురూ సర్వీస్ లో ఉన్న ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న టెట్ పరీక్ష విధానాన్ని రద్దు చేయాలంటూ యుటిఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు రాజాం లో నిరసన కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి రెడ్డి మోహనరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి పక్కి వాసు మాట్లాడుతూ విద్యా హక్కు చట్టం ప్రకారం 2010 నుండి టెట్ రాష్ట్రంలో అమలు చేయడం జరుగుతుంది. ఈ చట్టం ప్రకారం 2010 నుండి సెలెక్ట్ అయిన ఉపాధ్యాయులకు మాత్రమే టెట్ నిర్వహణ కాకుండా అంతకుముందు నియమాకమైన ఉపాధ్యాయులకూ టెట్ నిర్వహించడం అసంబద్ధమైనదిగా వారు పేర్కొన్నారు. 30 సంవత్సరాలు సర్వీస్ దాటినప్పటికీ కూడా పరీక్షల పేరిట ఉపాధ్యాయులను ప్రభుత్వం వేధించడం సరైన విధానం కాదని ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోవాలని లేదంటే యూటిఎఫ్ ఆద్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం ఉధృతం చేయనున్నట్లు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూటిఎఫ్ జిల్లా కార్యదర్శి డోల కృష్ణా రావు, శ్రీనివాసరావు లతో పాటు యూటిఎఫ్ కార్యవర్గ సభ్యులు,రాజాం నియోజకవర్గ పరిది ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు, ఉపాద్యాయులు పాల్గొన్నారు.
    1
    సర్వీసు లో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ రద్దు చేయాలి యూటిఎఫ్
సర్వీస్ లో ఉన్న ఉపాధ్యాయులకు టెట్  మినహాయింపు యూటిఎఫ్ డిమాండ్
రాజాం /సంతకవిటి, షురూ
సర్వీస్ లో ఉన్న ఉపాధ్యాయులకు  నిర్వహిస్తున్న టెట్ పరీక్ష విధానాన్ని రద్దు చేయాలంటూ యుటిఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు రాజాం లో నిరసన కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి రెడ్డి మోహనరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి పక్కి వాసు మాట్లాడుతూ విద్యా హక్కు చట్టం ప్రకారం 2010 నుండి టెట్ రాష్ట్రంలో అమలు చేయడం జరుగుతుంది. ఈ చట్టం ప్రకారం 2010 నుండి  సెలెక్ట్ అయిన ఉపాధ్యాయులకు మాత్రమే టెట్ నిర్వహణ కాకుండా అంతకుముందు నియమాకమైన ఉపాధ్యాయులకూ టెట్ నిర్వహించడం అసంబద్ధమైనదిగా వారు పేర్కొన్నారు. 30 సంవత్సరాలు సర్వీస్  దాటినప్పటికీ కూడా పరీక్షల పేరిట ఉపాధ్యాయులను ప్రభుత్వం వేధించడం సరైన విధానం కాదని ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోవాలని లేదంటే యూటిఎఫ్ ఆద్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం ఉధృతం చేయనున్నట్లు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూటిఎఫ్ జిల్లా కార్యదర్శి డోల కృష్ణా రావు, శ్రీనివాసరావు లతో పాటు యూటిఎఫ్ కార్యవర్గ సభ్యులు,రాజాం నియోజకవర్గ పరిది ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు, ఉపాద్యాయులు పాల్గొన్నారు.
    user_Eesarla Ramakrushna
    Eesarla Ramakrushna
    సంతకవిటి, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
    18 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.