ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ప్రత్యేక చొరవతో రూ.40.94 లక్షల DMFT నిధులు మంజూరు*_ వనపర్తి నియోజకవర్గ అభివృద్ధికి మరో ముందడుగు*_ _*విద్య, వైద్యం, తాగునీరు, మౌలిక వసతులకు ప్రాధాన్యం వనపర్తి నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా, ప్రజలకు అవసరమైన మౌలిక వసతులను మెరుగుపరచడమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి గారి ప్రత్యేక చొరవతో జిల్లా మినరల్ ఫౌండేషన్ ట్రస్ట్ (DMFT) నిధుల నుంచి మొత్తం రూ.40.94 లక్షల విలువైన 7 అభివృద్ధి పనులకు పరిపాలనా అనుమతులు మంజూరయ్యాయి*_ _*జిల్లా కలెక్టర్, DMFT చైర్‌పర్సన్ శ్రీ ఆదర్శ్ సురభి IAS గారు 21-08-2026న ఉత్తర్వులు జారీ చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు*_ _*విద్య, వైద్యం, తాగునీరు వంటి ప్రజలకు అత్యంత అవసరమైన రంగాలకు ప్రాధాన్యతనిస్తూ ఈ పనులను చేపట్టనున్నారు.*_ _*...మంజూరైన అభివృద్ధి పనులు*_ _*1. పోల్‌కేపాడు గ్రామం గోపాల్‌పేట మండలం స్థానిక పాఠశాల భవనంలో 3 అదనపు తరగతి గదుల నిర్మాణానికి రూ.30 లక్షలు కేటాయించారు*_ _*2. వనపర్తి పట్టణంలోని ప్రభుత్వ ఎస్సీ కాలేజ్ బాలికల హాస్టల్-A హాస్టల్ కాంపౌండ్ వాల్‌కు గేట్ మరియు మిగిలిన పనుల కోసం రూ.1 లక్ష మంజూరైంది*_ _*3. ప్రభుత్వ ఎస్సీ కాలేజ్ బాలికల హాస్టల్-A హాస్టల్‌లో వాటర్ స్టోరేజ్ సంప్, సెప్టిక్ ట్యాంక్ నిర్మాణానికి రూ.2 లక్షలు కేటాయించారు*_ _*4. ప్రభుత్వ ఎస్సీ కాలేజ్ బాలికల హాస్టల్-A హాస్టల్‌లో GI షీట్ల రూఫింగ్‌తో కిచెన్ షెడ్ నిర్మాణానికి రూ.2 లక్షలు మంజూరయ్యాయి.*_ _*5. వనపర్తి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (GGH)లో CT స్కాన్ బ్లాక్ CT స్కాన్ కేంద్రానికి వచ్చే రోగులు, వారి సహాయకుల సౌకర్యార్థం పేషెంట్ వెయిటింగ్ షెడ్ నిర్మాణానికి రూ.94 వేల నిధులు మంజూరయ్యాయి*_ _*6. వనపర్తి ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కాంప్లెక్స్ వర్షపు నీటిని భూగర్భ జలాలుగా మళ్లించేందుకు రీచార్జ్ పిట్స్ నిర్మాణానికి రూ.3.50 లక్షలు కేటాయించారు*_ _*7. ప్రభుత్వ ఎస్సీ కాలేజ్ బాలికల హాస్టల్-A తాగునీటి అవసరాలను తీర్చేందుకు బోర్‌వెల్ డ్రిల్లింగ్, సబ్‌మెర్సిబుల్ మోటార్ పంప్ మరియు అవసరమైన ఇతర సామగ్రి కోసం రూ.1.50 లక్షలు మంజూరయ్యాయి.*_ _*ఈ ఏడు పనులకు కలిపి రూ.40.94 లక్షలు DMFT నిధులు కేటాయించినట్లు ఎమ్మెల్యే తెలిపారు*_ _*ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గంలో ప్రతి గ్రామం, ప్రతి వర్గం అభివృద్ధి చెందాలన్నదే మా ప్రభుత్వ లక్ష్యం. ప్రజలకు నేరుగా ఉపయోగపడే విద్య, వైద్యం, తాగునీరు, మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టిసారిస్తున్నామన్నారు*_ _*ఈ అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేసిన జిల్లా కలెక్టర్ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు*_ _*పనులను నాణ్యతా ప్రమాణాలతో, నిర్ణీత సమయంలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.*_

- NGKL:హామీలు అమలు చేయకపోతే ఉద్యమం తప్పదు: సీఐటీయూ హెచ్చరిక ఆర్టీసీ యాజమాన్యం చర్చల వేదికగా ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కార్మికులను వంచిస్తోందని ఎస్‌డబ్ల్యూఎఫ్ ఉపాధ్యక్షులు పి.చింతలయ్య ధ్వజమెత్తారు. మంగళవారం నాగర్‌కర్నూల్ ఆర్టీసీ డిపో వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో చేపట్టిన ఒకరోజు నిరాహార దీక్షలకు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమాన్ని గౌరవాధ్యక్షులు ఆర్. శ్రీనివాసులు ప్రారంభించగా, టీజేఎంయూ నాయకుడు డీవీ నాయక్ మద్దతు పలికారు. రూట్ సర్వేలు చేయకుండానే ఏకపక్షంగా రన్నింగ్ టైమ్స్ మారుస్తున్నారని చింతలయ్య విమర్శించారు. మోటారు వాహనాల చట్టం-2019 ప్రకారం ఉద్యోగ భద్రత కల్పించాలని, 2017 వేతన బకాయిలు, ఆర్పీఎస్-2021 అరియర్స్ వెంటనే చెల్లించాలని, 2019 నాటి పోలీసు కేసులను ఎత్తివేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ప్రతినిధులు నందీశ్వర్, లింగయ్య, అర్జున్, వెంకట వర్ధనమ్మ పాల్గొన్నారు.3
- గోనెగండ్ల మండలం కులుమల గ్రామంలో కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు భాస్కర్ల చంద్రశేఖర్ గారు పర్యటించారు *ప్రజల మధ్య శేఖరన్న – అభివృద్ధి బాటలో కులుమల గ్రామం *గోనెగండ్ల మండలం కులుమల గ్రామంలో కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు భాస్కర్ల చంద్రశేఖర్ గారు పర్యటించారు.* *ఈ సందర్భంగా గ్రామ ప్రజలతో మమేకమై, గౌరవ ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ, వారి సమస్యలను స్వయంగా తెలుసుకున్నారు.* *ప్రజల సమస్యలు తెలుసుకుని, వాటి పరిష్కారానికి కృషి చేయడమే లక్ష్యంగా శేఖరన్న గారి పర్యటన కొనసాగింది.1
- స్వచ్ఛందంగా త్రాగునీటి కొరకు రోడ్డు పైకీ ఎక్కి ఆగ్రహించిన మహిళలు. ఎవరి పర్మిషన్ తీసుకున్నారు అంటున్న పోలీసులు. ( కోడుమూరు షురు న్యూస్ ప్రతినిధి) కర్నూలు జిల్లా కోడుమూరు పట్టణంలో కొండపేట చెందిన మహిళలు స్వచ్ఛందంగా బిందెలు తీసుకొని రోడ్డుపైకి ఎక్కి అగ్రహంతో ధర్నాకు దిగారు. మహిళలు మాట్లాడుతూ ఏ ఒక్క నాయకుడు వచ్చినా తూతూ మంత్రంగానే మాటలు చెప్పి తప్పించుకుంటున్నారు తప్ప కోడుమూరు పట్టణానికి శాశ్వతంగా మంచినీటి సౌకర్యం కల్పించాలని ఇంకిత జ్ఞానం నాయకులకు లేదు. మాకు 20 రోజులైనా కుళాయిల నుంచి నీరు అందటం లేదు మేము ఎందుకు రోడ్డుపైకి వస్తాం మాకు ఏమైనా పొగరా..? మాకు నీళ్లు వస్తే ఎందుకు ఎక్కుతం రోడ్డు. అదే మీ ఇండ్లలో నీళ్లు లేకుంటే మీ ఆడవాళ్లు ఎలా ఉంటారు మీకు అర్థమవుతుంది మాలాగైతేనే మీకు తెలుస్తుంది ఉద్యోగాలు చేసుకుని జీతాలు తినేది కాదు.. నీటి సమస్యను తీరేంతవరకు ఈ ధర్నా నుంచి విరమించుకునేదే లేదు కలెక్టర్ రావాలి అంటూ పట్టు పట్టారు. పోలీసులు వచ్చి మహిళలు మాట్లాడిన మాటలు విని పోలీసులు మాట్లాడుతూ మీకు పర్మిషన్ ఎవరు ఇచ్చారు. పరిమిషన్ ఉంటేనే ధర్నాకు దిగాలి మీ ఇష్టం వచ్చినట్టు రోడ్డు ఎక్కితే సరిపోదు మీ మీద కేసులు పెడతాం జాగ్రత్త అంటూ ఆగ్రహించారు. అంబులెన్స్ లో నాలుగు వెళ్లాయి గర్భవతులు అందులో ఉన్నారు అందులో గర్భవతులు చనిపోతే మీ మీద కేసులు పెడతాం . ఇదంతా సిపిఎం పార్టీ వాళ్లే చేసినట్టు ఉన్నారు.అంటూ గాంభీరంగా పోలీసులు మాట్లాడారు .దురుసు ఎక్కువ అయిపోతున్నది అంటూ మహిళలు పోలీసులపై మండిపడ్డారు. మాకు ఏ నాయకులతో సంబంధం లేదు మేము స్వచ్ఛందంగా బిందెలు తీసుకొని రోడ్ ఎక్కాం.మా ఇండ్లలో మాదిరిగా మీకు మా పరిస్థితి వస్తే సరిపోతుంది. ఊరికే ఇష్టం వచ్చినట్టు పోలీసులు మాట్లాడేది కాదు మాకు ఏ నాయకుడు చెప్పలేదు రోడ్డు ఎక్కమని.మేమే స్వచ్ఛందంగా వచ్చాం త్రాగునీటి కొరకు మా ఇండ్లలో నీళ్లు ఉన్నాయో లేదో పోలీసులైన పంచాయతీ అధికారులు అయిన మీరు వచ్చి చూడండి మీకు అర్థం అవుతుంది. అంటూ మహిళల ఆగ్రహించి మాట్లాడారు. ఒక్కసారిగా పోలీసులు ఏమీ ఆలోచించకుండా ట్రాఫిక్ సమస్య లేకుండా ముందుగా ధర్నాకు దిగిన మహిళలను పోలీసు స్టేషన్ కు తరలించారు. మరి కోడుమూరు త్రాగునీటి సమస్య ఎంతవరకు అవుతుందో సమస్యను తీరుస్తారో లేదో ఎవరికి అర్థం కాని పరిస్థితి ఈ వీడియో చూస్తే అధికారులకు తెలుస్తుంది. వేచి చూడాలి.1
- ప్రమాదకరంగా విద్యుత్ స్తంభాలు.. ప్రమాదాలు జరగక ముందే చర్యలు తీసుకోవాలని కోరుతున్న ప్రజలు నంద్యాల నుంచి కొత్తూరు వెళ్లే ప్రధాన రహదారిలో బ్రాహ్మణపల్లి గ్రామం వద్ద విద్యుత్ స్తంభాలు ప్రమాదకరంగా మారాయి. రోడ్డుకు ఇరువైపులా ఉన్న విద్యుత్ స్తంభాలు పూర్తిగా ఒరిగి ఎప్పుడు కూలిపోతాయో తెలియని పరిస్థితిలో ఉన్నాయి. పెద్ద గాలి వీచినా, వర్షం పడినా అవి రోడ్డుపై పడే ప్రమాదం ఉందని గ్రామస్తులు, వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మార్గంలో రోజూ వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయని, ఒరిగిన స్తంభాల వల్ల ఏ క్షణమైనా పెను ప్రమాదం జరిగే అవకాశం ఉందని స్థానికులు చెబుతున్నారు. ఎలాంటి ప్రాణనష్టం జరగకముందే విద్యుత్ శాఖ అధికారులు వెంటనే స్పందించి ఒరిగిన స్తంభాలను సరిచేయాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.1
- చిన్నకడబూరులో శివాలయ దేవాలయంకు వైభవంగా నూతన ధ్వజస్తంభం మహోత్సవం వేడుకలు పెద్దకడబూరు మండల పరిధిలోని చిన్నకడబూరు గ్రామంలో ఉన్న శ్రీ అంజినేయ స్వామి దేవాలయం పక్కన ఉన్న శివాలయ దేవాలయంకు నూతన ధ్వజస్తంభంను బుధవారం వైభవంగా జరిగింది.ఈ నూతన ద్వజస్థంభ ప్రతిష్ట మహోత్సవం కార్యక్రమం ధనుర్లగ్న శుభ ముహూర్తమున పండితులు వేద మంత్రాలు పఠిస్తుండంగా ఆలయ ధర్మకర్త గౌళ్ళ నల్లారెడ్డి ఆధ్వర్యంలో మరియు ఆలయ,గ్రామ పెద్దల సమక్షంలో అశేష భక్తవాహిణి నడుమ కన్నుల పండుగగా జరిగిందని ఆలయ ,కమిటీ పెద్దలు బుధవారం తెలిపారు.ప్రత్యేకంగా హోమం ద్వారా శివాలయ దేవాలయం నందు భ్రమరాంబిక,గణపతి,కుమారస్వామి, విగ్రహాలకు అలాగే ధ్వజస్తంభ ప్రతిష్టాపన ప్రత్యేక పూజలు నిర్వహించి ధ్వజస్తంభం ఏర్పాటు చేయడం జరిగింది.అనంతరం టీడీపీ రాష్ట్ర రైతు అధికార ప్రతినిధి నరవ రమాకాంత్ రెడ్డి ప్రత్యేకంగా స్వామివారిని దర్శించి ప్రత్యేక పూజలను గౌరవించారు.వేద పండితులు ధ్వజ స్తంభ ప్రతిష్టాపన మహోత్సవముకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.హోమం కాల్చిన అనంతరం శివాలయ దేవాలయముకు నూతనంగా ఏర్పాటు చేసిన నూతన ధ్వజ స్తంభ ప్రతిష్టాపనకు వచ్చిన భక్తాదులు ప్రత్యేక పూజలు గావించారు.ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ మీసేవ ఆంజనేయులు, మల్లికార్జున,ఆలయ పెద్దలు గౌళ్ళ నల్లారెడ్డి,తయాన్న,నారాయణస్వామి,ముత్తన్న,కోడిగుడ్ల లక్ష్మన్న, వీరారెడ్డి,ఎల్లన్న ,గిడ్డయ్య,సొసైటీ డైరెక్టర్ యం.జి నరసన్న,కోస్గి డైరెక్టర్ కలగట్ల లక్ష్మన్న,బుసిరెడ్డి, జనసేన నాయకులు మహదేవ, గ్రామ పెద్దలు,గ్రామ ప్రజలు,శివాలయం స్వామి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.2
- కేశంపేట మండల పరిధిలోని కాకునూరులో కలుపు మొక్కల నివారణకు చర్యలు కేశంపేట మండల పరిధిలోని కాకునూరు గ్రామంలో కలుపు మొక్కల నివారణకు పంచాయతీ సిబ్బంది చర్యలు చేపట్టారు. సర్పంచ్ బుడ్డ రాజు పిలుపు మేరకు సిబ్బంది గ్రామంలోని పలు ప్రాంతాల్లో పెరిగిన కలుపు మొక్కలకు మందులు పిచికారీ చేశారు. రోడ్ల వెంట, ఖాళీ ప్రదేశాలు, కాలనీల పరిసరాల్లో పెరిగిన పిచ్చి మొక్కలను తొలగిస్తూ గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు చర్యలు తీసుకున్నారు. వర్షాకాలంలో కలుపు మొక్కలు, పిచ్చి మొక్కలు అధికంగా పెరగడంతో దోమలు, ఇతర కీటకాలు వృద్ధి చెందే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. గ్రామ ప్రజలు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సర్పంచ్ బుడ్డ రాజు సూచించారు. పంచాయతీ సిబ్బంది చేపడుతున్న పారిశుద్ధ్య చర్యలకు ప్రజలు సహకరించాలని కోరారు.1
- మంత్రాలయం రాఘవేంద్ర స్వామి దర్శించుకున్న జిల్లా మంత్రులు - _*కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం పర్యటనలో సహచర మంత్రి గొట్టిపాటి రవి,కర్నూలు ఎంపీ బస్తి పాటి నాగరాజు,ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయ నాగేశ్వర్ రెడ్డి,గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి,కర్నూలు జిల్లా టిడిపి అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ,మంత్రాలయం ఇన్ చార్జ్ రాఘవేంద్ర రెడ్డి, మంత్రాలయం జనసేన పార్టీ ఇన్చార్జి లక్ష్మన్న,మరియు కూటమి పార్టీల నాయకులతో గురు రాఘవేంద్ర స్వామి దర్శనం చేసుకోవడం జరిగింది.*_ #NimmalaRamaNaidu #kurnoolcity #BvJayaNageshwaraReddy #APGovernment #NDA #leader #temples1
- *హైదరాబాద్- విజయవాడ హైవేపై ఘోర బస్సు ప్రమాదం.. ఐదుగురు మృతి* హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విజయవాడ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కోదాడ మండలం దుర్గాపురం స్టేజీ వద్ద కంటైనర్ డీసీఎంను వెనుక నుండి ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా, 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 42 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు.1