పార్నపల్లె గ్రామంలో వైభవంగా వాల్మీకి మహర్షి విగ్రహ ప్రతిష్ట బండి ఆత్మకూరు మండలం పార్నపల్లె గ్రామంలో ఆదివారం వాల్మీకి మహర్షి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం కన్నుల పండువగా జరిగింది. రామాయణ మహాకావ్యాన్ని లోకానికి అందించిన ఆదికవి వాల్మీకి మహర్షి నూతన శిలా విగ్రహాన్ని మహర్షి వాల్మీకి రిజర్వేషన్ ప్రజా సమితి రాష్ట్ర అధ్యక్షులు బోయపులి కొండన్న, బంగారయ్య, రాముడు ప్రత్యేక పూజలు చేసి ఆవిష్కరించారు. వాల్మీకి సంఘం నాయకులు, భక్తులు మహర్షికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మహర్షి వాల్మీకి రిజర్వేషన్ ప్రజా సమితి అధ్యక్షులు మొరళీ కృష్ణ, సభ్యులు కాంట్రాక్టర్ మహేశనాయుడు, రిటైర్డ్ డి ఈ శ్రీనివాసులు, మహర్షి వాల్మీకి రిజర్వేషన్ ప్రజా సమితి యువత విభాగం రాష్ట్ర సహాయ కార్యదర్శి శివానాగేంద్ర, టీచర్ వెంకటేశ్వర్లు, మండల మరియు గ్రామ ప్రజలు, నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
పార్నపల్లె గ్రామంలో వైభవంగా వాల్మీకి మహర్షి విగ్రహ ప్రతిష్ట బండి ఆత్మకూరు మండలం పార్నపల్లె గ్రామంలో ఆదివారం వాల్మీకి మహర్షి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం కన్నుల పండువగా జరిగింది. రామాయణ మహాకావ్యాన్ని లోకానికి అందించిన ఆదికవి వాల్మీకి మహర్షి నూతన శిలా విగ్రహాన్ని మహర్షి వాల్మీకి రిజర్వేషన్ ప్రజా సమితి రాష్ట్ర అధ్యక్షులు బోయపులి కొండన్న, బంగారయ్య, రాముడు ప్రత్యేక పూజలు చేసి ఆవిష్కరించారు. వాల్మీకి సంఘం నాయకులు, భక్తులు మహర్షికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మహర్షి వాల్మీకి రిజర్వేషన్ ప్రజా సమితి అధ్యక్షులు మొరళీ కృష్ణ, సభ్యులు కాంట్రాక్టర్ మహేశనాయుడు, రిటైర్డ్ డి ఈ శ్రీనివాసులు, మహర్షి వాల్మీకి రిజర్వేషన్ ప్రజా సమితి యువత విభాగం రాష్ట్ర సహాయ కార్యదర్శి శివానాగేంద్ర, టీచర్ వెంకటేశ్వర్లు, మండల మరియు గ్రామ ప్రజలు, నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
- పాణ్యం మండలంలో ఈదురు గాలుల వర్షం.. రోడ్డుకు అడ్డంగా విరిగిపడిన పురాతన చింతచెట్టు నంద్యాల జిల్లా పాణ్యం మండలం లో ఈదురు గాలుల వర్షం కురిసింది. దీంతో పాణ్యం నుండి బనగానపల్లె వెళ్లే దారిలో ఆలమూరు దగ్గర రోడ్డుకు అడ్డంగా పురాతన చింతచెట్టు విరిగిపడింది. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అధికారులు స్పందించి రోడ్డుకు అడ్డంగా ఉన్న చింత చెట్టును తొలగించాలని వాహనదారులు కోరారు.1
- అల్లూరు గ్రామంలో అభివృద్ధి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే నందికొట్కూరు మండలం అల్లూరు గ్రామంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించిన, నంద్యాల పార్లమెంట్ ఇన్చార్జి మాండ్ర శివానందరెడ్డి.. నందికొట్కూరు శాసనసభ్యులు గిత్త జయసూర్య.. ఈ సందర్భంగా మాండ్ర శివానందరెడ్డి ఎమ్మెల్యే గిత్త జయసూర్య మాట్లాడుతూ అల్లూరు గ్రామ అభివృద్ధికి (1) గ్రామ ప్రజల కలగా ఉన్న 24 గంటల నిరంతర కరెంటు సరఫరా కొరకు సబ్స్టేషన్ నిర్మాణం చేయుటకు 3 కోట్ల 90 లక్షలతో నూతన సబ్ స్టేషన్ నిర్మాణం చేపట్టి పూర్తిచేసి ఈరోజు గ్రామ ప్రజలకు అంకితం చేయడం జరిగింది అన్నారు. గ్రామపంచాయతీ 15వ ఆర్థిక సంఘం నిధులతో గ్రామంలో ప్రజలకు త్రాగునీటి సరఫరా కొరకు ఇన్ లైన్ క్లోరినేషన్ కొరకు 1,35,000, కొత్తగా ఒక మోటర్ కొనుగోలుకు 50,000 చేశామని అన్నారు మండల పరిషత్ నిధులతో కాలువలు నిర్మాణము మరియు కల్వర్టు కొరకు 10 లక్షల రూపాయల తో చేపట్టమని అన్నారు గ్రామపంచాయతీ నిధులతో ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకు రిపేరు కొరకు 6 లక్షలు తో చేపట్టమని అన్నారు. కొన్ని సంవత్సరాలుగా వేసినటువంటి పాత పైపులైను తీసివేసి కొత్తగా అల్లూరు గ్రామం మొత్తము జే ఐ పైప్ లైన్ కొరకు 81 లక్షలు రూపాయలు మరియు మండల పరిషత్ నిధులు 16 లక్షల రూపాయలతో చేపట్టడం జరిగిందని అన్నారు. ఇంకా గ్రామంలో తాగునీటి సరఫరా కొరకు జలజీవన్ మిషన్ కింద 63 .45 లక్షలు వినియోగిస్తూ ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకు మరియు పైప్లైన్ నిర్మాణం కొరకు కేటాయించడం జరిగింది అన్నారు. పల్లె పండుగ 1.o కింద 72 లక్షలు ఖర్చు చేస్తూ సిసి రోడ్ల నిర్మాణం చేపట్టడం జరిగింది అన్నారు పల్లె పండుగ 2.0 కింద ఒక కోటి 20 లక్షలు కేటాయించి సిసి రోడ్ల నిర్మాణం చేపట్టడం జరిగిందని అన్నారు అంగన్వాడి సెంటర్ 2 నిర్మాణం కొరకు 16 లక్షలు కేటాయించి పూర్తి చేయడం జరిగింది అన్నారు అంగన్వాడి సెంటర్ 3 నిర్మాణం కొరకు పది లక్షలు కేటాయించి పూర్తి చేయించడం జరిగింది అన్నారు R&B నిధులతో అల్లూరు నుంచి నందికొట్కూరు వరకు 40 లక్షల రూపాయలతో బీటీ రోడ్డు నిర్మాణం చేయించడం జరిగింది అన్నారు మొత్తం 4 కోట్ల 89 లక్షలు గ్రామ అభివృద్ధి కొరకు ఈ రెండు సంవత్సరములలో వినియోగించడం జరిగినది అన్నారు అనంతరం: 2005-06 సంవత్సరంలో అల్లూరు గ్రామ ప్రజలకు 81 మందికి ఐకెపి ఆధ్వర్యంలో గతంలో పొదుపు రుణం ద్వారా కొనుగోలు చేసిన భూమికి సంబంధించిన పట్టాలను ఎమ్మెల్యే గిత్త జయసూర్య మాండ్ర శివానందరెడ్డి బ్యాంకు రుణమును క్లియర్ చేసి సంబంధిత లబ్ధిదారులకు ఎకరా దాదాపుగా 15 లక్షల రూపాయల విలువ చేసే భూమికి సంబంధించిన పట్టాలను ఈరోజు 81 మందికి అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నందికొట్కూరు మండల కన్వీనర్ మాండ్ర సురేంద్రనాథ్ రెడ్డి మార్కెట్ యార్డ్ చైర్మన్ వీరం ప్రసాద్ రెడ్డి మరియు నందికొట్కూరు మండల నాయకులు కార్యకర్తలు నియోజకవర్గం లోని నాయకులు తెలుగుదేశం కుటుంబ సభ్యులు పాల్గొన్నారు1
- మే 11వ తేదీన ఒంగోలు ఎస్పీ కార్యాలయం మరియు మార్కాపురం ఎస్వీ కార్యాలయాలలో మీకోసం కార్యక్రమం ఒంగోలు, మార్కాపురం ఎస్పీ కార్యాలయాలలో మే 11 సోమవారం జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ఉదయం 11 గంటల వరకే నిర్వహించడం జరుగుతుందని ఉమ్మడి ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదివారం మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. ఉదయం 8 గంటల నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమై 11 గంటల లోపే ముగుస్తుంది అన్నారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎస్పీ తెలిపారు.1
- అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు సమాన వేతనం ఇవ్వాలి సంపత్ కుమార్ అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు హెచ్‌ఆర్సీ పాలసీ అమలు చేసి, సమాన పనికి సమాన వేతనం కల్పించాలని అవుట్‌సోర్సింగ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు సంపత్ కుమార్ డిమాండ్ చేశారు. ఆదివారం కర్నూలులోని రెవెన్యూ భవన్ లో నిర్వహించిన జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆర్టీసీలో పనిచేస్తున్న అవుట్‌సోర్సింగ్ సిబ్బందిని ఆబ్‌కాస్‌లో చేర్చకపోవడంతో తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం స్పందించి ఉద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరారు.1
- ఆంధ్రప్రదేశ్‌లో వీధి పేర్ల వివాదం మత విద్వేషాలకు దారితీస్తుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. మానవత్వాన్ని పెంపొందించాల్సిన మతాలు ఇలాంటి చిచ్చుకు కారణమవడం విచారకరం. ఈ సంఘటనలను అరికట్టాల్సిన పోలీసు వ్యవస్థ నిర్లక్ష్యంగా ఉందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.1
- నాగర్ కర్నూల్ లో ముంచెత్తిన వాన.. ముద్దయిన మొక్కజొన్న నెలికొండ మార్కెట్ యార్డులో మొక్కజొన్న రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. సాయంత్రం వేళ అకస్మాత్తుగా వాతావరణం చల్లబడి భారీ వర్షం కురవడంతో యార్డులో ఆరబోసిన పంట నీటిపాలైంది. ధాన్యం కొట్టుకుపోకుండా రైతులు ప్లాస్టిక్ కవర్లు కప్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. చేతికొచ్చిన పంట తడిసిపోవడంతో పెట్టుబడులు కూడా దక్కవని రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి, క్షేత్రస్థాయిలో నష్టాన్ని అంచనా వేసి తడిసిన ధాన్యాన్ని వెంటనే సేకరించాలని రైతాంగం కోరుతోంది1
- ప్రమాదవశాత్తు వరి కోత మిషన్ దగ్ధం అప్రమత్తమైనా చుట్టుపక్కల ప్రజలు జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలం సంకపురం స్టేజి సమీపంలో ఉన్న వెంచర్ లో ప్రమాదవశాత్తు వరి కోత మిషన్ దగ్ధం..1
- కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడిని అరెస్టు చేసి, మంత్రిని బర్తరఫ్ చేయాలని నంద్యాలలో సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు. తెలంగాణలోని నిజామాబాద్‌లో మైనర్ బాలికపై అత్యాచార యత్నం కేసులో సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ నిందితుడిగా ఉన్నాడు. ఈ విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఐ నాయకులు కోరారు.1