Shuru
Apke Nagar Ki App…
ఆంధ్రప్రదేశ్‌లోని గిరిజన ప్రాంతాలలో 699 మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రహదారులు, కమ్యూనికేషన్, తాగునీరు, కనెక్టివిటీ మెరుగుపడనున్నాయి. పర్యావరణ సమతుల్యతతో కూడిన అభివృద్ధి లక్ష్యంగా ఈ ప్రాజెక్టులు చేపడుతున్నారు.
JaiDesh Party
ఆంధ్రప్రదేశ్‌లోని గిరిజన ప్రాంతాలలో 699 మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రహదారులు, కమ్యూనికేషన్, తాగునీరు, కనెక్టివిటీ మెరుగుపడనున్నాయి. పర్యావరణ సమతుల్యతతో కూడిన అభివృద్ధి లక్ష్యంగా ఈ ప్రాజెక్టులు చేపడుతున్నారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- అరకు వెలిలో తీవ్ర గ్యాస్ కొరతను నిరసిస్తూ కాంగ్రెస్, సీపీఎం ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. నెలల తరబడి 2000కు పైగా బుకింగ్స్ పెండింగ్‌లో ఉండటంతో గిరిజన మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పీసీసీ నేత పి.చిన్నస్వామి మండిపడ్డారు. తక్షణమే స్థానికంగా గ్యాస్ గోడౌన్ ఏర్పాటు చేసి, సరఫరాను పునరుద్ధరించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.1
- ప్రామాణీకరణ సమస్యను ఎదుర్కొంటారుపేస్ అథర్టికేషన్ ప్రాబ్లం పేస్ అథర్టికేషన్ ప్రాబ్లం1
- గిరిజన ప్రజలకు తక్షణమే గ్యాస్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్‌లో నిరసన చేపట్టారు. రాష్ట్రంలో గ్యాస్ కొరత లేదని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, గత రెండు వారాలుగా అరకు వెలి మండలంతో సహా గిరిజన ప్రాంతాల్లో గ్యాస్ అందక మహిళలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కాంగ్రెస్, సీపీఎం నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు.1
- సంతకవిటి : ప్రభుత్వ పాఠశాలలో చేరికలకు ఎమ్మెల్యే ప్రోత్సాహం విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం సంతకవిటి మండలం మండవ కురిటి లో ఆదివారం ప్రైవేట్ పాఠశాల నుంచి సుమారు 18 మంది విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో ఎమ్మెల్యే కొండ్రు మురళి మోహన్ ఆధ్వర్యంలో చేర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య, మెరుగైన సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి వారి భవిష్యత్తుకు బాటలు వేయాలని పిలుపునిచ్చారు. ఆయనతో పాటు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.1
- హెలిప్యాడ్ స్థల పరిశీలన.జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, నరసన్న పేట, మే 10: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 16 వ తేదీన జిల్లా పర్యటనకు రానున్న నేపథ్యంలో నరసన్న పేట సమీపంలోని జమ్మూ, తమరా పల్లి ప్రాంతాల వద్ద ప్రతిపాదిత స్థలాలను జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, అధికారులతో కలిసి ఆదివారం పరిశీలించారు. హెలిప్యాడ్ స్థల అనుకూలతలపై అధికారులతో చర్చించారు. హెలిప్యాడ్ స్థల విస్తీర్ణం మ్యాప్ ద్వారా నిశితంగా పరిశీలించారు, వాహనాల పార్కింగ్, వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తకుండా వాహనాలకు ప్రత్యామ్నాయ మార్గం, తదితర అంశాలపై అధికారులకు సూచనలు చేశారు. హెలిప్యాడ్ స్థల మైదానాన్ని చదును, శుభ్రపరచే పనులు త్వరితగతిన పూర్తి చేసి సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ రెవిన్యూ డివిజనల్ అధికారి వేణుగోపాలరావు, రహదారులు, భవనాల శాఖ ఇంజనీరింగ్ అధికారి తిరుపతిరావు, తాసిల్దార్ సత్యనారాయణ, డి.ఎస్.పి లక్ష్మణరావు, సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, సబ్ ఇన్స్పెక్టర్లు గణేష్, రంజిత్, తదితరులు, పాల్గొన్నారు.4
- హైదరాబాద్‌లోని ఓ గుడిలో వందల కేజీల బరువున్న గంటను ఓ బామ్మ సులువుగా మోగించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆమె అసాధారణ శక్తిని చూసి ఆలయ సందర్శకులు, భక్తులు షాకయ్యారు. ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.1
- రంపచోడవరం రేలా ఉత్సవాలకు అడివి వెంకన్నగూడెం గ్రామస్తుల సన్నద్ధత రంపచోడవరంలో ఈ నెల 24, 25, 26 తేదీలలో ఘనంగా జరగనున్న ఆదివాసీ రేలా ఉత్సవాలను పురస్కరించుకుని అల్లూరి సీతారామరాజు జిల్లా వి.ఆర్.పురం మండలం అడివి వెంకన్నగూడెం గ్రామస్తులు ఉత్సాహంగా సన్నద్ధమవుతున్నారు. ఈ వేడుకల్లో తమ సంప్రదాయ రేలా నృత్యాన్ని ప్రదర్శించేందుకు సిద్ధమైన గ్రామస్తులు, ఆదివారం గ్రామంలో ప్రత్యేక ప్రదర్శన నిర్వహించి సందడి చేశారు. అనంతరం 24న నిర్వహించే 'చలో రంపచోడవరం' కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ భారీగా నినాదాలు చేశారు. గిరిజన సంస్కృతిని చాటిచెప్పే ఈ ఉత్సవాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని వారు పిలుపునిచ్చారు.1
- ఆంధ్రప్రదేశ్‌లోని అనంతగిరి మండలం అమలకుడియా గ్రామ గిరిజనులు కనీస సౌకర్యాల కోసం వినూత్నంగా ఆందోళన చేపట్టారు. పర్యాటక ప్రాంతమైన అనంతగిరికి సమీపంలో ఉన్నప్పటికీ, తమ గ్రామానికి రోడ్డు లేకపోవడంతో అనారోగ్యంతో ఉన్నవారిని దాదాపు రెండు కిలోమీటర్లు మోసుకెళ్లాల్సి వస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో వేసిన రహదారి కూడా ప్రస్తుతం ప్రయాణానికి అనుకూలంగా లేదు.1