పౌర సేవలపై ప్రజల్లో సంతృప్తి పెంచాలి కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ శ్రీకాకుళం, జనవరి 8: ప్రభుత్వ పథకాలు, పౌర సేవలపై ప్రజల్లో సానుకూల దృక్పథం పెరిగేలా అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు. గురువారం సాయంత్రం రాష్ట్ర సచివాలయం నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్‌తో కలిసి పాల్గొన్నారు. అనంతరం జిల్లా అధికారులతో జరిగిన సమీక్షలో కలెక్టర్ మాట్లాడుతూ దీపం పథకం, ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు, ఆర్టీసీ, పౌరసరఫరాలు, రిజిస్ట్రేషన్ల వంటి కీలక విభాగాల్లో సేవలు మరింత మెరుగుపడాలని, అప్పుడే రాష్ట్ర స్థాయిలో జిల్లాకు మరింత మెరుగైన ర్యాంకింగ్ లభిస్తుందని స్పష్టం చేశారు. గ్రామ, వార్డు సచివాలయాల పనితీరును జీఎస్‌డబ్ల్యూఎస్ కోఆర్డినేటర్లు నిరంతరం తనిఖీ చేయాలని సూచించారు. నియోజకవర్గానికి ఒక ఎంఎస్‌ఎంఈ పార్కు స్థాపన, స్వర్ణాంధ్ర - స్వచ్ఛ ఆంధ్ర లక్ష్యాల సాధనలో యంత్రాంగం వేగంగా కదలాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎస్వీ లక్ష్మణమూర్తి, సీపీఓ ప్రసన్న లక్ష్మీ, పలువురు జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.
పౌర సేవలపై ప్రజల్లో సంతృప్తి పెంచాలి కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ శ్రీకాకుళం, జనవరి 8: ప్రభుత్వ పథకాలు, పౌర సేవలపై ప్రజల్లో సానుకూల దృక్పథం పెరిగేలా అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు. గురువారం సాయంత్రం రాష్ట్ర సచివాలయం
నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్‌తో కలిసి పాల్గొన్నారు. అనంతరం జిల్లా అధికారులతో జరిగిన సమీక్షలో కలెక్టర్ మాట్లాడుతూ దీపం పథకం, ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు, ఆర్టీసీ,
పౌరసరఫరాలు, రిజిస్ట్రేషన్ల వంటి కీలక విభాగాల్లో సేవలు మరింత మెరుగుపడాలని, అప్పుడే రాష్ట్ర స్థాయిలో జిల్లాకు మరింత మెరుగైన ర్యాంకింగ్ లభిస్తుందని స్పష్టం చేశారు. గ్రామ, వార్డు సచివాలయాల పనితీరును జీఎస్‌డబ్ల్యూఎస్ కోఆర్డినేటర్లు నిరంతరం తనిఖీ చేయాలని సూచించారు. నియోజకవర్గానికి ఒక ఎంఎస్‌ఎంఈ
పార్కు స్థాపన, స్వర్ణాంధ్ర - స్వచ్ఛ ఆంధ్ర లక్ష్యాల సాధనలో యంత్రాంగం వేగంగా కదలాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎస్వీ లక్ష్మణమూర్తి, సీపీఓ ప్రసన్న లక్ష్మీ, పలువురు జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.
- నరసన్నపేట: సంక్రాంతికి ఊరెళితే సమాచారం ఇవ్వండి.. సీఐ సంక్రాంతి పండుగ సందర్భంగా ఎవరైనా తమ ఊర్లకు వెళ్లేవారు తప్పనిసరిగా సమీప పోలీస్ స్టేషన్లో సమాచారం అందించాలని నరసన్నపేట సీఐ ఎం శ్రీనివాసరావు సూచించారు. శుక్రవారం ఆయన కార్యాలయంలో మాట్లాడుతూ, ప్రయాణాల సమయంలో ఇళ్లల్లోని విలువైన వస్తువులు, బంగారు ఆభరణాలను లాకర్లలో భద్రపరచుకోవాలని తెలిపారు. ముందుగా సమాచారం ఇస్తే, ఆయా గృహాలపై ప్రత్యేక నిఘా ఉంచడం ద్వారా భద్రత కల్పించబడుతుందని, దీనిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.1
- సంతబొమ్మాళి, జనవరి 9,సంతబొమ్మాళి మండలం బోరుభద్ర, దండుగోపాలపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయు లు ఆధ్వర్యంలో శుక్రవారం భోగి, సంక్రాంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. పాఠశాలలో విద్యార్థులు ఉపాధ్యా యులు సంప్రదాయ దుస్తుల్లో అలరించారు. డూడూ బసవన్నలు ఆకర్షణగా నిలిచాయి. విద్యార్థులకు ముగ్గుల పోటీలు, గాలిపటాల పోటీ, స్లో సైక్లింగ్ తదితర ఆటలు నిర్వహించారు. విద్యార్థులు పలు సాంస్కృతిక పాటలకు డాన్స్లు వేశారు. హరిదాసు,సంక్రాంతి గొబ్బెమ్మలు, కోలాటం సాంప్రదాయ నృత్యాలు నిర్వహించారు సాంప్రదాయ వంటలు వాళ్లు విషయాలపై సాంస్కృతికంగా తెలిపారు.4
- శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం సంతబొమ్మాలి మండలం దండు గోపాలపురం జిల్లాపరిషత్ ఉన్నతపాఠశాల నందు సంక్రాంతి సంబరాలు విద్యార్థులు ఉపాధ్యాయులు ఉత్సాహముతో నిర్వహించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు తెలుగు సాంప్రదాయ దుస్తులు ధరించి, పాటశాల అవరణంతా మామిడి తోరణాలతో, రంగు రంగుల రంగవల్లికలు తో తీర్చిదిద్దారు. విద్యార్థులు వేసిన హరిదాసు, జంగమయ్య, సోదమ్మ వేషాలు అందరినీ ఆకట్టుకున్నాయి. చెరకుగడలతో, క్రొత్తకుండలో పాలు పొంగించిడము, గొబ్బెమ్మలు, భోగి మంటలతో కోలాహలంగా పండుగ వాావరణాన్ని నెలకొల్పారు. కార్యక్రమానికి మండల విద్యాధికారులు చిన్నవాడు, అర్జునుడు ముఖ్య అతిథిలుగా హాజరయ్యారు.1
- సీఎం సహాయనిధిని సద్వినియోగం చేసుకోండి ఎమ్మెల్యే ఎంజీఆర్. ముఖ్యమంత్రి సహాయ నిధిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు స్పష్టం చేసారు. ఈ మేరకు గురువారం నియోజకవర్గ పరిధి కొత్తూరు మండలంలో గల బలద గ్రామానికి చెందిన బెహర శంకరరావు మేడపై నుండి జారీ పడిపోవడంతో రెండు కాళ్ళు విరిగి ఇటీవల ఆపరేషన్ చేయించుకున్నారు వైద్య ఖర్చుల నిమిత్తం కుటుంబ సభ్యులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ స్థానిక నాయుకులు ద్వారా ఎమ్మెల్యే మామిడి గోవిందరావు వద్ద వివరించారు. దీంతో ఎమ్మెల్యే మామిడి గోవిందరావు స్పందిస్తూముఖ్యమంత్రి సహాయానిదికి దరఖాస్తు చేపించి ఆర్థిక సహాయం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 80,916/- రూపాయిలు చెక్ ను గురువారం అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆపదలో ఉన్నవారికి, సకాలంలో చికిత్స కోసం అందిస్తున్న నిధులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. వివిధ రకాల వ్యాధులకు వైద్యం చేయించుకునే ఆర్థికస్థోమత లేక ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఉదారంగా ఆర్థిక సాయం అందించి అండగా నిలుస్తున్న ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని తెలియజేశారు. పార్టీలకు అతీతంగా కేవల ౦ అర్హతే ఆధారంగా నిధులు అందిస్తున్నారు. అలాగే ఈ నియో జక వర్గంలో గత పాలకులు ఏరోజైనా సీఎం సహాయనిది కోసం ఒక్క దరఖాస్తు అయిన చేయలేదని నియోజకవర్గ ప్రజలకు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు ,కుటుంబ సభ్యులు ఉన్నారు.2
- 'మా గ్రామాలకు కనీస సదుపాయాలు లేవు. విద్యుత్ సౌక ర్యం లేక పాముల భయం వెంటాడుతోంది. పిల్లలు చదువుకు దూర మవుతున్నారు. మా గ్రామాలను చూసి ఆదుకోవాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణికి విన్నవించాం. ఏళ్లు గడుస్తున్నా మా కష్టాలు తొలగించేవారే కరువయ్యారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ స్పందిం చాలి. మా గిరిజన గ్రామాలకు సదుపాయాలు కల్పించాలి. లేదంటే మా అందరికీ చావే శరణ్యం' అంటూ విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం గోపాలరాయుడుపేట పంచాయతీ పరిధిలోని కృపావ లస, రమణ వలస, దీవెనవలస, సియోను వలస, చిన్నాకినవలస గిరిజన గ్రామాల ప్రజలు వేడుకున్నారు. వీరంతా కర్రలతో పందిరి నిర్మించి.. ఆ పందిరికి ఉరితాళ్లు అమర్చి.. తమ మెడలకు బిగించు కుని సామూహికంగా ఇలా నిరసన తెలిపారు. తమ సమస్యలను పరిష్కరించాలని ఆదివాసీ తెగ సంఘ నాయకుడు తుమ్మిక అప్పల రాజు దొర సర్కారుకు విజ్ఞప్తి చేశారు.1
- फिल्मी हीरो बनने की सनक: युवती को इंप्रेस करने के लिए रची नकली एक्सीडेंट की साजिश, दो युवक गिरफ्तार1
- 🙏🙏1
- भारत सरकार ने 100 mg से ज्यादा डोज वाली निमेसुलाइड दवाओं पर रोक लगा दी है। यह पेनकिलर और एंटी‑इंफ्लेमेटरी दवा आमतौर पर बुखार, सिरदर्द और बदन दर्द में ली जाती थी, लेकिन ज्यादा मात्रा में लेने से लिवर और किडनी को नुकसान पहुंच सकता है। स्वास्थ्य मंत्रालय और डॉक्टरों ने बिना सलाह दवा लेने से बचने और बच्चों को यह दवा न देने की चेतावनी दी है।1