ఫ్రెండ్స్ సహారా సొసైటీ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం... మీలాద్ ఉన్ నబీ పండుగను పురస్కరించుకుని తాడిపత్రి పట్టణ పరిధిలోని హజరత్ సిద్ధిఖ్ భాషా దర్గా వద్ద ఫ్రెండ్స్ సహారా సొసైటీ ఆధ్వర్యంలో అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రి రక్తనిధి కేంద్రం సహకారంతో బుధవారం మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు.కార్యక్రమానికి తాడిపత్రి పట్టణ ప్రభుత్వ ఖాజీ సయ్యద్ హయ్యద్ బాషా ఖాద్రి ముఖ్యఅతిథిగా హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఫ్రెండ్స్ సహారా సొసైటీ సభ్యులు ఖాజీని శాలువాతో సత్కరించారు. రక్తదాతలకు ధ్రువపత్రాలను అందజేశారు. శిబిరానికి విశేష స్పందన లభించగా, కులమతాలకు అతీతంగా 135 మంది స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. అనంతరం రోడ్డుపై జీవనం సాగిస్తున్న అభాగ్యులు, వృద్ధులు సుమారు 100 మందికి అన్నదానం చేశారు.రక్తదానం చేయడం ద్వారా ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడవచ్చని సొసైటీ సభ్యులు తెలిపారు. ముఖ్యంగా గర్భిణులు, తలసేమియా, సికిల్ సెల్ అనీమియా, హిమోఫీలియా బాధితులకు నిరంతరం రక్తం అవసరమవుతుందని, రక్తదాన శిబిరాల ద్వారా రక్తం అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్ సహారా సొసైటీ సభ్యులు కరీముల్లా, అలీ, షోహేబ్, అజీమ్, జిలాన్, జాఫర్, జావిద్, పిట్టి, ఖాజా, అక్మల్‌తో పాటు మతపెద్దలు, కే.జీ.ఎన్ పవర్ టూల్స్ రఫీ, దాదా, దాదు రిహాన్, చాంద్ భాషా, జిలాన్, వలి, మహబూబ్ బాషా, అబ్దుల్, ఎన్.ఏ.కే జిలాన్, మహమ్మద్ అలీ, బషీర్, జిల్లా వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు..

- *మధ్యప్రదేశ్:**4 కాళ్లు, 4 చేతులతో జన్మించిన* *మగ శిశువు...* లవ్‌ఖుష్‌నగర్‌లో అరుదైన ఘటన చోటుచేసుకుంది.ఓ మహిళకు 4 కాళ్లు, 4 చేతులతో మగశిశువు జన్మించాడు.అదనపు అవయవాలు శిశువు ఛాతీకి అనుసంధానమై ఉన్నట్లు వైద్యులు తెలిపారు. వాటి బ్లడ్ సర్క్యులేషన్, ఎముకల అనుసంధానంపై పరీక్షలు నిర్వహించిన తర్వాత తొలగింపుపై నిర్ణయం తీసుకోనున్నారు. జన్యుపరమైన కారణాల వల్లే ఇలా జరిగి ఉండొచ్చని వైద్యులు భావిస్తున్నారు. ప్రస్తుతం శిశువును ఎయిర్ అంబులెన్స్‌లో జబల్‌పూర్‌కు తరలించారు...1
- మహమ్మద్ ప్రవక్త గారి జన్మదినo సందర్భంగా కదిరి పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించిన ముస్లిం సోదరులు సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలో మహమ్మద్ ప్రవక్త గారి జన్మదినo ముస్లిం సోదరులు ఘనంగా ర్యాలీ జరుపుకున్నారు.ఈ ర్యాలీ మదనపల్లిరోడ్ లో వెలిసిన నానదర్గ నుండి ప్రారంభించి కాలేజీసర్కిల్ ,టవర్ క్లాక్, మున్సిపల్ ఆఫీస్ మీదగా తిరిగి నానదర్గ వరకు కొనసాగుతుంది. ముస్లింలు ఈ ర్యాలీ జరుపుకుంటున్నా సందర్బంగా పట్టణంలో ఎలాంటి ట్రాఫిక్ సమస్యలకు ఆటంకం కలగకుండా సూచనలుఇస్తూ పట్టణ పోలీసు సిబ్బంది సహకారంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసుసిబ్బంది తగు చర్యలు తీసుకొని ప్రజలకు సహకరించినందుకు ముస్లిం మత పెద్దలు పోలీసుసిబ్బంది కి ధన్యవాదాలు తెలిపారు.1
- ବିଜେପି କେତେ ନୀଳଜା ଅଛି1
- ఫ్రెండ్స్ మా చిన్నబాబు వివేకనంద ఈరోజు బర్త్డే ఫ్రెండ్స్ మీ అందరి ఆశీస్సులు కావాలని కోరుతున్నాను1
- పోలీసులపై అసత్య ఆరోపణలు: నందికొట్కూరు రూరల్ సీఐ సుబ్రహ్మణ్యం బ్రాహ్మణ కొట్కూరు పీఎస్ పరిధిలో జరిగిన ట్రాన్స్ఫార్మర్ దొంగతనం కేసులో ముద్దాయిలపై ఎలాంటి చిత్రహింసలకు పాల్పడలేదని సీఐ సుబ్రహ్మణ్యం స్పష్టం చేశారు. విచారణ నుంచి తప్పించుకునేందుకు నిందితులు స్వయంగా గాయాలు చేసుకొని నందికొట్కూరు సీహెచ్‌సీ వద్ద మీడియా ముందు పోలీసులపై అసత్య ప్రచారం చేస్తున్నారని తెలిపారు. అవసరమైనప్పుడు విచారణకు మళ్లీ హాజరు కావాలని సూచించినట్లు ఆయన వెల్లడించారు.1
- శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం నిర్మాణం కొరకు భూమి పూజ బండి ఆత్మకూరు మండలం జి. సీ. పాలెం గ్రామం నందు శ్రీవాణి ట్రస్ట్ ధ్వరా శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి కి దేవాలయం పూజ మరియు శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది . ఈ దేవాలయం నిర్మాణానికి రూ. 40 లక్షలు, అనుమతులు మంజూరు చేయించినటువంటి శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి గారికి గ్రామం తరపున ధన్యవాదములు తెలపడం జరిగింది. ఈ కార్యక్రమములో కంచెర్ల లింగారెడ్డి, సుబ్బయ్య, మోహనరావు, గోపాల్, వై రమణ, ప్రసాద్, వై శ్రీను, శివుడు, లక్ష్మీ రెడ్డి, సుబ్బారెడ్డి మరియు గ్రామ ప్రజలు భక్తి శ్రద్ధలతో అందరు పాల్గొని పూజా కార్యక్రమాన్ని జయప్రదం చేసినారు.1
- విద్యార్థులతో కిక్కిరిసిన ఆటోను గమనించిన టీడీపీ ఇంచార్జి వైకుంఠం జ్యోతి విద్యార్థులతో కిక్కిరిసిన ఆటోను గమనించిన టీడీపీ ఇంచార్జి వైకుంఠం జ్యోతి విద్యార్థుల భద్రత విషయంలో నిర్లక్ష్యం వద్దని ఆటో డ్రైవర్‌కు హెచ్చరిక ఆలూరు, ఆగస్టు 25: విద్యార్థుల భద్రత పట్ల ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని ఆలూరు నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి వైకుంఠం జ్యోతి సూచించారు. ఆదోని నుంచి ఆలూరు వైపు వెళ్తున్న సమయంలో పాఠశాల విద్యార్థులను పరిమితికి మించి ఆటోలో ఎక్కించుకుని తీసుకెళ్తున్న దృశ్యాన్ని ఆమె గమనించారు. విద్యార్థులు ఆటోలో కిక్కిరిసి ప్రయాణిస్తున్న పరిస్థితిని చూసిన వైకుంఠం జ్యోతి వెంటనే ఆటోను ఆపించి డ్రైవర్‌తో మాట్లాడారు. చిన్నారులను ప్రమాదకర పరిస్థితుల్లో ప్రయాణింపజేయడం సరికాదని, అధిక సంఖ్యలో విద్యార్థులను ఆటోలో ఎక్కించుకుని వెళ్లడం వల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉందని ఆమె డ్రైవర్‌కు వివరించారు. ఇకపై ఇలాంటి ఘటన పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆటో డ్రైవర్‌ను ఆమె హెచ్చరించారు. పిల్లలను పాఠశాలకు తీసుకెళ్లే వాహనాల విషయంలో డ్రైవర్లు, పాఠశాల యాజమాన్యాలు, తల్లిదండ్రులు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు. విద్యార్థులను తరలించే వాహనాల్లో అధిక సంఖ్యలో పిల్లలను ఎక్కించకుండా, వాహన సామర్థ్యానికి అనుగుణంగా మాత్రమే ప్రయాణించేలా చర్యలు తీసుకోవాలి. పాఠశాల విద్యార్థుల రవాణా విషయంలో సంబంధిత అధికారులు కూడా ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించి నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. పిల్లల ప్రాణాలకు సంబంధించిన అంశంలో చిన్నపాటి నిర్లక్ష్యం కూడా తీవ్ర పరిణామాలకు దారితీయవచ్చని, అందువల్ల విద్యార్థుల రవాణాలో భద్రతే మొదటి ప్రాధాన్యత కావాలని వైకుంఠం జ్యోతి సూచించారు. “విద్యార్థుల భద్రత విషయంలో రాజీ పడకూడదు. ఇలాంటి పరిస్థితులు మరోసారి కనిపించకుండా డ్రైవర్లు బాధ్యతగా వ్యవహరించాలి” అని ఆమె స్పష్టం చేశారు.2
- *బస్సు-కంటైనర్ - "ఢీ"* *6గురు మృతి* *20 మందికి తీవ్ర గాయాలు* *దొరకుంట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం* రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మహిళలు సహా ఆరుగురు మృతి *ఏలూరు వెళ్తున్న* బస్సుకు ఘోర ప్రమాదం..దొరకుంట శివారులో బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి ఏలూరు వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఆగి ఉన్న కంటైనర్ లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ఐదుగురు మహిళలు, ఒక పురుషుడు ఉన్నారు. ప్రమాద సమయంలో బస్సులో 42 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. మరో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే కోదాడ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనాస్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.2