logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

*విద్యార్థుల సంక్షేమానికి స్ఫూర్తి ఫౌండేషన్ చేయూత* కల్లూరు, స్థానిక కల్లూరు మున్సిపాలిటీ పరిధిలోని 15 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలతో పాటు పెనుబల్లి మండలంలోని వీఎం బంజర్, టేకులపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలకు స్ఫూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో మొత్తం 750 స్టీల్ ప్లేట్లను శనివారం పంపిణీ చేశారు. విద్యార్థులు మధ్యాహ్న భోజనాన్ని పరిశుభ్రంగా, సౌకర్యవంతంగా తీసుకునేందుకు ఈ ప్లేట్లను అందజేసినట్లు ఫౌండేషన్ ప్రతినిధులు తెలిపారు. మొత్తం 17 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయుల కు స్ఫూర్తి ఫౌండేషన్ కల్లూరు కమిటీ సభ్యులు ప్లేట్లను అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల అవసరాలను గుర్తించి దాతల సహకారంతో ప్లేట్లను అందించిన స్ఫూర్తి ఫౌండేషన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఇటువంటి సేవా కార్యక్రమాలు విద్యార్థుల్లో పరిశుభ్రత అలవాట్లను పెంపొందించడంతో పాటు ప్రభుత్వ పాఠశాలలకు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. స్ఫూర్తి ఫౌండేషన్ సభ్యులు మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి, విద్యార్థుల సంక్షేమం కోసం దాతల సహకారంతో ఇలాంటి సేవా కార్యక్రమాలను భవిష్యత్తులోనూ కొనసాగిస్తామని తెలిపారు.

1 hr ago
user_Ramprasad islavath
Ramprasad islavath
Taxi Driver కల్లూరు, ఖమ్మం, తెలంగాణ•
1 hr ago
a39cbd57-af61-4892-b2b3-d8214ca87a46

*విద్యార్థుల సంక్షేమానికి స్ఫూర్తి ఫౌండేషన్ చేయూత* కల్లూరు, స్థానిక కల్లూరు మున్సిపాలిటీ పరిధిలోని 15 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలతో పాటు పెనుబల్లి మండలంలోని వీఎం బంజర్, టేకులపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలకు స్ఫూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో మొత్తం 750 స్టీల్ ప్లేట్లను శనివారం పంపిణీ చేశారు. విద్యార్థులు మధ్యాహ్న భోజనాన్ని పరిశుభ్రంగా, సౌకర్యవంతంగా తీసుకునేందుకు ఈ ప్లేట్లను అందజేసినట్లు ఫౌండేషన్ ప్రతినిధులు తెలిపారు. మొత్తం 17 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయుల కు స్ఫూర్తి ఫౌండేషన్ కల్లూరు కమిటీ సభ్యులు ప్లేట్లను అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల అవసరాలను గుర్తించి దాతల సహకారంతో ప్లేట్లను అందించిన స్ఫూర్తి ఫౌండేషన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఇటువంటి సేవా కార్యక్రమాలు విద్యార్థుల్లో పరిశుభ్రత అలవాట్లను పెంపొందించడంతో పాటు ప్రభుత్వ పాఠశాలలకు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. స్ఫూర్తి ఫౌండేషన్ సభ్యులు మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి, విద్యార్థుల సంక్షేమం కోసం దాతల సహకారంతో ఇలాంటి సేవా కార్యక్రమాలను భవిష్యత్తులోనూ కొనసాగిస్తామని తెలిపారు.

More news from తెలంగాణ and nearby areas
  • వికలాంగులకు వీల్‌చైర్ల పంపిణీ చేసిన ఎస్ ఐ వెంకటేష్...... ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం రంగారావు బంజరు గ్రామంలో జోనేబోయిన చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ముగ్గురు వికలాంగులకు వీల్‌చైర్లు పంపిణీ చేశారు. ఈ సేవా కార్యక్రమాన్ని వి.ఎం. బంజరు ఎస్‌ఐ వెంకటేష్ అభినందించారు.
    1
    వికలాంగులకు వీల్‌చైర్ల పంపిణీ చేసిన ఎస్ ఐ వెంకటేష్......

ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం రంగారావు బంజరు గ్రామంలో జోనేబోయిన చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ముగ్గురు వికలాంగులకు వీల్‌చైర్లు పంపిణీ చేశారు. ఈ సేవా కార్యక్రమాన్ని వి.ఎం. బంజరు ఎస్‌ఐ వెంకటేష్ అభినందించారు.
    user_Tharun
    Tharun
    Local News Reporter సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    16 hrs ago
  • భారీ పెట్టుబడి మోసం కేసును ఛేదించిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు ప్రధాన నిందితుడి అరెస్టు.. నేరార్జిత ఆస్తులుగా గుర్తించిన 35 వాహనాలు స్వాధీనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి పోలీస్ స్టేషన్‌లో నమోదైన క్రైమ్ నెం.134/2026 కేసులో ప్రధాన నిందితుడు బేతంపూడి భరత్ కుమార్‌ను అరెస్టు చేసి, అతని వద్ద నుంచి నేరార్జిత ఆస్తులుగా భావిస్తున్న 35 వాహనాలు, ఇతర చరాస్తులను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ ఆదేశాల మేరకు కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ వివరాలను వెల్లడించడం జరిగింది. భార్పాటీ శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా, నిందితుడు తాను భద్రాచలం ఐటీసీ పేపర్ బోర్డ్స్‌లో లేబర్ కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్నానని, తనతో భాగస్వామిగా ఉంటే కాంట్రాక్ట్ పనులు ఇప్పించి అధిక లాభాలు అందిస్తానని నమ్మబలికి పలువురు బాధితుల నుంచి సుమారు రూ.52 కోట్ల మేర పెట్టుబడుల పేరుతో మోసపూరితంగా డబ్బులు సేకరించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. బాధితుల విశ్వాసాన్ని పొందేందుకు నకిలీ భాగస్వామ్య ఒప్పందాలు, తప్పుడు పత్రాలు రూపొందించి, లాభాల్లో 4 శాతం వాటా ఇస్తామని హామీలు ఇచ్చి మోసానికి పాల్పడినట్లు విచారణలో తేలిందని తెలిపారు. అలాగే బీకే నాయుడు అండ్ కో., రాజేశ్వరి ట్రావెల్స్ పేర్లతో సంస్థలను నిర్వహిస్తూ ఈ మోసపూరిత కార్యకలాపాలు సాగించినట్లు గుర్తించినట్లు వెల్లడించారు. సాంకేతిక ఆధారాలు, ఆర్థిక లావాదేవీల విశ్లేషణ ఆధారంగా నిందితుడిని కేరళ రాష్ట్రంలోని పాలా ప్రాంతంలో అరెస్టు చేసి, ట్రాన్సిట్ వారెంట్‌పై జిల్లాకు తీసుకువచ్చి పోలీసు కస్టడీలో విచారించినట్లు తెలిపారు. విచారణలో భాగంగా నేరార్జిత ఆస్తులుగా భావిస్తున్న 6 బస్సులు, ఒక వాటర్ ట్యాంకర్ లారీ, 3 ట్రాక్టర్లు, 2 వ్యవసాయ పరికరాలు, 7 కార్లు, 14 ద్విచక్ర వాహనాలు, 2 ట్రైలర్లు కలిపి మొత్తం 35 వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అదేవిధంగా బాధితుల నుంచి మోసపూరితంగా సేకరించిన డబ్బుతో భద్రాచలంలోని రాజీవ్‌నగర్ కాలనీలో ఒక మూడు అంతస్తుల భవనం, ఒక ప్లాట్ కొనుగోలు చేసినట్లు గుర్తించినట్లు తెలిపారు. ఈ కేసులో ఆర్థిక లావాదేవీలు, బ్యాంకు ఖాతాలు, సంబంధిత పత్రాల పరిశీలన కొనసాగుతోందని తెలిపారు. మరిన్ని బాధితులను గుర్తించడం, నేరార్జిత ఆస్తులను గుర్తించి స్వాధీనం చేసుకోవడం, పూర్తి మనీ ట్రైల్‌ను వెలికితీసే దిశగా దర్యాప్తు కొనసాగుతోందన్నారు. అధిక లాభాలు వస్తాయని, తక్కువ సమయంలో పెట్టుబడికి రెట్టింపు లేదా భారీ రాబడులు వస్తాయని చెప్పే వ్యక్తులు లేదా సంస్థలను గుడ్డిగా నమ్మి డబ్బులు పెట్టవద్దని ప్రజలకు సూచించారు. ఆకర్షణీయమైన హామీలు, నకిలీ పత్రాలు, తప్పుడు ఒప్పందాలతో మోసగాళ్లు ప్రజలను మభ్యపెడుతున్నందున ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని కోరారు. అనుమానాస్పద పెట్టుబడి పథకాలపై సమాచారం తెలిసినా లేదా మోసానికి గురైనా వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు. ప్రజల అప్రమత్తతతోనే ఇటువంటి ఆర్థిక నేరాలను సమర్థవంతంగా అరికట్టవచ్చని తెలిపారు. ఈ కేసును ఛేదించడంలో కృషి చేసిన లక్ష్మీదేవిపల్లి పోలీసు సిబ్బందిని, జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులను జిల్లా ఎస్పీ రోహిత్ రాజు అభినందించారు .
    1
    భారీ పెట్టుబడి మోసం కేసును ఛేదించిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు
ప్రధాన నిందితుడి అరెస్టు.. నేరార్జిత ఆస్తులుగా గుర్తించిన 35 వాహనాలు స్వాధీనం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి పోలీస్ స్టేషన్‌లో నమోదైన క్రైమ్ నెం.134/2026 కేసులో ప్రధాన నిందితుడు బేతంపూడి భరత్ కుమార్‌ను అరెస్టు చేసి, అతని వద్ద నుంచి నేరార్జిత ఆస్తులుగా భావిస్తున్న 35 వాహనాలు, ఇతర చరాస్తులను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ ఆదేశాల మేరకు కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ వివరాలను వెల్లడించడం జరిగింది.
భార్పాటీ శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా, నిందితుడు తాను భద్రాచలం ఐటీసీ పేపర్ బోర్డ్స్‌లో లేబర్ కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్నానని, తనతో భాగస్వామిగా ఉంటే కాంట్రాక్ట్ పనులు ఇప్పించి అధిక లాభాలు అందిస్తానని నమ్మబలికి పలువురు బాధితుల నుంచి సుమారు రూ.52 కోట్ల మేర పెట్టుబడుల పేరుతో మోసపూరితంగా డబ్బులు సేకరించినట్లు దర్యాప్తులో వెల్లడైంది.
బాధితుల విశ్వాసాన్ని పొందేందుకు నకిలీ భాగస్వామ్య ఒప్పందాలు, తప్పుడు పత్రాలు రూపొందించి, లాభాల్లో 4 శాతం వాటా ఇస్తామని హామీలు ఇచ్చి మోసానికి పాల్పడినట్లు విచారణలో తేలిందని తెలిపారు. అలాగే బీకే నాయుడు అండ్ కో., రాజేశ్వరి ట్రావెల్స్ పేర్లతో సంస్థలను నిర్వహిస్తూ ఈ మోసపూరిత కార్యకలాపాలు సాగించినట్లు గుర్తించినట్లు వెల్లడించారు.
సాంకేతిక ఆధారాలు, ఆర్థిక లావాదేవీల విశ్లేషణ ఆధారంగా నిందితుడిని కేరళ రాష్ట్రంలోని పాలా ప్రాంతంలో అరెస్టు చేసి, ట్రాన్సిట్ వారెంట్‌పై జిల్లాకు తీసుకువచ్చి పోలీసు కస్టడీలో విచారించినట్లు తెలిపారు. విచారణలో భాగంగా నేరార్జిత ఆస్తులుగా భావిస్తున్న 6 బస్సులు, ఒక వాటర్ ట్యాంకర్ లారీ, 3 ట్రాక్టర్లు, 2 వ్యవసాయ పరికరాలు, 7 కార్లు, 14 ద్విచక్ర వాహనాలు, 2 ట్రైలర్లు కలిపి మొత్తం 35 వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
అదేవిధంగా బాధితుల నుంచి మోసపూరితంగా సేకరించిన డబ్బుతో భద్రాచలంలోని రాజీవ్‌నగర్ కాలనీలో ఒక మూడు అంతస్తుల భవనం, ఒక ప్లాట్ కొనుగోలు చేసినట్లు గుర్తించినట్లు తెలిపారు.
ఈ కేసులో ఆర్థిక లావాదేవీలు, బ్యాంకు ఖాతాలు, సంబంధిత పత్రాల పరిశీలన కొనసాగుతోందని తెలిపారు. మరిన్ని బాధితులను గుర్తించడం, నేరార్జిత ఆస్తులను గుర్తించి స్వాధీనం చేసుకోవడం, పూర్తి మనీ ట్రైల్‌ను వెలికితీసే దిశగా దర్యాప్తు కొనసాగుతోందన్నారు.
అధిక లాభాలు వస్తాయని, తక్కువ సమయంలో పెట్టుబడికి రెట్టింపు లేదా భారీ రాబడులు వస్తాయని చెప్పే వ్యక్తులు లేదా సంస్థలను గుడ్డిగా నమ్మి డబ్బులు పెట్టవద్దని ప్రజలకు సూచించారు. ఆకర్షణీయమైన హామీలు, నకిలీ పత్రాలు, తప్పుడు ఒప్పందాలతో మోసగాళ్లు ప్రజలను మభ్యపెడుతున్నందున ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని కోరారు. అనుమానాస్పద పెట్టుబడి పథకాలపై సమాచారం తెలిసినా లేదా మోసానికి గురైనా వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు. ప్రజల అప్రమత్తతతోనే ఇటువంటి ఆర్థిక నేరాలను సమర్థవంతంగా అరికట్టవచ్చని తెలిపారు.
ఈ కేసును ఛేదించడంలో కృషి చేసిన లక్ష్మీదేవిపల్లి పోలీసు సిబ్బందిని, జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులను జిల్లా ఎస్పీ రోహిత్ రాజు  అభినందించారు .
    user_VANAMA SRINIVAS RAO
    VANAMA SRINIVAS RAO
    జర్నలిస్ట్ కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    7 hrs ago
  • అడిగేవాడు లేడని,ప్రభుత్వం అండతో ఫీజుల పేరుతో జనాల రక్తాన్ని జలగల్లా పీల్చి పిప్పి చేస్తున్న నారాయణ కాలేజీకి నేరుగా వెళ్లి *వీందో డ్రామా... వాందో డ్రామా😤* అడిగేవాడు లేడని,ప్రభుత్వం అండతో ఫీజుల పేరుతో జనాల రక్తాన్ని జలగల్లా పీల్చి పిప్పి చేస్తున్న నారాయణ కాలేజీకి నేరుగా వెళ్లి యాజమాన్యాన్ని ఏకిపారేసిన *ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న🔥* దొంగ ర్యాంకుల పేరుతో అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి జనాన్ని మోసం చేస్తే చూస్తూ ఊరుకోవడానికి అక్కడ ఉన్నది చేతకాని రేవంత్ రెడ్డి కాదు,దోపిడిదారి కేసీఆర్ కాదు.....దమ్మున్న తీన్మార్ మల్లన్న....ఒక్కొకడికి ఇక తీన్మారే ఇలాంటి నాయకులు కదా మనకు కావాల్సింది....
    1
    అడిగేవాడు లేడని,ప్రభుత్వం అండతో ఫీజుల పేరుతో జనాల రక్తాన్ని జలగల్లా పీల్చి పిప్పి చేస్తున్న నారాయణ కాలేజీకి నేరుగా వెళ్లి
*వీందో డ్రామా... వాందో డ్రామా😤*
అడిగేవాడు లేడని,ప్రభుత్వం అండతో ఫీజుల పేరుతో జనాల రక్తాన్ని జలగల్లా పీల్చి పిప్పి చేస్తున్న నారాయణ కాలేజీకి నేరుగా వెళ్లి యాజమాన్యాన్ని  ఏకిపారేసిన *ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న🔥*
దొంగ ర్యాంకుల పేరుతో అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి జనాన్ని మోసం చేస్తే చూస్తూ ఊరుకోవడానికి అక్కడ ఉన్నది చేతకాని రేవంత్ రెడ్డి కాదు,దోపిడిదారి కేసీఆర్ కాదు.....దమ్మున్న తీన్మార్ మల్లన్న....ఒక్కొకడికి ఇక తీన్మారే 
ఇలాంటి నాయకులు కదా మనకు కావాల్సింది....
    user_NIMMANAGANTI ANIL BABU
    NIMMANAGANTI ANIL BABU
    Local News Reporter డోర్నకల్, మహబూబాబాద్, తెలంగాణ•
    10 hrs ago
  • భద్రాచలం గోదావరిలో శ్రీరామకోటి పుస్తకాల నిమజ్జనం...... భద్రాచలం: ఏడాది పాటు పూజలు నిర్వహించిన శ్రీరామకోటి పుస్తకాలను గోదావరి ప్రవాహం ఎక్కువగా ఉన్న సమయంలో నిమజ్జనం చేయడం ఆనవాయితీగా వస్తోందని ఆలయ అర్చకులు తెలిపారు. ఈ మేరకు శనివారం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో నిమజ్జనోత్సవం నిర్వహించారు. ఆలయ ఈవో దామోదర్‌రావు, అర్చకులు ప్రత్యేక పూజలు చేసి శ్రీరామకోటి పుస్తకాలను గోదావరిలో నిమజ్జనం చేశారు.
    1
    భద్రాచలం గోదావరిలో శ్రీరామకోటి పుస్తకాల నిమజ్జనం......
భద్రాచలం: ఏడాది పాటు పూజలు నిర్వహించిన శ్రీరామకోటి పుస్తకాలను గోదావరి ప్రవాహం ఎక్కువగా ఉన్న సమయంలో నిమజ్జనం చేయడం ఆనవాయితీగా వస్తోందని ఆలయ అర్చకులు తెలిపారు. ఈ మేరకు శనివారం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో నిమజ్జనోత్సవం నిర్వహించారు. ఆలయ ఈవో దామోదర్‌రావు, అర్చకులు ప్రత్యేక పూజలు చేసి శ్రీరామకోటి పుస్తకాలను గోదావరిలో నిమజ్జనం చేశారు.
    user_JAI TEJ
    JAI TEJ
    బుర్గుంపహాడ్, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    1 hr ago
  • వరంగల్ జిల్లా: ప్రతి శుక్రవారం... పార్టీ లోని ఒక కుటుంబంతో కలిసి భోజనం, ఒక కార్యకర్తకు అండగా మొత్తం పార్టీ కుటుంబం!*❤️ *✊ ప్రతి శుక్రవారం... పార్టీ లోని ఒక కుటుంబంతో కలిసి భోజనం, ఒక కార్యకర్తకు అండగా మొత్తం పార్టీ కుటుంబం!*❤️ *మాధం రజినీ కుమార్ యాదవ్ గారి అధ్యక్షతన, పల్లెబోయిన అశోక్ ముదిరాజ్ గారి పర్యవేక్షణలో ప్రతి శుక్రవారం రాత్రి @8 PM నిర్వహిస్తున్న TRP డిన్నర్ హోమ్ మీట్ కార్యక్రమం నిజంగా ఆదర్శప్రాయమైనది.* *పార్టీలోని కార్యకర్తలు, నాయకులు ప్రతి వారం ఒక TRP కుటుంబం ఇంటికి వెళ్లి కలిసి భోజనం చేస్తూ, "మీ కుటుంబానికి మేమంతా అండగా ఉన్నాం" అనే భరోసాను కల్పిస్తున్నారు.* *ఇది కేవలం భోజన కార్యక్రమం కాదు... కుటుంబాల మధ్య అనుబంధాన్ని పెంచే, కార్యకర్తలో ఆత్మవిశ్వాసాన్ని నింపే ఉద్యమం.* *ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రతి TRP నాయకుడు, కార్యకర్త వెనుక ఇంత పెద్ద కుటుంబం అండగా ఉందనే ధైర్యంతో ముందుకు సాగుతున్నాడు.* *ఇదే TRP కుటుంబం... ఇదే కార్యకర్తకు ఇచ్చే గౌరవం... ఇదే ఐక్యతకు నిదర్శనం! 🔥✊*
    1
    వరంగల్ జిల్లా: ప్రతి శుక్రవారం... పార్టీ లోని ఒక కుటుంబంతో కలిసి భోజనం, ఒక కార్యకర్తకు అండగా మొత్తం పార్టీ కుటుంబం!*❤️

*✊ ప్రతి శుక్రవారం... పార్టీ లోని ఒక కుటుంబంతో కలిసి భోజనం, ఒక కార్యకర్తకు అండగా మొత్తం పార్టీ కుటుంబం!*❤️
*మాధం రజినీ కుమార్ యాదవ్ గారి అధ్యక్షతన, పల్లెబోయిన అశోక్ ముదిరాజ్ గారి పర్యవేక్షణలో ప్రతి శుక్రవారం రాత్రి @8 PM నిర్వహిస్తున్న TRP డిన్నర్ హోమ్ మీట్ కార్యక్రమం నిజంగా ఆదర్శప్రాయమైనది.*
*పార్టీలోని కార్యకర్తలు, నాయకులు ప్రతి వారం ఒక TRP కుటుంబం ఇంటికి వెళ్లి కలిసి భోజనం చేస్తూ, "మీ కుటుంబానికి మేమంతా అండగా ఉన్నాం" అనే భరోసాను కల్పిస్తున్నారు.*
*ఇది కేవలం భోజన కార్యక్రమం కాదు... కుటుంబాల మధ్య అనుబంధాన్ని పెంచే, కార్యకర్తలో ఆత్మవిశ్వాసాన్ని నింపే ఉద్యమం.*
*ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రతి TRP నాయకుడు, కార్యకర్త వెనుక ఇంత పెద్ద కుటుంబం అండగా ఉందనే ధైర్యంతో ముందుకు సాగుతున్నాడు.*
*ఇదే TRP కుటుంబం... ఇదే కార్యకర్తకు ఇచ్చే గౌరవం... ఇదే ఐక్యతకు నిదర్శనం! 🔥✊*
    user_NIMMANAGANTI ANIL BABU
    NIMMANAGANTI ANIL BABU
    Local News Reporter డోర్నకల్, మహబూబాబాద్, తెలంగాణ•
    12 hrs ago
  • *ప్రస్తుతం ప్రముఖ పుణ్య క్షేత్రం భద్రాచలం వద్ద గోదావరి వరద పరిస్తితి......*
    1
    *ప్రస్తుతం ప్రముఖ పుణ్య క్షేత్రం భద్రాచలం వద్ద గోదావరి వరద పరిస్తితి......*
    user_Ramprasad islavath
    Ramprasad islavath
    Taxi Driver కల్లూరు, ఖమ్మం, తెలంగాణ•
    6 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.