నగరపాలక సంస్థ అకౌంట్స్ విభాగాధికారులకు మేయర్ అభినందనలు - మేయర్ స్రవంతి జయవర్ధన్ నెల్లూరు నగరపాలక సంస్థ 2025 - 26 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రణాళికాబద్ధమైన బడ్జెట్ ను రూపొందించిన వారికీ, సర్వసభ్య సమావేశంలో విజయవంతంగా ప్రవేశపెట్టడంలో తోడ్పడిన వారందరికీ ప్రత్యేక అభినందనలను తెలియజేస్తున్నట్లు మేయర్ స్రవంతి జయవర్ధన్ గురువారం ఒక ప్రకటనలో తెలియజేశారు. బడ్జెట్ సమావేశాన్ని విజయవంతంగా పూర్తి చేయడంలో సర్వ సభ్యులు అందరితో పాటు, నగరపాలక సంస్థ కమిషనర్ సూర్య తేజ, అకౌంట్స్ విభాగం వారి పాత్ర ప్రశంసనీయమని, వారందరికీ మరియు ఇతర విభాగాధికారులకు మేయర్ ప్రత్యేక అభినందనలను తెలియజేశారు. సర్వ సభ్యుల ఆమోదంతో ప్రవేశపెట్టిన నూతన బడ్జెట్ ద్వారా నగర వ్యాప్తంగా మౌలిక వసతుల కల్పన, పారిశుధ్య నిర్వహణ, పర్యావరణ పరిరక్షణ తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించి నగరపాలక సంస్థను అభివృద్ధి పథంలోకి నడిపించేలా కృషి చేస్తామని మేయర్ ఆకాంక్షించారు.