logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

తేదీ: 20-04-2026 వలిగొండ మండలం *వడ్ల కొనుగోలు కేంద్రాలని ప్రారంభించిన భువనగిరి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు* వలిగొండ మండలంలోని పహిల్వాన్‌పురం, మాందాపురం, నాతాళ్ళగూడెం, అక్కంపల్లి, లింగరాజుపల్లి గ్రామాలలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాలను భువనగిరి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ, రైతులు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర అందేలా రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు. రైతులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తమ పంటను విక్రయించుకునే విధంగా కొనుగోలు కేంద్రాల నిర్వహణలో అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రతి రైతుకు న్యాయం జరిగేలా పారదర్శకంగా వ్యవహరించాలని సూచించారు. గత సంవత్సరంలో సుమారు 3 లక్షల 77 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు పేర్కొన్న ఎమ్మెల్యే గారు, ఈ సంవత్సరం సుమారు 4 లక్షల 50 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా నిర్ణయించుకున్నామని తెలిపారు. రైతులకు మరింత ప్రోత్సాహం అందించేందుకు వడ్లపై క్వింటాల్‌కు ₹500 బోనస్ అందిస్తున్నామని వెల్లడించారు. ఈ చర్య రైతుల ఆర్థిక స్థితిని బలోపేతం చేస్తుందని అన్నారు. కొనుగోలు కేంద్రాలలో గన్నీ బ్యాగులు, తూకం యంత్రాలు, మాయిశ్చర్ మీటర్లు సమృద్ధిగా అందుబాటులో ఉంచాలని, ధాన్యం తేమ శాతం పరీక్షలు సక్రమంగా నిర్వహించాలని అధికారులకు ఆదేశించారు. రైతులు కేంద్రాలకు తీసుకువచ్చే ధాన్యాన్ని ఆలస్యం లేకుండా వెంటనే కొనుగోలు చేసి, చెల్లింపులు సమయానికి జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా కేంద్రాల వద్ద తాగునీరు, ఇతర కనీస సదుపాయాలు కల్పించాలని, రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని తెలిపారు. రైతుల నుంచి వచ్చే ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు, మండల, గ్రామాల ప్రజాప్రతినిధులు, నాయకులు, ఐకేపీ ప్రతినిధులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

7 hrs ago
user_N6 news
N6 news
బీబీనగర్, యాదాద్రి భువనగిరి, తెలంగాణ•
7 hrs ago
73346d2a-80ba-4e82-ab77-6504c25cd960

తేదీ: 20-04-2026 వలిగొండ మండలం *వడ్ల కొనుగోలు కేంద్రాలని ప్రారంభించిన భువనగిరి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు* వలిగొండ మండలంలోని పహిల్వాన్‌పురం, మాందాపురం, నాతాళ్ళగూడెం, అక్కంపల్లి, లింగరాజుపల్లి గ్రామాలలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాలను భువనగిరి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ, రైతులు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర అందేలా రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు. రైతులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తమ పంటను విక్రయించుకునే విధంగా కొనుగోలు కేంద్రాల నిర్వహణలో అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రతి రైతుకు న్యాయం జరిగేలా పారదర్శకంగా వ్యవహరించాలని సూచించారు. గత సంవత్సరంలో సుమారు 3 లక్షల 77 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు పేర్కొన్న ఎమ్మెల్యే గారు, ఈ సంవత్సరం సుమారు 4 లక్షల 50

d8ddbef7-3e57-4512-868e-354943a087e2

వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా నిర్ణయించుకున్నామని తెలిపారు. రైతులకు మరింత ప్రోత్సాహం అందించేందుకు వడ్లపై క్వింటాల్‌కు ₹500 బోనస్ అందిస్తున్నామని వెల్లడించారు. ఈ చర్య రైతుల ఆర్థిక స్థితిని బలోపేతం చేస్తుందని అన్నారు. కొనుగోలు కేంద్రాలలో గన్నీ బ్యాగులు, తూకం యంత్రాలు, మాయిశ్చర్ మీటర్లు సమృద్ధిగా అందుబాటులో ఉంచాలని, ధాన్యం తేమ శాతం పరీక్షలు సక్రమంగా నిర్వహించాలని అధికారులకు ఆదేశించారు. రైతులు కేంద్రాలకు తీసుకువచ్చే ధాన్యాన్ని ఆలస్యం లేకుండా వెంటనే కొనుగోలు చేసి, చెల్లింపులు సమయానికి జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా కేంద్రాల వద్ద తాగునీరు, ఇతర కనీస సదుపాయాలు కల్పించాలని, రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని తెలిపారు. రైతుల నుంచి వచ్చే ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు, మండల, గ్రామాల ప్రజాప్రతినిధులు, నాయకులు, ఐకేపీ ప్రతినిధులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

  • user_N6 news
    N6 news
    బీబీనగర్, యాదాద్రి భువనగిరి, తెలంగాణ
    e56dd401-e073-4133-a50b-2df3c27fe5a2
    61f8636b-7d3e-4b01-87f6-3752305d25a5
    71425a64-594b-4d0f-9012-02fc029ee211
    1a1928c6-4fb3-4786-b2c9-899e7eabc4c1
    6 hrs ago
More news from తెలంగాణ and nearby areas
  • Post by Tagore
    1
    Post by Tagore
    user_Tagore
    Tagore
    Newspaper publisher యాదగిరిగుట్ట, యాదాద్రి భువనగిరి, తెలంగాణ•
    5 hrs ago
  • జహీరాబాద్ నియోజకవర్గం లోని ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన మౌలిక సౌకర్యాలు కల్పించాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ ను కోరిన జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు
    1
    జహీరాబాద్ నియోజకవర్గం లోని ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన మౌలిక సౌకర్యాలు కల్పించాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ ను కోరిన జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు
    user_Sangareddy News
    Sangareddy News
    జర్నలిస్ట్ Saidabad, Hyderabad•
    5 hrs ago
  • the mhshshsndihdbxbbxnxndbndjxjxbdoshdhbspHetro address video
    1
    the mhshshsndihdbxbbxnxndbndjxjxbdoshdhbspHetro address video
    user_Prabhuram
    Prabhuram
    షేక్‌పేట్, హైదరాబాద్, తెలంగాణ•
    15 hrs ago
  • నల్లగొండ టూ టౌన్ పోలీసుల వేగవంతమైన చర్యలు... మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన సీఐ రాఘవరావు... నాంపల్లి మండలం మహ్మదాపురం గ్రామానికి చెందిన ఐశ్వర్య (20)కు ఐదు నెలల క్రితం పానగల్లుకు చెందిన శివశంకర్‌తో వివాహం జరిగింది... భర్త ఇంట్లో లేని సమయంలో మామ వర్రే లింగయ్య తరచూ వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు... ప్రతి చిన్న విషయానికీ తప్పుపట్టడం,అవమానించడం, మానసికంగా హింసించడం చేసినట్లు కుటుంబ సభ్యుల ఫిర్యాదు... టూ టౌన్ ఎస్ఐ సైదులు దర్యాప్తు వేగవంతం... “నువ్వు చస్తే నా కొడుకుకు ఇంకా మంచి భార్య వస్తుంది” అంటూ తీవ్రంగా వేధించినట్లు కేసులో వెల్లడింపు... వేధింపులు తట్టుకోలేక 18-04-2026 ఉదయం పానగల్లు ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఐశ్వర్య ఆత్మహత్య.. మృతురాలి తండ్రి చింతల వెంకటయ్య ఫిర్యాదుతో నల్లగొండ టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు... BNS సెక్షన్లు 95, 108 కింద నేరం నమోదు చేసిన పోలీసులు... నిందితుడు వర్రే లింగయ్య (45)ను ఈరోజు ఉదయం అతని నివాసంలో అరెస్టు చేసిన పోలీసులు... సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకుని కోర్టులో హాజరు పరచేందుకు రిమాండ్‌కు తరలింపు.. కోడలిపై వేధింపులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తప్పవని పోలీసుల హెచ్చరిక...
    1
    నల్లగొండ టూ టౌన్ పోలీసుల వేగవంతమైన చర్యలు...
మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన సీఐ రాఘవరావు...
నాంపల్లి మండలం మహ్మదాపురం గ్రామానికి చెందిన ఐశ్వర్య (20)కు ఐదు నెలల క్రితం పానగల్లుకు చెందిన శివశంకర్‌తో వివాహం జరిగింది...
భర్త ఇంట్లో లేని సమయంలో మామ వర్రే లింగయ్య తరచూ వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు...
ప్రతి చిన్న విషయానికీ తప్పుపట్టడం,అవమానించడం, మానసికంగా హింసించడం చేసినట్లు కుటుంబ సభ్యుల ఫిర్యాదు...
టూ టౌన్ ఎస్ఐ సైదులు దర్యాప్తు వేగవంతం...
“నువ్వు చస్తే నా కొడుకుకు ఇంకా మంచి భార్య వస్తుంది” అంటూ తీవ్రంగా వేధించినట్లు కేసులో వెల్లడింపు...
వేధింపులు తట్టుకోలేక 18-04-2026 ఉదయం పానగల్లు ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఐశ్వర్య ఆత్మహత్య..
మృతురాలి తండ్రి చింతల వెంకటయ్య ఫిర్యాదుతో నల్లగొండ టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు...
BNS సెక్షన్లు 95, 108 కింద నేరం నమోదు చేసిన పోలీసులు...
నిందితుడు వర్రే లింగయ్య (45)ను ఈరోజు ఉదయం అతని నివాసంలో అరెస్టు చేసిన పోలీసులు...
సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకుని కోర్టులో హాజరు పరచేందుకు రిమాండ్‌కు తరలింపు.. 
కోడలిపై వేధింపులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తప్పవని పోలీసుల హెచ్చరిక...
    user_Journalist pk
    Journalist pk
    Journalist గుండ్ల పల్లె, నల్గొండ, తెలంగాణ•
    7 hrs ago
  • ప్రజాప్రస్థానం నకిరేకల్, నియోజకవర్గo:- నకిరేకల్ నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తూ ప్రజల మన్ననలు పొందిన మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తన 53వ జన్మదినాన్ని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన రాజకీయ జీవితం, ప్రజా సేవలపై స్థానికంగా చర్చలు జరుగుతున్నాయి. నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం బ్రాహ్మణ వెల్లెంల గ్రామంలో నిరుపేద దళిత కుటుంబంలో 1973 ఏప్రిల్ 20న జన్మించిన లింగయ్య చిన్ననాటి నుంచే కష్టజీవితాన్ని అనుభవిస్తూ ఎదిగారు. విద్యాభ్యాసంతో పాటు వ్యవసాయ పనుల్లో తల్లిదండ్రులకు తోడ్పడుతూ సామాన్య ప్రజల కష్టాలను దగ్గరగా తెలుసుకున్నారు. అంబేద్కర్, గాంధీ సిద్ధాంతాల ప్రభావంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఆయన 1995లో ఎంపీటీసీగా, 2001లో జెడ్పీటీసీగా గెలిచి ప్రజాసేవలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారు. 2009లో నకిరేకల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి కమ్యూనిస్టుల కంచుకోటగా పేరున్న ప్రాంతంలో సంచలనం సృష్టించారు. ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో గ్రామీణ అభివృద్ధి, సీసీ రోడ్లు, చెరువుల పునరుద్ధరణ, విద్యుత్ సదుపాయాలు, తాగునీటి ప్రాజెక్టులు వంటి అనేక కార్యక్రమాలను అమలు చేశారు. ముఖ్యంగా కృష్ణ జలాలను గ్రామాలకు అందించే ప్రయత్నాలు, ధర్మారెడ్డిపల్లి–పిల్లాయిపల్లి కాలువల పూర్తి కోసం చేసిన కృషి ప్రజల్లో ప్రశంసలు అందుకుంది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రాష్ట్ర సాధన కోసం పోరాటం చేసిన తొలి నేతల్లో ఒకరిగా నిలిచారు. అనంతరం 2018 ఎన్నికల్లో తిరిగి ఎమ్మెల్యేగా గెలిచి అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేశారు. తరువాత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నాయకత్వంలోని టీఆర్ఎస్ పార్టీలో చేరి, కేటీఆర్, జగదీష్ రెడ్డి ఆశీస్సులతో నకిరేకల్ అభివృద్ధికి పెద్దఎత్తున నిధులు సాధించారు. అయిటిపాముల లిఫ్ట్, ఉదయ సముద్రం ప్రాజెక్ట్, ఆసుపత్రుల విస్తరణ, డిగ్రీ కళాశాల, మున్సిపల్ అభివృద్ధి వంటి పలు ప్రాజెక్టులను ముందుకు తీసుకువచ్చారు. 2023 ఎన్నికల్లో ఓటమి చెందినప్పటికీ ప్రజల మధ్యలోనే ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ సేవలు అందిస్తున్నారు. ఈ సందర్భంగా నకిరేకల్ ప్రజలు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, భవిష్యత్తులో మళ్లీ ఎమ్మెల్యేగా గెలిచి అభివృద్ధిని కొనసాగించాలని ఆకాంక్షిస్తున్నారు. 💐
    3
    ప్రజాప్రస్థానం
నకిరేకల్, నియోజకవర్గo:-
నకిరేకల్ నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తూ ప్రజల మన్ననలు పొందిన మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తన 53వ జన్మదినాన్ని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన రాజకీయ జీవితం, ప్రజా సేవలపై స్థానికంగా చర్చలు జరుగుతున్నాయి.
నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం బ్రాహ్మణ వెల్లెంల గ్రామంలో నిరుపేద దళిత కుటుంబంలో 1973 ఏప్రిల్ 20న జన్మించిన లింగయ్య చిన్ననాటి నుంచే కష్టజీవితాన్ని అనుభవిస్తూ ఎదిగారు. విద్యాభ్యాసంతో పాటు వ్యవసాయ పనుల్లో తల్లిదండ్రులకు తోడ్పడుతూ సామాన్య ప్రజల కష్టాలను దగ్గరగా తెలుసుకున్నారు.
అంబేద్కర్, గాంధీ సిద్ధాంతాల ప్రభావంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఆయన 1995లో ఎంపీటీసీగా, 2001లో జెడ్పీటీసీగా గెలిచి ప్రజాసేవలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారు. 2009లో నకిరేకల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి కమ్యూనిస్టుల కంచుకోటగా పేరున్న ప్రాంతంలో సంచలనం సృష్టించారు.
ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో గ్రామీణ అభివృద్ధి, సీసీ రోడ్లు, చెరువుల పునరుద్ధరణ, విద్యుత్ సదుపాయాలు, తాగునీటి ప్రాజెక్టులు వంటి అనేక కార్యక్రమాలను అమలు చేశారు. ముఖ్యంగా కృష్ణ జలాలను గ్రామాలకు అందించే ప్రయత్నాలు, ధర్మారెడ్డిపల్లి–పిల్లాయిపల్లి కాలువల పూర్తి కోసం చేసిన కృషి ప్రజల్లో ప్రశంసలు అందుకుంది.
ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రాష్ట్ర సాధన కోసం పోరాటం చేసిన తొలి నేతల్లో ఒకరిగా నిలిచారు. అనంతరం 2018 ఎన్నికల్లో తిరిగి ఎమ్మెల్యేగా గెలిచి అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేశారు.
తరువాత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నాయకత్వంలోని టీఆర్ఎస్ పార్టీలో చేరి, కేటీఆర్, జగదీష్ రెడ్డి ఆశీస్సులతో నకిరేకల్ అభివృద్ధికి పెద్దఎత్తున నిధులు సాధించారు. అయిటిపాముల లిఫ్ట్, ఉదయ సముద్రం ప్రాజెక్ట్, ఆసుపత్రుల విస్తరణ, డిగ్రీ కళాశాల, మున్సిపల్ అభివృద్ధి వంటి పలు ప్రాజెక్టులను ముందుకు తీసుకువచ్చారు.
2023 ఎన్నికల్లో ఓటమి చెందినప్పటికీ ప్రజల మధ్యలోనే ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ సేవలు అందిస్తున్నారు.
ఈ సందర్భంగా నకిరేకల్ ప్రజలు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, భవిష్యత్తులో మళ్లీ ఎమ్మెల్యేగా గెలిచి అభివృద్ధిని కొనసాగించాలని ఆకాంక్షిస్తున్నారు. 💐
    user_Nagesh Kothapalli
    Nagesh Kothapalli
    Local News Reporter నక్రేకల్, నల్గొండ, తెలంగాణ•
    12 hrs ago
  • మహాత్మా బసవేశ్వర జయంతి కార్యక్రమాన్ని విద్యుత్ కార్యాలయం ఆవరణలో సోమవారం నిర్వహించారు. విద్యుత్ బిసి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బసవేశ్వర విగ్రహానికి ప్రత్యేక అభిషేక కార్యక్రమాలు నిర్వహించారు. అర్చకులు వేదమంత్రాలతో పూజా కార్యక్రమాలు చేశారు. అనంతరం పూలమాలలు వేసి తీర్థ ప్రసాదాలను అందజేశారు. కార్యక్రమంలో నాయకులు రాజేశ్వర్ స్వామి, ప్రభు గౌడ్, మల్లికార్జున్ పాటిల్, పాల్గొన్నారు.
    1
    మహాత్మా బసవేశ్వర జయంతి కార్యక్రమాన్ని విద్యుత్ కార్యాలయం ఆవరణలో సోమవారం నిర్వహించారు. విద్యుత్ బిసి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బసవేశ్వర విగ్రహానికి ప్రత్యేక అభిషేక కార్యక్రమాలు నిర్వహించారు. అర్చకులు వేదమంత్రాలతో పూజా కార్యక్రమాలు చేశారు. అనంతరం పూలమాలలు వేసి తీర్థ ప్రసాదాలను అందజేశారు. కార్యక్రమంలో నాయకులు రాజేశ్వర్ స్వామి, ప్రభు గౌడ్, మల్లికార్జున్ పాటిల్, పాల్గొన్నారు.
    user_Praveen
    Praveen
    మున్‌పల్లె, సంగారెడ్డి, తెలంగాణ•
    14 hrs ago
  • .*ప్రెస్ రిలీజ్* మెదక్ 20 ఏప్రిల్2026 2027 -పూర్తిగా డిజిటల్ జనగణన కలెక్టర్ ఎన్యుమరేటర్స్ సూపర్వైజర్స్ శిక్షణలో సంపూర్ణ అవగాహనతో , జనగణన విజయవంతం చేయాలి జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ 2027 - డిజిటల్ జనగణన అని *జిల్లా కలెక్టర్ ప్రతి మాసింగ్* అన్నారు కౌడిపల్లి మండలంలో జిల్లా పరిషత్ పాఠశాలలో ఎన్యుమరేటర్ సూపర్వైజర్లకు జనగణన-2027 నిర్వహణలో భాగంగా మూడు రోజులపాటు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ శిక్షణ కార్యక్రమానికి కలెక్టర్ ప్రతిమ సింగ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్యుమరేటర్స్ సూపర్వైజర్లుకు దిశా నిర్దేశం చేశారు. శిక్షణలో ప్రతి అంశాన్ని అవగాహన కల్పించుకోవాలన్నారు ఈ శిక్షణ మూడు రోజులు పాటు కొనసాగుతుందని ప్రశ్నలు సమాధానాల రూపంలో జనగణన కు సంబంధించివారి సందేహాలను నివృత్తి చేశారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ ఆర్డీవో రామకృష్ణ సంబంధిత ఎనిమరేటర్స్ సూపర్వైజర్స్ తదితరులు పాల్గొన్నారు
    1
    .*ప్రెస్ రిలీజ్*
మెదక్ 20 ఏప్రిల్2026
2027 -పూర్తిగా  డిజిటల్ జనగణన కలెక్టర్
ఎన్యుమరేటర్స్ సూపర్వైజర్స్  శిక్షణలో సంపూర్ణ అవగాహనతో , జనగణన విజయవంతం చేయాలి  
జిల్లా కలెక్టర్ ప్రతిమా  సింగ్
2027 - డిజిటల్   జనగణన   అని 
*జిల్లా కలెక్టర్ ప్రతి మాసింగ్* అన్నారు 
కౌడిపల్లి మండలంలో  జిల్లా పరిషత్ పాఠశాలలో ఎన్యుమరేటర్ సూపర్వైజర్లకు జనగణన-2027  నిర్వహణలో భాగంగా మూడు రోజులపాటు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ శిక్షణ కార్యక్రమానికి కలెక్టర్ ప్రతిమ సింగ్  ముఖ్యఅతిథిగా హాజరయ్యారు
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్యుమరేటర్స్ సూపర్వైజర్లుకు దిశా నిర్దేశం చేశారు.   శిక్షణలో ప్రతి అంశాన్ని అవగాహన కల్పించుకోవాలన్నారు ఈ శిక్షణ మూడు రోజులు పాటు కొనసాగుతుందని  ప్రశ్నలు సమాధానాల రూపంలో జనగణన కు సంబంధించివారి సందేహాలను నివృత్తి చేశారు.
ఈ కార్యక్రమంలో నర్సాపూర్ ఆర్డీవో రామకృష్ణ సంబంధిత ఎనిమరేటర్స్ సూపర్వైజర్స్ తదితరులు పాల్గొన్నారు
    user_మెదక్ న్యూస్
    మెదక్ న్యూస్
    Medak, Telangana•
    6 hrs ago
  • జనగాం జిల్లా:పాలకుర్తి మండల కేంద్రంలో మొక్కజొన్న కొనుగోలు జాప్యాన్ని నిరసిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. చాకలి ఐలమ్మ వ్యవసాయ మార్కెట్‌ను పరిశీలించిన రాష్ట్ర నాయకులు లేగ రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. తక్షణమే కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
    1
    జనగాం జిల్లా:పాలకుర్తి మండల కేంద్రంలో మొక్కజొన్న కొనుగోలు జాప్యాన్ని నిరసిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. చాకలి ఐలమ్మ వ్యవసాయ మార్కెట్‌ను పరిశీలించిన రాష్ట్ర నాయకులు లేగ రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు.
తక్షణమే కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    6 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.