మహబూబాబాద్ జిల్లా గొంతు కోసేలా 'రైల్వే మెగా డిపో' తరలింపు కుట్రలు... సహించేది లేదు! వరంగల్ ఎంపీ కావ్య ఆధిపత్య ధోరణి - స్థానిక కాంగ్రెస్ నేతల చేతకానితనం వల్ల జిల్లా యువత పొట్టకొడితే కాంగ్రెస్ పార్టీని పాతరపెడతాం: మహబూబాబాద్ మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ ఫరిద్ హెచ్చరిక మహబూబాబాద్ జిల్లా సమగ్ర అభివృద్ధికీ దోహదం చేసే వేలాది మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించగల ప్రతిష్టాత్మక "రైల్వే మెగా మెయింటేనేన్స్ డిపో" (Railway Mega Maintenance Depot) ను మహబూబాబాద్ జిల్లా నుండి తరలించేందుకు జరుగుతున్న కుట్రలను తీవ్రంగా ఖండిస్తున్నామని మహబూబాబాద్ మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ మహ్మద్ ఫరీద్ గారు స్పష్టం చేశారు. ఈ మేరకు వారు ఒక సుదీర్ఘ పత్రికా ప్రకటన విడుదల చేశారు. వరంగల్ ఎంపీ ఆధిపత్యం - మానుకోటపై చిన్నచూపు: వరంగల్ పార్లమెంట్ సభ్యులు కడియం కావ్య గారు సంకుచిత మనస్తత్వంతో వ్యవహరిస్తున్నారని ఫరీద్ గారు మండిపడ్డారు. మహబూబాబాద్ జిల్లాలో ఏర్పాటు చేయాల్సిన ఈ భారీ ప్రాజెక్టును, కేవలం తన రాజకీయ లబ్ది కోసం వరంగల్ పార్లమెంట్ పరిధిలోని 'నష్కల్' (Nashkal) ప్రాంతానికి తరలించాలని చూడటం అత్యంత దుర్మార్గమైన చర్య అని విమర్శించారు. ఒక గిరిజన జిల్లాగా, వెనుకబడిన ప్రాంతంగా ఉన్న మహబూబాబాద్‌కు దక్కాల్సిన హక్కులను కాలరాస్తూ, అభివృద్ధిని ఒకే చోట కేంద్రీకరించాలనుకోవడం కావ్య గారి అవివేకానికి నిదర్శనమని అన్నారు. నిద్రపోతున్న ఎమ్మెల్యే, ఎంపీలు: జిల్లా నడిబొడ్డున ఇంత పెద్ద అన్యాయం జరుగుతుంటే, మహబూబాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్యే మురళీ నాయక్ గారు మరియు ఎంపీ బలరాం నాయక్ "అధికారంలో ఉన్నది మీరే కదా? మీ సొంత పార్టీ ఎంపీనే మన జిల్లాకు అన్యాయం చేస్తుంటే, కనీసం ప్రశ్నించే దమ్ము, ధైర్యం మీకు లేవా?" అని ఎద్దేవా చేశారు. కేవలం పైరవీలకు, ప్రోటోకాల్‌లకు పరిమితమైన ఎమ్మెల్యే, ఎంపీల నిర్లక్ష్య వైఖరి వల్లే నేడు మహబూబాబాద్ జిల్లాకు ఈ దుస్థితి దాపురించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. యువత భవిష్యత్తుపై దెబ్బ: ఈ రైల్వే డిపో కేవలం ఒక భవనం కాదని, ఇది జిల్లా యువత భవిష్యత్తు అని ఫరీద్ పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు ఇక్కడ ఉంటే స్థానికంగా వందల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుందని, వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయని తెలిపారు. కానీ కాంగ్రెస్ నాయకుల స్వార్థం వల్ల మన యువత ఉపాధి అవకాశాలు నష్కల్ పాలవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బి.ఆర్.ఎస్ అల్టిమేటం: వెంటనే ఈ తరలింపు ప్రతిపాదనను విరమించుకోవాలని, డిపోను యథాతథంగా మహబూబాబాద్ జిల్లాలోనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. "కాంగ్రెస్ నాయకులారా ఖబడ్దార్.. మా జిల్లా జోలికొస్తే ఊరుకోం. మహబూబాబాద్ హక్కులను కాపాడేందుకు బి.ఆర్.ఎస్ పార్టీ, కె.సి.ఆర్ గారి సైనికులుగా ఎంతవరకైనా పోరాడుతాం. అవసరమైతే రైల్ రోకోలు, రాస్తారోకోలతో జిల్లాను స్తంభంపజేస్తామని హెచ్చరించారు. ఈ కుట్రను భగ్నం చేసేందుకు జిల్లా ప్రజలు, మేధావులు, విద్యార్థులు ఏకం కావాలని వారు పిలుపునిచ్చారు.

- అంబేద్కర్ ఆశయ సాధన కోసం అడుగులు అడుగు వేస్తున్న పార్టీ ఉమ్మడి కుటమి, ఎమ్మెల్యే డాక్టర్ చదలాడ అరవింద్ బాబు1
- ప్రతిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాం స్థానిక సంస్థల ఎన్నికలు సజావుగా జరిగేలా పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేస్తున్నామని మంచిర్యాల డీసీపీ భాస్కర్, ఎసిపి ప్రకాష్ అన్నారు. స్థానిక ఎన్నికల నేపథ్యంలో జన్నారం మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై పోలీసులు నిర్వహించారు.18 సంవత్సరాల దాటిన ప్రతి ఒక్కరూ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీఐ రమణమూర్తి, ఎస్సైలు గొల్లపల్లి అనూష, తహిసుద్దీన్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.1
- సంగారెడ్డి న్యూస్ : ఎవరు...??? షార్ట్ ఫిలిం ఎమ్మెస్సార్ క్రియేషన్స్ ఆధ్వర్యంలో ఈరోజు స్టార్ట్ అయింది ఇది ఒక హర్రర్ మరియు జిల్లా సస్పెన్స్ షార్ట్ ఫిలిం చిత్ర దర్శకుడు రాజు వర్క్ ఉంది మరియు కెమెరామెన్ శ్రవణ్ కుమార్ గౌడ్ ఈ చిత్రంనిది సుమారు 15 నిమిషాలు అతి త్వరలో సస్పెన్స్ తో కూడిన చిత్రాన్ని ప్రేక్షకులను మెప్పించేలా ఉంటుందని దర్శకుడు చెప్పడం జరిగింది మీరు కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నాo1
- ఈ రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని ఉన్న వ్యవసాయం మార్కెట్ కమిటీ *చైర్మన్స్ మీటింగ్* రాజమండ్రి మార్కెట్ కమిటీ నందు జరిగింది. ఈ మీటింగ్ నందు వ్యవసాయ మార్కెట్ కమిటీలలో పని చేస్తున్న *ఔట్ సోర్చింగ్ ఎంప్లాయిస్ యొక్క సమస్యలు* గురించి వివరిస్తూ మెమోరాండం ఆ మీటింగ్ లో ఇవ్వడము జరిగింది. సదరు మెమోరాండం నందు పేర్కొన్న సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకోని వెళ్ళాలని కోరుతూ అది వారికి ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ నుంచి అధ్యక్షులు నక్క వెంటరత్నం గారు,పోలిశెట్టి శివ గారు, తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు గంగాధర్ గారితో పాటు రాజమండ్రి కమిటీ సభ్యులు పాల్గొనడం జరిగింది.1
- Post by Omnamashivaya S1
- కోడుమూరు టౌన్‌లో జరిగే హిందూ సమ్మేళనానికి మాజీ కేంద్రమంత్రి, డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి,కోట్ల రాఘవేంద్ర రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు.ఉదయం 9 గంటలకు రాములవారి దేవాలయం వద్ద చేరుకోనున్నారు. గ్రామ పెద్దలు మధుసూదన్ రెడ్డి,హేమాద్రి రెడ్డి, మాజీ సర్పంచ్ సి.బి.లత, కేఈ రాంబాబు,సర్పంచ్ భాగ్యరత్న, ఆంధ్రయ్య,గుంతకంటి వేణుగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొననున్నారు. భక్తులు, కోట్ల అభిమానులు తప్పనిసరిగా హాజరు కావాలని నిర్వాహకులు కోరుతున్నారు.2
- Post by KLakshmi Devi1
- అసలు రమాదేవి అనే పేషెంట్ కు ఏమి జరిగింది? వివరణ నరసరావుపేట ఏరియా హాస్పిటల్ డాక్టర్ టి. నారాయణస్వామి మీడియాతో మాట్లాడుతూ..1