Shuru
Apke Nagar Ki App…
కుమారుడి జ్ఞాపకార్థం విగ్రహంతో పుట్టినరోజు వేడుకలు ... వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణానికి చెందిన వడ్లకొండ శ్రీనివాస్–సరిత దంపతుల కుమారుడు సాయి చరణ్ రెండేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. కొడుకు జ్ఞాపకాలను శాశ్వతంగా నిలుపుకోవాలనే ఉద్దేశంతో తల్లిదండ్రులు అతని రూపంలో నిలువెత్తు విగ్రహాన్ని తయారు చేయించి ఇంట్లో ప్రతిష్టించారు. నేడు కుమారుడి జన్మదినం సందర్భంగా ఆ విగ్రహానికి కొత్త రంగులు వేసి పూలమాలలతో అలంకరించి కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలను భావోద్వేగభరితంగా నిర్వహించారు. కుమారుడు తమతోనే ఉన్నాడన్న భావనతో ప్రతి ఏడాది ఇలాంటి వేడుకలు నిర్వహిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
M D Azizuddin
కుమారుడి జ్ఞాపకార్థం విగ్రహంతో పుట్టినరోజు వేడుకలు ... వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణానికి చెందిన వడ్లకొండ శ్రీనివాస్–సరిత దంపతుల కుమారుడు సాయి చరణ్ రెండేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. కొడుకు జ్ఞాపకాలను శాశ్వతంగా నిలుపుకోవాలనే ఉద్దేశంతో తల్లిదండ్రులు అతని రూపంలో నిలువెత్తు విగ్రహాన్ని తయారు చేయించి ఇంట్లో ప్రతిష్టించారు. నేడు కుమారుడి జన్మదినం సందర్భంగా ఆ విగ్రహానికి కొత్త రంగులు వేసి పూలమాలలతో అలంకరించి కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలను భావోద్వేగభరితంగా నిర్వహించారు. కుమారుడు తమతోనే ఉన్నాడన్న భావనతో ప్రతి ఏడాది ఇలాంటి వేడుకలు నిర్వహిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
More news from తెలంగాణ and nearby areas
- ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా వరంగల్ జిల్లా గీసుగొండ మండలం రెడ్డిపాలెం గ్రామంలోని విద్యా నిలయ స్కూల్‌లో మంగళవారం బాలల భద్రత మరియు మాదకద్రవ్యాల వ్యతిరేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హైదరాబాద్ నార్కోటిక్స్ విభాగం డీఎస్పీ రమేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు. మాదకద్రవ్యాల వల్ల ఆరోగ్యంతో పాటు భవిష్యత్తు కూడా నాశనం అవుతుందని చెప్పారు. బాలల భద్రతకు సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కూడా విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్, ఎంఈఓతో పాటు గీసుగొండ సీఐ విశ్వేశ్వర్ పాల్గొన్నారు. సుమారు 500 మంది విద్యార్థులు ఈ అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు.1
- గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహించాలని క్యాబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది. సెక్రటేరియట్‌లో మంత్రి శ్రీధర్ బాబు అధ్యక్షతన “గోదావరి పుష్కరాలు–2027 కేబినెట్ సబ్ కమిటీ” తొలి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, హర్కర వేణుగోపాల్ సంబంధిత శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. గోదావరి పుష్కరాలను ఈసారి కని విని ఎరుగని రీతిలో నిర్వహించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారని మంత్రులు తెలిపారు. రాష్ట్ర ప్రతిష్ఠకు అనుగుణంగా పుష్కరాల ఏర్పాట్లు అత్యంత ప్రాముఖ్యంతో చేపట్టాలని సీఎం ఇప్పటికే అధికారులకు సూచించినట్లు చెప్పారు. గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో లక్షలాది మంది భక్తులు పుష్కర స్నానాలకు తరలివస్తారని పేర్కొన్నారు. ముఖ్యంగా ధర్మపురి నియోజకవర్గ పరిధిలో గోదావరి తీరం విస్తరించి ఉండటంతో పాటు అక్కడ ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు ఉండటంతో భక్తుల రద్దీ మరింత ఎక్కువగా ఉంటుందని తెలిపారు. ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయం సహా గోదావరి తీరం వెంట ఉన్న ఆలయాలను దర్శించేందుకు దేశం నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. అందువల్ల ఘాట్‌ల అభివృద్ధి, తాత్కాలిక స్నాన ఘాట్‌లు, రహదారుల విస్తరణ, పార్కింగ్ స్థలాలు, తాగునీరు, పారిశుధ్యం, విద్యుత్, వైద్య సేవలు, భద్రత వంటి అంశాలపై ముందస్తు ప్రణాళికతో ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. పుష్కరాల సమయంలో భక్తులకు సౌకర్యవంతమైన రవాణా కోసం ప్రత్యేక బస్సులు, తాత్కాలిక వసతి కేంద్రాలు, సమాచార కేంద్రాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. అలాగే విపత్తు నిర్వహణ, పోలీస్ భద్రత, వైద్య అత్యవసర సేవలు అందుబాటులో ఉండేలా సమగ్ర ప్రణాళికతో ముందుకు వెళ్లాలని పేర్కొన్నారు. పుష్కరాల సందర్భంగా పర్యాటక అభివృద్ధికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలని, రాష్ట్రానికి వచ్చే భక్తులకు తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని పరిచయం చేసే విధంగా కార్యక్రమాలు నిర్వహించాలని సమావేశంలో సూచించారు.2
- Post by Gift maker1
- రామగుండం ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో మిస్‌మేనేజ్‌మెంట్ జరుగుతోందని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు. సంస్థ ఉత్పత్తి సామర్థ్యం పూర్తిగా వినియోగం కావడం లేదని, కేవలం 70% ప్రొడక్షన్ మాత్రమే కొనసాగుతోందన్నారు. హెడ్‌ఆఫీస్‌ను ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు మార్చాలని పలుమార్లు కేంద్రానికి లేఖలు రాసినా స్పందన రాలేదన్నారు. యూరియా నిర్వహణలో గందరగోళంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని తెలిపారు.1
- జగిత్యాల జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. పార్టీ మారుతున్నారన్న ప్రచారంపై మీడియా ప్రశ్నలకు స్పందించిన ఆయన, కాంగ్రెస్ పార్టీలో కొనసాగాలా లేదా అనే విషయంపై ఆలోచించాల్సిన పరిస్థితి ఉందన్నారు. అయితే ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. సరైన సమయం, సందర్భం వచ్చినప్పుడు నిర్ణయం తీసుకుంటానని, ఏ నిర్ణయం తీసుకున్నా మీడియా ద్వారానే వెల్లడిస్తానని స్పష్టం చేశారు.1
- నల్గొండ జిల్లా కేంద్రంలోని అన్లిమిటెడ్ షాపింగ్ కాంప్లెక్స్ వద్ద సోమవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో యువకుడి పరిస్థితి విషమంగా మారింది. స్థానిక ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అతి వేగంగా వచ్చిన కారు ఢీకొట్టిన సంఘటనలో మహిళ యువకుడు గాయపడ్డ సంఘటన తెలిసిందే.1
- హన్మకొండ:ఎల్కతుర్తి మండల కేంద్రంలో 99 రోజుల ప్రజాపాలన ప్రగతిప్రణాళిక కార్యాచరణపై సమీక్ష సమావేశం విజయవంతంగా జరిగింది. ఈ సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిధిగా పాల్గొని, స్థానిక మరియు మండల అధికారులతో ప్రగతిని సమీక్షించారు. సమావేశంలో అధికారులు ప్రస్తుత ప్రణాళిక కింద చేపట్టిన పనుల రిపోర్ట్‌ను వివరించారు. ముఖ్యంగా గ్రామీణాభివృద్ధి, స్వచ్ఛత, పౌరసౌకర్యాలు, మరియు ప్రభుత్వ సేవల అందుబాటులో ఉన్నత ప్రమాణాలను నిర్ధారించడంలో ప్రగతి ఏ స్థాయిలో ఉందో గుర్తించబడింది. మంత్రి ప్రభాకర్ సమావేశంలో భాగంగా అధికారులకు సమగ్ర మార్గదర్శక సూచనలు ఇచ్చారు మరియు ఈ కార్యక్రమం పూర్ణవంతంగా అమలు కావడానికి చర్యలను వేగవంతం చేయాలని దృష్టి పెట్టారు. మంత్రి మాట్లాడుతూ, “ప్రజాపాలనలో పారదర్శకత మరియు సమయపాలన ప్రధానమైన అంశాలు. ఈ 99 రోజుల ప్రణాళిక ద్వారా మేము ప్రతీ గ్రామానికి సమగ్రమైన సేవలు అందించడానికి కృషి చేస్తున్నాం” అని అన్నారు.1
- వరంగల్ జిల్లా తొగర్రాయి గ్రామ శివారులో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుని ఓ యువకుడు మృతి చెందిన ఘటన కలకలం రేపింది. స్థానికుల వివరాల ప్రకారం నల్లబెల్లి మండలం దస్తగిరిపల్లి గ్రామానికి చెందిన పోతరబోయిన మనోహర్ స్వామి (27) సోమవారం కొమ్మాల జాతరకు వెళ్లినట్లు సమాచారం. అనంతరం అర్థరాత్రి సమయంలో గిర్నిబావి–దుగ్గొండి రహదారి మీదుగా తిరిగి వెళ్తుండగా తొగర్రాయి గ్రామ శివారులోని మూలమలుపు వద్ద ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం తీవ్రత ఎక్కువగా ఉండటంతో మనోహర్ స్వామి అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని తదుపరి చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.1
- రాష్టంలో ఉచిత బస్సు ప్రయాణ పథకం ప్రవేశ పెట్టిన తరువాత ఇప్పటి వరకు మూడు వందల కోట్ల మంది మహిళలు ఉచితం గా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేశారని తద్వారా ఆర్టీసీకి పది వేల కోట్ల లాభం చేకూరిందని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం లో భాగంగా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, కలెక్టర్ చిత్రమిశ్రా పాల్గొన్నారు. నూతనంగా మున్సిపల్ పాలక వర్గం బాధ్యతలు చేపట్టడంతో వారికి శుభాకాంక్షలు తెలిపి హుజూరాబాద్ మున్సిపల్ అభివృద్ధికి పాటుపడాలని నూతన పాలకవర్గాన్ని సూచించారు. ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు విజయవంతం కావాలంటే ప్రజల భాగస్వామ్యం తప్పనిసరని తెలిపారు. ప్రజలందరూ పరిసరాలు శుభ్రం గా ఉండే విధం గా చూసుకోవాలని యువత చెడు మార్గం పట్టకుండా చెడు అలవాట్లకు లోనూ కాకుండా ఉండాలంటే తల్లిదండ్రులు, సమాజం బాధ్యత వహించాలని కోరారు. యువత ఎదుగుదలకు ప్రధాన కారణం విద్యేనని ఇటీవల ఒక సర్వేలో తేలిందని అందుకే పిల్లలను ప్రతి ఒక్కరు చదివించాలని కోరారు. రాబోయే రోజుల్లో స్థానిక శాసన సభ్యుడు, పార్లమెంట్ సభ్యుడి సహకారం తో హుజూరాబాద్ అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.1