ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంతో పాటు అవసరమైన మందులు అందుబాటులో ఉంచుకోవాలి : జిల్లా కలెక్టర్ రాజ కుమారి గణియా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంతో పాటు అవసరమైన మందులు అందుబాటులో ఉంచుకోవాలనీ జిల్లా కలెక్టర్ రాజ కుమారి గణియా ఆదేశించారు. గురువారం క్షేత్రస్థాయి సందర్శనలో భాగంగా గోస్పాడు మండలం, దీబగుంట్ల గ్రామం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను ఆకస్మికంగా తనిఖీ చేసి ఆరోగ్య కేంద్రం పనితీరు, అందుతున్న వైద్య సేవలు, మౌలిక వసతులను సమగ్రంగా పరిశీలించారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బందితో సమీక్ష నిర్వహించి, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు తీసుకుంటున్న చర్యలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో అమలవుతున్న వివిధ జాతీయ, రాష్ట్ర ఆరోగ్య కార్యక్రమాల పురోగతిని వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్య శాఖ నిర్దేశించిన 21 కీలక పనితీరు సూచికల (21 Indicators) ఆధారంగా మెరుగైన ర్యాంకింగ్ సాధించేలా సిబ్బందితో సమన్వయం చేసుకొని పనిచేయాలని సూచించారు. KPI కు సంబంధించి ANM లకు అవసరమైన శిక్షణ అందించి, క్షేత్రస్థాయిలో ఆరోగ్య సేవలను మరింత వేగవంతంగా, సమర్థవంతంగా అందించాలని వైద్య అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న పాత ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవనంలో వసతులను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. నూతన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో, కొత్త భవనం పూర్తయ్యే వరకు రోగులకు వైద్య సిబ్బంది ఎలాంటి ఇబ్బందులు లేకుండా తాత్కాలికంగా స్థానిక సచివాలయ భవనంలోకి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను మార్చేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రస్తుతం ప్రాథమిక చికిత్స కోసం ఒక బెడ్ అందుబాటులో ఉందని, పగటిపూట వచ్చే రోగులకు అవసరమైన చికిత్సతో పాటు అత్యవసర మందులు అందించి వైద్యుల పర్యవేక్షణలో సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. నూతన భవనం పూర్తయిన అనంతరం 6 పడకల సదుపాయం అందుబాటులోకి రానుందని వెల్లడించారు. రోగులకు అవసరమైన అన్ని రకాల మందులు అందుబాటులో ఉన్నాయనీ వైద్య అధికారులు తెలిపారు. మందుల నిల్వ కోసం ప్రత్యేక గదిని కేటాయించినట్లు తెలిపారు. ప్రస్తుతం భవన వసతుల పరిమితుల కారణంగా ప్రసవ సేవలు మినహా మిగిలిన వైద్య సేవలను నిరంతరాయంగా అందిస్తున్నట్లు తెలిపారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందేలా సిబ్బంది అంకితభావంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ గోవర్ధన్ రెడ్డితో పాటు PHC సిబ్బంది, ANMలు మరియు ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

- శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం నిర్మాణం కొరకు భూమి పూజ బండి ఆత్మకూరు మండలం జి. సీ. పాలెం గ్రామం నందు శ్రీవాణి ట్రస్ట్ ధ్వరా శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి కి దేవాలయం పూజ మరియు శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది . ఈ దేవాలయం నిర్మాణానికి రూ. 40 లక్షలు, అనుమతులు మంజూరు చేయించినటువంటి శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి గారికి గ్రామం తరపున ధన్యవాదములు తెలపడం జరిగింది. ఈ కార్యక్రమములో కంచెర్ల లింగారెడ్డి, సుబ్బయ్య, మోహనరావు, గోపాల్, వై రమణ, ప్రసాద్, వై శ్రీను, శివుడు, లక్ష్మీ రెడ్డి, సుబ్బారెడ్డి మరియు గ్రామ ప్రజలు భక్తి శ్రద్ధలతో అందరు పాల్గొని పూజా కార్యక్రమాన్ని జయప్రదం చేసినారు.1
- రైతులు ఉధ్యాన పంటలపై మెగ్గు చూపాలి:రాష్ట్ర ఉద్యాన సెరికల్చర్ డైరెక్టర్ డాక్టర్ కే. శ్రీనివాసులు రైతులు మంచి ఆదాయాన్ని ఇచ్చే ఉద్యాన పంటలపై మెగ్గు చూపాలని రాష్ట్ర ఉద్యాన సెరికల్చర్ డైరెక్టర్ డాక్టర్ కే. శ్రీనివాసులు పేర్కొన్నారు.బుధవారం మహానంది మండలం గాజులపల్లె గ్రామంలోని ఉద్యాన పంటలను సందర్శించారు. అనంతరం రైతులు వేసిన అంతర పంట యాలక్కి అరటి, 30 రకాల విత్తనాలతో వేసిన పీఎండీస్, ఫారం పాండ్లు, బిందు సేద్యం పద్ధతి ద్వారా సాగు చేస్తున్న బంతిపూలు, గులాబి, మామిడి, అన్న యాపిల్ పంటలను పరిశీలించారు. అనంతరం రైతులతో పంటల సాగు, పద్ధతులు, మార్కెటింగ్ గురించి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యాన శాఖ అధికారి నాగరాజు, జిల్లా సూక్ష్మ సేద్య సాగు అధికారిణి విజయలక్ష్మి , నంద్యాల ఉద్యాన శాఖ అధికారి హరేంద్ర, రైతులు హుస్సేన్, హుస్సేన్ రెడ్డి,మస్తాన్ తదితరులు పాల్గొన్నారు.1
- అలంపూర్: సంగమేశ్వర దేవాలయం కి వెళ్లే ప్రధాన ద్వారం వద్ద ఆర్చి ఏర్పాటు!! కూడవల్లి స్వచ్ఛంద సంస్థ సభ్యులు!! పనుల ఆటంగానికి సహకరించాలని కోరిన సభ్యులు అలంపూర్ మండల కేంద్రంలో ఉన్న సంగమేశ్వర దేవాలయానికి వెళ్లే ప్రధాన ద్వారం వద్ద ఆర్చి లేక వచ్చిన భక్తులు దేవాలయం ఎక్కడ ఉందో తెలియక ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో స్పందించిన కూడవల్లి స్వచ్ఛంద సంస్థ సభ్యులు దాదాపు 18 లక్షలతో ఆర్చి పనులు ప్రారంభించారు. ఈ పనుల ద్వారా భక్తులకు కొద్దిగా ఆటంకం కలగవచ్చని భక్తులు సహకరించాలని వారు కోరారు.1
- వెలిగొండ ప్రాజెక్టు నీటి విడుదల సందర్భంగా కృతజ్ఞతగా 1000 బైకులతో భారీ ర్యాలీ ఆగస్టు 31వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వెలుగొండ ప్రాజెక్టు నీటి విడుదల సందర్భంగా కృతజ్ఞతగా మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి మరియు కూటమి నేతల ఆధ్వర్యంలో మార్కాపురం పట్టణంలో 1000 బైకులతో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ బైక్ ర్యాలీకి నియోజకవర్గంలోని కూటమి శ్రేణులు,రైతులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. మొదటిగా మార్కాపురం పట్టణంలోని అల్లూరి పోలేరమ్మ గుడి వద్ద నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఈ బైక్ ర్యాలీ తర్లుపాడు రోడ్డు, ఆర్టీసీ బస్టాండ్, కోర్ట్ సెంటర్, కంభం బస్టాండ్, దోర్నాల బస్టాండ్, సప్తగిరి సెంటర్, తూర్పు వీధి మీదుగా శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి మాట్లాడుతూ ఎన్నో ఏళ్ల కల అయిన వెలుగొండ ప్రాజెక్టు 1996వ సంవత్సరంలో నారా చంద్రబాబునాయుడు శంకుస్థాపన చేశారని అనంతరం పలు ఇబ్బందులను దాటుకొని ఈ నెల 31వ తేదీన ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవం జరుపుకోవడం ఈ ప్రాంత ప్రజలకు పట్టరాని సంతోషంతో ఉన్నారని అన్నారు. వైసిపి నాయకులు నిర్వాసితులను రెచ్చగొట్టాలని చూస్తున్నారని కానీ ఇప్పటికే 768 కోట్ల రూపాయలు నిర్వాసితులకు పరిహారంగా చెల్లించడం జరిగిందని ప్రతి నిర్వాసితునికి న్యాయం జరుగుతుందని ఈ విషయంలో ఎవరు ఎటువంటి అపోహలకు లోను కావద్దని ముంపు గ్రామాల ప్రజలు త్యాగదనులని వారి వలన నాలుగు లక్షల 60 వేల ఎకరాలకు సాగునీరు, 22 లక్షల మందికి త్రాగునీరు అందించడం జరుగుతుందని వారి త్యాగాలు వెలకట్టలేనివి అని అన్నారు. ఈనెల 31వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెలుగును ప్రాజెక్ట్ నుండి నీటి విడుదల చేసి జల హారతి కార్యక్రమంలో పాల్గొంటారని ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరూ విచ్చేసి విజయవంతం చేయగలరని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టిడిపి పోల్ మేనేజ్మెంట్ క్లస్టర్ ఇంచార్జ్ కందుల రామిరెడ్డి, యువ నాయకులు కందుల విగ్నేష్ రెడ్డి , మార్కాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ ఇమ్మడి కాశీనాథ్ , బిజెపి జిల్లా అధ్యక్షులు పీవీ కృష్ణారావు , కూటమి నాయకులు కార్యకర్తలు వారి సంఖ్యలో పాల్గొన్నారు.1
- హైవే భద్రతా లోపాలే ప్రమాదాలకు కారణం: జేసీ ప్రభాకర్ రెడ్డి కోదాడ వద్ద జరిగిన ప్రైవేట్ బస్సు ప్రమాదంపై తాడిపత్రి మాజీ మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు.ప్రమాదానికి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు తప్పిదమే కారణమని చెప్పడం సరికాదని అన్నారు.జాతీయ రహదారి నిర్వహణ లోపాలు, భద్రతా ప్రమాణాల అమలులో నిర్లక్ష్యమే ప్రమాదాలకు ప్రధాన కారణమని ఆరోపించారు.హైవేపై ఆగిపోయిన వాహనాలకు సరైన రక్షణ కల్పించాల్సిన బాధ్యత జాతీయ రహదారి నిర్వహణ సంస్థలదేనని జేసీ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు.ఆగి ఉన్న వాహనాల చుట్టూ సరౌండింగ్ లైట్లు, హెచ్చరిక సంకేతాలు ఏర్పాటు చేయాలని సూచించారు.జాతీయ రహదారి కాంట్రాక్టర్లు తప్పనిసరిగా భద్రతా నిబంధనలు పాటించాలని స్పష్టం చేశారు.హైవేపై కనీస భద్రతా జాగ్రత్తలు పాటించకపోవడం వల్లే తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు.జాతీయ రహదారి అధికారులు తగిన భద్రతా చర్యలు తీసుకుంటే ప్రమాదాలను నివారించవచ్చని పేర్కొన్నారు.ప్రతి ప్రమాదం జరిగినప్పుడు ప్రైవేట్ బస్సు యజమానులనే తప్పుబట్టడం సరికాదని జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. జాతీయ రహదారి నిర్వహణ లోపాలపై ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ప్రైవేట్ ట్రావెల్స్ యజమానులు కూడా హైవే భద్రతపై గళమెత్తాలని పిలుపునిచ్చారు. జాతీయ రహదారులపై సరైన భద్రతా సదుపాయాలు, ప్రమాణాలను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.1
- మంగనూరులో విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో రాఖీ పండుగ వేడుకలు బిజినేపల్లి: మండలంలోని మంగనూరు గ్రామంలో విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో రక్షాబంధన్ వేడుకలు కన్నులపండువగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా పాఠశాల విద్యార్థులు ఒకరికొకరు రక్షణ సూత్రాలు కట్టుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ‘నువ్వు నాకు రక్ష.. నేను నీకు రక్ష, మనమంతా దేశానికి రక్ష’ అంటూ విద్యార్థులు దేశభక్తిని చాటారు. అనంతరం మహాత్మా పూలే, అంబేద్కర్‌లకు జైకొడుతూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో విజ్ఞాన వేదిక అధ్యక్షుడు శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శి కొండయ్య, సభ్యులు వెంకటయ్య, రాములు తదితరులు పాల్గొన్నారు1
- గాజుల పల్లెలో బంతిపూల సాగు.. లాభాలు బాగు..ఉద్యాన పంటలపై ఆసక్తి రైతులు వరి, ఇతర పంటల సాగుతో పాటు ఉద్యాన పంటలపై ఆసక్తి చూపుతున్నారు. మహానంది మండలం గాజులపల్లె గ్రామంలో రైతు హుస్సేన్ రెడ్డి బిందు సేద్యం, విడ్ మ్యాట్ ద్వారా నాలుగు ఎకరాల పొలంలో బంతి పూలు, మూడు ఎకరాల్లో గులాబీ పూలు సాగుచేస్తూ ఇతర రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.ఎకరాకు సుమారు 4 టన్ను పూలు దిగుబడి వస్తాయని.. బంతి సాగు వల్ల మంచి ఆదాయం వస్తుందని భావిస్తున్నట్లు రైతు తెలిపారు.1
- అక్రమంగా బ్లాస్టింగ్ కు పాల్పడుతున్న భారత్‌మాల ప్రాజెక్టు కంపెనీపై చర్యలు తీసుకోవాలి.. పురుగుల మందు తాగి చికిత్స పొందుతున్న రైతును పరామర్శించిన తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్) గద్వాల నియోజకవర్గ ఇన్‌చార్జి గొంగళ్ల రంజిత్. జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం సల్కాపురం గ్రామంలో భారత్ మాల ప్రాజెక్టు కంపెనీకి సంబంధించిన క్రషర్ మిషన్ బ్లాస్టింగ్ వల్ల వచ్చే దూలి మరియు ప్రకంపనల వల్ల తన బోర్ ఎండిపోతుందని అధికారులకు ఎన్నిసార్లు విన్నవించిన న్యాయం జరగలేదని రైతు యేసు పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడి గద్వాల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యేసును పరామర్శించి, ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న గొంగల్ల రంజిత్ కుమార్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గట్టు మండలం సల్కాపురం గ్రామానికి చెందిన రైతు యేసు తన పట్టా భూమిలో సుమారు మూడు ఎకరాల్లో వ్యవసాయం చేసుకుంటున్నారని తెలిపారు. ఆయన వ్యవసాయ భూమికి సమీపంలో భారత్‌మాల ప్రాజెక్టు కంపెనీకి సంబంధించిన కాంట్రాక్టర్ బ్లాస్టింగ్ కు పాల్పడటం తో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లే పరిస్థితి ఏర్పడిందన్నారు. క్రషర్ నిర్వహణతో పాటు తరచూ బ్లాస్టింగ్ చేపట్టడం వల్ల 100 మందికి పైగా రైతులు, గ్రామ ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని అన్నాన్నారు. బ్లాస్టింగ్ సమయంలో రాళ్లు ఎగిరిపడటంతో పాటు భారీ ప్రకంపనలు చోటుచేసుకుంటున్నాయని, దీంతో రైతుల పంట పొలాల్లో బోర్లు ప్రకంపన చెంది బోర్లు చెడిపోతున్నాయని , ప్రజల భద్రతకు ముప్పు ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల ప్రాణాలు, రైతుల పంటలకు నష్టం కలిగించే విధంగా క్రషర్ నిర్వహణ కొనసాగించడం సరికాదని అన్నారు. రైతు సమస్యపై జిల్లా ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి భారత్ మాల ప్రాజెక్టు కంపెనీ క్రషర్ మిషన్‌ను నిలిపివేయడంతో పాటు బ్లాస్టింగ్ వల్ల ప్రజలకు, రైతులకు కలుగుతున్న ఇబ్బందులపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. రైతులకు న్యాయం జరిగే వరకు తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.సమస్య పరిష్కారం కాకపోతే సల్కాపురం గ్రామంలో పెద్ద ఎత్తున ఉద్యమ కార్యాచరణ చేపడతామని, అవసరమైతే రైతుల తరఫున న్యాయస్థానాన్ని ఆశ్రయించి న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం, సంబంధిత అధికారులు వెంటనే స్పందించి రైతులు, గ్రామ ప్రజల భద్రతకు భరోసా కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రక్షణ సేన నాయకులు బుచ్చిబాబు, కార్తీక్ విష్ణు, మీసాల కిష్టన్న, గోవిందు, మల్దకల్ విజయ్, రమేష్, రంగస్వామి, లక్ష్మన్న, స్వామి, సామెల్, ప్రేమ్‌రాజ్, చిన్న రాముడు, సుదర్శన్ నాయుడు, జమ్మన్న, గోపాల్, సుభాష్, దొడ్డన్న, భీమన్ గౌడ్, వీరేష్, రేనప్ప, శాంతిరాజ్ తదితరులు పాల్గొన్నారు.2