రోడ్డు భద్రత మరియు సామాజిక అవగాహనపై ఎస్.ఐ వినోద్ పిలుపు అడ్డతీగల: మండలంలోని కొత్తపాలెం గ్రామంలో ఆదివారం ఎస్.ఐ వినోద్ గారి ఆధ్వర్యంలో గ్రామస్తులతో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాహనదారులు ప్రయాణాల్లో తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, హైవేలపై ప్రయాణించేటప్పుడు తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ లైసెన్స్ మరియు బైక్ ఇన్సూరెన్స్ కలిగి ఉండాలని స్పష్టం చేశారు. సామాజిక అంశాలపై చర్చిస్తూ.. మహిళల భద్రత పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఆడపిల్లలపై ఎటువంటి అకృత్యాలు జరగకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. నేటి కాలంలో పెరుగుతున్న ఆత్మహత్యల నివారణకు తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనపై నిరంతరం నిఘా ఉంచి, వారిలో ధైర్యాన్ని నింపాలని వివరించారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో ప్రభుత్వం అందించే పౌష్టికాహారాన్ని పిల్లలకు సక్రమంగా అందించాలని, విద్యార్థులను ఉన్నత చదువులు చదివించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ అడ్డతీగల మండల అధ్యక్షులు జర్తా వెంకటరమణారెడ్డి గారితో పాటు గ్రామ పెద్దలు, మహిళలు మరియు యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
రోడ్డు భద్రత మరియు సామాజిక అవగాహనపై ఎస్.ఐ వినోద్ పిలుపు అడ్డతీగల: మండలంలోని కొత్తపాలెం గ్రామంలో ఆదివారం ఎస్.ఐ వినోద్ గారి ఆధ్వర్యంలో గ్రామస్తులతో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాహనదారులు ప్రయాణాల్లో తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, హైవేలపై ప్రయాణించేటప్పుడు తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ లైసెన్స్ మరియు బైక్ ఇన్సూరెన్స్ కలిగి ఉండాలని స్పష్టం చేశారు. సామాజిక అంశాలపై చర్చిస్తూ.. మహిళల భద్రత పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఆడపిల్లలపై ఎటువంటి అకృత్యాలు జరగకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. నేటి కాలంలో పెరుగుతున్న ఆత్మహత్యల నివారణకు తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనపై నిరంతరం నిఘా ఉంచి, వారిలో ధైర్యాన్ని నింపాలని వివరించారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో ప్రభుత్వం అందించే పౌష్టికాహారాన్ని పిల్లలకు సక్రమంగా అందించాలని, విద్యార్థులను ఉన్నత చదువులు చదివించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ అడ్డతీగల మండల అధ్యక్షులు జర్తా వెంకటరమణారెడ్డి గారితో పాటు గ్రామ పెద్దలు, మహిళలు మరియు యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
- పిఠాపురం: యువత డ్రగ్స్ వంటి దురలవాట్లకు దూరంగా ఉండి, దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆకాంక్షిస్తూ పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలులోని ఆదర్శ కళాశాల వేదికగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వైబ్రంట్స్ ఆఫ్ కలాం ఆధ్వర్యంలో దండి మార్చ్ 2.0 పేరుతో చేపట్టిన సైకిల్ యాత్రలో భాగంగా విద్యార్థులకు మాదకద్రవ్యాల వినియోగంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఈగల్ అడిషనల్ ఎస్పీ ప్రభాకర్ బాబు మాట్లాడుతూ... మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే చట్టపరమైన ఇబ్బందులను, శిక్షలను వివరించారు. చిన్న వయసులో డ్రగ్స్‌కు బానిసలైతే భవిష్యత్తు నాశనమవడమే కాకుండా, ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హులవుతారని హెచ్చరించారు. వ్యసనాల నుంచి బయటపడటానికి ఉన్న మార్గాలను విద్యార్థులకు సూచించారు. కాకినాడ జిల్లా ఈగల్ సీఐ (సర్కిల్ ఇన్‌స్పెక్టర్) మాట్లాడుతూ... వందల అడుగుల ఎత్తులో ఎగిరే గ్రద్ద భూమిపై ఉన్న ఆహారాన్ని ఎంత స్పష్టంగా గమనిస్తుందో...ఈగల్ విభాగం మరియు లా అండ్ ఆర్డర్ పోలీసులు కూడా అదే స్థాయిలో నిఘా ఉంచుతున్నారని, డ్రగ్స్, గంజాయి విక్రయించినా లేదా వినియోగించినా చట్టం నుంచి తప్పించుకోలేరని, డ్రగ్స్ వినియోగం అనేది కేవలం వ్యక్తిగత సమస్య కాదని, అది జాతీయ భద్రతకే ముప్పు అని ఆయన స్పష్టం చేశారు. ఏదైనా సమాచారం ఉంటే ఈగల్ టోల్ ఫ్రీ నంబర్ 1972 కు ఫిర్యాదు చేయాలని సూచించారు. వైబ్రంట్స్ ఆఫ్ కలాం ఫౌండర్ విజయ్ కలాం మాట్లాడుతూ... అబ్దుల్ కలాంను యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు. నిజమైన దేశభక్తి ఉన్నవారు ఎవరూ డ్రగ్స్ జోలికి వెళ్లరని, విద్యార్థులు చదువుపై ఏకాగ్రత వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆదర్శ కళాశాల చైర్మన్ బుర్రా అనుబాబు,ఈగల్ ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్వరరావు,గొల్లప్రోలు ఎస్సై ఎన్. రామకృష్ణ, ప్రిన్సిపాల్ వి. శ్రీనివాసరావు, వైబ్రంట్స్ ఆఫ్ కలాం కోఆర్డినేటర్లు, కళాశాల అధ్యాపకులు, ఎన్ఎస్ఎస్ విద్యార్థులు మరియు ఈగల్ విభాగం సిబ్బంది పాల్గొన్నారు.3
- Post by Rai Narendra1
- ఈ సందర్భంగా దేవతామూర్తులకు పంచామృతాభిషేకం, బిల్వార్చన, పుష్పాలంకరణ చేయించిన తరువాత దేవాలయ ఆవరణలో ముఖ్యమంత్రి గారితో పాటు మంత్రుల బృందాన్ని దేవాలయ అధికారులు స్వామి శేషవస్త్రాలతో సత్కరించి దేవతామూర్తి ప్రతిమను, చిత్రపటాలను కానుకగా అందజేశారు. వేద పండితుల చేత వేదాశీర్వచనం, తీర్థప్రసాదాలను స్వీకరించారు. అనంతరం ముఖ్యమంత్రి గారు కాళేశ్వరం ఆలయఅభివృద్ధి పనులకు భూమిపూజ, బస్ స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.1
- **“Wish you a blessed Akshaya Tritiya ✨ May prosperity and positivity fill your life. Choose comfort that stays with you every day. MGM Vests – Wear Prosperity.”**1
- నరసరావుపేట మండలం లింగంగుంటలో రాజకీయ ఘర్షణ చోటుచేసుకుంది. వైసీపీ సోషల్ మీడియా ప్రెసిడెంట్ హన్నుపై టీడీపీ నేతలు దాడి చేశారని ఆయన బంధువులు ఆరోపించారు. ఈ దాడిలో హన్నుకు గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం తక్షణమే ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై బాధిత బంధువులు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. గ్రామంలో ఉద్రిక్తత నెలకొనకుండా పోలీసులు నిఘా ఉంచారు. దాడికి గల పూర్తి కారణాలు మరియు ఇతర వివరాలు తెలియాల్సి ఉంది.1
- ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఏప్రిల్ 20వ తేదీ నుండి 26వ తేదీ వరకు వారం రోజులు రాష్ట్రవ్యాప్తంగా అన్ని వసతి గృహాలు సంక్షేమ విద్యాసంస్థలలో సంక్షేమ వారోత్సవాలు ప్రారంభం అయ్యాయి, మహబూబాబాద్ జిల్లా గూడూరు మరిమిట్టా *మహాత్మ జ్యోతిరావు పూలే వసతిగృహం* (బాలికలు) లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో *జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్* పాల్గొని పిల్లలతో కలిసి భోజనం చేశారు, ఈ సందర్భంగా కలెక్టర్ మహాత్మ జ్యోతిరావు పూలే వసతి గృహంలో పరిసరాలను పరిశీలించారు, ఈ వారం రోజులలో ప్రతిరోజు ఒక థీమ్ ద్వారా వసతి గృహాలలో సానిటేషన్, మైనర్ రిపేర్, హెల్త్, స్టోర్ పరిసరాల పరిశుభ్రత తదితర అంశాలపై ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు, వసతి గృహంలోని స్టోర్ గది, తరగతి గదులు, కిచెన్, డైనింగ్ హాల్, మరుగుదొడ్లు, లను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సంబంధిత వసతి గృహాల సిబ్బంది ఆదేశించారు, భోజనం సిద్ధం చేసే సిబ్బంది కి షెడ్యూల్ ప్రకారం వైద్య పరీక్షలు నిర్వహించాలని సూచించారు, అన్ని వసతి గృహాలలో ఫిర్యాదుల బాక్సులు ఏర్పాటు చేయాలని సూచించారు, విద్యార్థిని, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు, డైట్ నేను ప్రకారం పక్కాగా నాణ్యమైన రుచికరమైన ఆహారాన్ని అందించాలని, విద్యతోపాటు క్రీడా మానసిక వికాసం తదితర అంశాలపై శిక్షణ ఇప్పించాలని, సమ్మర్ క్యాంపు ల ద్వారా పిల్లలకు క్రీడల్లో పాల్గొనే అవకాశం కల్పించాలన్నారు, పిల్లల యొక్క విద్యాసామర్ధ్యాలను స్వయంగా పరిశీలించారు నూతన టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డిజిటల్ తరగతుల ద్వారా అత్యాధునిక వినూత్న రీతిలో విద్యాబోధనలు అందించాలని ఉపాధ్యాయునీ ఉపాధ్యాయులకు సూచించారు, అత్యుత్తమ ఫలితాలను సాధించేందుకు కృషి చేయాలని, ఈ వారం రోజులు అన్ని విద్యాసంస్థలలో రోజువారి కార్యక్రమాలను పకడ్బందీగా నిర్వహించాలని తెలిపారు, ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈరోజు నుండి ఏప్రిల్ 26 వరకు వారం రోజులు జిల్లాలో సంక్షేమ వారోత్సవాలను నిర్వహించడం కోసం ఇప్పటికే పక్కా ప్రణాళికతో ప్రతి ఒక్కరికి వసతి గృహాలు హాస్టల్స్, విద్యాసంస్థలను కేటాయించడం జరిగిందని తెలిపారు, కలెక్టర్ వెంట గూడూరు తాసిల్దార్ నాగభవాని, ఎంపీడీవో, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. -1
- పిఠాపురం: పేదవాడు సొంత ఇల్లు కట్టుకోవాలన్నా రాజకీయ నాయకులకు 'లంచాలు' ఇచ్చుకోవాల్సిన దుస్థితి పిఠాపురంలో నెలకొంది. ఇంటి నిర్మాణం చేపట్టిన ఒక పేద మహిళను జనసేన నాయకులు బెదిరింపులకు గురిచేయడం ఇప్పుడు స్థానికంగా కలకలం రేపుతోంది. ఘటన వివరాల్లోకి వెళ్తే... పిఠాపురం జగ్గయ్య చెరువు కాలనీకి చెందిన కఠారి సత్యవతి అనే పేద మహిళకు ప్రభుత్వం నుండి రెండు సెంట్ల పట్టా మంజూరైంది. తనకున్న కొద్దిపాటి స్థలంలో ఆమె ఇంటి నిర్మాణం చేపట్టింది. ఆదివారం ఇంటికి స్లాబ్ వేసేందుకు సిద్ధమవగా, జనసేన పార్టీకి చెందిన కొందరు నాయకులు అక్కడకు చేరుకుని దౌర్జన్యానికి దిగారని, మాకు 60 వేల రూపాయలు ఇస్తేనే ఇల్లు కట్టనిస్తాం.. లేదంటే ఇక్కడ ఇటుక కూడా కదలనివ్వం" అంటూ సత్యవతిని బెదిరించారని బాధితురాలు వాపోయారు. నేను ఎంతో కష్టపడి ఇల్లు కట్టుకుంటుంటే అడ్డుకుంటున్నారు. చివరకు పవన్ కళ్యాణ్ వచ్చి చెప్పినా సరే, మాకు డబ్బులు ఇవ్వాల్సిందేనని వారు తెగేసి చెబుతున్నారు" అని ఆవేదన వ్యక్తం చేశారు. వీరి అరాచకం వల్ల పని మధ్యలో ఆగిపోయి,సుమారు 20 వేల రూపాయల వరకు నష్టం వాటిల్లిందని ఆమె కన్నీరుమున్నీరయ్యారు. న్యాయం కోసం బాధితురాలు సిపిఐ నాయకులను ఆశ్రయించగా పిఠాపురం సిపిఐ నాయకులు సాకా రామకృష్ణ,ఖండవల్లి సుబ్బారావు తదితరులు ఆమెకు అండగా నిలిచారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ.. అధికార గర్వంతో పేద ప్రజలను వేధించడం సరికాదని మండిపడ్డారు. పట్టా ఉన్న స్థలంలో ఇల్లు కట్టుకుంటుంటే లంచాల కోసం బెదిరించడం హేయమైన చర్య అని ధ్వజమెత్తారు. ఈ అక్రమ వసూళ్లు, బెదిరింపులపై బాధితురాలు మరియు సిపిఐ నాయకులు కలిసి పాడా ఆఫీసులో ఫిర్యాదు చేశారు. పోలీసులు మరియు సంబంధిత అధికారులు వెంటనే స్పందించి బాధితురాలికి రక్షణ కల్పించాలని, దౌర్జన్యానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధితులకు న్యాయం జరగని పక్షంలో సిపిఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని వారు హెచ్చరించారు.1
- Post by Ramprasad islavath1
- గుంటూరు: ప్రత్తిపాడులో అంకమ్మ గుడి సెంటర్ వద్ద ఆర్టీసీ బస్సు టైర్ క్రింద మహిళ పడిన సంఘటన సోమవారం చోటుచేసుకుంది.ఈ సంఘటనలోరెండు కాళ్లు నుజ్జునుజ్ అయ్యాయి.ప్రత్తిపాడు మిరపకాయలకు కూలి పని చేసుకుని బస్సు ఎక్కే క్రమంలో జారిపడి ప్రమాదం జరిగింది. ప్రమాదానికి గురి అయిన మహిళ పెదనందిపాడు కు చెందిన బొమ్మతోటి సౌదామని అనే మహిళ గా గుర్తించారు.1