logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి. - జిల్లా కలెక్టర్ కు పిఠాపురం జర్నలిస్టుల వినతి పిఠాపురం: జర్నలిస్టుల డిమాండ్స్ డే సందర్భంగా... జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏపిడబ్ల్యూజేఎఫ్, ఏపీబీజేఏ సంయుక్తంగా పిఠాపురం పాడా కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు మాట్లాడుతూ... రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది జర్నలిస్టులు ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తూ ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువస్తున్నప్పటికీ అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ పెండింగ్‌లో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యను తక్షణమే పరిష్కరించి అర్హులైన వారికి ఇళ్ల స్థలాలు కేటాయించాలి. మీడియా కమిషన్ ఏర్పాటు చేసి జర్నలిస్టుల హక్కులు, సంక్షేమం, భద్రతకు సంబంధించిన అంశాలపై సమగ్ర విధానాన్ని అమలు చేయాలి. జర్నలిస్టులకు హెల్త్ కార్డులు జారీ చేసి, నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలి. జర్నలిస్టులపై దాడులు, బెదిరింపులను అరికట్టేందుకు ప్రత్యేక చట్టం తీసుకురావాలి. ప్రతి జిల్లాలో జర్నలిస్టుల భవనాల నిర్మాణానికి స్థలాలు కేటాయించి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలి. జర్నలిస్టులకు రాయితీపై నివాస స్థలాలు, గృహ నిర్మాణ సౌకర్యాలు కల్పించాలి. అక్రిడిటేషన్ కార్డుల జారీ ప్రక్రియను పారదర్శకంగా, వేగవంతంగా పూర్తి చేయాలి. జర్నలిస్టుల పిల్లలకు విద్యా పరంగా ప్రత్యేక రాయితీలు, స్కాలర్‌షిప్‌లు అందించాలి. పాత్రికేయుల సంక్షేమ నిధిని మరింత బలోపేతం చేసి ఆర్థిక సహాయాన్ని పెంచాలి. జర్నలిస్టుల వృద్ధాప్య పెన్షన్, ప్రమాద బీమా, ఆరోగ్య భద్రత వంటి సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో పిఠాపురం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు పాల్గొన్నారు.

2 hrs ago
user_Prasanna kumar Rowthu
Prasanna kumar Rowthu
Press advisory పిఠాపురం, కాకినాడ, ఆంధ్రప్రదేశ్•
2 hrs ago
62a6b895-6b76-4b49-a85d-f74cb9fd74ba

More news from Kakinada and nearby areas
  • డీఎస్సీపై లోకేష్ విసిరిన సవాల్‌కు సమాధానం చెప్పలేక జగన్ బెంగళూరుకు వెళ్లారు – ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి వ్యాఖ్యలు ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి మీడియా సమావేశంలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై విమర్శలు చేశారు. డీఎస్సీ అంశంపై మంత్రి నారా లోకేష్ విసిరిన సవాల్‌కు సమాధానం చెప్పలేక జగన్ బెంగళూరుకు వెళ్లారని ఆయన వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో డీఎస్సీ నిర్వహణ, విద్యా రంగానికి సంబంధించిన పలు అంశాలపై మాట్లాడిన ఆయన, ప్రభుత్వ చర్యలను వివరించారు. అలాగే ప్రతిపక్షం చేస్తున్న విమర్శలకు సమాధానం ఇస్తూ పలు రాజకీయ అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు. ఈ మీడియా సమావేశం అమరావతిలోని ఎన్టీఆర్ భవన్‌లో నిర్వహించబడగా, అక్కడి నుంచి ప్రత్యక్ష ప్రసారం చేశారు.
    1
    డీఎస్సీపై లోకేష్ విసిరిన సవాల్‌కు సమాధానం చెప్పలేక జగన్ బెంగళూరుకు వెళ్లారు – ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి వ్యాఖ్యలు
ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి మీడియా సమావేశంలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై విమర్శలు చేశారు. డీఎస్సీ అంశంపై మంత్రి నారా లోకేష్ విసిరిన సవాల్‌కు సమాధానం చెప్పలేక జగన్ బెంగళూరుకు వెళ్లారని ఆయన వ్యాఖ్యానించారు.
ఈ సందర్భంగా రాష్ట్రంలో డీఎస్సీ నిర్వహణ, విద్యా రంగానికి సంబంధించిన పలు అంశాలపై మాట్లాడిన ఆయన, ప్రభుత్వ చర్యలను వివరించారు. అలాగే ప్రతిపక్షం చేస్తున్న విమర్శలకు సమాధానం ఇస్తూ పలు రాజకీయ అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు.
ఈ మీడియా సమావేశం అమరావతిలోని ఎన్టీఆర్ భవన్‌లో నిర్వహించబడగా, అక్కడి నుంచి ప్రత్యక్ష ప్రసారం చేశారు.
    user_Apsv9 News channel
    Apsv9 News channel
    Media company Yeleswaram, Kakinada•
    22 hrs ago
  • కృష్ణవరం పోలవరం కాల్వ పనులు పరిశీలించిన మంత్రి నిమ్మల.. వెంట ఎమ్మెల్యే నెహ్రూ కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం కృష్ణవరం వద్ద పోలవరం ఎడమ కాల్వలో జరుగుతున్న పనులను రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభతో కలిసి పరిశీలించారు. అనంతరం పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం రెండో దశ పంపింగ్ స్టేషన్‌ను సందర్శించారు. తొండంగి మండలం బెండపూడి వద్ద ఎన్‌హెచ్ క్రాసింగ్ వంతెన నిర్మాణ పనులను కూడా పరిశీలించారు. అధికారులకు పనులు వేగవంతంగా, నాణ్యతతో పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు.
    1
    కృష్ణవరం పోలవరం కాల్వ పనులు పరిశీలించిన మంత్రి నిమ్మల.. వెంట ఎమ్మెల్యే నెహ్రూ
కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం కృష్ణవరం వద్ద పోలవరం ఎడమ కాల్వలో జరుగుతున్న పనులను రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభతో కలిసి పరిశీలించారు. అనంతరం పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం రెండో దశ పంపింగ్ స్టేషన్‌ను సందర్శించారు. తొండంగి మండలం బెండపూడి వద్ద ఎన్‌హెచ్ క్రాసింగ్ వంతెన నిర్మాణ పనులను కూడా పరిశీలించారు. అధికారులకు పనులు వేగవంతంగా, నాణ్యతతో పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు.
    user_SAI DURGA
    SAI DURGA
    Local News Reporter కిర్లంపూడి, కాకినాడ, ఆంధ్రప్రదేశ్•
    19 hrs ago
  • ఆగస్టు 2న మూలారెడ్డి వర్ధంతి కార్యక్రమాలు :ఎమ్మెల్యే నల్లమిల్లి దివంగత మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి మూలారెడ్డి వర్ధంతి సందర్భంగా ఆగస్టు 2న బలభద్రపురంలో స్మారక పురస్కారాల సభ, ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి తెలిపారు. ముఖ్య అతిథిగా ఉమ్మడి ఏపీ మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి హాజరవుతారని, సత్యవాణి, డాక్టర్ రామచంద్రరెడ్డిలకు పురస్కారాలు అందజేస్తామన్నారు.పసలపూడిలో మూలారెడ్డి విగ్రహావిష్కరణ జరుగుతుందని,కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
    1
    ఆగస్టు 2న మూలారెడ్డి వర్ధంతి కార్యక్రమాలు :ఎమ్మెల్యే నల్లమిల్లి 
దివంగత మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి మూలారెడ్డి వర్ధంతి సందర్భంగా ఆగస్టు 2న బలభద్రపురంలో స్మారక పురస్కారాల సభ, ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి తెలిపారు. ముఖ్య అతిథిగా ఉమ్మడి ఏపీ మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి హాజరవుతారని, సత్యవాణి, డాక్టర్ రామచంద్రరెడ్డిలకు పురస్కారాలు అందజేస్తామన్నారు.పసలపూడిలో మూలారెడ్డి విగ్రహావిష్కరణ జరుగుతుందని,కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
    user_DEVENDRA
    DEVENDRA
    Journalist అనపర్తి, తూర్పు గోదావరి, ఆంధ్రప్రదేశ్•
    15 hrs ago
  • ఆషాడ మాసం సందర్భంగా శాకంబరీ దేవిగా అలంకరణలో దర్శనమిస్తున్న నూకాలమ్మ ఆషాడ మాసం పర్వదినం పురస్కరించుకొని శుక్రవారం నాడు ఎస్ అన్నవరం నుకాలమ్మ ఆలయంలో అమ్మవారిని శాకంబరీ దేవిగా అలంకరించారు. కాకినాడ జిల్లా తుని మండలం ఎస్.అన్నవరం గ్రామంలో శ్రీ నూకాలమ్మ తల్లి అమ్మవారి ని పలు రకాల కూరగాయలు పళ్ళు తో శాకంబరీ దేవిగా అలంకరించారు. అనంతరం అమ్మవారికి వేద పండితులు ఆధ్వర్యంలో శాస్త్రాకంగా పూజలు నిర్వహించి భక్తులకు దర్శనానికి అనుమతిని ఇచ్చారు. నిర్వాహకులు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
    1
    ఆషాడ మాసం సందర్భంగా శాకంబరీ దేవిగా అలంకరణలో దర్శనమిస్తున్న నూకాలమ్మ
ఆషాడ మాసం పర్వదినం పురస్కరించుకొని శుక్రవారం నాడు ఎస్ అన్నవరం నుకాలమ్మ ఆలయంలో అమ్మవారిని శాకంబరీ దేవిగా అలంకరించారు. కాకినాడ జిల్లా తుని మండలం ఎస్.అన్నవరం గ్రామంలో శ్రీ నూకాలమ్మ తల్లి అమ్మవారి ని పలు రకాల కూరగాయలు పళ్ళు తో శాకంబరీ దేవిగా అలంకరించారు. అనంతరం అమ్మవారికి వేద పండితులు ఆధ్వర్యంలో శాస్త్రాకంగా పూజలు నిర్వహించి భక్తులకు దర్శనానికి అనుమతిని ఇచ్చారు. నిర్వాహకులు  భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
    user_Machha Mallesh
    Machha Mallesh
    Taxi Driver తుని, కాకినాడ, ఆంధ్రప్రదేశ్•
    18 hrs ago
  • వికలాంగులకు వీల్‌చైర్ల పంపిణీ చేసిన ఎస్ ఐ వెంకటేష్...... ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం రంగారావు బంజరు గ్రామంలో జోనేబోయిన చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ముగ్గురు వికలాంగులకు వీల్‌చైర్లు పంపిణీ చేశారు. ఈ సేవా కార్యక్రమాన్ని వి.ఎం. బంజరు ఎస్‌ఐ వెంకటేష్ అభినందించారు.
    1
    వికలాంగులకు వీల్‌చైర్ల పంపిణీ చేసిన ఎస్ ఐ వెంకటేష్......

ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం రంగారావు బంజరు గ్రామంలో జోనేబోయిన చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ముగ్గురు వికలాంగులకు వీల్‌చైర్లు పంపిణీ చేశారు. ఈ సేవా కార్యక్రమాన్ని వి.ఎం. బంజరు ఎస్‌ఐ వెంకటేష్ అభినందించారు.
    user_Tharun
    Tharun
    Local News Reporter సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    3 hrs ago
  • కృష్ణవరం పోలవరం కాల్వ పనులు పరిశీలించిన మంత్రి నిమ్మల.. వెంట ఎమ్మెల్యే నెహ్రూ కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం కృష్ణవరం వద్ద పోలవరం ఎడమ కాల్వలో జరుగుతున్న పనులను రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభతో కలిసి పరిశీలించారు. అనంతరం పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం రెండో దశ పంపింగ్ స్టేషన్‌ను సందర్శించారు. తొండంగి మండలం బెండపూడి వద్ద ఎన్‌హెచ్ క్రాసింగ్ వంతెన నిర్మాణ పనులను కూడా పరిశీలించారు. అధికారులకు పనులు వేగవంతంగా, నాణ్యతతో పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు.
    1
    కృష్ణవరం పోలవరం కాల్వ పనులు పరిశీలించిన మంత్రి నిమ్మల.. వెంట ఎమ్మెల్యే నెహ్రూ
కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం కృష్ణవరం వద్ద పోలవరం ఎడమ కాల్వలో జరుగుతున్న పనులను రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభతో కలిసి పరిశీలించారు. అనంతరం పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం రెండో దశ పంపింగ్ స్టేషన్‌ను సందర్శించారు. తొండంగి మండలం బెండపూడి వద్ద ఎన్‌హెచ్ క్రాసింగ్ వంతెన నిర్మాణ పనులను కూడా పరిశీలించారు. అధికారులకు పనులు వేగవంతంగా, నాణ్యతతో పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు.
    user_SAI DURGA
    SAI DURGA
    Local News Reporter కిర్లంపూడి, కాకినాడ, ఆంధ్రప్రదేశ్•
    19 hrs ago
  • *బస్సు ఢీకొని జింక మృతి.. రక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్* మధురవాడ: మధురవాడ జూ పార్క్ సమీపంలోని జాతీయ రహదారిపై శుక్రవారం విషాద ఘటన చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న ఓ ప్రైవేట్ బస్సు ఢీకొనడంతో ఓ జింక తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికుల సమాచారం మేరకు, కంబాలకొండ రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో తగిన రక్షణ కంచెలు లేకపోవడం, అడవుల విస్తీర్ణం తగ్గడం, నీటి కొరత వంటి కారణాలతో వన్యప్రాణులు తరచూ ఆహారం, నీటి కోసం జాతీయ రహదారిపైకి వస్తున్నాయని తెలిపారు. దీంతో తరచూ రోడ్డు ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోతున్నాయని పేర్కొన్నారు. ప్రతి నెలా రెండు నుంచి మూడు జింకలు ఇలాంటి ప్రమాదాల్లో మృతి చెందుతున్నప్పటికీ అటవీ శాఖ, జూ పార్క్ అధికారులు తగిన నివారణ చర్యలు చేపట్టడం లేదని జంతు ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేశారు. వన్యప్రాణుల సంరక్షణ కోసం రహదారి వెంట రక్షణ కంచెలు ఏర్పాటు చేయడం, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడం, అవసరమైన భద్రతా చర్యలు చేపట్టాలని వారు ప్రభుత్వాన్ని, సంబంధిత అధికారులను కోరారు.
    1
    *బస్సు ఢీకొని జింక మృతి.. రక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్*
మధురవాడ: మధురవాడ జూ పార్క్ సమీపంలోని జాతీయ రహదారిపై శుక్రవారం విషాద ఘటన చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న ఓ ప్రైవేట్ బస్సు ఢీకొనడంతో ఓ జింక తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందింది.
స్థానికుల సమాచారం మేరకు, కంబాలకొండ రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో తగిన రక్షణ కంచెలు లేకపోవడం, అడవుల విస్తీర్ణం తగ్గడం, నీటి కొరత వంటి కారణాలతో వన్యప్రాణులు తరచూ ఆహారం, నీటి కోసం జాతీయ రహదారిపైకి వస్తున్నాయని తెలిపారు. దీంతో తరచూ రోడ్డు ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోతున్నాయని పేర్కొన్నారు.
ప్రతి నెలా రెండు నుంచి మూడు జింకలు ఇలాంటి ప్రమాదాల్లో మృతి చెందుతున్నప్పటికీ అటవీ శాఖ, జూ పార్క్ అధికారులు తగిన నివారణ చర్యలు చేపట్టడం లేదని జంతు ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేశారు. వన్యప్రాణుల సంరక్షణ కోసం రహదారి వెంట రక్షణ కంచెలు ఏర్పాటు చేయడం, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడం, అవసరమైన భద్రతా చర్యలు చేపట్టాలని వారు ప్రభుత్వాన్ని, సంబంధిత అధికారులను కోరారు.
    user_Y.S.RAJ KUMAR PATNAIK
    Y.S.RAJ KUMAR PATNAIK
    Marketing Executive మహారాణిపేట, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.